kite
-
పతంగ్ ఎగరేసిన బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫోటోలు)
-
పతంగులకు ఎంత గాలి అవసరం? ఎందుకు తెగిపోతాయి?
నేడు (జనవరి 14) దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే గాలిపటం ఎగురవేయడానికి ఎంత గాలి అవసరమో మీకు తెలుసా?మకర సంక్రాంతి రోజున భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిల్లలు, పెద్దలు అంతా కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు. ఈ రోజున ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. ఈ గాలిపటాలను చూసినప్పుడు అందరి హృదయాలు ఆనందంతో నిండిపోతాయి.ఆకాశంలో గాలి లేకపోతే గాలిపటాలు ఎగరవేయలేమని పలువురు చెబుతుంటారు. ఇంతేకాదు గాలి బలంగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం, కత్తిరించడం కష్టం అవుతుంది. నిజానికి పతంగులు ఎగురవేయడానికి, స్థిరమైన గాలి వేగం గంటకు 8 నుండి 20 మైళ్ళు (13 నుండి 32 కిలోమీటర్లు) మధ్య ఉండాలి. దీనికంటే తక్కువ గాలి వీచినా, గాలిపటాన్ని ఎగురవేయడం కష్టమవుతుంది. అలాగే గంటకు 30 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో వీచే గాలులు కూడా గాలిపటం ఎగరవేయడానికి ఇబ్బందికరంగా మారుతుంది.ఆకాశంలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం కష్టమవుతుంది. నిజానికి బలమైన గాలి వీచినప్పుడు గాలిపటం వెంటనే గాలిలో ఎగురుతుంది. ఇంతేకాదు మాంజాను గాలిపటానికి సరిగ్గా కట్టకపోయినా, గాలిపటం వేగంగా ఎగురుతుంది. అయితే బలమైన గాలులకు గాలిపటం ఆ గాలితో పాటు ముందుకు కదులుతుంది. అయితే అప్పుడు ఆ గాలిపటాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఇంతేకాదు బలమైన గాలిలో మీ గాలిపటంతో మరొక గాలిపటాన్ని కట్చేయలేరు. గాలి వేగం పెరుగుతున్నప్పుడు, గాలిపటాన్ని వెనక్కి లాగే సందర్భంలో అది చినిగిపోతుంది. ఎందుకంటే గాలి దానిని ముందుకు నెట్టివేస్తుంటుంది. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం -
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
రాజస్థాన్‌లో అక్షయ తృతీయ వేళ విషాదం చోటుచేసుకుంది. ఈ పండుగను రాష్ట్రంలో అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా బికనీర్‌లో గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. అయితే వీటిని ఎగువేసేందుకు వినియోగించే చైనీస్ మాంజాలు పలువురిని గాయాలపాలు చేస్తున్నాయి.చైనీస్ మాంజా తగలడంతో 35 మంది గాయపడ్డారు. ఆరుగురి గొంతులు కోసుకుపోయాయి. మాంజా బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బికనీర్ జిల్లా ఆరోగ్య యంత్రాంగం బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. బికనీర్‌లోని పీబీఎం ఆస్పత్రిలో కూడా గాలి పటాల బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గాలిపటాల మాంజాల కారణంగా గాయపడిన 35 మందికి పీబీఎం ఆస్పత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గొంతు తెగిన ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ట్రామా సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ కపిల్ తెలిపారు. మరోవైపు నగరానికి చెందిన పలువురు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గాలిపటాలు ఎగరవేయడంతో ఆకాశం నిండా గాలిపటాలు కనిపిస్తున్నాయి. చైనా మాంజా కారణంగా పక్షులు కూడా చనిపోతున్నట్లు తెలుస్తోంది. आखातीज और बीकानेर स्थापना दिवस पर आइए कभी हमारे बीकानेर और देखिए यहां कि पतंगबाजी इतनी धूप में 🔥🎉#Bikaner pic.twitter.com/QdvPW0R66q— MAHENDARA GODARA (@MAHENDRAJAAT010) May 10, 2024 -
మకర సంక్రాంతికి ఏ రాష్ట్రంలో ఏంచేస్తారు?
దేశవ్యాప్తంగా నేడు మకర సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన ఈ తరుణం నుంచి హిందువులు శుభకార్యాలను ప్రారంభిస్తారు. మకర సంక్రాంతి నాడు చేసే గంగాస్నానం, దానధర్మాలు, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకరసంక్రాంతి నాడు ఏ రాష్ట్రాల్లో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘీగా జరుపుకుంటారు. తెల్లవారుజామున నదీస్నానం చేస్తారు. ఈ రోజున నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. మాఘి నాడు శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో భారీ జాతర నిర్వహిస్తారు. తమిళనాడు దక్షిణ భారతదేశంలో మకర సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి పొంగల్, రెండవ రోజు సూర్య పొంగల్, మూడవ రోజు మట్టు పొంగల్, నాల్గవ రోజు కన్యా పొంగల్ నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ సందర్భంగా గంగాసాగర్ వద్ద జాతర నిర్వహిస్తారు. స్నానం చేసిన తర్వాత నువ్వులను దానం చేస్తారు. ఈ రోజున యశోదమాత.. శ్రీ కృష్ణుడిని దక్కించుకునేందుకు ఉపవాసం చేశారని చెబుతారు. అలాగే ఈ రోజునే గంగామాత భగీరథుడిని అనుసరిస్తూ, గంగా సాగర్‌లోని కపిలముని ఆశ్రమాన్ని చేరిందని అంటారు. కేరళ కేరళలో సంక్రాంతిని మకర విళక్కు పేరుతో నిర్వహిస్తారు. శబరిమల ఆలయానికి సమీపంలో ఆకాశంలో మకర జ్యోతిని భక్తులు సందర్శిస్తారు. కర్ణాటక కర్నాటకలో సంక్రాంతిని ‘ఏలు బిరోదు’ అనే పేరుతో జరుపుకుంటారు. స్థానిక మహిళలు.. చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరిని ఉపయోగించి చేసిన వంటకాన్ని చుట్టుపక్కలవారికి పంచిపెడతారు. గుజరాత్ మకర సంక్రాంతిని గుజరాతీలో ఉత్తరాయణం అని అంటారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేస్తారు. ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు. ఇది కూడా చదవండి: మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి! -
గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి?
సూర్య భగవానుని గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగే మకరసంక్రాంతి. ఈ రోజున స్నానం చేసి, సూర్యభగవానుని పూజించి, దానాలు చేస్తారు. మకర సంక్రాంతి పండుగను మన దేశంలో చాలా పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో పొంగల్, గుజరాత్లో ఉత్తరాయణం, పంజాబ్‌లో లోహ్రీ, అస్సాంలో భోగాలి, బెంగాల్లో గంగాసాగర్, ఉత్తరప్రదేశ్‌లో ఖిచ్డీ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. పతంగుల పోటీలు జరుగుతుంటాయి. ఒకరి గాలిపటాన్ని మరొకరు కట్ చేసేందుకు ప్రయత్నిస్తూ వినోదిస్తారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే సంక్రాంతిరోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉద్దేశం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పలు ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయడం వెనుక పలు శాస్త్రీయ కారణాలున్నాయి. బహిరంగ ప్రదేశంలో ఆకాశంలో గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు సూర్యుని నుండి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం. అంతేకాకుండా ఎండలో నిలుచుని గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు చలినుంచి రక్షణ దొరుకుతుంది. శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చు. మకర సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేయడం వెనుక మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇతిహాసాలలోని వివరాల ప్రకారం మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయాన్ని శ్రీరాముడు ప్రారంభించాడు. శ్రీరాముడు తొలిసారి గాలిపటం ఎగురవేసినప్పుడు, ఆ గాలిపటం ఇంద్రలోకానికి వెళ్లింది. నాటి నుంచి శ్రీరాముడు ప్రారంభించిన సంప్రదాయాన్ని హిందువులు భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. మకర సంక్రాంతి రోజున పతంగులు ఎగురవేయడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా సౌభ్రాతృత్వం, సంతోషం వెల్లివిరుస్తాయి. గాలిపటం అనేది ఆనందం, స్వేచ్ఛ, ఐశ్వర్యానికి చిహ్నమని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి? -
‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్!
పతంగులు ఎగురవేసే అభిరుచి కలిగినవారికి మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వారణాసి గగనతలంలో ప్రత్యేక గాలిపటాలు సందడి చేస్తున్నాయి. ఈసారి వారణాసి మార్కెట్లో ‘బుల్డోజర్ బాబా’ గాలిపటాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. ఈ బుల్డోజర్ బాబా గాలిపటంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉన్నాయి. దీంతోపాటు బుల్డోజర్ బాబా బొమ్మకు కూడా చోటు దక్కింది. అంతే కాదు ఈ గాలిపటంపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా ముద్రించారు. దుకాణదారుడు అరవింద్ మాట్లాడుతూ బుల్డోజర్ బాబా గాలిపటాలను యువత అమితంగా ఇష్టపడుతున్నారని, అందుకే వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ‘బుల్డోజర్ బాబా’ పతంగికి డిమాండ్ ఉంది. ఈ గాలిపటం ధర 5 నుంచి 15 రూపాయల వరకు ఉంది. గాలిపటాలంటే అమితమైన ఇష్టం ఉన్న వారణాసి కుర్రాడు ఆదిత్య ఈసారి మకర సంక్రాంతికి బుల్డోజర్ బాబా గాలిపటం ఎగురవేస్తానని చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో తన ‘బుల్డోజర్’ చర్యలతో మాఫియా వెన్ను విరిచి, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చారని ఆదిత్య పేర్కొన్నాడు. సీఎంకు మద్దతుగా తాను ఈ గాలిపటాన్ని ఎగురవేస్తానన్నారు. ఇది కూడా చదవండి: 25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా.. -
తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు?
దేశంలోని వివిధ ప్రాంతాలలో మకర సంక్రాంతిని అక్కడి ఆచార సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. అయితే సంక్రాంతి అనగానే ముందుగా గాలిపటాలు గుర్తుకువస్తాయి. జైపూర్, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో సంక్రాతి సందర్భంగా కైట్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు గాలిపటాలు ఎగరేస్తూ ఎంతగానో ఆనందిస్తారు. అయితే గాలిపటం అనేది భారతదేశంలో ఆవిష్కృతం కాలేదు. గాలిపటాన్ని చైనాలో కనుగొన్నారు. క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో చైనాలో గాలిపటాన్ని ఆవిష్కరించారని చెబుతుంటారు. ప్రపంచంలోనే మొట్టమొదటి గాలిపటాన్ని చైనీస్ తత్వవేత్త హువాంగ్ హెంగ్ తయారు చేశారు. చైనాలో గాలిపటాలు దూరాలను కొలవడానికి, గాలిని పరీక్షించడానికి, సైనిక కార్యకలాపాలలో ఉపయోగించేందుకు కనుగొన్నారు. అయితే గాలిపటం భారతదేశంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో నాటి కాలపు రాజులు, చక్రవర్తులు కూడా గాలిపటాలు ఎగురవేసేవారు. ఇది కాలక్రమేణా ప్రజాదరణ పొందింది. ప్రస్తుత రోజుల్లో సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా గాలిపటాలు ఎగురవేయడం అంటే ఎంతో ఇష్టం. ఆయన వీలు చిక్కినప్పుడు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దేశంలోని జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో గాలిపటాల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పతంగులు ఎగురవేసేందుకు, వాటిని చూసేందుకు పలు దేశాల టూరిస్టులు భారత్‌కు వస్తుంటారు. సంక్రాంతి నాడు ఆకాశం గాలిపటాలతో నిండిపోతుంది. దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల పతంగుల వ్యాపారం జరుగుతుండగా, జైపూర్, అహ్మదాబాద్, ముంబైలలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పతంగుల తయారీ వలన లక్షలాది మందికి ఉపాధి కూడా లభిస్తుంది. గాలిపటం ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు గాలిపటం ఎగురవేసేటప్పుడు దాని దారం విద్యుత్ తీగలకు చిక్కుకుపోతుంది. ఇటువంటి సందర్భంలో ఆ దారాన్ని లాగితే షాక్ తగిలే అయ్యే ప్రమాదం ఉంది. చాలా మంది పిల్లలు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రమాదాల బారినపడుతుంటారు. ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ మరింత అవసరం. -
గాలిపటం ఎగురవేస్తూ 11 ఏళ్ల బాలుడు మృతి
-
కేసీఆర్ కిట్ ఇక.. ఎంసీహెచ్ కిట్
నల్లగొండ టౌన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్లపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలపై ఇప్పుడు తెల్లని స్టిక్కర్లను అతికించి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బాలింతలకు అందజేస్తున్న కేసీఆర్ కిట్ పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ కిట్‌కు బదులు ఎంసీహెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) కిట్‌గా పేరు మారుస్తూ వైద్య, ఆరోగ్యశాఖ సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేసీఆర్ కిట్లపై ఉన్న కేసీఆర్ ఫొటోపై తెల్లని స్టిక్కర్ అతికించి దానిపై ఎంసీహెచ్ కిట్ అని పేరు రాసి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. దాంతో పాటుగా గర్భిణులకు అందజేస్తున్న న్యూట్రీషియన్ కిట్‌లోని వస్తువులపై ఉన్న కేసీఆర్ ఫొటోలపై కూడా తెల్లని స్టిక్కర్ అతికించి ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఎంసీహెచ్ పేరుతో ముద్రించిన కిట్లు వచ్చే వరకు.. ఇప్పటికే జిల్లాలో ఉన్న కిట్ల స్టాక్‌పై ఉన్న కేసీఆర్ పేరు, ఫొటోపై స్టిక్కర్లు అతికించి ఎంసీహెచ్ కిట్ల పేరు రాసి పంపిణీ చేస్తున్నాం. అలాగే న్యూట్రిషియన్ కిట్లలోని వస్తువులపై ఉన్న కేసీఆర్ ఫొటోలపై కూడా తెల్లని స్టిక్కర్ వేస్తున్నాం. – డాక్టర్ కొండల్రావు, డీఎంహెచ్ఓ, నల్లగొండ -
తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!
పండగను ప్రత్యేకంగా జరుపుకోవాలనే తపన అందరిలోనూ ఉంటుంది. అందుకు తగినట్టుగా ఇంటి అలంకరణను ఎంచుకుంటారు. అయితే, పండగ కళ అందరికన్నా బాగా కనపడాలని కోరుకునేవారికి డెకార్ నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు. ఫ్యాబ్రిక్‌తో డిజైన్.. కర్టెన్లు, చీరలు, దుపట్టాలు లేదా ఏదైనా ఫాబ్రిక్‌ని ఉపయోగించి మీ లివింగ్‌రూమ్‌ని అందంగా మార్చుకోవచ్చు. ఇందుకు పండగ థీమ్‌తో బాగా సరియే డిజైన్ లేదా ప్రింట్‌ని ఎంచుకోవాలి. రంగవల్లికలైనా, ఇంటి అలంకరణలో డిజైన్ని మెరుగుపరచడానికైనా పువ్వులు, లైటింగ్ ఎంపికలు, బెలూన్ లను వాడచ్చు. గాలిపటం గాలిపటాలు ఎగురవేసిన జ్ఞాపకాలు మీలో ఉండే ఉంటాయి. అయితే, గాలిపటాలు ఎగురవేయడాన్ని మీ ఇంటి వెలుపలికి ఎందుకు పరిమితం చేయాలి? ఈసారి ఇంటిని పండగ కళ నింపేలా ఒక వాల్ని పతంగులతో అలంకరించండి. ఆకులతో.. భోగి, సంక్రాంతి శ్రేయస్సుకు వేడుకలు. అందుకే ప్రధాన రంగు ఆకుపచ్చ తప్పక ఉంటుంది. మామిడి ఆకులు పొంగల్ వేడుకలలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. వీటిని మీ ద్వారం వద్ద వేలాడదీయచ్చు. మామిడి ఆకులు శుభప్రదానికి, సంతోషానికి సూచికలు. పర్యావరణ అనుకూలమైనవి. మామిడి ఆకులు, ఇతర పువ్వులతో కలిపి చేసే అలంకరణ కూడా చూడముచ్చటగా ఉంటుంది. వెదురు బుట్టలు కొన్నిరకాల చిన్న చిన్న బుట్టలను ఎంపిక చేసుకోవాలి. వాటి చివర్లను పువ్వులు లేదా ఇతర టాసిల్స్తో జత చేయాలి. వాటిని గొడుగులా ఔట్ డోర్ లేదా బాల్కనీ ఏరియాలో వేలాడదీయవచ్చు. తక్కువ బడ్జెట్ అలంకరణకు తక్కువ బడ్జెట్లో పర్యావరణకు అనుకూలమైనవి, తిరిగి భద్రపరుచుకునేవి ఎంపిక చేసుకుంటే పండగ సంబరం మరింత పెరుగుతుంది. ఇందుకు ఖరీదైన వస్తువులను కొనడం అవసరం లేదు. ప్రాథమిక అలంకరణలపై దృష్టి పెడితే చాలు. వాటిలో... స్కాచ్ టేప్, సేఫ్టీ పిన్స్ లేదా అతికించడానికి గ్లూ, కట్టర్ లేదా కత్తెర వంటివి సిద్ధం చేసుకోవాలి. ప్రతి ప్రయత్నమూ మిమ్మల్ని విసిగిస్తే సింపుల్‌గా బెలూన్లను ఎంపిక చేసుకోవచ్చు. వీటి నిర్వహణ కూడా పెద్ద కష్టం కాదు. రంగు రంగుల బెలూన్లు రెండు మూడు కలిపి, గుచ్చంలా వాల్కి ఒక్కో చోట అతికించవచ్చు. లేదా హ్యాంగ్ చేయవచ్చు. ప్రతి పూజలో పువ్వులు ముఖ్యమైన భాగం. కాబట్టి, మీ ఇంటికి కొన్ని తాజాపూలను ముందుగానే కొనుగోలు చేయండి. పూలతో ఎన్ని అలంకరణలైనా చేయచ్చు. పండుగలలో ఏదైనా తీపిని తినడం మంచి శకునంగా భావిస్తారు. అలాగే, స్వయంగా చేసినవైనా, కొనుగోలు చేసినవైనా కొన్ని రకాల తీపి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. పండగ సమయాల్లో ప్రకాశంతమైన రంగు దుస్తులు బాగుంటాయి. వాటిలో మంచి పచ్చ, పసుపు, మెరూన్, పింక్.. ఎంచుకోవాలి. (క్లిక్ చేయండి: పండగ రోజు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా చేయండి..) -
ప్రాణం తీసిన పతంగి దారం.. బైకర్ గొంతు తెగి..
సూరత్: గాలిపటం ఎగరేసే దారం మెడకు చుట్టుకొని ఓ బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. మాంజా చాలా పదునుగా ఉంటడంతో అతని గొంతు తెగి చనిపోయాడు. గుజరాత్‌లోని సూరత్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు బల్వంత్ పటేల్(52). కమ్రేజ్‌లోని నవగామ్‌లోని నివాసముంటాడు. వజ్రాల పరిశ్రమలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా శంకర్ నగర్లో ఓ పతంగి దారం అతని మెడకు చుట్టుకుంది. అతను ఎలాగోలా బైక్‌ను ఆపి కిందపడిపోయాడు. మెడ తెగి రక్తం కారుతున్న అతడ్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వైద్యులు బల్వంత్ చనిపోయాడని సోమవారం రాత్రి ప్రకటించారు. మాంజా పదునుగా ఉండటంతో గొంతు లోతుగా తెగిందని, ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థినిని దారుణంగా కత్తితో.. -
రాఖీ కట్టించుకునేందుకు భార్యతో కలిసి చెల్లి ఇంటికి వెళ్తూ... అంతలోనే..
న్యూఢిల్లీ: చెల్లితో రాఖీ కట్టించుకుందామని ఆనందంగా భార్యతో కలిసి బైక్ పై కలిసి వస్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీ జాతీయ రహదారిలో చోటుచేసుకుంది. ఈ మేరకు రాజధానికి సమీపంలోని నాంగ్లోయ్‌లో నివశిస్తున్న 35 ఏళ్ల విపిన్ కుమార్ రక్షబంధన్ పండుగను జరుపుకునేందుకు లోని ప్రాంతంలో ఉన్న తన చెల్లి ఇంటికి తన భార్యతో వస్తున్నాడు. అతను బైక్‌పై శాస్త్రి ఫై ఓవర్ వద్దకు చేరుకునేటప్పటికీ చైనీస్ గాలిపటం అతని మెడకు చుట్టుకుంది. అంతే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతని భార్య రహదారిపై ఉన్న స్థానికుల సాయంతో తన భర్తను ఆస్పత్రికి తరలించేటప్పటికే మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. వాస్తవానికి ఈ ఘటనలు గతంలో చాలా జరగడంతో ఢిల్లీలో 2016లోనే ఈ గాలిపటాల విక్రయాలను నిషేధించారు. దీంతో ఈ విషయమై స్పందించిన ఢిల్లీ హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించిన చైనీస్ ఫ్లాగ్‌ల విక్రయంలో పోలీసులు తీసుకున్న చర్యలేంటో వివరించాలని కోరింది. ధర్మాసం 2016లో ఈ చైనీస్ గాలిపటాలపై దాఖలైన ఫిల్‌ని విచారిస్తూ వీటిని నిషేధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. గతంలో ఈ గాలిపటాల కారణంగా వేర్వేరు ప్రమాదంలో చిన్నారుల నుంచి పెద్దలు వరకు మృతి చెందిన పలు ఘటనలు చోటుచేసుకోవడంతో ఢిల్లీ హైకోర్టు వాటి విక్రయాలను నిషేధించింది. (చదవండి: ఘోరం.. గోడపై మూత్రం పోయడంతో గొడవ.. తల్లిని దుర్భాషలాడినందుకు వెంటాడి చంపాడు) -
గాలి పటాలతో కరెంటు ఉత్పత్తి..
-
భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని ప్రాణం తీసింది..
భువనేశ్వర్/కటక్: గాలిపటాలు ఎగరేస్తుంటే వచ్చే ఆనందమే వేరు. కానీ ఆ పతంగి పైపైకి పోవాలనే భావనతో కొంతమంది దారానికి మాంజా(గాజు పెంకుల పొడి) పూయడం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఇప్పటివరకు మాంజా కాళ్లకు చుట్టుకుని పక్షులు మరణించిన ఉదంతాలు మాత్రమే చూశాం. ప్రస్తుతం మాంజా పూసిన దారం మెడకు చుట్టుకోవడంతో ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన సంచలనం రేకిత్తిస్తోంది. కటక్–చాంద్‌బాలి జాతీయ రహదారిలోని పీర్ బజారు ప్రాంతంలో సోమవారం ఉదయం కటక్‌లోని తమ బంధువుల ఇంటికి భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్న జయంత్ సామల్(31)పీకకు ఓ తెగిన గాలిపటం దారం ఒకటి చుట్టుకుంది. ఒక చేత్తో దాన్ని పక్కకు లాగుతూనే కొంతదూరం వెళ్లారు. ఈ ప్రయత్నంలో పతంగికి ఉన్న దారం అతని గొంతును కోసేసింది. దీంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. అదృష్టవశాత్తు అతడితో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్వల్పంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగిన మరుక్షణమే స్థానికులు చొరవ కల్పించుకుని చేరువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భార్యాభర్తలిద్దరినీ చేర్చారు. ఈ క్రమంలో చికిత్స ప్రారంభించిన వైద్యులు జయంత్ అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జగత్పూర్ ఠాణా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం దుర్ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) గాలిపటం దారానికి గాజు పెంకుల పొడి పూస్తున్న దృశ్యం దుకాణానికి వెళ్తుండగా.. పూరీ పట్టణంలో వెలుగుచూసిన మరో గాలిపటం దుర్ఘటనలో ఓ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానిక బొడొదండొలో మందుల దుకాణానికి వెళ్తుండగా, తెగిన గాలిపటం అతడి మెడ భాగం కోసుకుపోయింది. ఈ ప్రమాదంలో భంజబిహారి పాత్రో తీవ్రంగా గాయపడి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఏడేళ్లలో ముగ్గురు మృతి.. గడిచిన ఏడేళ్లలో ఒక్క కటక్ నగరంలోనే గాలిపటంతో పీక తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం, 10 మందికి పైగా గాయాలపాలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతి పురస్కరించుకుని, జరుపుకునే గాలిపటాల పండుగ మరెంతమందిని విషాదంలోకి నెడుతుందోనని సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం మాంజా అమ్మకాలపై నిషేధం విధించినా పలుచోట్ల వాటి అమ్మకాలు జోరుగా సాగుతుండడం గమనార్హం. చదవండి: (Hubli: కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం) మాంజా తయారీ.. సాధారణంగా సంక్రాంతి పండగ దగ్గర పడుతున్న తరుణంలో గాలి పటాల సందడి ప్రారంభమవుతుంది. నింగికెగసి రెపరెపలాడుతూ ఎగిరే గాలి పటాల మధ్య పోటీ కోసం దారం పదును పెడతారు. ఫుడ్ కలర్ కలిపిన బంకలో గాజు పెంకుల పొడిని జోడించిన మిశ్రమం దారపు పోగును బలంగా చేసేందుకు పూస్తారు. ఎండలో ఇది ఆరిన తర్వాత గాలి పటానికి కట్టి ఎగురవేస్తారు. ఈ ప్రక్రియని మాంజాగా పేర్కొంటారు. గాలిలో జరిగే ఈ పోటీలో ఎవరి గాలి పటం తెగితే ఆ అభ్యర్థి ఓడినట్లే. ఇలా తెగిన గాలి పటం గాలిలో తేలియాడుతూ నేలను చేరుకునే క్రమంలో ఆ ప్రాంతంలోని ఎవరికో ఒకరికి తగిలి, ప్రమాదం తెచ్చిపెడుతోంది. సాధారణంగా మెడ ప్రాంతంలో గాలిపటం దారం కోసుకుపోతుండడంతో ప్రాణాలు పోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు.. గాలి పటం తెగడంతో కటక్ ప్రాంతంలో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఐపీసీ 304–ఎ సెక్షన్ కింద జగత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయా సడక్, నంది సాహి ప్రాంతాల్లో పూరీ ఘాట్ ఠాణా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విచారకర సంఘటనతో నగర వ్యాప్తంగా ప్రత్యేక దాడులు చేపట్టినట్లు కటక్ నగర డీసీపీ ప్రతీక్ సింఘ్ తెలిపారు. గాలి పటాలు, మాంజా దారం విక్రేతలను పలుచోట్ల అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నగర వ్యాప్తంగా అన్ని ఠాణాల అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటుండడం విశేషం. ముఖ్యంగా మాంజా తయారీదారులను గుర్తించి వారిని కఠినంగా శిక్షిస్తారు. గాలి పటాల దుకాణాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు చేపడతున్నట్లు డీసీపీ తెలిపారు. మాంజా దారాల విక్రయం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. పూరీ సంఘటనపై కేసు నమోదు భువనేశ్వర్/పూరీ: పూరీ బొడొదండొ ప్రాంతంలో జరిగిన గాలిపటం దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ–337, ఐపీసీ–338 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పూరీ కుంభార్‌పడా ఠాణా పోలీసులు తెలిపారు. -
పతంగి కోసం వెళ్లి.. పెంటకుప్పలో పడి
ముంబై: సంక్రాంతి పండుగ అనగానే పిల్లలకు వెంటనే గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అవును పండుగ ముందు నుంచి మొదలయ్యే పతంగుల సందడి ఆ తర్వాత కూడా రెండు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. అయితే పతంగులు సంతోషాన్నే కాదు.. అప్పుడప్పుడు విషాదాన్ని కూడా నింపుతాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి పేడ కుప్పలో పడి ఓ 10 పదేళ్ల బాలుడు మరణించాడు. ముంబై కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలు.. పదేళ్ల చిన్నారి పండుగ సందర్భంగా గాలిపటం ఎగురేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలుడు ఎగురవేస్తున్న గాలిపటం పక్కనే ఉన్న ఆవుల షెడ్డు సమీపంలో పడిపోయింది. (చదవండి: వైరల్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం) షెడ్డు పక్కనే ఓ పెద్ద గొయ్యి ఉంది. దానిలో ఆవుల పేడ వేస్తారు. ఇక గాలిపటం మీద ఆసక్తితో ప్రమాదాన్ని అంచనా వేయకుండా పరిగెత్తిన సదరు చిన్నారి.. ఆ పేడ గోతిలో పడిపోయాడు. బయటకు రాలేక.. ఊపిరాడక మరణించాడు. ఆ సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర పని చేస్తున్న కొందరు వ్యక్తులు చిన్నారి పేడ గోతిలో పడిపోవడం చూశారు. బయటకు తీద్దామని భావించారు.. కానీ తాము కూడా గోతిలో ఇరుక్కుంటే మరణించే అవకాశం ఉంటుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత బిల్డింగ్ దగ్గర క్రేన్ ఉండటంతో దాని సాయంతో బాలుడిని బయకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు. -
రెప్పపాటులో తప్పించుకోవడం అంటే ఇదేనేమో
బెంగళూరు : రెప్పపాటులో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడమంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఈ వార్త చదివిన తర్వాత వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరం అనేది మీకే అర్థమవుతుంది. వివరాలు.. బెంగుళూరుకు చెందిన సురజిత్ బెనర్జీ వృత్తి రిత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫిబ్రవరి 7న ఆఫీసు పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తున్న తరుణంలో డిఎల్ఎఫ్ దగ్గరలో ఉన్న అక్షయ్‌నగర్ వద్దకు రాగానే ఒక దారం అతని తలకు అడ్డుగా వచ్చింది. రెప్పపాటు క్షణంలోనే బైక్‌పై ఉన్న సురజిత్ బెనర్జీ హెల్మట్ గ్లాస్ ఓపెన్ చేసి ఉండడంతో కంటి, ముక్క భాగాన్ని కోసుకుంటూ వెళ్లింది. దీంతో అప్రమత్తం అయిన బెనర్జీ సడన్‌బ్రేక్ వేసి కిందకు దిగి పరిశీలించగా ఒక పతంగికి కట్టిన మాంజా దారం కనిపించింది. కాగా ఆ సమయంలో సురజిత్ హెల్మట్ పెట్టుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది. దీంతో బతుకుజీవుడా అనుకుంటూ ఆసుపత్రికి వెళ్లిన బెనర్జీ చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లాడు. ఇదే విషయమై అతని భార్య స్వాగత బెనర్జీ మాట్లాడుతూ..' మేము స్లమ్ ఏరియాకు దగ్గరలో ఉండడంతో మా ప్రాంతమంతా చీకటిగా ఉంటుంది. నా భర్త ఆరోజు ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పతంగికి కట్టిన మాంజా రోడ్డుకు ఇరువైపులా కట్టిఉంది. నా భర్తకు చీకట్లో అదేమి కనిపించకపోవడంతో అలాగే ముందుకు వచ్చేశాడు. దీంతో కంటి, ముక్కు భాగానికి మాంజా దారం కోసుకుంది. అదృష్టవశాత్తు నా భర్త హెల్మట్ ధరించడంతో గొంతు భాగానికి మాంజా తట్టకుండా అడ్డుగా నిలిచింది. ఇది నిజంగా మా అదృష్టమే.. లేకుంటే నా భర్త మెడ తెగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచేవాడు. దేవుడి దయ వల్ల అలాంటిదేమి జరగలేదు' అంటూ బెనర్జి భార్య భావోద్వేగానికి గురయ్యారు. -
పతంగి ఎగరేసేందుకు వెళ్లి..
అల్వాల్: గాలిపటం ఎగరవేసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు గోదాంలో జారి పడిపోయిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట్‌కు చెందిన వాహిద్ వారం రోజుల క్రితం గాలిపటం ఎగరవేసేందుకు అదే ప్రాంతంలో ఉన్న మూతపడిన గోదాం పైకి ఎక్కాడు. పతంగి ఎగరవేస్తున్న అతను ప్రమాదవశాత్తు కాలుజారి లోపల పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో అతను బయటికి రాలేకపోయాడు. బుధవారం రాత్రి గోదాం పక్కనే ఉన్న మరో గోదాంకు వచ్చిన కొందరు వ్యక్తులు వాహిద్ కేకలు విని అక్కడికి చేరుకుని అతడిని బయటికి తీసుకువచ్చారు. వారం రోజుల పాటు తిండి లేకపోవడంతో నిరసించిన అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించార -
ఆరునెలల క్రితమే వివాహం.. అంతలోనే విషాదం
బౌద్ధనగర్: గాలి పటం ఎగుర వేస్తూ ఓ యువకుడు భవనంపై నుంచి జారి పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన చిలకలగూడ పొలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారాసిగూడకు చెందిన సయ్యద్ ఖలీద్ అలియాస్ ఇమ్రాన్ (27) స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సంక్రాంతి పండగ కావడంతో తోటి స్నేహితులతో కలసి ఆదివారం సాయంత్రం ఇంటి మిద్దె పైన గాలి పటాలు ఎగురవేస్తున్నారు. ఈ సమయంలో ఆనందంలో ఉన్న ఖలీద్ భవనంపై ఉన్న విషయం మర్చిపోయి అడుగు ముందుకు వేయడంతో... ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్నేహితులు, స్థానికులు 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 6 గంటల సమయంలో ఖలీద్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల క్రితమే వివాహం... ఖలీద్ అలియాస్ ఇమ్రాన్ (27)కు ఆరు నెలల క్రితమే వివాహం అయింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అందరితో ఆప్యాయంగా ఉండే ఇమ్రాన్ మృతి స్థానికులను కలచివేసింది. -
ఉసురు తీసిన గాలిపటం !
సాక్షి, నిర్మల్ : నర్సాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మృత్యువు గాలిపటం రూపంలో వచ్చి ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. విద్యుత్ తీగలకు తగులుకున్న గాలిపటాన్ని తీయబోయిన ఓ బాలుడు కరెంట్ షాక్‌కు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో తాండ్ర అరుణ్ కుమార్ అనే 11ఏళ్ల బాలుడు గాలిపటాన్ని ఎగరేస్తుండగా అదికాస్త కరెంట్ తీగలకు చిక్కుకుంది. గాలిపటాన్ని తీగలనుంచి తప్పించేందకు బాలుడు ప్రయత్నిస్తుండగా.. కరెంట్ షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మెరుగైన చికిత్స చేయించటానికి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. -
సందడి చేసిన ‘పతంగి కారు’
బహదూర్‌పురా: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత, సుధాకార్స్ మ్యూజియం సృష్టికర్త సుధాకర్ పతంగుల కారును ఆవిష్కరించారు. వివిధ రూపాల్లో అతి చిన్న కార్లను రూపొందించి ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించిన సుధాకర్... ఈసారి 150 సీసీ సామర్ధ్యం గల ఇంజిన్‌తో పతంగు (ౖకైట్) కారును రూపొందించారు. 10 అడుగులు పొడవు, 8 అడుగుల వెడల్పుతో ఆటోరిక్షా ఆకారంలో రూపొందించారు. శుక్రవారం ఆవిష్కరించిన ఈ కారు బహదూర్‌పురా రోడ్డుపై రయ్.. మంటూ దూసుకెళ్లింది. గంటకు 50–60 కిలో మీటర్ల వేగంతో ఈ పతంగి కారు రోడ్లపై పరుగులు తీస్తుందని కారు సృష్టికర్త సుధాకర్ తెలిపారు. సంక్రాంతి రోజు నగర వ్యాప్తంగా ఈ వాకీ కారును రోడ్లపై తిప్పనున్నామన్నారు. తాను రూపొందించిన వాకీ కార్లలో ఇది 50వ కారు అన్నారు. ప్రపంచంలో ఎవరూ 50 వరకు వాకీ కార్లను రూపొందించలేదని చెప్పారు. కైట్ ఆకారంలోని ఈ కారు తయారు చేయడానికి నెలరోజుల సమయం పట్టిందన్నారు. -
పాతబస్తీలో మొదలైన పతంగుల సందడి
-
యువతకు ఎన్పీ టెల్ ఒక వరం
ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సదస్సు కోరంగి (తాళ్లరేవు) : దేశంలోని యువతకు ఎన్పీ టెల్ ఒక వరమని నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హేన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్పీ టెల్) కో-ఆర్డినేటర్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ తెలిపారు. కోరంగిలోని కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశంలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉన్నందున కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థికి సైతం ప్రపంచ స్థాయి సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో ఎన్పీ టెల్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్టు తెలిపారు. దీనిలో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న ఆయా ఇంజనీరింగ్, డిగ్రీ, మేనేజ్మెంట్ సైన్సెస్, కళాశాలల్లోని అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. వెయ్యికి పైగా కోర్సులను అందిస్తున్నట్టు తెలిపారు. దేశంలో సుమారు 80 శాతం మంది ఈ కోర్సులను ఉపయోగించుకుంటున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్ల మంది ఎన్పీ టెల్ కోర్సుల్లో చేరారని తెలిపారు. ఎన్పీ టెల్ రీజనల్ మేనేజర్ భారతి మాట్లాడుతూ యువతను సాంకేతిక విజ్ఞానంలో నిష్టాతులను చేసేందుకు దూర విద్యను రూపొందించినట్టు తెలిపారు. ఈ నెల 23 వరకు 4, 6, 12 వారాల కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. సాఫ్ట్ స్కిల్స్, ఆంగ్ల విద్య, లీడర్షిప్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ తదితర అధునాతన మార్పులపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతీవారం విద్యార్థులకు వారాంతపు పరీక్షలు నిర్వహించి టీసీఎస్ ఐకాన్ ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. ఈ కోర్సులలో నేర్చుకున్నవారు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు కైట్ కళాశాలను రీజినల్ సెంటర్‌గా గుర్తించినట్టు ఆమె తెలిపారు. -
పండగొచ్చె.. పతంగులకు..!
-
పండగొచ్చె.. పతంగులకు..!
రాష్ట్రంలో అంతర్జాతీయ వేడుకగా నిర్వహణ జనవరి 12 నుంచి వారం రోజులపాటు.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండగను అహ్మదాబాద్‌కు దీటుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 12 నుంచి వారం పాటు వేడుకలు జరగనున్నాయి. 16 దేశాలకు చెందిన అంతర్జాతీయ పతంగుల నిపుణులు ఇందులో పాల్గొనబోతున్నారు. వీరుగాక మరో 32 దేశాలకు, దేశంలోని 15 కైట్ క్లబ్‌లకు అధికారులు ఆహ్వానాలు పంపారు. తొలుత 12వ తేదీ రాత్రి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నైట్ కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. 14, 15 తేదీల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోని ఆగాఖాన్ అకాడమీ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించనున్నారు. 16, 17 తేదీల్లో వరంగల్‌లో ఉత్సవాలు జరుపుతారు. హైదరాబాద్‌లోని 15 పెద్ద పాఠశాలలను కూడా వేడుకల కోసం గుర్తించారు. ఒక్కో పాఠశాలలో వేరుు మంది చొప్పున విద్యార్థులు పాల్గొననున్నారు. పతంగుల వేడుకను బాలిక విద్య ఇతివృత్తంగా నిర్వహించనున్నారు. సందర్శకులు కొనే టికెట్ల రూపంలో వచ్చే మొత్తాన్ని ఇద్దరు పేద బాలికలు నిజామాబాద్‌కు చెందిన రాధ, హైదరాబాద్‌కు చెందిన నిఖితలకు స్కాలర్‌షిప్స్‌గా ఇవ్వనున్నారు. తెలంగాణకు కొత్త కీర్తి అంతర్జాతీయ పతంగుల ఉత్సవం ద్వారా తెలంగాణకు మంచి ఖ్యాతి రానుంది. ఈ ఏడాది 16 దేశాలకు చెందిన నిపుణులు వస్తుండటం దీనికి బలం చేకూరుస్తుంది. వచ్చే ఏడాది నుంచి పర్యాటకులు పోటెత్తుతారు. - మంత్రి చందూలాల్ 2020కి లక్ష మంది.. గతేడాది తమ క్లబ్ సభ్యులను పంపేందుకు అహ్మదాబాద్ వెనకాడింది. ఈసారి ఉమ్మడిగా వేడుకలు నిర్వహిద్దామని కోరింది. 2020లో లక్ష మంది పర్యాటకులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. - బుర్రా వెంకటేశం, పర్యాటక శాఖ కార్యదర్శి -
కాపర్ వైరుతో పతంగి ఎగిరేయడంతో దారుణం
జగద్గిరిగుట్ట: పతంగి ఎగరవేస్తుండగా కరెంట్ తీగలకు తాకడంతో ఇద్దరు చిన్నారులు విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలపాలయ్యారు. జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం... అంజయ్యనగర్ షిరిడీ హిల్స్‌కు చెందిన బుచ్చిరెడ్డి కుమారుడు అభిషేక్‌రెడ్డి(8), చంద్రశేఖర్ కుమారుడు అభిషేక్ (9) శనివారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ఓ డాబా పైకి ఎక్కి పతంగులు ఎగుర వేస్తున్నారు. ఇంటి పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు పతంగి తట్టుకోవడంతో విద్యుద్ఘాతానికి గురయ్యారు. ప్రమాదానికి ముఖ్య కారణం ఇదీ.. అభిషేక్‌రెడ్డి, అభిషేక్‌లు ఎగుర వేసే పతంగికి మాంజాకు బదులు సన్నని కాపర్ వైర్ కట్టి ఎగుర వేస్తున్నారు. ఒకరు పతంగి ఎగుర వేస్తుండగా, మరొకరు కాపర్ వైర్ చుట్టిన డబ్బాను చేత్తో పట్టుకున్నారు. పైకి ఎగిరిన పతంగి ఒక్కసారిగా పక్క భవనంపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలకు తట్టుకుంది. కాపర్‌వైర్ కావడంతో విద్యుత్ సరఫరా జరిగి చిన్నారులిద్దరూ కరెంట్ షాక్‌కు గురై పడిపోయారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వెంటనే భవనం పైకి వెళ్లి చూడగా బాలురు తీవ్రగాయాలతో పడి ఉన్నారు. వీరు పతంగి ఎగిర వేస్తున్న భనవంపై ఉదయం కురిసిన వర్షపు నీరు ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. చిన్నారులను కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సూచన మేరకు అభిషేక్‌రెడ్డిని గాంధీ ఆస్పత్రికి. అభిషేక్‌ను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అభిషేక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కాగా, విద్యుద్ఘాతం కారణం గా ప్రమాదం జరిగిన భవనం చుట్టు పక్కల ఉన్న గృహాల్లో టీవీలు, మీటర్లు, ఇతర ఎలక్టికల్, ఎలక్టాన్రిక్ వస్తువులు కాలిపోయాయి. -
చిన్నారి ప్రాణం తీసిన గాలిపటం దారం
-
ఓరేటర్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు ‘కైట్’
తాళ్లరేవు : అంతర్జాతీయ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ ఓరేటర్ 2016 చాంపియన్‌షిప్‌లో కైట్ విద్యార్థులు సెమీస్‌కు చేరినట్టు చైర్మన్ పి.వి. విశ్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని బాచుపల్లి బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన రెండో రౌండ్ పోటీల్లో 10 మంది సెమీస్‌కు చేరుకున్నారని, ఆగస్టు ఏడోతేదీన ఫైనల్ పోటీలు జరుగుతాయని ఏపీ ఏరియా మేనేజర్ రతన్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ విశ్వం, డైరెక్టర్ జాన్ ఉదయ్‌కుమార్, కోఆర్డినేటర్లు ఎన్.వీరాంజనేయులు, ప్రసన్న అభినందించారు. 2,78,704 క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం : గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం సాయంత్రం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి స్వల్పంగా పెరిగింది. మంగళవారం సాయంత్రం కాటన్ బ్యారేజ్ నుంచి 2,78,704 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ గేట్లను 0.60 మీటర్లు మేర పైకి లేపి ఉంచారు. బ్యారేజ్ వద్ద 9.60అడుగులు నీటి మట్టం నెలకొంది. భద్రాచలం వద్ద 25.50 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 2300 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1800 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు నాలుగు వేలు క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. -
గాలిపటం ఎంత పని చేసింది..
ఘజియాబాద్: రంగురంగుల్లో ఆకాశంలో విహరించే గాలిపటం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. యోగేశ్ శర్మ(52) అనే వ్యక్తి పనులు ముగించుకుని ఢిల్లీలోని తన నివాసానికి బయలుదేరాడు. దారిలో ఠాకూర్ ద్వారా ఫ్లై-ఓవర్ మీదుగా బైక్ పై వెళ్తున్న సమయంలో ఓ తెగిన గాలిపటం దారం అతని మెడకు చుట్టుకుంది. వాహనాన్ని ఆపడానికి కొద్ది మీటర్లు ముందుకు వెళ్లేసరికి ఆయన గొంతు తెగిపోయి రక్తం చిమ్మి కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యోగేశ్ చిన్న తరహా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం వ్యాపారానికి సంబంధించిన పనులు ముగించుకుని ఢిల్లీలోని మౌజ్ పురాలోని తన నివాసానికి బయలుదేరారు. బైక్ పై వెళ్తున్న సమయంలో గాలిపటం దారం మెడకు చుట్టుకోవడంతో అతని స్వరపేటికతో పాటు రక్తనాళాలు తెగిపోయినట్లు చెప్పారు. రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. గాలి పటం తయారీలో ఉపయోగించిన నైలాన్ దారం, సీసపు పూత కారణంగా పదునుగా తయారయిందని వివరించారు. ప్రతి ఏటా గాలిపటం దారాల వల్ల పక్షులు, ప్రజలు గాయాలపాలవుతున్న విషయం తెలిసిందే. -
సంక్రాంతి వేడుకల్లో విషాదం
-
హైదరాబాద్‌లో పతంగుల పండుగ
-
గాలిపటం ఎగరవేసిన 'కవిత'
-
ఫన్డగొచ్చిందోచ్..
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పిల్లలకు ముందుంగా గుర్తుకొచ్చేది పతంగి (గాలిపటం). అను నిత్యం పుస్తకాలతో కుస్తీలు పట్టే చిన్నారులు సంక్రాంతి సెలవులు వచ్చాయంటే గాలిపటాలతో సందడి చేస్తుంటారు. ఒకప్పుడు గాలిపటం అంటే న్యూస్ పేపర్ తీసుకుని రెండు చీపురుపుల్లలతో స్వయంగా తయారు చేసుకునేవారు. దానికి బొడ్డుముడి వేసి మైనం పూత పూసిన దారపు రీళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకునేవారు. వాటితో గాలి పటాల పోటీలు నిర్వహించుకునేవారు. ప్రస్తుతం పిల్లలకు గాలిపటం తయారు చేసుకునే తీరికే దొరకడం లేదు. దీంతో గాలిపటాల పరిశ్రమ ఒకటి ప్రత్యేకంగా ఏర్పడింది. గాలి పటాల వ్యాపారం రూ.కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. గాలిపటాలకు పుట్టిల్లయిన చైనా నుంచి రకరకాల గాలిపటాలను దిగుమతి చేసుకుని మరీ విక్రయిస్తున్నారంటే గాలిపటం ప్రాముఖ్యం ఎంతలా ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలుస్తుంది. - విశాఖపట్నం విశాఖ నగరంలోని అల్లిపురం ప్రాంతం గాలిపటాలకు హోల్‌సేల్ మార్కెట్‌గా వెలుగొందుతోంది. కోల్‌కతాలోని మిదియా బూర్జి ప్రాంతం నుంచి వీటిని తీసుకువస్తుంటారు. చైనా నుంచి కంటెయినర్స్ ద్వారా విభిన్న రూపాలలో తయారవుతున్న గాలిపటాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇక్కడ రూ.3 నుంచి రూ.3000 విలువ గల గాలిపటాలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నగరంతో పాటు, జిల్లా నుంచి అనేక మంది ఇక్కడ నుండే గాలిపటాలను తీసుకుపోయి అమ్మకాలు జరుపుతున్నారు. నగరంలో పెద్దపెద్ద షాపులవారు వీరి వద్దనే కొనుగోలు చేస్తుంటారు. ఆకట్టుకునే మోడల్స్: గాలిపటాలు ప్రస్తుతం పిల్లల అభిరుచులకు తగ్గట్టుగా డోరోమెన్, చోటాభీమ్, సై ్పడర్మెన్, యాంగ్రీబర్డ్ వంటి కార్టూన్ కేరక్టర్లతో పాటు ప్రధాని మోడీ, అమితాబ్ వంటి ప్రముఖుల ఫొటోలతో కూడా రకరకాల గాలిపటాలు సైజుల వారిగా తయారు చేస్తున్నారు. కార్టూన్ కేరక్టర్స్‌ను పిల్లలు ఇష్టపడుతుండడంతో డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు అంటున్నారు. అదే విధంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న గాలి పటాలు వివిధ రూపాలలో అలరిస్తున్నాయి. గ్రద్ద, స్పైడర్మాన్, తూనీగ, గబ్బిలం, డేగ, బటర్ఫై ్ల, డ్రాగన్ తదితర రకాలకు ఎక్కువ గిరాకీ ఉంది. వీటి ధరలు సైజులను బట్టి రూ.100 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. దార పురీళ్లు ప్రత్యేకం: గాలిపటానికి ఆధారం దారం. గాలిపటానికి ఉపయోగించే దారం చుట్టుకునే వాటిని పల్లేట్ అంటారు. ఇవి రూ.20 నుండి రూ.450 ధరల్లో దొరుకుతున్నాయి. పిల్లలూ జర జాగ్రత్త! గాలి పటాలు ఎగరేసే సమయంలో పిల్లలు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పిల్లలు గాలిపటాల ఎగురవే సేందుకు మార్కెట్లో చైనా త్రెడ్, బరేలి, పాండా, కోల్‌కతా మాంజా, టైగర్ మాంజా, మహాబలి మాంజా, మోనో ఫైటర్, మోనో ఫిల్ గోల్డ్ వంటి రకరకాల దారాలు దొరుకుతున్నాయి. అవి కాకుండా స్థానికంగా పిల్లలు గాలిపటాల పోటీలకు మాంజా దారాలు స్వయంగా తయారు చేసుకుంటుంటారు. ఈ దారంతో పిల్లలు తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దారానికి గాజుపెంకులు కలిపినప్పుడు, పట్టించినపుడు చేతులకు గ్లౌజులు ధరించాలి. పోటీల సమయంలో కూడా గ్లౌజులు వాడడం మంచిది.పోటీల సమయంలో దారాన్ని స్పీడుగా వదిలే సమయంలోను, లాగే సమయంలో చేతులు తెగి గాయాలు అయ్యే అవకాశం ఉన్నందున గ్లౌజులు వేసుకోవడం ఉత్తమం.మోనో ఫైటర్, మోనో ఫిల్ గోల్డ్ వంటి దారాలు ఉపయోగించే సమయంలోను గ్లౌజులు ఉపయోగిస్తే చేతులు రక్షణ ఉంటుంది. చిన్న పిల్లలు గాలిపటాలు ఎగరేసే సమయంలో తల్లిదండ్రులు ప్రక్కనే ఉండడం మంచిది. గాలిపటం విద్యుత్ స్తంభాలు, కొబ్బరిచెట్లుకు చిక్కుకున్న సమయాల్లో వాటిని ఎక్కే ప్రయత్నాలు మానుకోవాలి.కర్రలతో గాలిపటాలను లాగే ప్రయత్నాలు చేయరాదు. మేడలపై నుంచి ఇనుప చువ్వలు, కర్రలతో తీసే ప్రయత్నం చేయరాదు. రహదారులపైన, మేడలపైన గాలిపటాలను ఎగురవేయరాదు. -
కరెంటు తీగపై గాలిపటం తీయబోతూ..!
శామీర్‌పేట(రంగారెడ్డి జిల్లా): శామీర్‌పేట పట్టణంలోని ముదిరాజ్బస్తీలో విషాదం చోటుచేసుకుంది. తాను ఎగరేసిన గాలిపటం కరెంటుతీగలకు చిక్కుకోవడంతో దానిని తీయడానికి ప్రయత్నించిన 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన నాగరాజు, వీరమ్మలు 15 సంవత్సరాల క్రితం శామీర్‌పేటలో స్థిరపడ్డారు. వీరికి సాయి కుమార్(11) అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఇంటికి సమీపంలో సాయి గాలిపటం ఎగర వేస్తుండగా..అది పైనఉన్న కరెంటు తీగలపై పడింది. తీగలపై పడ్డ గాలిపటాన్ని అతను ఇనుప చువ్వతో తీయడానికి ప్రయత్నించడంతో కరెంటు షాక్ తగిలింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సాయిని స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గాలిపటం ఎగిరేస్తూ..
దిల్సుఖ్నగర్: గాలిపటం ఎగిరేస్తుండగా కరెంట్ షాక్ తగిలిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూనాగోల్ లో శనివారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన సంతోష్(14) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పాఠశాలకు సెలవులు రావడంతో రెండు రోజుల కిందట ఇంటి పైన ఢాబా మీద గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలపై పడ్డాడు. తీవ్రగాయాలైన అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. -
పిట్టకు ఉరి....
విశాఖ : మనిషి తన వినోదం కోసం మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాడు. తమ మనుగడ కోసం మూగ జీవాలను వాడుకుంటున్న జనాలు... తమకు తెలిసి, ఒక్కోసారి తెలియకుండా వాటి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్న హృదయాన్ని కదిలించే దృశ్యం విశాఖలోని సర్క్యూట్ హౌస్ వద్ద బుధవారం 'సాక్షి' కెమెరా కంటపడింది. వినోదం కోసం ఎవరో ఎగరేసిన గాలిపటం దారం చెట్టు మీద సేద తీరుతున్న పిట్ట మెడకు చుట్టుకుంది. దాన్ని వదిలించుకునే క్రమంలో దారం పిట్ట మెడకు బిగుసుకుపోవడంతో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచింది. ఎవరో తమ ఆనందం కోసం ఎగరేసిన గాలిపటం ఇలా ఓ పక్షిని బలిగొంది. -
ప్రాణం తీసిన సరదా
హైదరాబాద్: ఆటవిడుపు కోసమో.. అహ్లాదం కోసమో ఎగిరేసిన గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన చింతల్ సమీపంలోని మారుతీనగర్‌లో శుక్రవారం జరిగింది. భవానికళ్యాణ్ (9) గాంధీనగర్ లోని ఠాగూర్ హైస్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌పై గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తూ కాలు జారీ కిందపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు బాలుడిని వెంటనే అంబులెన్స్ సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. భవానికళ్యాణ్ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతిచెందాడు. -
నింగీ.. నేలా ఒక్కటై
రంగు రంగుల పతంగులు ఆకాశంలో హరివిల్లునల్లాయి... మేఘాలను తాకుతున్నట్టుగా తమ సొగసైన నాట్యంతో చూపరులను కట్టిపడేశాయి.... సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో పతంగుల పండుగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు వెంక ట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి, ప్రేమ్‌సింగ్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట జరిగిన పతంగుల పండుగలో విదేశీ విద్యార్థులు పాల్గొని ఆనందించారు. -ఖైరతాబాద్ -
పతంగుల పండుగ
ఇది వానా కాలం కాదు... అయినా ఆకాశంలో హరివిల్లులు కనువిందు చేస్తున్నాయి. వానా కాలంలో ఒకటే హరివిల్లు... అందునా ఏడు రంగులే. ఈ పుష్య మాసపు హరివిల్లులకు వేన వేల వర్ణాలు. వింత సోయగాలు... విభిన్న ఆకృతులు... ఉదయం వేళ సూర్యునితో చేతులు కలిపేందుకు... సాయంత్రం తారలను తాకేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా కనిపించే ఈ హరివిల్లులే పతంగులు. అవును...సంక్రాంతి అంటే పిల్లలకు పతంగుల ‘పండుగ’. చిట్టి పాదాలతో మైదానంలో ముగ్గులు పెట్టినట్టుగా తిరిగే పిల్లలు... పతంగులతో మేఘాలకు సందేశం పంపేందుకు పోటీ పడుతుంటారు. ప్రస్తుతం నగరంలోని అనేక మైదానాలు గాలిపటాలు ఎగురవేసే వారితో సువర్ణ శోభితమవుతున్నాయి. సిటీబ్యూరో: సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు... వీటితో పాటు ముఖ్యమైనవి ఉన్నాయి.... అవే పతంగులు. సంక్రాంతి పేరు చెబితే చిన్నారులకు ఠక్కున గుర్తొచ్చేది పతంగులే. నింగిలో రంగురంగుల గాలిపటాల విన్యాసాలు పిల్లలతో పాటు పెద్దలనూ ఆనందంలో ముంచెత్తుతాయి. వీరి ఆసక్తికి తగినట్టే విభిన్న ఆకృతులతో... వింత వింత పతంగులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోదీల స్నేహబంధాన్ని చాటే పతంగులు ఈసారి ప్రత్యేకం. పిల్లలను ఆకట్టుకుంటున్న కార్టూన్ పాత్రలతో రూపొందించినవి... టాలీవుడ్, బాలీవుడ్, తారలు... పక్షులు... జంతువులు... ఇలా ఎన్నో రకాల పతంగులు... కళాకారుల సృజనకు అద్దం పడుతున్నాయి. ఎక్కడికక్కడ వీటి పోటీలతో మైదానాలు రంగుల హరివిల్లులవుతున్నాయి. కాంక్రీట్ జంగిల్లో కష్టం సుమారు పదిహేనేళ్ల క్రితంతో పోలిస్తే ఇటీవల కాలంలో గాలిపటాల సందడి కొంత తగ్గిందనే చెప్పుకోవాలి. ఒకప్పటి ఆనందోత్సాహాలు ఇప్పుడు లేవు.నగరంలో మైదానాలతో పాటే పతంగుల పండుగ క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. అడుగడుగునా వెలసిన కాంక్రీట్ కట్టడాలు, బహుళ అంతస్థుల భవనాలు, వాహనాల రద్దీ, కార్పొరేట్ చదువులు ఈ సంస్కృతిని మింగేస్తున్నాయి. మాంజా స్థానంలో తంగూన్... పతంగులను ఎగురవేసేందుకు వినియోగించే మాంజా ఇప్పుడు లభించడం లేదు. చైనా నుంచి టన్నుల కొద్దీ దిగుమతి అవుతున్న తంగూన్ (సన్నటి వైరు) మాంజాను కబళించింది. ఆ రోజుల్లో మాంజా తయారు చేయడం ఒక కళ. ఇందుకోసం ప్రత్యేకంగా వస్తాదులు ఉండేవాళ్లు. అన్నం మెత్తగా రుబ్బి, దానికి బెండకాయ రసం, గుడ్డు, సీసం, రంగులు కలిపి దారానికి రుద్దేవాళ్లు. పది నిమిషాలు ఆరబెడితే మాంజా తయారయ్యేది. ఇది మెత్తగా.. పతంగులను ఎగురేసేందుకు అనుకూలంగా ఉండేది. తంగూన్ వల్ల తరచుగా చేతులకు గాయాలవుతున్నట్టు జనం చెబుతున్నారు. ఎన్నెన్ని రకాలో.... మెహదీపట్నం: సినీతారలు... డోరోమెన్, బెన్‌టెన్ వంటి కార్టూన్ పతంగులతో పాటు ఈగల్, అనకొండ వంటి ఆకృతులతో గాలిపటాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మూడు నెలలుగా వీటి తయారీలో నిమగ్నమైనట్టు కొంతమంది కళాకారులు చెబుతున్నారు. పరిమాణాన్ని బట్టి... పతంగులు పరిమాణం...రంగులను బట్టి ధరలు ఉన్నాయి. ప్రత్యేకంగా వస్త్రాలతో తయారు చేసిన పతంగులు అత్యధిక ధరలు పలుకుతున్నాయి. వీటితో పాటు ప్లాస్టిక్ దారం, మాంజా, ప్రత్యేకంగా తయారు చేసిన మాంజా దారం మీటర్లచొప్పున అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో కంటే పతంగుల సందడి కాస్తా తగ్గిందని దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్న కార్వాన్కు చెందిన వ్యాపారి పురిషోత్తంఠాకూర్ తెలిపారు. వైవిధ్యానికి చిరునామా ఏఎస్రావు నగర్ సైనిక్‌పురి చౌరస్తాలోని అమిత్ పతంగ్ హౌస్‌లో వెరైటీ గాలి పటాలకు చిరునామాగా మారింది. ఇక్కడ రూ.10 నుంచిరూ.1200 విలువైన పతంగులు అందుబాటులో ఉన్నాయి. గుజరాత్, ఢిల్లీ, ముంబయ్, బరేలీ, కాన్పూర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఏటా వెరైటీ గాలి పటాలను తెచ్చి అమిత్ విక్రయిస్తుంటాడు. వీటికి డిమాండ్ అదే స్థాయిలో ఉంటోంది. ఇక్కడ చైనా కైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో డ్రాగన్, ఎరోప్లెన్, స్పైడర్‌మెన్, బోగిమెన్, బ్యాట్స్‌మెన్, ఫిష్, ఈగల్, టైగర్ తదితర ఆకృతులతో ఉన్నాయి. ప్రముఖ సినీ తారల చిత్రాలతో కూడిన కైట్స్‌కు డిమాండ్ అధికంగా ఉంది. ఈ సారి స్వామి వివేకానంద(12న జన్మదినం) ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కెసీఆర్ చిత్రాలతో కూడిన గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పతంగ్ హౌస్‌లో నాణ్యమైన మాంజా దారం రూ. 2 నుంచి రూ.180 వరకు, చరఖా రూ.10 నుంచిరూ.350 వరకు, మాంజా చరఖా రూ.35 నుంచి రూ.2000 వరకు లభిస్తున్నాయి. ఉత్తర, దక్షిణాలను ఏకం చేసింది.. పతంగం ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి భాగ్యనగరంలో వేడుక చేసుకుంది. నిజాం కాలంలో గొప్ప ఆదరణ పొందింది. దీని పుట్టుకా ఆసక్తికరమే. సముద్ర తీర ప్రాంతాలు, మైదానాలు, ఎడారుల్లో గాలి తీవ్రతను...వాటాన్ని తెలుసుకొనేందుకు ఆ రోజుల్లో తేలికపాటి వస్తువులను గాలిలో ఎగురవేసేవారు. అవే పతంగుల పుట్టుకకు కారణమయ్యాయి. రాజస్తాన్‌లోని అల్వర్‌కు చెందిన మౌజీ 1872లో మొట్టమొదటిగా పిల్లల సరదా కోసం పతంగాన్ని ఎగురవేసినట్టు చెబుతారు. అలా ఉత్తరాదిలో పుట్టిన పతంగి దక్షిణాది సంస్కృతిలో భాగమైపోయింది. నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించారు. నగరంలోని విశాలమైన మైదానాలు అందుకు వేదికల య్యాయి. బారుత్కా కోట, చంచల్‌గూడ మైదానం, ఆస్మాన్‌గఢ్ మైదానాల్లో వేడుకలు జరిగాయి. నవాబుల కాలంలో బంగారు, వెండి చరఖాలు (దారం చుట్టేవి) ఉండేవి. వాటికి ముత్యాలు, వ జ్రాలు పొదిగేవారు. ఏటా వేడుకల సమయంలో వాటిని బయటకు తీసేవారు. ఆ రోజుల్లో నాలుగైదు నెలల పాటు వేడుకలు జరిగేవి. పోటీల్లో గెలిచిన వారికి నవాబు స్వయంగా బహుమతులను అందజేసేవారు. కుల,మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకొనే గొప్ప వేడుక ఇది. -
పట్నం వచ్చిన పల్లెక్రాంతి
అరిటి బోదెలు, కొబ్బరి మట్టలతో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు.. కలాపి చల్లిన లోగిళ్లు.. అందులో నవధాన్యాలతో తీర్చిదిద్దిన రంగవల్లులు.. పిండి వంటలు, పతంగులు, పట్టు పరికిణీల్లో యువతులు, పంచె కట్టులో యువకులు.. అచ్చంగా పల్లె పండుగ సంక్రాంతి పట్నానికి తరలి వచ్చింది. నగర శివారుల్లోని చిలుకూరు సమీపంలోని నిర్వాణ ప్రాంగణం పల్లెక్రాంతితో వెలిగిపోయింది. నాలుగు రోజులు ముందుగానే సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంది. -శిరీష చల్లపల్లి పల్లెలో సంక్రాంతి అనగానే.. తెల్లవారకముందే గంగిరెద్దల మువ్వల సవ్వడి వినిపిస్తుంది. హరిదాసుల గానం పల్లె గాలిలో విహరిస్తుంది. పట్నవాసంలో పండుగంటే హాలిడే అని తప్ప మరో అనుభూతి ఉండదు. ఈ సంప్రదాయానికి చెక్ పెడుతూ పల్లెలో జరిగే పండుగ శోభను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్వాణ నిర్వాహకురాలు లీల. సిటీవాసులకు సంక్రాంతి ఆనందం పంచడానికి ఏకంగా పల్లెనే పట్నానికి తీసుకొచ్చారు. ముందే వచ్చిన పండుగ... సొంతూళ్లకు వెళ్లలేని సిటీజనులెందరో నిర్వాణ ప్రాంగణంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. మగువలంతా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అందులో కొలువుదీర్చారు. పెద్ద మనుషులు వైకుంఠపాళి ఆటతో కాలక్షేపం చేశారు. చిన్నారులు, యువకులు పతంగులు ఎగిరేస్తూ జాలీగా గడిపారు. మహిళలు గచ్చుకాయలు, అష్టాచెమ్మా, వామన గుంటలు ఇలా కనుమరుగవుతున్న పల్లె ఆటల్లో తేలాడారు. మీసం మెలేసిన మగమహారాజులు కోడి పందేల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. చిన్న పిల్లల నుంచి, పెద్దవాళ్ల వరకు అందరూ కల్చరల్ ఈవెంట్లలో పాలుపంచుకున్నారు. జానపద వేడుక... ఈ ఆటపాటలకు తోడు గంగిరెద్దులు ఆడించేవారు, హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, బుర్రకథ చెప్పేవాళ్లు, పిట్టల దొరలు ఇలా జానపద కళారూపాలు పండుగ వాతావరణానికి మరింత శోభను తెచ్చిపెట్టాయి. ఔత్సాహిక కళాకారులు ఏక్తారా, సితారా, తంబుర, వీణ వంటి సంప్రదాయ వాయిద్యాలతో తమలో ఉన్న ప్రతిభను చాటుకున్నారు. ధాన్యరాశులు, కలశాలు, అరివేణి కుండలు ఇలా ట్రెడిషనల్ ఫెస్టివల్ అంటే ఎలా ఉండాలో చూపారు. వింతైన వంటకంబులు... వివాహ భోజనంబును తలదన్నే రీతిలో వంటకాలు వండి వడ్డించారు. దంపుడు బియ్యంతో అన్నం, పొంగలి, పులిహోర, దద్దోజనం, ముద్దపప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ కూర లాంటివే కాకుండా పూర్ణాలు, అరిసెలు వంటి తీపి పదార్థాలు, మురుకులు, సకినాలు వంటి పిండి వంటకాలు భోజనప్రియులను కట్టిపడేశాయి. మొత్తానికి పల్లె సందడిని మోసుకొచ్చిన ఈ ప్రాంగణంలో సంక్రాంతితో పాటు భోగి, కనుమలు కూడా కన్నులపండువగా జరిగాయి. సరదాగా సాగింది ఉగాది, సంక్రాంతి తెలుగు పండుగలు. మరచిపోతున్న సంస్కృతిని మళ్లీ పరిచయం చేయడం బాగుంది. ముగ్గుల పోటీలు, పతంగుల ఆటలు భలే సరదాగా అనిపించాయి. నగర వాతావరణానికి పల్లె సంస్కృతిని పరిచయం చేయడం బాగుంది. - లక్ష్మీ పార్వతి నా వంతు ప్రయత్నం ఈ రోజుల్లో మనిషికంటే ధనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే నా వంతు ప్రయత్నమే నిర్వాణ వేదిక. ఏటా ఇలాంటి భారీ వేడుకను నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సారి సంక్రాంతికి ప్లాన్ చేశాం. సంప్రదాయానికి పెద్దపీట వేసే ఎలాంటి కార్యక్రమాలైనా ఈ ప్రాంగణంలో నిర్వహించవచ్చు. అదీ ఉచితంగానే. - లీల, నిర్వాణ ప్రాంగణం నిర్వాహకురాలు ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
ఆర్ యూ రెడీ!
-
పుత్రశోకం
విద్యుత్‌షాక్‌తో ముగ్గురు చిన్నారుల మృతి మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు పామర్రులో విషాదం పామర్రు : చేపల కోసం వెళ్లకుండా ఉన్నా... తమ పిల్లలు దక్కేవారేమో అంటూ మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. హై ఓల్టేజీ విద్యుత్ తీగల మధ్య చిక్కుకున్న గాలిపటం తీయబోయిన నల్లబోతుల ఏసురాజు, నల్లబోతుల జాన్‌బాబు, భోగిన సురేష్‌లు మరణించడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పామర్రు పట్టణం 8వ వార్డులోని రావి హరిగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న నల్లబోతుల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు ఏసురాజు(14), రెండో కుమారుడు జాన్‌బాబును స్థానిక జెడ్పీ పాఠశాలలో చేర్పించారు. అయినా వారు స్కూలుకు వెళ్లకుండా ఇంటివద్దనే కాలక్షేపం చేస్తున్నారు. మూడో కుమారుడు జక్రయ్య స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన భోగిన వీరయ్య, తిరుపతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్కడే కుమారుడు(సురేష్) ఉన్నారు. సురేష్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కాన్వెంట్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ రెండు కుటుంబాలకు చేపలవేటే జీవనాధారం. పెద్దలు రోజూ ఉదయాన్నే చేపల వేటకు వెళ్తుంటారు. యథావిధిగా శుక్రవారం ఉదయం కూడా వెళ్లగా.. బిడ్డల మృతి విషయం తెలియడంతో వేటనుంచి తిరిగి వచ్చిన వారు మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిరునవ్వుతో పంపించారు.. నల్లబోతుల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ దంపతుల ఇద్దరు కుమారులు ఈ దుర్ఘటనలో మృతిచెందడంతో వారు పడుతున్న వేదన వర్ణనాతీతం. తాము ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు చిరునవ్వుతో పంపారని, ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారని వెంకటేశ్వరమ్మ గుండెలు బాదుకుంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. ఒక్కగానొక్కడు.. ముగ్గురు కుమార్తెల మధ్య ఒక్కడే కొడుకు కావడంతో సురేష్‌ను అతడి తల్లిదండ్రులు వీరయ్య, తిరుపతమ్మ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. విగతజీవిగా మారిన సురేష్‌ను చూసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తరువాత తేరుకుని గుండెలవిసేలా రోదిం చడం అక్కడివారి హృదయాలను కలచివేసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కల్పన విద్యుదాఘాతంతో ముగ్గురు చిన్నారులు మృతిచెందారన్న విషయం తెలియగానే పామర్రు ఎమ్మెల్యే, శాసనసభలో వైఎస్సార్సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కల్పన మాట్లాడుతూ చిన్నారుల మృతికి చింతిస్తున్నామని, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేలా కృషి చేస్తామన్నారు. విద్యుత్ శాఖ నుంచి కూడా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డి.వై.దాసు, టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వర్ల రామయ్య, గుడివాడ ఆర్డీవో వెంకటసుబ్బయ్య, సీఐ కోసూరు ధర్మేంద్ర, పామర్రు ఎస్ఐ మోర్ల వెంకటనారాయణ తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.