ప్రస్తుతం భారత్‌లోని ఉత్తరాది ప్రాంతం భారీ వర్షాలకు, వరదలకు వణుకుతుండగా, చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో గల మైన్‌యాంగ్ సిటీ నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్‌యాంగ్‌లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదేవిధంగా చైనాలోని చోంగ్‌కింగ్ నగర పరిధిలో 9,700 మంది తుపాను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.
మీడియా ఏజెన్సీ షిన్హువా తెలిపిన వివరాల ప్రకారం చోంగ్‌కింగ్ పరిధిలోని 41 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. వాన్‌ఝోవూలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 227 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాన్‌ఝోవూ విపత్తు నియంత్రణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 300 హెక్టార్లలోని పంటపొలాలు నీట మునిగాయి. ఇళ్లు నీట మునగడంతో వందల మంది నిరాశ్రయులుగా మారారు. వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని రెస్క్యూ బృందాలు కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
ఇది కూడా చదవండి: ‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!
Comments
Please login to add a commentAdd a comment