
నింగీ.. నేలా ఒక్కటై
రంగు రంగుల పతంగులు ఆకాశంలో హరివిల్లునల్లాయి... మేఘాలను తాకుతున్నట్టుగా తమ సొగసైన నాట్యంతో చూపరులను కట్టిపడేశాయి.... సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో పతంగుల పండుగ వైభవంగా ప్రారంభమైంది.
కార్యక్రమాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు వెంక ట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి, ప్రేమ్‌సింగ్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట జరిగిన పతంగుల పండుగలో విదేశీ విద్యార్థులు పాల్గొని ఆనందించారు.
-ఖైరతాబాద్