
బీజింగ్: వినూత్న, భారీ ప్రాజెక్టులకు పెట్టింది పేరైన చైనా దేశం మరోమారు తన భారీతనాన్ని చాటుకుంటోంది. ఏకంగా ఒక నగరం కంటే పెద్ద స్థాయిలో నూతనంగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో అంటే దాదాపు 32,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి.
చైనాలోని హెనాన్ ప్రావిన్సులోని ఝెన్‌ఝౌ నగరం శివారు ప్రాంతంలో బీవైడీ సంస్థ ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ఈ కర్మాగారంలో తయారుచేయనున్నారు. తాజాగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక డ్రోన్ వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో సామాజిక మాధ్యమాల్లో దీని గురించి చర్చ మొదలైంది. ఉత్పత్తి యూనిట్లు, పెద్ద భవనాలు, టెన్నిస్ కోర్టు, ఫుట్‌బాల్ మైదానాలతో సకల సదుపాయాలతో కర్మాగార పనులు కొనసాగుతున్నాయి. రోజు ఇక్కడ పనిచేసే కారి్మకులతో ఇప్పటికే ఈ ప్రాంతం కొత్త సిటీలా మారిపోయిందని డ్రోన్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఇదే ప్రాంత సమీపంలో బీవైడీ కంపెనీకి ఒక ఫ్యాక్టరీ ఉంది.
ఈ ఫ్యాక్టరీ.. అమెరికాలో నెవడా రాష్ట్రంలో విద్యుత్‌కార్ల దిగ్గజం టెస్లాకు చెందిన ఫ్యాక్టరీ కంటే విస్తీర్ణంలో పెద్దదికావడం విశేషం. కొత్త ఫ్యాక్టరీని ఎనిమిది బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బీవైడీ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 9,00,000 మంది సిబ్బంది ఉన్నారు. మరో మూడు నెలల్లో 2,00,000 మంది సిబ్బందిని కొత్తగా నియమించుకోనున్నారు. ఝెన్‌ఝౌ నగరంలో నిర్మిస్తున్న కొత్త కర్మాగారంలో రోజు 60,000 మంది కారి్మకులు పనిచేస్తుండటంతో ఇప్పుడు అదొక కొత్త సిటీలా కనిపిస్తోందని ఒక నెటిజన్ అన్నారు.
BYD has announced that their Zhengzhou factory will be 50 square miles, which is reportedly bigger than San Francisco at 46.9 square miles, per the Sun. pic.twitter.com/y39khwcyuc
— unusual_whales (@unusual_whales) March 24, 2025
Comments
Please login to add a commentAdd a comment