తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితి
నాగావళి పరవళ్లు
Published Sun, Jul 31 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
► పెరిగిన తోటపల్లి నీటిప్రవాహం
గరుగుబిల్లి: అల్పపీడనం కారణంగా ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లిప్రాజెక్టువద్ద నీటిప్రవాహం పెరిగింది. కొద్ది రోజులక్రితం ఒడిశాలో కురిసిన వర్షాలకు వరదనీరు చేరడంతో నాగావళినదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 104.2 మీటర్లకు చేరింది. ప్రస్తుతం పై భాగం నుంచి నదిలోకి ఇన్‌ఫ్లో 8,450 క్యూసెక్కులు వస్తోంది. ఈమేరకు అధికారులు నాలుగు గేట్లను ఎత్తివేసి 9,056 క్యూసెక్కుల నీటిని నదిలో నుంచి విడిచిపెడుతున్నారు. అలాగే కుడి,ఎడమకాలువలద్వారా 900 క్యూసెక్యుల నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టువద్ద నీటిపరిస్థితిని ప్రాజెక్టు డీఈ పాండు,ఏఈ శ్రీనివాసరావులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.5 టీంసీలకుగాను 1.72 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒడిశాలో వర్షం కురిస్తే నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం నీటిప్రవాహం నిలకడగానే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Advertisement