నేడు (జనవరి 14) దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే గాలిపటం ఎగురవేయడానికి ఎంత గాలి అవసరమో మీకు తెలుసా?
మకర సంక్రాంతి రోజున భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిల్లలు, పెద్దలు అంతా కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు. ఈ రోజున ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. ఈ గాలిపటాలను చూసినప్పుడు అందరి హృదయాలు ఆనందంతో నిండిపోతాయి.
ఆకాశంలో గాలి లేకపోతే గాలిపటాలు ఎగరవేయలేమని పలువురు చెబుతుంటారు. ఇంతేకాదు గాలి బలంగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం, కత్తిరించడం కష్టం అవుతుంది. నిజానికి పతంగులు ఎగురవేయడానికి, స్థిరమైన గాలి వేగం గంటకు 8 నుండి 20 మైళ్ళు (13 నుండి 32 కిలోమీటర్లు) మధ్య ఉండాలి. దీనికంటే తక్కువ గాలి వీచినా, గాలిపటాన్ని ఎగురవేయడం కష్టమవుతుంది. అలాగే గంటకు 30 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో వీచే గాలులు కూడా గాలిపటం ఎగరవేయడానికి ఇబ్బందికరంగా మారుతుంది.
ఆకాశంలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం కష్టమవుతుంది. నిజానికి బలమైన గాలి వీచినప్పుడు గాలిపటం వెంటనే గాలిలో ఎగురుతుంది. ఇంతేకాదు మాంజాను గాలిపటానికి సరిగ్గా కట్టకపోయినా, గాలిపటం వేగంగా ఎగురుతుంది. అయితే బలమైన గాలులకు గాలిపటం ఆ గాలితో పాటు ముందుకు కదులుతుంది. అయితే అప్పుడు ఆ గాలిపటాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఇంతేకాదు బలమైన గాలిలో మీ గాలిపటంతో మరొక గాలిపటాన్ని కట్‌చేయలేరు. గాలి వేగం పెరుగుతున్నప్పుడు, గాలిపటాన్ని వెనక్కి లాగే సందర్భంలో అది చినిగిపోతుంది. ఎందుకంటే గాలి దానిని ముందుకు నెట్టివేస్తుంటుంది.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం
Comments
Please login to add a commentAdd a comment