
బెంగళూరు: సాధారణంగా నదులు, చెరువుల్లో మొసళ్లు కనిపిస్తేనే భయపడతాం. అలాంటిది ఏకంగా మొసలి ఓ గ్రామానికి పర్యటనకు వచ్చింది. అవును.. నిజం.. కర్ణాటకలోని కోగిల్బాన్ గ్రామంలోకి గురువారం ఉదయం ఓ భారీ మొసలి ప్రవేశించింది. దానిని చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామ వీధుల్లో మొసలి తిరుగుతున్న సమాచారాన్ని స్థానికులు వెంటనే అటవీ అధికారులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకొని నీటిలో వదిలిపెట్టారు.
కాలీ నది నుంచి గ్రామంలోకి మొసలి వచ్చిందని అధికారులు తెలిపారు. గ్రామానికి చేరుకున్న మొసలి సుమారు అరగంట పాటు వీధుల వెంట తిరిగిందని పేర్కొన్నారు. అయితే.. అదృష్టవశాత్తూ మొసలి ఎవరిపైనా దాడి చేయలేదని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి.. మహిళా డాక్టర్‌పై అత్యాచారం