దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లెక్కలేనన్ని ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఉగ్రరూపాన్ని దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడ్డివాములు నదుల్లోకి చేరుతున్నాయి. రోడ్లపై చేరిన చెత్తాచెదారం రహదారులను మూసేస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దులోని ధార్చులలో గల కాళీనది ఉగ్రరూపాన్ని దాల్చింది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తం కావాలని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కాళీనది పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాళీనదిలోని నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. కాళీనది ఉగ్ర రూపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకంతకు నదిలో పెరుగున్న నీటి మట్టాన్ని ఈ వీడియోలలో గమనించవచ్చు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వంతెనలు కూలిపోవడంతో పాటు పలు రహదారులు మూసుకుపోయాయి. రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
भारत नेपाल बॉर्डर : उत्तराखंड के धारचूला में फटा बादल, SDRF को अलर्ट मोड पर रखा गया#CloudBurst | #Dharchula | #Uttarakhand | #HeavyRain | #SDRF pic.twitter.com/wLlWQYMGrA
— NDTV India (@ndtvindia) July 12, 2024
Comments
Please login to add a commentAdd a comment