
సాక్షి, మధురానగర్ (విజయవాడ): బాలికను వృద్ధుడు వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన ఘటన నున్న రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజీవ్‌నగర్‌కు చెందిన జాన్ బాబు(74) అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు.
బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు జాన్‌బాబును హెచ్చరించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాక పోగా బాలిక స్కూలుకు వెళ్లే సమయంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాలిక తల్లి మంగళవారం నున్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.