తార్నకలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది.
హైదరాబాద్: తార్నకలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు 10 తులాల బంగారు ఆభరణాలను దుండగులు లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిని కుంతిదేవి నాగర్జున నగర్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న కుంతిదేవిని గమనించిన స్నాచర్లు బ్లాక్ పల్సర్ వాహనంపై వచ్చి ఆమె మెడలోని నల్లపూసల గొలుసు, తాళిబొట్టుతో పాటు మరో ఆభరణాన్ని లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.