జనంతో నిండిపోయిన ఆలయం ,ఆలయ ప్రహరీపై హనుమాన్ చిత్రాన్ని తలపిస్తున్న ఆకారం (వృత్తంలో)
తార్నాక: తార్నాక– సీతాఫల్‌మండి వెళ్లే రహదారిలోని ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వద్ద ఉన్న మూడుగుళ్ల అమ్మవారి ఆలయ ప్రహరీపై çఆంజనేయస్వామిని తలపించేలా ఆకారం ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది. గోడపై ఆంజనేయ స్వామి చిత్రాన్ని చూసిన కొందరు ఈ విషయాన్ని తమకు తెలిసిన వారికి చెప్పడంతో ఈ సమాచారం దావానంలా వ్యాప్తించింది.
మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తార్నాక నుంచి సీతాఫల్‌మండి బ్రిడ్జి వైపు వెళ్లే రహదారిలో ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రహరీని ఆనుకుని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ మూడుగుళ్ల దేవాలయం ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఇటీవలే ఆధునికీకరించారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆలయ ప్రహరీపై ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు ఆకుల మధ్య నుంచి ఆంజనేయస్వామి ఆకారం కనిపించింది. విద్యుత్ కాంతుల మధ్య గోడపై ధగధగా మెరుస్తున్న ఆంజనేయస్వామి ఆకారాన్ని అటుగా వెళ్లున్నవారు గమనించారు. ఈ సమాచారం ఆ నోటా ఈనోటా బయటకు రావడంతో కొద్ది క్షణాల్లోనే ఆలయ ప్రాంగణం జనంతో నిండిపోయింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌తో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment