రాజస్థాన్‌లో అక్షయ తృతీయ వేళ విషాదం చోటుచేసుకుంది. ఈ పండుగను రాష్ట్రంలో అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా బికనీర్‌లో గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. అయితే వీటిని ఎగువేసేందుకు వినియోగించే చైనీస్ మాంజాలు పలువురిని గాయాలపాలు చేస్తున్నాయి.
చైనీస్ మాంజా తగలడంతో 35 మంది గాయపడ్డారు. ఆరుగురి గొంతులు కోసుకుపోయాయి. మాంజా బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బికనీర్ జిల్లా ఆరోగ్య యంత్రాంగం బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. బికనీర్‌లోని పీబీఎం ఆస్పత్రిలో కూడా గాలి పటాల బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గాలిపటాల మాంజాల కారణంగా గాయపడిన 35 మందికి పీబీఎం ఆస్పత్రిలోని ట్రామా సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. గొంతు తెగిన ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ట్రామా సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ కపిల్ తెలిపారు. మరోవైపు నగరానికి చెందిన పలువురు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గాలిపటాలు ఎగరవేయడంతో ఆకాశం నిండా గాలిపటాలు కనిపిస్తున్నాయి. చైనా మాంజా కారణంగా పక్షులు కూడా చనిపోతున్నట్లు తెలుస్తోంది.
आखातीज और बीकानेर स्थापना दिवस पर आइए कभी हमारे बीकानेर और देखिए यहां कि पतंगबाजी इतनी धूप में 🔥🎉#Bikaner pic.twitter.com/QdvPW0R66q
— MAHENDARA GODARA (@MAHENDRAJAAT010) May 10, 2024
Comments
Please login to add a commentAdd a comment