తార్నకలో దారుణం.. నడిరోడ్డుపై లైంగిక దాడికి యత్నం! | Girl Critical After Fall from Bike To escape Molestation Tarnaka | Sakshi

తార్నకలో దారుణం.. నడిరోడ్డుపై లైంగిక దాడికి యత్నం.. లారీ కింద పడి యువతి పరిస్థితి విషమం!

Jul 3 2023 4:18 PM | Updated on Jul 3 2023 4:41 PM

Girl Critical After Fall from Bike To escape Molestation Tarnaka  - Sakshi

పోలీసుల అదుపులో నిందితుడు

నడిరోడ్డుపై అదీ బైక్‌పై తీసుకెళ్తూ ఓ యువతిపై లైంగిక దాడికి.. 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్‌ ఇచ్చే వంకతో ఓ యువతిపై నడిరోడ్డుపై.. అదీ బైక్‌ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది. 

తార్నక వద్ద లిఫ్ట్‌ ఇచ్చే వంకతో బైక్‌పై ఎక్కించుకుని లైంగిక దాడికి యత్నించారు. అయితే.. తప్పించుకునేక్రమంలో బైక్‌పై నుంచి దూకేసింది సదరు యువతి. అదే సమయంలో వెనక నుంచి లారీ దూసుకురావడంతో.. దాని కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పేరు ఆర్తిగా గుర్తించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ఇదీ చదవండి: కిక్‌ ఎక్కి.. దోస్తును చంపేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement