Kali River
-
కాళీనది ఉగ్రరూపం.. ఉత్తరాఖండ్ అతలాకుతలం
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లెక్కలేనన్ని ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఉగ్రరూపాన్ని దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడ్డివాములు నదుల్లోకి చేరుతున్నాయి. రోడ్లపై చేరిన చెత్తాచెదారం రహదారులను మూసేస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దులోని ధార్చులలో గల కాళీనది ఉగ్రరూపాన్ని దాల్చింది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తం కావాలని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.ఎన్డిఆర్ఎఫ్ బృందం కాళీనది పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాళీనదిలోని నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. కాళీనది ఉగ్ర రూపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకంతకు నదిలో పెరుగున్న నీటి మట్టాన్ని ఈ వీడియోలలో గమనించవచ్చు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వంతెనలు కూలిపోవడంతో పాటు పలు రహదారులు మూసుకుపోయాయి. రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. भारत नेपाल बॉर्डर : उत्तराखंड के धारचूला में फटा बादल, SDRF को अलर्ट मोड पर रखा गया#CloudBurst | #Dharchula | #Uttarakhand | #HeavyRain | #SDRF pic.twitter.com/wLlWQYMGrA— NDTV India (@ndtvindia) July 12, 2024 -
ఊళ్లోకి వచ్చిన మొసలి.. భయంతో పరుగులు తీసిన జనం!
బెంగళూరు: సాధారణంగా నదులు, చెరువుల్లో మొసళ్లు కనిపిస్తేనే భయపడతాం. అలాంటిది ఏకంగా మొసలి ఓ గ్రామానికి పర్యటనకు వచ్చింది. అవును.. నిజం.. కర్ణాటకలోని కోగిల్బాన్ గ్రామంలోకి గురువారం ఉదయం ఓ భారీ మొసలి ప్రవేశించింది. దానిని చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామ వీధుల్లో మొసలి తిరుగుతున్న సమాచారాన్ని స్థానికులు వెంటనే అటవీ అధికారులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకొని నీటిలో వదిలిపెట్టారు. కాలీ నది నుంచి గ్రామంలోకి మొసలి వచ్చిందని అధికారులు తెలిపారు. గ్రామానికి చేరుకున్న మొసలి సుమారు అరగంట పాటు వీధుల వెంట తిరిగిందని పేర్కొన్నారు. అయితే.. అదృష్టవశాత్తూ మొసలి ఎవరిపైనా దాడి చేయలేదని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి.. మహిళా డాక్టర్‌పై అత్యాచారం -
కల్లోల నదిలో కిక్కే కిక్కు
⇒ గంగానదిలో తప్ప మరెక్కడా లేదు ⇒ కాళీ నదిలో రివర్ ర్యాఫ్టింగ్ సందడి ⇒ వర్షాలతో మొదలైన సీజన్ ⇒ దండేలి అభయారణ్యంలో జల హోరు బెంగళూరు: జర్రున దూసుకుపోయే నది ప్రవాహంతో సమానంగా పోటీపడుతూ పడవలో దూసుకెళ్లడం, రాళ్లు, గుట్టలు, కొండల నడుమ నుంచి మెరుపు వేగంతో కదులుతూ నదీ జలాల్లో సయ్యాటలాడడం మంచి థ్రిల్లింగ్ అనుభూతి. ఇలాంటి కిక్‌నిచ్చే సవాళ్లు కావాలంటే నదిలో ర్యాఫ్టింగ్ చేయాల్సిందే. అది కూడా కాళీ నదిలో అయితే మరీ బాగుంటుంది. ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి సందర్శకులు వస్తుంటారు. పచ్చని అడవుల అందాలు, లోయల సౌందర్యం, అరుదైన పశుపక్ష్యాదులను చూసి ఆనందిస్తుంటారు. దీంతో పాటు దేశంలో గంగానదిలో తప్ప మరెక్కడా కనిపించని వైట్ వాటర్ ర్యాఫ్టింగ్ దండేలి అడవుల గుండా ప్రవహించే కాళీ నదిలో మాత్రమే లభ్యం. ఏమిటీ రివర్ ర్యాఫ్టింగ్ ఇక్కడ అడవుల్లో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే కాళీ నది జూన్ నుంచి ఉధృతంగా ప్రవాహాన్ని అందుకుంటుంది. ఇక నదీజలాల్లో ర్యాఫ్టింగ్ చేయాలనుకునే ఔత్సాహికులు కూడా ఇక్కడికి పయనమవుతారు. ఇక్కడ ఉన్న పలు క్లబ్‌లు, రిసార్ట్లు ర్యాఫ్టింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్లాస్టిక్, రబ్బర్ బోట్లలో 10–15 మంది కూర్చుని పొంగిపొర్లే నదీజలాల్లో ప్రయాణించడం ఒక వింత అనుభూతి. గజ ఈతగాళ్లు, నిపుణులు పడవను నురగలు కక్కే నదీజలాల్లో కొండలను, బండలను తప్పించుకుంటూ దూకుతూ బోట్‌ను తీసుకెళ్తుంటే సందర్శకుల గుండెలు ఉద్విగ్నతతో లయ తప్పుతాయి. కొందరు ర్యాఫ్టింగ్ ప్రి యులు తామే పడవలను తీ సుకుని సొంతంగా నదిలో విహా రానికి బయల్దేరతారు. ఇది కొన్ని గంటలు ఉండవచ్చు, కొ న్ని రోజులు కావచ్చు. మధ్యలో మజిలీలు వేస్తూ టెంట్లలో కాలం గడుపుతూ సిటీ లైఫ్ ఒత్తిళ్ల నుంచి దూరంగా సేదదీరుతారు. వర్షాలు ఆరంభం కావడంతో కాళీ నదిలో కూడా ర్యాఫ్టింగ్ సందడి మొదలైంది. ఎలా వెళ్లాలి? బెంగళూరు నుంచి 480 కిలోమీటర్ల దూరం. దండేలికి బెంగళూరు, బళ్లారి, హుబ్లి–ధార్వాడ, మైసూరు, బెళగావి తదితర నగరాల నుంచి బస్సు సర్వీసులున్నాయి. రైల్లో అయితే లోండాకు వెళ్లి అక్కడి నుంచి గంటన్నర బస్సు ప్రయాణంతో దండేలిలో దిగవచ్చు. ఎక్కడ ఉండాలి? దండేలిలో ఆర్థిక స్థాయిని బట్టి బస చేయడానికి తగిన రిసార్ట్లు, హోటళ్లు లభ్యం. కొంచెం ఖర్చు పెట్టగలిగితే ఆధునిక సౌకర్యాలు, ఆతిథ్యంతో కూడిన బస దొరుకుతుంది. బడ్జెట్ హోటళ్లూ ఉన్నాయి. ఇక సాహసాలు చేయాలనుకుంటే జంగిల్ సఫారీ, రివర్ ర్యాఫ్టింగ్ చేయవచ్చు. ఇవే కాకుండా ఈ దట్టమైన అరణ్యంలో ఊరికే అలా గడిపినా ఎంతో హాయిగా ఉంటుందంటారు సందర్శకులు. ఇంకా చుట్టుపక్కల సింధేరి కొండలు, ఉలవి శ్రీక్షేత్రం ఆలయం, అంబికా నగర, కావాల గుహలను సైతం తిలకించవచ్చు.