Tarnaka
-
కనుమరుగవుతున్న సికింద్రాబాద్ రైల్వే కాలనీలు.. అప్రోచ్ రోడ్లు మూసివేత
రైల్వే కాలనీలు, సాధారణ ప్రజల సమ్మేళనంగా దశాబ్దాల కాలంగా సికింద్రాబాద్ నగరం వర్ధిల్లింది. రైల్వే కాలనీలు, కార్యాలయాలు, స్టేషన్ల సమాహారంగా ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంది. ఇదిలా ఉండగా రైల్వే కాలనీలు, స్థలాల మీదుగా సాధారణ ప్రజలు రాకపోకలకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉండేవి. క్రమేణా పరిస్థితులు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల తొలగింపుతో రైల్వే కాలనీలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ ప్రాంతాల మీదుగా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న రైల్వే అప్రోచ్ రోడ్లు కనుమరుగు అవుతున్నాయి. కొంతకాలం క్రితం హమాలిబస్తీ, మెట్టుగూడ ప్రాంతాల్లో రోడ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరిన్ని రోడ్లను మూసి వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. దశాబ్దాల కాలంగా...సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం రైల్వే స్థలాలు దశాబ్దాల కాలంగా ఆవరించి ఉన్నాయి. మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్ల పరిధిలో రైల్వేశాఖకు చెందిన కాలనీలు నెలకొని ఉన్నాయి. ఆవిర్భావ కాలం నుంచి రైల్వే రోడ్ల మీదుగా పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది మంది సాధారణ ప్రజలు పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లడం కోసం రైల్వే రహదారులను వినియోగించుకుంటున్నారు.శిథిలావస్థకు చేరడంతో.... దశాబ్దాల క్రితం నిర్మించిన రైల్వే క్వార్టర్లు క్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. శిథిలావస్థకు చేరుతున్న క్వార్టర్లను రైల్వే అధికారులు నేలమట్టం చేస్తూ వస్తున్నారు. ఖాళీ ప్రదేశాలుగా మారుతున్న సదరు స్థలాల చుట్టూ అధికారులు ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. పనిలో పనిగా ఆయా కాలనీల్లోంచి లోగడ కొనసాగిన అప్రోచ్ రోడ్లను కూడా మూసివేస్తున్నారు. మైదానాలుగా మారుతున్న రైల్వే క్వార్టర్లు, కాలనీల స్థలాల్లో కొన్నింటిని రైల్వే అధికారులు పరిరక్షిస్తున్నారు. ఇంకొన్ని స్థలాలను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేశారు. రహదారుల మూసివేతలు పూర్వకాలం నుంచి రైల్వే అప్రోచ్ రోడ్లను వినియోగించుకున్న లష్కర్ ప్రజలకు తాజాగా ప్రవేశాల మూసివేత వ్యవహారం గుదిబండగా మారుతుంది. ఈ వ్యవహారాల్లో భాగంగా హమాలిబస్తీ – చిలకలగూడ కూడలి, విజయపురికాలనీ–రైల్వే ఆసుపత్రి, లాలాగూడ–మారేడుపల్లి అప్రోచ్ రోడ్లను ఇప్పటికే మూసివేశారు. లీజుదారులు రైల్వే స్థలాల్లో నిర్మాణం పనులు ప్రారంభిస్తే మరిన్ని రహదారులు మూతడబడే అవకాశాలు ఉన్నాయి.ఇబ్బంది పడుతున్న ప్రజలు రైల్వే అధికారులు ఎడాపెడా రోడ్లు మూసివేస్తుండడంతో పరిసర ప్రాంతాల వెళ్లి రావడం కోసం తీవ్ర ఇబ్బందులపాలవుతున్నాంమని స్థానికులు వాపోతున్నారు. సమీపంలోని ఆసుపత్రి, పాఠశాల, బస్‌స్టాప్‌లకు వెళ్లడానికి కోసం కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా సరైన సమయంలో వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి అప్రోచ్ రోడ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలి.చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులుఅనుమతిస్తే డంపింగ్యార్డులుగా మారుతున్నాయి : అధికారులు రైల్వే స్థలాల మీదుగా ప్రయాణాలకు అనుమతిస్తే వాటిని చెత్త డంపింగ్ కేంద్రాలుగా మార్చుతున్నారు. అల్లరిమూకలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు వ్యర్థ పదార్థాలు డంప్ చేస్తున్నారు. రైల్వే స్థలాల పరిసర ప్రాంతాల ప్రజలకు రక్షణ, ఆరోగ్యకర వాతావరణం కోసం మాత్రమే అప్రోచ్ రోడ్లను మూసివేసి, రైల్వే స్థలాల్లోకి ప్రవేశాలను కట్టడి చేస్తున్నామని రైల్వే డివిజనల్ అధికారులు చెబుతున్నారు. -
దాడులు చేస్తే..: తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆర్డీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు.. ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మహాలక్ష్మీ స్కీం ప్రకటన అనంతరం.. పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ధైర్యం చెప్పే పనిలో ఉన్నారు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. మొన్నీమధ్య ఫరూక్నగర్ డిపో బస్సులో డ్రైవర్, కండక్టర్లపై జరిగిన దాడిని ఆయన ఖంచింన సంగతి తెలిసిందే. తాజాగా గాయపడిన ఆ సిబ్బందిని పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. టీఎస్ఆర్టీసీ అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇక నుంచి ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారాయన. ‘‘గాయపడ్డ కండక్టర్, డ్రైవర్‌కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది. ఫరూక్ నగర్ డిపో బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే ఇక ఉపేక్షించం. ఇక నుంచి రౌడీ షీట్లు కేసులు తెరుస్తాం’’ అని సజ్జనార్ హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని సజ్జనార్ చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని తెలిపారు. కాగా ఫరూక్నగర్ డిపోకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారని, ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్‌కి గాయాలయ్యాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన. -
HYD: తార్నాకలో గ్యాంగ్‌రేప్, ఆలస్యంగా వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఘోరం జరిగింది. లిఫ్ట్ పేరిట ఒక మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఐదుగురు. నిందితుల అరెస్ట్‌తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు. తన స్కూటీపై ఎక్కించుకుని ప్రశాంత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఫోన్ చేసి తన నలుగురు స్నేహితుల్ని రప్పించుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో మధు యాదవ్, బర్నా యేసు, సిరిగిరి ప్రశాంత్‌కుమార్, పస్తం తరుణ్‌కుమార్, కేశోజువా రోహిత్‌లపై కేసు నమోదు చేసుకున్నారు లాలాగూడ పోలీసులు. ప్రశాంత్.. మధుసూదన్.. రోహిత్ తరుణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
తార్నకలో దారుణం.. నడిరోడ్డుపై లైంగిక దాడికి యత్నం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇచ్చే వంకతో ఓ యువతిపై నడిరోడ్డుపై.. అదీ బైక్ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది. తార్నక వద్ద లిఫ్ట్ ఇచ్చే వంకతో బైక్‌పై ఎక్కించుకుని లైంగిక దాడికి యత్నించారు. అయితే.. తప్పించుకునేక్రమంలో బైక్‌పై నుంచి దూకేసింది సదరు యువతి. అదే సమయంలో వెనక నుంచి లారీ దూసుకురావడంతో.. దాని కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పేరు ఆర్తిగా గుర్తించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: కిక్ ఎక్కి.. దోస్తును చంపేశారు! -
అవును.. ఆయన లంచంతో పట్టుబడ్డాడు: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా(63) తమ అదుపులోనే ఉన్న విషయాన్ని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ ప్రకటించారు. అయితే ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదని.. పూర్తి స్థాయిలో తనిఖీలు ముగిశాక అరెస్ట్ చేస్తామని స్పష్టత ఇచ్చారు. సాక్షితో మాట్లాడిన ఆయన.. శనివారం జరిగిన పరిణామాలకు వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. తార్నాకలోని తన ఇంట్లోనే బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడాయన. ఆయన అల్మారా నుంచి నగదును సేకరించి.. కెమికల్ టెస్ట్ నిర్వహించి వేలిముద్రలతో పోల్చి చూసుకున్నాం. ఆ వేలిముద్రలు ఆయన ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోలాయి. నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. వీడియో: గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి డబ్బులు చల్లుతూ వీసీ రవీందర్ డ్యాన్స్ లు ఇదీ చదవండి: కోరుకున్న కాలేజీ.. కోర్సు కూడా! -
సూపర్ స్పెషాలిటీగా ఆర్టీసీ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం సంస్థ ఉద్యోగులకే పరిమితమైన తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి సాధారణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అవతరించింది. ఇటీవలే సాధారణ ప్రజల(ఆర్టీసీ ఉద్యోగులు కానివారు)కు ఔట్ పేషెంట్లుగా చికిత్స ప్రారంభించిన ఆర్టీసీ.. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలతో ముందుకొచ్చింది. ఇందుకోసం 16 పడకలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సిద్ధం చేసింది. నాలుగు ఆపరేషన్ థియేటర్లను కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుంది. వీటిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం ఉదయం ప్రారంభించనున్నారు. ఏడు ఆపరేషన్ థియేటర్లు.. గతంలో అత్యవసర వైద్య సేవలు అందించే పరిస్థితి లేకపోవటంతో ఇక్కడికి వచ్చే రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసేవారు. ఆ స్థితి నుంచి క్రమంగా కీలక చికిత్సలు, అత్యవసర ఆపరేషన్లు చేసే స్థాయికి తార్నాక ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కొత్తగా మరో నాలుగు ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ భవనంపై కొత్తగా ఐసీయూ బ్లాక్‌ను నిర్మించారు. ఇందులో 16 బెడ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులే కాకుండా సాధారణ ప్రజలకూ ఇందులో చికిత్స అందిస్తారు. నిమ్స్ తరహాలో తక్కువ చార్జీలు వసూలు చేయనున్నారు. రోజుకు రూ.3 వేలు, అంతకంటే తక్కువే వసూలు చేయనున్నట్టు సమాచారం. త్వరలో సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆధునిక వసతులతో ఉండే సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను కూడా ఆర్టీసీ ఆసుపత్రిలో సిద్ధం చేశారు. త్వరలో దీన్ని వినియోగంలోకి తేనున్నారు. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ ప్రారంభించిన తర్వాత, ఎస్ఐసీయూ బ్లాక్‌లో ఫ్యూమిగేషన్ చేసి, బ్యాక్టీరియా కల్చర్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ రిపోర్టు వస్తే వెంటనే దాన్ని అందుబాటులోకి తెస్తారని సమాచారం. సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందిన వారు, కీలక ఆపరేషన్లు చేయించుకున్న రోగులు.. కొంతకాలం ఐసీయూలో ఉండాల్సి వస్తే ఇందులో ఉంచుతారు. వార్డులో ఓవైపు దీన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక ప్రతి డిపోలో హెల్త్ వాలంటీర్లు.. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ హిస్టరీతో కూడిన రికార్డులను సిద్ధం చేశారు. గుండె సమస్యలు, ఇతర తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నట్లు గుర్తించిన ఉద్యోగులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తూ, వారు క్రమపద్ధతిలో మందులు వాడేలా చూస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలున్నాయని తేలిన 278 మంది ఉద్యోగుల్లో ఇద్దరు మందుల వాడకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొద్ది రోజుల్లోనే వారు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితి మిగతావారికి రావద్దనే ఉద్దేశంతో ప్రతి డిపోలో సుశిక్షితులైన ఇద్దరు హెల్త్ వర్కర్లను నియమించాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీరు ఉద్యోగులకు ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి హెల్త్ హిస్టరీ ఆధారంగా మందులు వాడేలా చూస్తారు. అలాగే వీరి వద్ద డిజిటల్ బీపీ చెకింగ్ యంత్రాలుంటాయి. వాటి ద్వారా బీపీని మానిటర్ చేస్తూంటారు. ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణ ఇస్తారు. ఇప్పుడు ఈ హెల్త్ వర్కర్లకు శిక్షణ ప్రారంభించనున్నారు. -
తార్నాకలో ప్రైవేట్ ఉద్యోగి ఘాతుకం.. కాపాడాల్సినవాడే.. కడతేర్చాడు
కంటికిరెప్పలా ఇంటిల్లిపాదినీ కాపాడేవాడే, కుటుంబానికి అండగా ఉండాల్సినవాడే దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లిని, కట్టుకున్న ఇల్లాలిని, అభమూ శుభమూ లియని కన్న కూతురునూ కడతేర్చాడు. కడకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తనతో చెన్నై రావడానికి నిరాకరించిన భార్యతో పాటు కుమార్తెను, కన్నతల్లిని చంపేశాడు. ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రైవేట్ ఉద్యోగి. సోమవారం మధ్యాహ్నం ఈ విషాద ఉదంతం వెలుగులోకి వచి్చంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. చెన్నైకి చెందిన ప్రతాప్ (34) అక్కడి ఓ కార్ల కంపెనీలో డిజైన్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తార్నాక ప్రాంతానికి చెందిన సింధూర (32)తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఆద్య ఉంది. సింధూరకు రెండు నెలల క్రితం హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం వచి్చంది. దీంతో ఆమెతో పాటు ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి నగరానికి వచ్చారు. తార్నాకలోని రూపాలీ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్న ప్రతాప్ వారాంతాల్లో ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు. చెన్నై వెళదామనే విషయంపై కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బెడ్రూంల్లో నిద్రిస్తుండగా.. చెన్నైలో స్థిరపడటానికి ఉద్యోగం వదిలి రావాలంటూ భార్య సింధూరపై ప్రతాప్ ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి ఆమె అంగీకరించడంపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వీకెండ్లో రావడంతో శుక్రవారం ప్రతాప్ నగరానికి వచ్చాడు. చెన్నై వెళ్లే విషయమై రెండు రోజులుగా వీరి మధ్య గొడవలు జరిగి ఆదివారం రాత్రి తారస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రతాప్.. కుటుంబాన్ని హతమార్చి తానూ తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ప్రధాన బెడ్రూంలో నిద్రిస్తున్న భార్య, కుమార్తెను, కొద్దిసేపటి తర్వాత పక్కనే మరో బెడ్రూంలో పడుకుని ఉన్న తల్లినీ చంపివేశాడు. హాల్లో సీలింగ్ ఫ్యాన్‌కు తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సింధూర సహోద్యోగులు ఫోన్ చేయడంతో.. సింధూర సోమవారం విధులకు హాజరుకావాల్సి ఉంది. ఆమె బ్యాంక్‌కు రాకపోవడంతో ఆరా తీసేందుకు సహోద్యోగులు ఫోన్ చేశారు. సింధూర నుంచి స్పందన రాకపోవడంతో మధ్యాహ్నం వరకు ప్రయత్నించారు. చివరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సింధూర అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. ఎంత పిలిచినా లోపల నుంచి స్పందన లేకపోవడంతో పక్కన అపార్ట్మెంట్లో నివసించే సింధూర తల్లి జమునను తీసుకువచ్చారు. వీరికి ఫ్లాట్‌లోకి హాల్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న ప్రతాప్ మృతదేహం కనిపించింది. బెడ్స్‌పై ఉన్న సింధూర, ఆద్యలను పరిశీలించారు. సింధూర కొన ఊపిరితో ఉండటంతో సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స ప్రారంభించడానికి ముందే ఆమె తుది శ్వాస విడిచింది. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. సింధూర తల్లి జమున ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు: సింధూర తల్లి జమున ‘ప్రతాప్ మాకు దగ్గరి బంధువు హైదరాబాద్ నుంచి చెన్నై షిఫ్ట్ కావాలనే విషయంపై భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ.. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు’ అని జమున మీడియాతో అన్నారు. రాజతి మెడపై ఉన్న గుర్తుల్ని బట్టి ఉరి బిగించి లేదా గొంతు నులిమి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. సింధూర, ఆద్యల మృతికి కారణాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పోస్టుమార్టం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్ తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సింధూర కోసం వాళ్ల ఆఫీస్ వారు వచ్చి చూసేదాకా ఇంతటి ఘోరం జరిగిందని నాకు తెలియదు. ఆమె ఫోన్ ఎత్తట్లేదు అని ప్రతాప్ కూడా స్పందించట్లేదని కంగారు పడుతూ వచ్చి చెప్పారు. ఎంత కొట్టినా తలుపులు కూడా తీయట్లేదని ఆందోళన చెందారు. అప్పుడు వచ్చి చూస్తే ఈ ఘోరం కనిపించింది. మేం పక్క అపార్ట్మెంట్లో ఉంటాం. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మా దగ్గరికి వస్తే సరిపోయేది కదా. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా. -
నత్తనడకన సాగుతున్న డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు
తార్నాక డివిజన్ లాలాపేట సాయి నగర్‌లోని మురికివాడలో తాత్కాలిక నివాసాలు, గుడిసెల్లో నివాసాలుంటున్న సుమారు 107 కుటుంబాలను డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పేరిట ఖాళీ చేయించారు. మూడు బ్లాక్‌లతో కూడిన ఇళ్ల సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ కూడా పూర్తి కాలేదు. అక్కడి నివాసితులు ఇతర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో కిరాయిలు కట్టలేక ఇబ్బందుల మధ్య బతుకులీడుస్తున్నారు. నగరంలోని అడ్డగుట్ట డివిజన్ ఆజాద్ చంద్రశేఖర్ నగర్ మురికివాడలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం అక్కడి 42 నివాసాలను ఖాళీ చేయించారు. 2015లో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లుగా వీటి నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పేద కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో కిరాయి ఇళ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: గూడు కోసం నిరుపేదల ఏడేళ్లుగా నిరీక్షిస్తున్నారు. మురికివాడల రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిదేందుకు పేదల నివాసాలను ఖాళీ చేయించి అక్కడే చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు నత్తలకు నడక నేర్పిస్తున్నాయి. అయిదారేళ్లుగా ఇంటి అద్దె భారమై పేదలు నానా అవస్థలు పడుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల ఆశలు అడియాసలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2015లో రెండు పడకగల గదుల ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. కానీ ఆశించిన రీతిలో ఇళ్ల నిర్మాణం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. 40 ప్రాంతాలు.. 8,898 గృహాలు హైదరాబాద్ మహానగరంలో సుమారు రెండు లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, తొలి దశలో లక్ష గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ప్రభుత్వం సేకరించింది. వాటిలో స్లమ్స్‌లోని పేదలు నివసిస్తున్న ఇరుకు ఇళ్లను కూల్చివేసి 40 ప్రాంతాల్లో ఇన్సిటూ పద్ధతిలో 8,898 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే సింగం చెరువు తండా, చిత్తారమ్మ బస్తీ, కిడ్ కీ బాత్ అలీషా, సయ్యద్ సాబ్ కా బాడా, ఎరుకల నాంచారమ్మ బస్తీ, జియాగూడ, కట్టెలమండి, గోడే కీ ఖబర్ తదితర 25 ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల పనులు జరగనందునే జాప్యం ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అయిదేళ్లలో రూ.3.5 లక్షలపైనే .. నగరంలోని మురికి వాడల సమీపంలో నివాసాలకు నెలసరి అద్దె కనీసం అయిదు వేల రూపాయల వరకు ఉంది. అద్దెలన్నీ లెక్కిస్తే అయిదేళ్లలో చెల్లించింది రూ.3.5 లక్షలపైనే ఉంటుంది. ఇంటి అద్దె తలకుమించిన భారంగా మారడంతో పేద కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులందకపోవడంతోనే పనులు కుంటుపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అద్దెలు చెలించలేక అవస్థలు పడుతున్నాం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట సొంతింటిని ఖాళీ చేయించారు. అప్పటి నుంచి కిరాయి ఇంటిలోనే ఉంటున్నాం. ఏళ్లు గడుస్తున్నా..ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. యేటా పెరుగుతున్న అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం. త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే బాగుంటుంది. – జీలకర్ర నవీన్, ఆజాద్‌నగర్ అయిదో దసరా వచ్చింది మా ఇల్లు ఖాళీ చేయించి నిర్మాణాలు చేపట్టారు. దసరా పండగకు గృహ ప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి నాలుగు దసరా పండగలు గడిచిపోయాయి. అయిదోసారి దసరా దగ్గరకు వచ్చింది. – కొత్తపల్లి అనిల్ కుమార్, సాయినగర్ -
ABVP: విద్యార్థులే భవన నిర్మాతలు
‘విద్యార్థి సేవా సమితి ట్రస్ట్’ ఆధ్వర్యంలో ‘స్ఫూర్తి ఛాత్రా శక్తి భవనం’ నిర్మితమైంది. ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేతుల మీదగా రేపు విద్యార్థి లోకానికి అంకితం కాబోతోంది. 1949 జూలై 9న దేశవ్యాప్తంగా ఏబీవీపీ పనిని ప్రారంభిస్తే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1964లో పనిలోకి దిగింది. అప్పట్లో విద్యానగర్‌లో ఏబీవీపీ కార్యాలయం కోసం ఒక అద్దె భవనాన్ని తీసుకున్నారు. ఆ కార్యాలయం అనేక విద్యార్థి ఉద్యమాలకు వేదిక అయ్యింది. తెలంగాణ ఉద్యమంలో ఈ కార్యాలయం కేంద్ర బిందువయ్యింది, అనేక మంది నాయకులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఇక్కడ తయారయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యాలయమూ దీనిలోనే ఉంది. ఏబీవీపీ ‘సర్వవ్యాప్త– సర్వ స్పర్శి’ అనే నినాదంతో అన్ని విభాగాల విద్యార్థులకు చేరువ కావడంతో సభ్యుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కార్యాలయం విద్యార్థుల అవసరాలను తీర్చలేకపోతున్నందున ఆధునిక కార్యాలయం ఏబీవీపీకి తక్షణ అవసరంగా మారింది. అందుకే కొత్త కార్యాలయం కోసం హైదరాబాద్ తార్నాకలో వేయి గజాల విస్తీర్ణం గల భూమిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ సంగతి తెలిసి వేయిమంది పూర్వ కార్యకర్తలు ఒక్కొక్కరూ ఒక గజాన్ని కొనడానికయ్యే ఖర్చు భరించారు. 2017 ఏప్రిల్‌లో భూమి పూజ జరిగింది. ఈ ఐదేళ్లలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, కరోనా కష్టాలను దాటుకుంటూ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా పదిహేను వేలకు పైగా పూర్వ కార్యకర్తలు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వారి నుండి ప్రేరణ పొంది లక్షలాది మంది విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. స్థానిక, అలాగే ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల ఎదుగుదలకు కావలసిన స్ఫూర్తినీ, సదుపాయాలనూ ఈ కార్యాలయం అందించాలనేది లక్ష్యం! – చింత ఎల్లస్వామి ఏబీవీపీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ, తెలంగాణ (జూన్ 16న ‘స్ఫూర్తి ఛాత్రా శక్తి నిలయం’ ప్రారంభం సందర్భంగా) -
‘ఆర్టీసీ’ రోగులకు హోటల్ తిండి!
సాక్షి, హైదరాబాద్: ఐసీయూ, ఆక్సిజన్ ప్లాంటు, నిరంతరం నడిచే ల్యాబ్ తదితర సౌకర్యాలతో ఇటీవలే మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి స్థాయికి ఎదిగిన తార్నాకలోని 200 పడకల ఆర్టీసీ ఆసుపత్రిలో ఒక సమస్య మాత్రం రోగులు, వారి సహాయకులను వేధిస్తోంది. ఇన్‌పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రిలో భోజన సదుపాయం లేక హోటళ్ల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఏ ఆసుపత్రిలోనైనా వైద్యుల సూచనల ప్రకారం రోగులకు ఆసుపత్రుల్లోనే భోజనం తయారు చేసి అందించాల్సి ఉంటుంది. సొంత కిచెన్ వసతి లేని చోట, కాంట్రాక్టు పద్ధతిలో భోజనం తయారు చేయించి అందిస్తారు. తినకూడని పదార్థాలు తింటే వారి అనా రోగ్యం పెరిగే ప్రమాదం కూడా ఉంటుందనే ఉద్దేశంతో రోగులకు వైద్యుల సూచన మేరకే భోజనం అందుతుంది. కానీ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో తార్నాక ఆసుపత్రిపై సరైన పర్యవేక్షణ లేదు. దీంతో నిధుల్లేక రోగులకు భోజనాన్ని అందించలేమని ఆసుపత్రి చేతులెత్తేసింది. నిత్యం 200 పడకల్లోనూ రోగులు ఉన్నా వారి భోజన ఖర్చు ఏడాదికి రూ. కోటిన్నర మించదు. కానీ ఈ మాత్రం సొమ్ము కూడా ఆర్టీసీ వద్ద లేకపోవడం అందరినీ విస్మయ పరుస్తోంది. ఈ ఆసుపత్రిలో రోగులకు ప్రస్తుతం ఒక గ్లాసు పాలు, ఒక బ్రెడ్, ఒక అరటి పండు అందిస్తున్నారు. హరేరామ హరేకృష్ణ సెంటర్ తెరవాలి... రోగులకు మందులతోపాటు సరైన డైట్ అవసరమని... అందుకు వీలుగా ఆసుపత్రిలో హరేరామ హరేకృష్ణ సెంటర్ అందించే రూ. 5 భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సూచించారు. మరోవైపు రోగులకు డైట్‌ను ఆసుపత్రిలోనే తయారు చేసి అందించాలని.. ఈ విషయంలో ఎండీ సజ్జనార్ మానవతాదృక్ఫథంతో వ్యవహరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు చెందిన కమాల్‌రెడ్డి, నరేందర్ కోరారు. రోగులకు హోటళ్ల భోజనం అందించడం ప్రమాదకరమని డాక్టర్ సునీల్ పేర్కొన్నారు. రోగుల సహాయకులు ఇంటి నుంచి భోజనం తెచ్చినా ఉప్పు, కారం, మసాలాలు, శరీరానికి పడని పదార్థాలు రోగికి చేటు చేస్తాయన్నారు. అందువల్ల వైద్యుల సూచన ప్రకారమే రోగులకు భోజనం అందాలని పేర్కొన్నారు. -
వాహనాల తనిఖీలను పరిశీలించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తార్నాకలో సోమవారం పోలీస్ చెక్‌పోస్ట్‌ను డీజీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్‌ను పొడిగించిందని ఆయన అన్నారు. కరోనాను అంతం చేసేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో తెలంగాణలో నేరాల శాతం తగ్గిందని వెల్లడించారు. గూడ్స్ వాహనాలకు రాత్రి 9 నుంచి ఉదయం 11 గంటల వరకే అనుమతి ఉందని తెలిపారు. చదవండి: కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన..సీపీ చర్యలు -
కేరింటలు
కరోనా వల్ల పిల్లల స్కూళ్లకు సెలవులొచ్చాయి. ఒక్కరోజు స్కూల్‌కి వెళ్లక్కర్లేదంటేనే చాలు పిల్లలకు పెద్ద పండగే. అలాంటిది పదిహేను రోజులంటే... వాళ్ల ఆనందం మాటల్లో వివరించ లేనిది. రెండు, మూడు, నాలుగు రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు బోర్ ఫీలవ్వడం మొదలుపెడుతున్నారు. కొందరు పిల్లలు తమ తోబుట్టువులతో గొడవలు పెట్టుకొని పెద్దలకు తలనొప్పులు తెస్తున్నారు. అలాగని వాళ్లనీ తప్పు పట్టలేం. బయటకెళ్లి తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి లేదు. సినిమాలకు వెళ్లడానికి లేదు. ఇక షాపింగ్‌లు, షికార్లు సరేసరి. ఫంక్షన్లకు వెళ్లేది లేదు. బంధువుల ఇళ్లకు వెళ్లేది లేదు. ‘అమ్మా! బోర్ కొడుతోంది...’ ఇదీ పిల్లల ఫిర్యాదు. ఎంతసేపూ టీవీ,సెల్ఫోన్లతో కాలక్షేపం. ‘ఏంటి చేయడం...’ తల్లిదండ్రులకు ఇప్పుడు ఇదో పెద్ద సమస్య. దీనిని అధిగమించడానికి ఇంట్లోనే ఓ చిన్న సమ్మర్ క్యాంప్‌ను ముందస్తు క్యాంప్‌గా మార్చేశారు హైదరాబాద్ తార్నాకలో ఉంటున్న డాక్టర్ శిరీష ముఖేష్. వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఇన్ని పాయింట్స్, ఈజీ కుకింగ్కు సంబంధించిన ఐటమ్స్ నేర్చుకుంటే ఇన్ని పాయింట్స్, గార్డెనింగ్ చేస్తే ఇంకొన్ని పాయింట్స్.. అంటూ రోజూ ఏదో ఒక ఇంటి పనిలో తన ఇద్దరు పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. పిల్లలు చేస్తున్న... నేర్చుకుంటున్న ఇంటిపనులు, వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాట్సప్ ఫ్యామిలీ గ్రూప్‌ల్లో పోస్ట్ చేస్తూ పిల్లలను ఉత్సాహ పరుస్తున్నారు. దీంతో పిల్లలు బోర్ ఫీలవకుండా, పెద్దవారిని విసిగించకుండా టైమ్‌ని ప్లానింగ్‌గా మార్చేస్తున్నారు. ‘ఇలాగే మనమూ చేయచ్చు కదా!’ అని మిగతా తల్లిదండ్రులకూ ఆలోచన అందిస్తున్నారు. కరోనా అంటూ భయంతో ఇంట్లోనే ముడుచుకు కూర్చోవాల్సిన పనిలేదు. పిల్లలకు ఎన్నో అంశాల్లో నైపుణ్యాలకు సంబంధించి తరగతులు ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇలా ఇంట్లోనే కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. -
తార్నాకలో ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం తార్నాకలో బీభత్సం సృష్టించింది. డ్రైవర్.. బస్సును అదుపు చేయలేక.. ముందున్న వాహనాలను ఢీ కొట్టాడు. దీంతో.. మూడు కార్లు, ఓ బైక్ ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన జరిగిన వెంటనే తాత్కాలిక డ్రైవర్ పారిపోయారు. జేబీఎస్ నుంచి జనగామ వెళుతుండగా హబ్సీగూడ సిగ్నల్స్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. గోతిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్‌రోడ్డు వద్ద భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డుపక్కనున్న గోతిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 13మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరోవైపు సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కాగా తాత్కాలిక డ్రైవర్లకు సరైన అనుభవం లేకపోవడంతో ఇప్పటికే పలుచోట్ల ప్రమాదాలు జరిగాయి. 24వ రోజుకు చేరిన సమ్మె కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని వారు హితవు పలికారు. ఈనెల 30న సరూర్‌నగర్ నగర్లో సకలజనుల సమరభేరి సభను నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. -
మూడు కార్లు,బైక్‌ను ఢీ కొన్న బస్సు
-
తండ్రి మృతి.. కుమారుడి పరిస్థితి విషమం
హైదరాబాద్: తార్నాకలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు దారి తప్పి ఇద్దరి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి తీవ్రగాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
తార్నాకలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తార్నాకలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు తార్నాక డిగ్రీ కాలేజ్ ఎదురుగా రోడ్డు దాటుతున్నతండ్రి కొడుకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. యువకుడిని లాలాగూడ పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణ కాలేజీలో డీన్ లైంగిక వేధింపులు
-
నారాయణ కాలేజీలో లైంగిక వేధింపులు.. డీన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : తార్నాకాలోని నారాయణ కళాశాల డీన్ తనను లైంగికంగా వేదిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగి బంధువులతో సహా ఆందోళనకు దిగింది. బాధితురాలి బంధువులు డీన్‌పై దాడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు డీన్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీన్ శ్రీనివాస్ రావు కొద్దిరోజులుగా ఫోన్ చేస్తూ తనను వేదిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. గత 10 ఏళ్లుగా తాను నారయణ కాలేజీల్లో పనిచేస్తున్నానని, ఇటీవల వచ్చిన డీన్ శ్రీనివాస్ కాలేజీ అయిపోయిన తర్వాత కూడా ఫోన్ చేస్తూ అసభ్యకర మాటలతో టార్చర్ పెడుతున్నాడని పేర్కొంది. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని యాజమాన్యాన్ని కోరింది. ఈ విషయం యజమాన్యానికి తెలియజేయడం కోసమే తాను ఆందోళన చేపట్టినట్లు స్పష్టం చేసింది. -
ఆలయ ప్రహరీపై హనుమాన్ ఆకారం
తార్నాక: తార్నాక– సీతాఫల్మండి వెళ్లే రహదారిలోని ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వద్ద ఉన్న మూడుగుళ్ల అమ్మవారి ఆలయ ప్రహరీపై çఆంజనేయస్వామిని తలపించేలా ఆకారం ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది. గోడపై ఆంజనేయ స్వామి చిత్రాన్ని చూసిన కొందరు ఈ విషయాన్ని తమకు తెలిసిన వారికి చెప్పడంతో ఈ సమాచారం దావానంలా వ్యాప్తించింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తార్నాక నుంచి సీతాఫల్మండి బ్రిడ్జి వైపు వెళ్లే రహదారిలో ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రహరీని ఆనుకుని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ మూడుగుళ్ల దేవాలయం ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఇటీవలే ఆధునికీకరించారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆలయ ప్రహరీపై ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు ఆకుల మధ్య నుంచి ఆంజనేయస్వామి ఆకారం కనిపించింది. విద్యుత్ కాంతుల మధ్య గోడపై ధగధగా మెరుస్తున్న ఆంజనేయస్వామి ఆకారాన్ని అటుగా వెళ్లున్నవారు గమనించారు. ఈ సమాచారం ఆ నోటా ఈనోటా బయటకు రావడంతో కొద్ది క్షణాల్లోనే ఆలయ ప్రాంగణం జనంతో నిండిపోయింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌తో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇటువైపు ఒక అడుగు
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే!ఆ తర్వాత మరిన్ని అడుగులు పడతాయి. వాటికి మరికొన్ని అడుగులు జత కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి ఓ అద్భుతం జరగడం కోసం డంప్‌యార్డ్ వైపు ఒక అడుగు వేశారు డాక్టర్ జయశ్రీ కిరణ్. తర్వాత అడుగు మనది కావాలి. మనందరిదీ కావాలి. డాక్టర్ జయశ్రీ కిరణ్ లెక్చరర్. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఉంటున్నది హైదరాబాద్‌లోని తార్నాక. గత ఐదు నెలలుగా ఆమె డంప్‌యార్డ్‌ల చుట్టూ ఉండే జనావాసాల్లోకి వెళ్లివస్తున్నారు. వాళ్లంతా డంప్‌యార్డే జీవనాధారం అయినవాళ్లు. డంప్‌యార్డ్‌కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జబ్బు చేస్తే క్రమం తప్పకుండా వాడాల్సిన మందుల గురించి ఆ సమీపంలోని ఇల్లిల్లూ తిరిగి, ముఖ్యంగా అక్కడి మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్ అధికారులను కూడా కలిసి డంప్‌యార్డ్ వద్ద హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయమని కోరుతున్నారు. తను కూడా హెల్త్‌క్యాంపులను పెట్టి, అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ‘దయచేసి డంప్‌యార్డ్ వైపు ఒకసారి చూడండి’ అని నగరవాసులను కూడా కోరుతున్నారు! ఎందుకిలా జయశ్రీ ఏరి కోరి ప్రమాదంలోకి వెళుతున్నారు? ఇదే మాటను ఆమెను అడిగితే.. ‘నేను వెళ్లడం.. అంటుంచండి. వాళ్లంతా ప్రమాదంలోనే కదా ఉంటున్నారు!’ అంటారు ఆవేదనగా. జబ్బుల దిబ్బలు! పగిలిపోయిన ట్యూబ్‌లైట్లు, గాజు బాటిళ్లు, గ్లాసు ముక్కలు చెత్తబుట్టలోనే వేస్తుంటాం. డయాబెటిస్ పేషెంట్స్ రోజూ తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్లూ అదే బుట్టలోనే. ఆడవాళ్లు వాడేసే శానిటరీ న్యాప్కిన్లు, ఉపయోగంలో లేని బ్యాటరీలు, డిజిటల్ వేస్టేజ్.. ఒకటేమిటి హానికరమైన ఎన్నో వస్తువులు చెత్తలోకి చేరుతుంటాయి. అవన్నీ డంప్‌యార్డ్‌కి చేర్చి, ఉపాధి కోసం వాటిలోనే తిరిగేవారికి ఆ గాజు ముక్కలు, ఇంజెక్షన్లు గుచ్చుకుని.. వ్యాధుల పాలిట పడుతున్నారు. వాడిపడేసిన బ్యాటరీలు ఒక్కోసారి పేలుతుంటాయి కూడా! ఇదంతా డంప్‌యార్డ్ వద్ద హెల్త్‌క్యాంప్ ఏర్పాటు చేశాక, అక్కడి వారి పరిస్థితులు ప్రత్యక్షంగా చూశాక జయశ్రీకి మరింతగా స్పష్టం అయ్యింది. అసలు ఈ జబ్బుల దిబ్బల్లోకి వెళ్లాలన్న ఆలోచన జయశ్రీకి ఎలా వచ్చింది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మూడు రోజులు బండి రాలేదు ‘ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరిగిందది! ఆ సమయంలో వరుసగా మూడు రోజుల పాటు చెత్త తీసుకువెళ్లే వాళ్లు రాలేదు. ఆ దుర్గంధాన్ని భరించలేకపోయాను. నాల్గవ రోజు చెత్త తీసుకెళ్లే ఆమె వస్తే ‘ఎందుకు రావట్లేదు?’ అని కోపగించుకున్నాను. ‘మా ఆయనకి ఒంట్లో బాగోలేదమ్మా! కడుపునొప్పి. పోయిన వారమే నాకూ ఆసుపత్రి ఖర్చు వెయ్యి రూపాయిలయ్యింది. ఇప్పుడు ఆయనకు..’ అంటూ లోపలికి వచ్చి చెత్త డబ్బా తీసుకెళ్లింది కుంటుకుంటూ. చెత్తను తను తెచ్చిన బండిలో వేసుకుని, చెత్తబుట్టను ఇవ్వడానికి తిరిగొచ్చింది. ‘నీకేమయ్యింది కుంటుతున్నావ్.. ’ అన్నాను. ‘కాలికి ఏదో గుచ్చుకుంది. ఇరవై రోజుల పైనే అయ్యింది. నొప్పి అస్సలు తగ్గడం లేదు’ అంది. ‘మీకిలా ఉంటే మీ పిల్లల్నెవరు చూస్తారు’ అన్నాను. ‘మా పిల్లోడికి ఐదేళ్లమ్మా! ఎక్కడేస్తే అక్కడే పడుంటాడు. పిలిచినా పలకడు. డాక్టర్లకు చూపిస్తే మెదడు ఎదుగుదల లేకుండానే పుట్టాడు అని చెప్పారు, ఏం చేస్తాం. మా తలరాత’ అంటూ ఆమె ఇంకో ఇంట్లో చెత్త తీసుకెళ్లడానికి వెళ్లబోయింది. ‘మీరెక్కడుంటారు.. ఈ చెత్తంతా ఎక్కడకు తీసుకెళతారు?’ అని అడిగాను. ‘డంప్‌యార్డ్ ఉందిగా అమ్మా! అక్కడకు తీసుకెళ్లి వేస్తాం.. మేం ఉండేది కూడా అక్కడి బస్తీలోనే’ అని చెప్పి, ముందుకు వెళ్లిపోయింది. నేరుగా డంప్యార్డుకే వెళ్లిపోయా! ఆ తర్వాత రోజు చెత్త తీసుకెళ్లడానికి ఆమె రాలేదు. మనసు మనసులో లేదు. ఏమై ఉంటుంది ఆమెకు. భర్తకు ఆరోగ్యం బాగోలేదు. పిల్లాడు ఎలా ఉన్నాడో.. ఆమె చెప్పిన స్థితి కళ్ల ముందు కదలాడుతోంది. ఇంట్లో ఉండబుద్ది కాలేదు. ఆమె చెప్పిన డంప్‌యార్డ్ ఎక్కడుంటుందో కనుక్కొని వెళ్లాను. ఇక్కడే ఉందన్నట్టు ముందుగా వచ్చిన దుర్వాసన చెప్పేసింది. వంద ఎకరాల్లో ఉండే ఆ డంప్‌యార్డ్‌ను కాసేపు అక్కడే ఉండే చూశా! కనుచూపుమేరంతా చెత్త. ముక్కులు పగిలిపోయే దుర్వాసన. భుజాలకు పెద్ద పెద్ద సంచులు వేసుకున్న కొందరు ఆడవాళ్లు, పిల్లలు, మగవాళ్లు చెత్తను కెలుకుతూ స్క్రాప్‌ని ఏరుకుంటున్నారు. వాళ్ల చేతులకు గ్లౌజులు లేవు. కొందరి కాళ్లకు చెప్పులు లేవు. పందులు, కుక్కలు ఆ ఏరియా మాదేనన్నట్టు తిరుగుతున్నాయి. అక్కడే ఉన్న ఒకట్రెండు చెట్లకు ఐదారు గుడ్డ ఊయలలు పసిపిల్లలను నిద్రపుచ్చుతున్నాయి. ఆ పిల్లల తల్లులు ఆ మురికి చేతుల్తోనే పిల్లలను ఎత్తుకుంటున్నారు. అలాగే పాలు పడుతున్నారు. అక్కడ వారికి చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. వెంట తెచ్చుకున్న బాటిళ్ల నీళ్లతో గొంతులు తడుపుకుంటున్నారు. దాదాపు వందల మంది ఆ డంప్‌యార్డే ఆధారంగా జీవిస్తున్నారు. రెండు రోజులు ఇంట్లోని చెత్తను తీసుకెళ్లకపోతేనే విసుక్కుంటాం. అలాంటిది నిత్యం చెత్తలోనే బతుకుతున్న వారిని చూస్తుంటే కడుపులో దేవినట్టయ్యింది. నా భర్త కిరణ్‌కుమార్ డాక్టర్ కావడంతో నా ఆవేదనను వెంటనే అర్థం చేసుకున్నారు. హెల్త్ క్యాంపు ఏర్పాటులో తనూ ఓ చేయి కలిపారు. పర్మిషనిచ్చినా చాలు..! రోజూ వేల టన్నుల చెత్త ఒక డంప్‌యార్డ్‌కి చేరుతుందట! నగరంలో ఇలాంటి డంప్‌యార్డ్‌లు 24 ఉన్నాయి. వాటన్నింటినీ తిరిగాను. విదేశాలలో ఇళ్ల నుంచి చెత్తను సేకరించే పద్ధతులు, అక్కడ ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, చెత్తను రీ సైక్లింగ్ చేసే విధానాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాను. వాటిలో మనం కనీసం 50 శాతం పాటించినా ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనిపించింది. అన్ని డంప్‌యార్డ్‌ల వద్ద హెల్త్‌క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. రెండు రోజుల క్రితమే పటాన్చెరువు, మియాపూర్‌లలోని డంప్‌యార్డ్‌ల వద్ద హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశాం. తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. మిగతా డంప్‌యార్డ్‌ల వద్ద కూడా హెల్త్ క్యాంపులు పెట్టి, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇందుకు తగినంత వైద్య సిబ్బంది, వాలంటీర్ల లేమి ఉంది. రాబోయేది వర్షాకాలం. ఈ కాలంలో ఆరోగ్య సమస్యల సంఖ్య ఇంకా ఎక్కువే. కాలుష్యం తగ్గడానికి డంప్‌యార్డ్ చుట్టూ ఔషధ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని, తాగునీటి వసతితో పాటు చేతులు, ఒళ్లు శుభ్రం చేసుకోవడానికి తగినన్ని నీళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాను. పర్మిషన్ ఇచ్చినా ఆ పనిని నేను కొద్ది కొద్దిగానైనా నెరవేర్చుకుంటూ వెళ్లగలననే నమ్మకం నాకుంది’’ అని చెప్పారు జయశ్రీ. ‘‘ఇన్నాళ్లు నేను చేసిన ఉద్యోగం పిల్లల భవిష్యత్తుకు మార్గం చూపేది. ఇప్పుడు డంప్‌యార్డ్ చుట్టూ పేరుకుపోయిన అనారోగ్య పరిస్థితుల్ని తొలగించడానికి నా చుట్టూ ఉన్న నలుగురిని తట్టిలేపాలని నిశ్చయించుకున్నాను’’ అంటున్నారు జయశ్రీ. ప్రతి ఇంటికీ బాధ్యత ఉంది మన దగ్గర తడి చెత్త–పొడి చెత్త అని, చెత్తను వేరు చేసే రెండు విధానాలు ఉన్నాయి. కానీ, వాటిని పట్టించుకునే వారే లేరు. ఇళ్ల వద్దే చెత్తను మనం చాలా రకాలుగా తగ్గించవచ్చు. తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవచ్చు. పొడి చెత్తలోనూ హానికారకమైన (సిరంజులు, సూదులు, గాజు ముక్కలు, బ్యాటరీల.. వంటివి) వస్తువులను విడిగా ఒక ప్యాకెట్లో వేసి ఇస్తే వాటిని వాళ్లు అంతే జాగ్రత్తగా తీసుకెళ్లగలరు. నివారణ మన ఇంటి నుంచి మొదలైతే సమాజ ఆరోగ్యం బాగుంటుంది. – జయశ్రీ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం
-
కోదండరామ్ అరెస్ట్; టెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. తార్నాకలోని తన నివాసం నుంచి మిలియన్ మార్చ్ సభకు బయలుదేరుతుండగా తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వాహనాన్ని భారీగా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన చాలాసేపు కారులోనే ఉండిపోయారు. తర్వాత ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డిని పార్టీ కార్యాలయంలోనే అరెస్ట్ చేశారు. కాగా, ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ సభకు అనుమతి లేదని, ఇటువైపు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఇటువైపు వచ్చే దారులను మూసివేసినప్పటికీ కొంత ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సాయంత్రం సభ నిర్వహించి తీరతామని జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
తార్నాకలో చైన్ స్నాచింగ్ కలకలం
హైదరాబాద్: తార్నకలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు 10 తులాల బంగారు ఆభరణాలను దుండగులు లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిని కుంతిదేవి నాగర్జున నగర్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న కుంతిదేవిని గమనించిన స్నాచర్లు బ్లాక్ పల్సర్ వాహనంపై వచ్చి ఆమె మెడలోని నల్లపూసల గొలుసు, తాళిబొట్టుతో పాటు మరో ఆభరణాన్ని లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
అక్రమంగా విక్రయిస్తున్న భారీ మద్యం పట్టివేత
తార్నాక: అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. తార్నాకలోని మారేడుపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పి. భగవంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలో మద్యం షాపులు బంద్ చేశారు. అయితే, అడ్డగుట్ట పరిధిలోని మంగోర్ బస్తీలో యు. చోటు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే అధికారులు ఆ ఇంటిపై దాడి చేసి రూ. 2 లక్షల విలువ చేసే వివిధ బ్రాండ్లకు చెందిన 53 కాటన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోటు పరారీ కాగా.. అతని భార్య నిర్మలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తూ గతంలో పట్టుబడ్డ యు.వాణిశ్రీ అనే మహిళ బోనాల సందర్భంగా అధిక ధరలకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేసి.. చోటు ఇంట్లో నిల్వ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న వాణిశ్రీ, చోటు కోసం గాలిస్తున్నామని, కేసు తదుపరి విచారణను మారేడుపల్లి ఎక్సైజ్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ స్వప్నకు అప్పగించారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు జి.శ్రీనివాసరావు, వేమారెడ్డి, ఎస్సైలు కె.కరుణ, చంద్రశేఖర్, రమహమత్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి
ఆదిలాబాద్(కుంటాల): హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కుంటాల జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడు గుండ్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని తార్నకకు చెందిన ఊటుకూరి చైతన్య(24), స్నేహితులతో కలసి జలపాతాన్ని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు.