flow
-
పతంగులకు ఎంత గాలి అవసరం? ఎందుకు తెగిపోతాయి?
నేడు (జనవరి 14) దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే గాలిపటం ఎగురవేయడానికి ఎంత గాలి అవసరమో మీకు తెలుసా?మకర సంక్రాంతి రోజున భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిల్లలు, పెద్దలు అంతా కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు. ఈ రోజున ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. ఈ గాలిపటాలను చూసినప్పుడు అందరి హృదయాలు ఆనందంతో నిండిపోతాయి.ఆకాశంలో గాలి లేకపోతే గాలిపటాలు ఎగరవేయలేమని పలువురు చెబుతుంటారు. ఇంతేకాదు గాలి బలంగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం, కత్తిరించడం కష్టం అవుతుంది. నిజానికి పతంగులు ఎగురవేయడానికి, స్థిరమైన గాలి వేగం గంటకు 8 నుండి 20 మైళ్ళు (13 నుండి 32 కిలోమీటర్లు) మధ్య ఉండాలి. దీనికంటే తక్కువ గాలి వీచినా, గాలిపటాన్ని ఎగురవేయడం కష్టమవుతుంది. అలాగే గంటకు 30 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో వీచే గాలులు కూడా గాలిపటం ఎగరవేయడానికి ఇబ్బందికరంగా మారుతుంది.ఆకాశంలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం కష్టమవుతుంది. నిజానికి బలమైన గాలి వీచినప్పుడు గాలిపటం వెంటనే గాలిలో ఎగురుతుంది. ఇంతేకాదు మాంజాను గాలిపటానికి సరిగ్గా కట్టకపోయినా, గాలిపటం వేగంగా ఎగురుతుంది. అయితే బలమైన గాలులకు గాలిపటం ఆ గాలితో పాటు ముందుకు కదులుతుంది. అయితే అప్పుడు ఆ గాలిపటాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఇంతేకాదు బలమైన గాలిలో మీ గాలిపటంతో మరొక గాలిపటాన్ని కట్చేయలేరు. గాలి వేగం పెరుగుతున్నప్పుడు, గాలిపటాన్ని వెనక్కి లాగే సందర్భంలో అది చినిగిపోతుంది. ఎందుకంటే గాలి దానిని ముందుకు నెట్టివేస్తుంటుంది. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం -
నగరంలో కుండపోత వర్షాలు
-
ఆల్మట్టిలో పెరిగిన వరద ఉద్ధృతి
సాక్షి,అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.67 టీఎంసీలకు చేరింది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆల్మట్టి నుంచి విడుదల చేస్తున్న జలాలకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న వరద తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,681 క్యూసెక్కులు చేరుతున్నాయి. నారాయణపూర్‌లో నీటి నిల్వ 20.36 టీఎంసీలకు చేరింది. కృష్ణా ప్రధాన పాయ, భీమా నుంచి జూరాల ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ఉద్ధృతి మరింత పెరిగింది. టీబీ డ్యామ్‌లోకి 83,842 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 32.86 టీఎంసీలకు చేరింది. జూరాలలో విద్యుదుత్పత్తిని ఆపేయడంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1236 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 37.08 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల సాగర్‌లోకి 6,438 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 142.44 టీఎంసీలకు చేరింది. మూసీ వరద పులిచింతలలోకి నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 12,560 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన మున్నేరు, కట్టలేరు, వైరా కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో బ్యారేజ్‌కు 11,840 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజ్ 16 గేట్లను అడుగు మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజీకి 50 వేల క్యూసెక్కులు అంతకు మించి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సంగమేశ్వరుడి సన్నిధికి.. కొత్తపల్లి (నంద్యాల): నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరాలయాన్ని కృష్ణా జలాలు సమీస్తున్నాయి. సంగమేశ్వరాలయం వద్ద బీమలింగం కొలను పూర్తిగా మునిగిపోయి ఆలయ సమీపంలోని మెట్ల మార్గం వరకు చేరుకున్నాయి. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. -
శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టులో జలవిద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల్లో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 22,573 క్యూసెక్కులు చేరాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు.. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 808.90 అడుగుల్లో 33.67 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నారాయణపూర్, ఉజ్జయిని డ్యామ్‌లకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధాన పాయ, భీమాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 41,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 37,930 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్‌లోకి 2,015 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 8,685 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.39 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు దిగువన మున్నేరు, వాగులు, వంకల ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజ్‌లోకి 15,698 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 6,114 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 9,584 క్యూసెక్కులను అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టిలోకి పెరిగిన వరద పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,07,769 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.56 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదలుతున్న ఆరు వేల క్యూసెక్కులు నారాయణపూర్ డ్యామ్‌కు చేరుతున్నాయి. సోమవారం ఆల్మట్టిలోకి మరింతగా వరద పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. తుంగభద్రలోనూ పెరిగిన ప్రవాహం తుంగభద్ర డ్యామ్, తుంగ ఆనకట్ట దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల తుంగభద్రలో వరద ఉద్ధృతి కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 54,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.36 టీఎంసీలకు చేరుకుంది. -
ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి
ప్రస్తుతం భారత్‌లోని ఉత్తరాది ప్రాంతం భారీ వర్షాలకు, వరదలకు వణుకుతుండగా, చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో గల మైన్‌యాంగ్ సిటీ నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్‌యాంగ్‌లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదేవిధంగా చైనాలోని చోంగ్‌కింగ్ నగర పరిధిలో 9,700 మంది తుపాను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. మీడియా ఏజెన్సీ షిన్హువా తెలిపిన వివరాల ప్రకారం చోంగ్‌కింగ్ పరిధిలోని 41 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. వాన్‌ఝోవూలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 227 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాన్‌ఝోవూ విపత్తు నియంత్రణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 300 హెక్టార్లలోని పంటపొలాలు నీట మునిగాయి. ఇళ్లు నీట మునగడంతో వందల మంది నిరాశ్రయులుగా మారారు. వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని రెస్క్యూ బృందాలు కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇది కూడా చదవండి: ‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు! -
ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ(2–19) నికరంగా రూ. 30,945 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇందుకు ప్రధానంగా దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, వడ్డీ రేట్లు వెనకడుగు వేయనున్న అంచనాలు, సానుకూల కార్పొరేట్ ఫలితాలు, స్టాక్స్ విలువలు దిగివస్తుండటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం మే నెల పెట్టుబడులను కలుపుకుంటే ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 16,365 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో రూ. 11,630 కోట్లు, మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినప్పటికీ.. జనవరి, ఫిబ్రవరిలలో రూ. 34,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ నెలలో రుణ సెక్యూరిటీలలో ఎఫ్‌పీఐలు రూ. 1,057 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదీ చదవండి: Rs 2000 Note Withdrawn: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత.. కీలక విషయాలు వెల్లడి -
మంచి మాట: సంతోషం సమగ్ర బలం
సంతోషం సగం బలం‘ అన్నది మనకు బాగా తెలిసిన మాటే. నిజానికి మనిషికి సంతోషం సమగ్ర బలం. అంతేకాదు మనిషికి సంతోషం సహజమైన బలం కూడా. ఎంత బలవంతుడికైనా సంతోషం లేనప్పుడు అతడు బలహీనుడిగా అయిపోతాడు. సంతోషం కరువైపోయిన మనుషులు మనోవ్యాధులతో శుష్కించిపోవడమూ, నశించిపోవడమూ మనకు తెలిసిన విషయమే. బావుండాలంటే మనిషికి సంతోషం ఎంతో ముఖ్యం. వర్తమానంలో మనం సంతోషంతో ఉంటే లేదా మనం వర్తమానాన్ని సంతోష భరితంగా చేసుకోగలిగితే మన భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుంది. ‘సంతోషానికి మార్గం లేదు, సంతోషమే మార్గం‘ ఇది గౌతమ బుద్ధుడి ఉవాచ. సంతోషం అనేది సంపాదించుకోగలిగేదీ, సాధించుకోగలిగేదీ కాదు. సంతోషం మనలో ప్రవహించే రక్తంలాంటిది. బయటనుంచి వచ్చేది కాదు. మనలోంచి మన కోసం మనమై కలిగేది. ‘మనం మన ఆలోచనలవల్ల నిర్మితం అయ్యాం; మనం మన ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతాం; మన మెదడు నిర్మలంగా ఉంటే సంతోషం వీడని నీడలా అనుసరిస్తుంది’ అని చెప్పాడు బుద్ధుడు. మనిషి సంతోషంగా ఉండడం అతడి ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన ఆధారంగా కలిగే అనుభూతి సంతోషం. ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి సంతోషాన్ని ఇచ్చేది కాకపోవచ్చు. ‘సూర్యుడి కాంతి మనుషులకు వెలుగును ఇస్తూ ఉంటే గుడ్లగూబలకు చీకటి అవుతోంది. నీటిలో మునిగినప్పుడు మనుషులకు, పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకం అవుతోంది. ఆ నీరే చేపల శ్వాసకు ఆటంకం అవడం లేదు. మనుషులు హాయిగా గాలి పీల్చుకునే తీరప్రదేశంలో చేపలు గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నిటినీ దహిస్తుంది. కానీ అత్తిరిపక్షులు అగ్నికణాల్ని తింటాయి. నీళ్లవల్ల నిప్పు నశిస్తుంది. కానీ బడబాగ్ని సముద్రం మధ్యలో జ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా జగత్తులో విషయాలన్నీ ద్వైరూప్యంతో ఉన్నాయి అని భారతీయ తత్త్వసాహిత్యంలో అత్యున్నతమైన త్రిపురారహస్యంలో చెప్పబడింది. విషయాలనుబట్టి కాదు మనల్ని బట్టి మనకు తృప్తి కలుగుతూ ఉంటుంది లేదా మన తనివి తీరుతూ ఉంటుంది. కాబట్టి మన సంతోషానికి మనమే మూలంగా ఉన్నాం, ఉంటాం. ‘శరీరాన్ని శుష్కింపజెయ్యడంలో చింత లేదా విచారానికి సమానమైంది లేదు’ అని హితోపదేశం ఎన్నో యేళ్ల క్రితమే మనకు చెప్పింది. ‘చితి, చింత ఈ రెండిటిలో చింత ఎక్కువ దారుణమైంది. చితి నిర్జీవమైన శరీరాన్నే దహిస్తుంది కానీ చింత సజీవంగా ఉన్న శరీరాన్ని దహిస్తూ ఉంటుంది’ అని ఒక సంస్కృత శ్లోకం తెలియజేస్తోంది. నిజానికి చింత అనేది శరీరాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రగతిని, జీవితాన్ని కూడా శుష్కింపజేస్తుంది. కాబట్టి మనకు కలిగిన చింతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. మనకు కలిగిన చింత నుంచి మనం వీలైనంత త్వరగా విముక్తం అవ్వాలి. ‘మానవజాతిలోని చింత అంతా మనసువల్ల వచ్చిన జబ్బు’ అని తమిళకవి కణ్ణదాసన్ చెప్పారు. ఈ స్థితికి అతీతంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మనసే కీలకం. మనసువల్ల వచ్చిన చింతను ఆ మనసువల్లే తొలగించుకోవాలి.‘గాలి తనతో తీసుకు వచ్చిన మేఘాలను తానే చెదరగొడుతుంది.’ అని ఒక సంస్కృత శ్లోకం చెబుతోంది. ఆ విధంగా మనసువల్ల వచ్చిన చింతలను మనం మనసువల్లే పోగొట్టుకోవాలి. సంతోషం మనిషిలోనే నిక్షిప్తం అయి ఉంది. దుఃఖాన్ని తొలగించుకునేందుకు తనను తాను చెక్కుకోవడం నేర్చుకుంటే మనిషి సంతోషశిల్పం అవుతాడు; మనిషి ‘సంతోషంగా’ ఉంటాడు. – శ్రీకాంత్ జయంతి -
సాగర్ రైతుల ఆశలు సజీవం..
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎగువ ప్రాజెక్టులన్నీ నిండి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ప్రవాహాలు వస్తున్నాయి, ఇది నిండితే ఇక వచ్చేదంతా సాగర్‌కే కావడంతో వానాకాలం సాగుపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే కనీస నీటిమట్టాలకు పైన 42 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. వానాకాలం నీటి విడుదలకు మరో 20 రోజుల గడువు ఉంది. అప్పటిలోగా మరింత నీరు చేరుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. శ్రీశైలం నిండితే దిగువకే నీరంతా.. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండగా దిగువకు వచ్చే నీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకే. దీంతో శ్రీశైలంలోనూ మట్టాలు గణనీయంగా పెరు గుతున్నాయి. శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వ సా మర్థ్యానికిగాను 93 టీఎంసీల మేర నీరు చేరింది. మరో 122 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండుకుండ లా మారనుంది. ప్రవాహాలు ఇదేవిధంగా కొనసాగితే మరో 10, 15 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశముంది. అదే జరిగితే ఆగస్టు రెండోవారం నుంచి శ్రీశైలం నుంచి వచ్చే వరదంతా దిగువ సాగర్‌కే. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీల నిల్వ సామర్థ్యా నికిగాను 182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇం దులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 42 టీఎంసీల మేర ఉంది. మరో 45 టీఎంసీల నీరు చేరే వరకు... ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగర్ కింద 6.40 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ఇటీవల జరిగిన ఇరిగేషన్ శాఖ శివమ్ కమిటీ భేటీలో అధికారులు నిర్ణయించారు. దీనికి 60 టీఎంసీల నీరు అవసరమని అంచనా కట్టారు. సాగర్‌పై ఆధారపడ్డ ఏఎంఆర్పీ కింద, హైదరాబాద్ జంటనగరాలకు, మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకు కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన కనిష్టంగా 25 టీఎంసీల మేర నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్రస్తుత లభ్యత కేవలం 17 టీఎంసీలే ఉంటుంది. ఈ నీరు సాగు అవసరాలను తీర్చే అవకాశంలేనందున మరో 45 టీఎంసీల నీరు చేరే వరకు వేచిచూడాల్సి ఉంది. అయితే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌లోకి 25 వేల నుంచి 29 వేల క్యూ సెక్కుల మేర నీటి విడుదల కొనసాగుతోంది. దీనికితోడు, ఆగస్టు రెండోవారం నుంచి ప్రవాహాలు పెరగనుండటంతో నిల్వలు పెరిగే అవకాశం ఉంద ని అంటున్నారు. గత ఏడాది మాదిరిగానే ఆగస్టు 13 నుంచి సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, పూర్తి ఆయకట్టుకు నీరందుతుందని నీటి పారుదల వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది మాదిరిగా ఆగస్టు 13 నుంచి నవంబర్ వరకు ఆరు నుంచి ఏడు తడులకు నీరందే అవకాశముందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఫ్లో కంట్రోల్
నిజామాబాద్‌అర్బన్: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీటిని అందించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఎత్తు, పల్లాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఒకే విధంగా నీరు సరఫరా అందించేలా చూస్తోంది. ఇందుకోసం నూతన పద్ధతిని అమలులోకి తీసుకొస్తోంది. ఇంటింటికి నల్లా ద్వారా నీరు అందించే క్రమంలో నీటి సరఫరాలో లోపాలు ఏర్పడకుండా, ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరందేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. మిషన్ భగీరథ పైప్లైన్లకు ‘ఫ్లో కంట్రోల్ వాల్వ్’ అమర్చడం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీటిని సరఫరా చేయనుంది. జిల్లావ్యాప్తంగా ఇది వరకే కొన్నిచోట్ల పైప్లైన్లు వేయగా, అవసరమున్న చోట ఆ పైప్లైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్‌లు అమర్చుతున్నారు. ముఖ్యంగా ఈ పద్ధతి ద్వారా ఎత్తైన ప్రాంతాలు, తండాలు, మారుమూల గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగనున్నాయి. ఫ్లో కంట్రోల్ వాల్వ్ అంటే.. జిల్లాలో మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు ఇంటింటికి నల్లా కనెక్షన్ల పనులు కూడా కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2165.45 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం జరగాల్సి ఉండగా, ఇప్పటికే 670.45 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణానికిగాను పైపులు సరఫరా అయ్యాయి. కాగా ఇందులో 552.33 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం పూర్తయింది. ఇంటింటికి తాగునీరు అందించేందుకు 2,86,494 లక్షల నల్లా కనెక్షన్లు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 37,834 నల్లా కనెక్షన్లు అందించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందించేందుకుగాను పైపులైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్‌ను అమరుస్తున్నారు. ఈ వాల్వ్‌లను పైప్‌లైన్‌లో అవసరమున్న చోట ఏర్పాటు చేయడం ద్వారా నీరు ఒకే ప్రాంతానికి వేగంగా వెళ్లకుండా, అన్ని ప్రాంతాలకు నీటిని సమానంగా అందే వీలుంటుంది. బంతి మాదిరిగా ఉండే వాల్వ్‌ను పైపులైన్లో ఏర్పాటు చేస్తారు. ఈ వాల్వ్‌కు ఉండే రంధ్రాలు నీటి ఉధృతిని నియంత్రించి, ఒకే ప్రాంతానికి వెళ్లకుండా నీటి సరఫరాను సమన్వయం చేస్తుంది. ఎత్తు నుంచి పల్లానికి నీరు వేగంగా ప్రవహిస్తుంది.. కాబట్టి పైప్లైన్లకు ఈ వాల్వ్‌లను అమర్చుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎత్తుపల్లాలు ఉన్నచోట ఈ విధానం అమలు చేస్తే అందరికి సమానంగా నీరు అందుతుంది. వాల్వ్ ఏర్పాటుకు ప్రాంతాల గుర్తింపు.. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఎత్తుపల్లాలను గుర్తించి పైప్లైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకే కొన్ని చోట్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తికాగా, ఈ వాల్వ్‌లు ఏర్పాటు చేసేందుకు మళ్లీ తవ్వి పూడ్చివేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇదివరకే వాల్వ్‌ల ఏర్పాటు కూడా జరిగింది. గతంలో మున్సిపాలిటీల్లో నీటి నియంత్రణకు పైపులకు స్ప్రింగ్‌ల మాదిరి ఉండే పరికరాలను ఏర్పాటు చేసి నీటిని కంట్రోల్ చేసేవారు. అయితే కొన్నిరోజులకు స్ప్రింగ్‌లు సాగకపోవడంతో ఈ పద్ధతి విఫలమైంది. ఈ స్థానంలో ప్రస్తుతం ఫ్లో కంట్రోల్ వాల్వ్ విధానంను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని తండాలు, గ్రామ పంచాయతీలు, ఎత్తు ప్రాంతంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో శివారు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను ఇదివరకే గుర్తించారు. మిషన్ భగీరథలో నూతన వాల్వ్ విధానం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
ఓ మృతుని ఆత్మఘోష
గుంటూరు, శావల్యాపురం: అంతా శూన్యం..అంతా నిర్వేదం..అంతా నిస్సత్తువ..ఎన్నో ఏళ్లుగా నా చుట్టూ అల్లుకున్న బంధాలు, అనుబంధాలు అన్నీ తీరిపోయాయి. కట్టెగా మారిన నా శరీరం వద్ద రాలిన కన్నీటి బొట్లు నా ఆత్మఘోషకు ఆజ్యం పోశాయి. సొంత ఇంటిని, పుట్టిన ఊరిని, ఈ లోకాన్ని వదిలిన నన్ను సాగనంపుతున్న వేళ.. ఇదిగో వాగు..కొద్దిసేపు ఆగు అంటూ నాతోపాటు నన్ను తీసుకెళుతున్న వారినీ నిలేసింది. తన ఉధృతితో చచ్చిన నన్ను తీసుకెళుతున్న బతికున్న వారినీ భయపెట్టింది. వీడి చావు మన చావుకొచ్చిందిరా అంటూ ఆ వాగు దాటలేక నా బంధువే ఒకరు అన్న మాటలు ఆగిన నా గుండెల్లో కన్నీటి సుడులయ్యాయి. అప్పుడు నా కళ్ల ముందు అధికారులకిచ్చిన వినతిపత్రాలు, పాలకులు ఇచ్చిన హామీలు పొరలు పొరలుగా కనిపించాయి. జన్మభూమి అంటూ ఊళ్లోకి వచ్చిన వారికి వాగు దాటే దారి చూపించండయ్యా అంటూ వేడుకున్న గుర్తులు ఈ ప్రవాహంలో కలిసిపోతున్నట్టే అనిపించాయి. అందుకే పాలకులారా ? అధికారులారా ? మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నా, బతికున్నప్పుడు ఎలాగూ మా సమస్యలు పట్టించుకోలేదు.. కనీసం చచ్చాకైనా మా కాలనీవాసుల అంతిమయాత్ర వెంట నలుగురు నడిచేలా దారి చూపించండి. – శావల్యాపురం మండలం బొందిలిపాలెం దళితవాడలో ఓ మృతుని ఆత్మఘోష -
నిలకడగా గోదావరి వరద
2,45,090 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి.. పశ్చిమ డెల్టాకు నీటి విడుదల కుదింపు కొవ్వూరు: గోదావరిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మంగళవారం సాయంత్రం 10.80 అడుగులు నమోదైంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు నీటి విడుదల తగ్గించారు. సోమవారం 10,400 క్యూసెక్కులు విడిచిపెట్టగా మంగళవారం 9,200 క్యూసెక్కులకు కుదించారు. తూర్పుడెల్టాకు 4,100, సెంట్రల్ డెల్టాకు 2,100, పశ్చిమ డెల్టాకు 3 వేల క్యూసెక్కులు చొప్పున సాగునీరు అందిస్తున్నారు. మిగిలిన 2,45,090 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకు 3 వేల క్యూసెక్కులు పశ్చిమ డెల్టాకు నీటి విడుదలను అధికారులు కుందించారు. మంగళవారం సాయంత్రం నుంచి 3 వేల క్యూసెక్కులు నీరు వదులుతున్నారు. జీ అండ్ వీ కెనాల్‌కి 489, నరసాపురం కాలువకి 1,534, ఉండి కాలువకి 997, ఏలూరు కెనాల్‌కి 693, అత్తిలి కాలువకి 267 క్యూసెక్కులు చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు. -
సోమశిలలో7.474 టీఎంసీల నీటి నిల్వ
సోమశిల : సోమశిల జలాశయంలో సోమవారం ఉదయానికి 7.474 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంకు పైతట్టు ప్రాంతాల నుంచి 453 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో 82.220 మీటర్లు, 269.75 అడుగుల మట్టం నమోదైంది. సగటున 59 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వథా అవుతోంది. -
జూరాలకు కొనసాగుతున్న వరద
– మూడు టర్బైన్లలో విద్యుదుత్పత్తి జూరాల : కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం ఇన్‌ఫ్లో వరద కొనసాగుతుంది. 23వేల క్యూసెక్కుల వరద వస్తుండగా జలవిద్యుత్ కేంద్రంలో మూడు టర్బైన్లలో 110 మెగావాట్ల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ దిగువ నదిలోకి 24వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.33 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. జూరాల రిజర్వాయర్ ద్వారా నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 123.08 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి రిజర్వాయర్‌కు 17,980 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 20వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు. ప్రస్తుతం 32.37 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టాన్ని పూర్తిస్థాయికి పెంచుతున్నందున విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా కేవలం 6వేల క్యూసెక్కుల వరదను జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. -
బిరా బిరా కృష్ణమ్మ..!
బిరబిరా కృష్ణమ్మ పరుగు లిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొర్లుతాయి అని శంకరంబాడి సుందరాచారి ఏనాడో చెప్పారు. అది నాటికి నేటికి రుజువు అవుతూనే ఉంది. కృష్ణవేణి పుష్కరాల్లో పుణ్న స్నానమాచరించి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రిడ్జ్ పాఠశాల డ్రాయింగ్ మాస్టర్ గీచిన చిత్రమిది. – కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) -
జూరాలకు పెరిగిన వరద
జూరాల: ఎగువరాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు మంగళవారం వరద 1,72,000 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో తొమ్మిది క్రస్టుగేట్లను ఎత్తి శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,82,787 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాలలో 8.43 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. నాలుగు టరై్బన్ల ద్వారా 150 మెగావాట్ల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. -
నాగావళి పరవళ్లు
► పెరిగిన తోటపల్లి నీటిప్రవాహం గరుగుబిల్లి: అల్పపీడనం కారణంగా ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లిప్రాజెక్టువద్ద నీటిప్రవాహం పెరిగింది. కొద్ది రోజులక్రితం ఒడిశాలో కురిసిన వర్షాలకు వరదనీరు చేరడంతో నాగావళినదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 104.2 మీటర్లకు చేరింది. ప్రస్తుతం పై భాగం నుంచి నదిలోకి ఇన్‌ఫ్లో 8,450 క్యూసెక్కులు వస్తోంది. ఈమేరకు అధికారులు నాలుగు గేట్లను ఎత్తివేసి 9,056 క్యూసెక్కుల నీటిని నదిలో నుంచి విడిచిపెడుతున్నారు. అలాగే కుడి,ఎడమకాలువలద్వారా 900 క్యూసెక్యుల నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టువద్ద నీటిపరిస్థితిని ప్రాజెక్టు డీఈ పాండు,ఏఈ శ్రీనివాసరావులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.5 టీంసీలకుగాను 1.72 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒడిశాలో వర్షం కురిస్తే నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం నీటిప్రవాహం నిలకడగానే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద ఉధృతి
143.71 మీటర్లకు చేరిన నీరు మంచిర్యాల రూరల్ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఆదివారం మంచిర్యాల మండలంలోని గుడిపేట ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో నిండుగా దర్శనమిచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు తీయడంతో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టుకు చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా, శనివారం సాయంత్రం వరకు 143.61 మీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి. తాజాగా ఈ నీటిమట్టం 143.71 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 10.19 టీఎంసీల నీటీ నిల్వ ఉంది. కాగా, ప్రస్తుతానికి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 400ల కూసెక్కుల కాగా, 400 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్టులో 147 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు ఆ దిశగా ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఆర్డీవో అయిషా మస్రత్ ఖానమ్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని ముంపు గ్రామాలకు ఎలాంటి ముంపు లేదని, ప్రాజెక్టుకు నీళ్లు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు. ముంపు గ్రామాలైన చందనాపూర్, రాపల్లి, కొడపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాల నిర్వాసితులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిని వెంటనే గ్రామాలు ఖాళీ చేయాలని కూడా సూచించామని చెప్పారు. అయితే ముందస్తుగా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక పునరావాస ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఉంచామని వివరించారు. -
దవళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి
రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువనుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నీటిమట్టం 14.7 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 14.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి ఉధృతితో 71 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. పీ.గన్నవరంలో 38 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయినవెల్లి మండలం వెదురుబీడెం కాజ్వే పైకి వరద రావడంతో ఏడు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు 12 లాంచీలు, 100 పడవలు ఏర్పాటుచేశారు. -
నా పయనంలో జంటస్వరాలు
ప్రవాహం నా జీవన విధానం. పయనం నా జీవిత పాఠం. ప్రయాణం నా ప్రాణం. ఈ ప్రవాహంలో నాకు నచ్చనివి ఒడ్డున వదిలేస్తూ.. నచ్చినవి నాలో అంతర్భాగం చేసుకుంటూ.. నా జీవితాన్ని మరింత సారవంతం చేసుకుంటున్నా. గమ్యాన్ని కాదు గమనాన్ని ప్రేమించు అన్న వాస్తవాన్ని గ్రహిస్తూ ప్రవహిస్తున్నా. నా ఈ చిన్ని జీవితంలో, నేను చేసిన కొన్ని ప్రయాణాల్లో.. ఎందరో వ్యక్తులు, వారి మనస్తత్వాలు, వస్తువులు, ప్రదేశాలు, సన్నివేశాలు నన్ను ప్రభావితం చేశాయి. ఇటీవల చేసిన ప్రయాణంలో కర్ణాటకలోని ఓ చిరుగ్రామం కెరతణ్ణూరు నుంచి బెంగళూరు వరకూ ఎన్నో జ్ఞాపకాలను భద్రంగా మూటగట్టుకున్నా. అందులో పదిలంగా దాచుకునే పరిచయం ఒకటుంది. పరిచయం పాతదే కానీ ఈసారి చూసిన కోణం కొత్తది. చిరునవ్వుల హృదయాలు.. బెంగళూరులో మిలటరీ ఆఫీసర్ల క్వార్టర్లు. చుట్టూ దట్టంగా తరువులు, వాటి మధ్య పాత రాతి కట్టడాల కాటేజీల్లో ఓ అందమైన తెలుగు పొదరింటికి చుట్టపు చూపుగా వెళ్లాను. ఆ పొదరింట్లో ఏడేళ్ల ఓ తుంటరి ప్రశ్నల పుట్ట, వాడి అల్లరిని చిరునవ్వుతో ఆస్వాదిస్తూ, నిండు కుండలా తొణకని వ్యక్తిత్వంతో ఆ ఇంటికి, ఇల్లాలికి కొండంత అండలా ఓ ధీర గంభీరుడు, అతని చిరునవ్వే తన ఆనందంలా స్వచ్ఛంగా ఉబ్బితబ్బిబ్బైపోతున్న ముద్దబంతి ఆ ఇంటి ఇంతి. ముచ్చటగా ముగ్గురున్న ఆ ఇంటిని చూసి ఎంత ముచ్చటేసిందో. అక్కడ ప్రేమ ప్రవహిస్తోంది. ఆ ముద్దబంతి మీ అందరికీ తెలిసిన నా సహనటి, యాంకర్ గాయత్రీ భార్గవి. వారింట గడిపిన ప్రతిక్షణం అపురూపంగా దాచుకునే అందమైన ఫ్రేములే. లెఫ్టినెంట్ కల్నల్ విక్రమ్, భార్గవిల భాగస్వామ్యం మరింత అపురూపమైన అనుబంధంగా మారాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేశాను. సమకాలీన సాహచర్యానికి నిజమైన అర్థంలా కనిపించిన ఆ ఇద్దరినీ చూస్తూ నా ప్రయాణంలో నన్ను ప్రభావితం చేసిన మరికొందరి జీవన భాగస్వామ్యాలు తలుచుకున్నాను. భళా తందతానా ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది సత్యం కాదని నిరూపించిన జంటని బోస్టన్‌లో కలిశాను. ఆమె మాట పదును తేలిన కత్తి, ఆయన మాటని అరుదుగా ఉపయోగించే మేటి. ఆమెకు మౌనం ఎప్పుడు ప్రయోగించాలో తెలుసు, ఆయనకు మాటని అస్త్రంగా ఉపయోగించడం తెలుసు. అదే వారి బలం. వారే అమెరికాలో ‘తానా’ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, ఆయన సతీమణి శ్యామా. ఇద్దరూ కార్యదక్షులు, సమఉజ్జీలు, శక్తివంతులు.. ఇద్దరూ కలసి అమెరికాలో ఏడెకరాల సువిశాల ప్రాంగణంలో రాజమహల్ లాంటి ఇంటిని నిర్మించుకునేంత సంపన్నులుగా ఎదిగారు. ఐశ్వర్యం కంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది వారి భాగస్వామ్యం గురించి. వారిద్దరి మధ్య ఉన్నది పరస్పర గౌరవం, అందుకే రెండు కత్తులూ ఒకే ఒరలో ఒదిగిపోయాయి. చందురుని మించు.. మరో జంట అమెరికాలోనే డల్లాస్‌లోని కవి మిత్రుడు, రచయిత కన్నెగంటి చంద్ర. ఆయన బెటర్ హాఫ్ మంజులత. మాటల మాంత్రికుడుగా కథాగమనాన్ని నడిపించే చంద్రగారు మట్లాడటంలో మహా పొదుపరి. ఉద్యోగంతో పాటు ‘తానా’లో పలు బాధ్యతలు నిర్వహించే మంజుగారు చమత్కారి. అమెరికా పెరట్లో అపురూపంగా పెంచుకున్న మల్లెతీగకు విచ్చుకున్న మల్లెలను చూసి పసిపిల్లలా మురిసిపోయే ఆవిడ భావుకతని, తన కళ్లలోని చిరునవ్వుతో అర్థం చేసుకునే తాత్వికుడు ఆయన. ఆమె ఆప్యాయంగా చంద్రమా అని పిలిస్తే, నిండు చందమామలా పరవశిస్తాడాయన. ఉరకలేసే కుందేలుని తనలోనే అంతర్భాగం చేసుకున్న చందమామ లాంటిది వారిద్దరి భాగస్వామ్యం. మల్లెలను చూసినా వారే గుర్తొచ్చేంత అపురూపమైనది వారి సాహచర్యం. పరుగులు తీసే మనసులు.. ఇక నా ఆప్తమిత్రులు, ఆత్మబంధువులు అయిన లక్ష్మీ, వెంకట్ల గురించి ప్రస్తావించకుండా ఎలా ఉండగలను. ఇద్దరూ విలక్షణంగా మల్టీ టాస్కర్లు. ఇద్దరూ స్వచ్ఛమైన పర్ఫెక్షనిస్టులు. ఇద్దరి తత్వం ఒకటే.. సరికొత్త రంగంలో ఉన్నతంగా నిలవడం. కానీ తమాషాగా ఒకరికొకరు పోటీ. ఎవరు గెలుస్తారనే బెంగే లేదు, అయినా పరుగుపందెంలా ఉంటుంది వారి సాహచర్యం. గమ్మత్తేంటంటే పందెంలో పరుగెడుతూ కూడా ఒకరి చేయి మరొకరు విడువరు. ఒకరితో మరొకరు తోడుగా పక్కనే పరుగులో ఉంటారు. కానీ పందెం మాత్రం ఉంటుంది, పంతం కాదు. ఒకరు గెలిస్తే మరొకరు గెలిచినట్టే ఒకరు ఓడితే మరొకరు ఓడినట్టే. అందమైన పోటీతత్వంలో ఒదిగిపోయిన ప్రేమ తత్వం వారిద్దరిదీ. ప్రయాణమే లేకపోతే ఇంతటి అందమైన భాగస్వామ్యం అర్థమయ్యే అవకాశం కోల్పోయి ఉండేదాన్ని. నగర జీవితంలో ఉరుకులు, వృత్తి జీవితంలో ఒడిదుడుకులు.. ఎన్ని ఉన్నా జీవనయానం యాంత్రికం కాకుండా కాపాడుకునేందుకు ప్రేరణ ఈ అందమైన జంటలు. ప్రేమించే హృదయాలు పోటీతత్వంతో ముడిపడి ఒకరి శక్తిని మరొకరు అర ్థం చేసుకుని ఒకే ఒరలో ఇమిడే కత్తులై, చందమామలోని కుందేలులా విడదీయలేని అనుబంధమై సాగిపోవాలనే స్ఫూర్తినిస్తున్న ఈ జంటల్లో మన ని మనం వెతుక్కోవచ్చు. ఆనందాన్ని పెంచుకోవచ్చు. హ్యాపీ ఫ్యామిలీస్ అంటే హ్యాపీ సిటీస్. -
కుందూ ఉధృతి
పెద్దముడియం: కుందూనదిలో వరద ఉధృతి పెరుగుతోంది. సోమవారం ఉదయం కుందూ నదిలో 9వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా అదే రోజు రాత్రి కురిసిన వర్షాలకు ప్రవాహం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రికి కుందూలో 13వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు సమాచారం. మండలంలోని నెమళ్లదిన్నె బ్రిడ్జిపై రెండు అడుగుల ఎత్తు వరకు వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో కుందూ నదిలో ప్రవాహం మరింత పెరిగి నెమళ్లదిన్నె, గరిశలూరు గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ప్రతి ఏడాది కుందూ నదికి వరదలు వస్తుండటంతో పరివాహక ప్రాంతాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.ప్రతి ఏడాది కుందూ నదికి వరదలు వస్తుండటంతో పంటపొలాలు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. ప్రజల కష్టాలను గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రాజోలి ఆనకట్టవద్ద 2.93 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ వైఎస్ మరణానంతరం వచ్చిన పాలకులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో వరద జలాలన్నీ పూర్తిగా నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే పెద్దముడియం, రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల్లోని రైతుల పంటలకు సాగునీరు, తాగునీరు అందే ఆవకాశం ఉంది.