
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఘోరం జరిగింది. లిఫ్ట్ పేరిట ఒక మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఐదుగురు. నిందితుల అరెస్ట్‌తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు. తన స్కూటీపై ఎక్కించుకుని ప్రశాంత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఫోన్ చేసి తన నలుగురు స్నేహితుల్ని రప్పించుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదుతో మధు యాదవ్, బర్నా యేసు, సిరిగిరి ప్రశాంత్‌కుమార్, పస్తం తరుణ్‌కుమార్, కేశోజువా రోహిత్‌లపై కేసు నమోదు చేసుకున్నారు లాలాగూడ పోలీసులు. ప్రశాంత్.. మధుసూదన్.. రోహిత్ తరుణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment