పతంగులు ఎగురవేసే అభిరుచి కలిగినవారికి మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వారణాసి గగనతలంలో ప్రత్యేక గాలిపటాలు సందడి చేస్తున్నాయి.
ఈసారి వారణాసి మార్కెట్‌లో ‘బుల్డోజర్ బాబా’ గాలిపటాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. ఈ బుల్డోజర్ బాబా గాలిపటంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉన్నాయి. దీంతోపాటు బుల్డోజర్ బాబా బొమ్మకు కూడా చోటు దక్కింది. అంతే కాదు ఈ గాలిపటంపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా ముద్రించారు. దుకాణదారుడు అరవింద్ మాట్లాడుతూ బుల్డోజర్ బాబా గాలిపటాలను యువత అమితంగా ఇష్టపడుతున్నారని, అందుకే వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ‘బుల్డోజర్ బాబా’ పతంగికి డిమాండ్ ఉంది. ఈ గాలిపటం ధర 5 నుంచి 15 రూపాయల వరకు ఉంది. గాలిపటాలంటే అమితమైన ఇష్టం ఉన్న వారణాసి కుర్రాడు ఆదిత్య ఈసారి మకర సంక్రాంతికి బుల్డోజర్ బాబా గాలిపటం ఎగురవేస్తానని చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో తన ‘బుల్డోజర్’ చర్యలతో మాఫియా వెన్ను విరిచి, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చారని ఆదిత్య పేర్కొన్నాడు. సీఎంకు మద్దతుగా తాను ఈ గాలిపటాన్ని ఎగురవేస్తానన్నారు.
ఇది కూడా చదవండి: 25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా..
Comments
Please login to add a commentAdd a comment