totapalli
-
మరో మూడు డెంగీ కేసులు
33కు చేరిన సంఖ్య విజయనగరం ఫోర్ట్/మున్సిపాలిటీ : జిల్లాలో మరో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు సర్కార్ దోమలపై దండయాత్ర పేరుతో ఓ వైపు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న సమయంలో వ్యాధుల వ్యాప్తి అధికమవుతుండడం గమనార్హం. విజయనగరం పట్టణంలో రెండు, తోటపల్లిలో మరో డెంగీ కేసు శుక్రవారం నమోదయ్యాయి. విజయనగరం పట్టణంలోని లంక పందిరివీధికి చెందిన హాసిని, గాజులరేగకు చెందిన వివేక్‌సాయి , తోటపల్లికి చెంది స్పందనలకు డెంగీ సోకింది. హాసిని(హర్షిణి), వివేక్‌సాయిలు పట్టణంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బందాలు పర్యటిస్తున్నప్పుడే.. జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాధుల నియంత్రణకు 9 మెుబైల్ టీమ్‌లు పర్యటిస్తున్నాయి. వ్యాధులు రాకుండా ఏ జాగ్రత్తలు, తీసుకోవాలి, వేటి వల్ల దోమలు వద్ధి చెందుతాయి వంటి విషయాలపై మోబైల్ టీమ్‌లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే వ్యాధులు ప్రబలుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి.. డెంగీ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచించారు. పట్టణానికి చెందిన వివేక్ సాయి, హాసిని (హర్షిణి) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకష్ణ, కమిషనర్ జి.నాగరాజు ఆస్పత్రిని సందర్శించి చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ల్యాబ్ టెక్నీషియన్ ధ్రువీకరణ చేయకుండా డెంగీ జ్వరంగా ఎలా నిర్ధారించి, చికిత్స అందిస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. ఇందుకుసంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాని ఆదేశించారు. పరిశీలనలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ పట్నాయక్, ఆర్డీఓ శ్రీనివాసమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు. వైద్యాధికారి సంతకంతో డెంగీ నివేదిక డెంగీ నివేదికలను వైద్యాధికారి సంతకం, స్టాంపు వేసి ఇవ్వాలని కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కేంద్రాస్పత్రిలో ఉన్న ఐడీఎస్పీ లేబరేటరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరికరాలను పరిశీలించారు. నివేదికలపై తప్పకుండా సంబంధిత వైద్యాధికారి సంతకం ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సుధాకర్ పట్నాయక్, డీసీహెచ్ఎస్ గరికిపాటి ఉషశ్రీ , కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. -
అన్నది ఒకటి... చేస్తున్నది మరొకటి
వీరఘట్టం: తోటపల్లి ఎడమ కాలువకు విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం పెద్దబుడ్డిడి–శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం సంతనర్సిపురం గ్రామాల మధ్య ఈనెల 18న పడిన గండిని పూడ్చేందుకు ఎట్టకేలకు పనులు ప్రారంభించారు. యూటీ(అండర్ టెన్నల్) ఆకారంలో పనులు చేస్తామని నేతలు చెప్పినా పనుల ప్రారంభంలో సాధారణ యంత్రాలు వినియోగించడంతో స్థానికుల్లో అనుమానాలు మొదలయ్యాయి. బొబ్బిలి ఇరిగేషన్ ఎస్ఈ ఎంవీ రమణమూర్తి ఈ పనులను సోమవారం ప్రారంభించారు. సైఫన్ వద్ద కాంక్రీట్ రెడీ మిక్సింగ్‌తో ఫౌండేషన్ పనులు ప్రారంభించాల్సి ఉండగా సాధారణ మిక్సింగ్ యంత్రాన్ని తీసుకొచ్చారు. పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలంటే రెడీమేడ్ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రం ద్వారానే సాధ్యమవుతుందని స్థానికులు అంటున్నారు. నాణ్యతపై అనుమానాలు ఇదిలా ఉండగా పంచాయతీ స్థాయిలో వేసే సిమ్మెంటు రోడ్డులతో పాటు ఏ ప్రభుత్వ నిర్మాణాలకైనా 53 గ్రేడ్ ఉన్న సిమెంటును వాడతారు. భారీ గండి పడిన ఈ ప్రాంతంలో మాత్రం 43 గ్రేడ్ సిమెంటు వినియోగించడంతో నాణ్యతపై అనుమానాలు వస్తున్నాయి. 50 ఎకరాల్లో సాగునీరు గగనంగా మారినా పనులు ఇలా చేస్తుండడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వర్షాలు పడినందున రైతుకు కాస్త ఊరటగా ఉంది. లేకుంటే ఈ పాటికే పొలం ఎండిపోయి ఉండేదని స్థానిక రైతులంటున్నారు. మిక్సర్ విషయంపై బొబ్బిలి సెక్షన్ ఎస్.ఈ.రమణమూర్తి వద్ద సాక్షి ప్రస్తావించగా రోడ్డు బాగోలేదని, ఈ రోడ్డు గుండా రెడీ మిక్సర్ రాలేదని తెలిపారు. -
నాగావళి పరవళ్లు
► పెరిగిన తోటపల్లి నీటిప్రవాహం గరుగుబిల్లి: అల్పపీడనం కారణంగా ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లిప్రాజెక్టువద్ద నీటిప్రవాహం పెరిగింది. కొద్ది రోజులక్రితం ఒడిశాలో కురిసిన వర్షాలకు వరదనీరు చేరడంతో నాగావళినదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 104.2 మీటర్లకు చేరింది. ప్రస్తుతం పై భాగం నుంచి నదిలోకి ఇన్‌ఫ్లో 8,450 క్యూసెక్కులు వస్తోంది. ఈమేరకు అధికారులు నాలుగు గేట్లను ఎత్తివేసి 9,056 క్యూసెక్కుల నీటిని నదిలో నుంచి విడిచిపెడుతున్నారు. అలాగే కుడి,ఎడమకాలువలద్వారా 900 క్యూసెక్యుల నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టువద్ద నీటిపరిస్థితిని ప్రాజెక్టు డీఈ పాండు,ఏఈ శ్రీనివాసరావులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.5 టీంసీలకుగాను 1.72 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒడిశాలో వర్షం కురిస్తే నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం నీటిప్రవాహం నిలకడగానే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
తోటపల్లి ప్రధాన కాలువకు లైనింగ్ ?
* రూ. 300 కోట్లు అవసరం * నిధుల మంజూరుకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం * ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు విజయనగరం కంటోన్మెంట్ : ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన తోటపల్లిని ప్రారంభిద్దామన్న ధ్యాసే తప్ప ఇతర బాగోగులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోయినా కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏటా సాగునీటి రంగానికి కేటాయించే నిధులకు సంబంధించి తోటపల్లి ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసింది. ఏమేం అభివృద్ధి పనులు చేయొచ్చో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోరడంతో ఇరిగేషన్ అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్‌ను 1200 క్యూసెక్కుల నీటి సామర్థ్యంగా 2003లో డి జైన్ చేశారు. అయితే అప్పట్లో పూసపాటి రేగ, గుర్ల, గరివిడి, గజపతినగరం, తదితర అదనపు ఆయకట్టు ప్రతిపాదనలు లేవు. ఆ తర్వాత నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో ఈ అదనపు ప్రాంతాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అయితే అదనపు ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు పూర్తి స్థాయిలో జోరుగా అందాలంటే కాలువ ఆసాంతం లైనింగ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం కాలువ అంతా మట్టి, తుప్పలు, పెద్ద రెల్లు గడ్డితో నిండి ఉంది. మొత్తం 118 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ పరిస్థితి అంతా ఇలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేని సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పనుల కోసం సుమారు రూ. 300 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిశీలించే అవకాశం ఉంది. నిధులు మంజూరు చేస్తే ఈ ఏడాదే పనులు ప్రారంభించే అవకాశముంది. లైనింగ్ ఎందుకంటే..? కాలువలో పిచ్చిమొక్కలు, పూడికలు పేరుకుపోవడంతో శివారు ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. ఇలా కాకుండా వాటన్నింటినీ తొలగించి కాంక్రీట్‌తో లైనింగ్ చేస్తే సాగునీటి ప్రవాహం జోరందుకుని అంతటా ఒకేలా నీరందుతుంది. అలాగే లైనింగ్ చేయడం వల్ల కాలువ గట్లు కూడా బలంగా తయూరవుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రతిపాదనలు సమర్పిస్తాం తోటపల్లి కాలువ లైనింగ్ ప్రతిపాదనలు ఏప్రిల్ మొదటి వారంలో పంపిస్తాం. ప్రస్తుతం ప్రతిపాదనల తయూరీపై దృష్టి సారించాం - డోల తిరుమల రావు, పర్యవేక్షక ఇంజినీరు, తోటపల్లి -
తోటపల్లి రిజర్వాయర్ టెండర్ రద్దు
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం, తోటపల్లి గ్రామం వద్ద నిర్మించదలచిన ఓగులాపూర్ రిజర్వాయర్ పనుల టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రిజర్వాయర్‌కు అనుబంధంగా ఉన్న మోహిడి మేడువాగు, ఎల్లమ్మ వాగు పనులను సైతం నిలిపివేయాలని నిర్ణయించి గురువారం నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. అంచనా వ్యయానికి 18 శాతం తక్కువకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేసేందుకు నిరాకరించడంతో ఏడేళ్లుగా పని ముందుకు కదల్లేదు. టెండర్‌ను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వరద కాల్వ చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వానికి విన్నవించగా, ప్రభుత్వం సమ్మతించింది. -
‘తోటపల్లి’పై ప్రత్యేక దృష్టి
గరుగుబిల్లి :తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో సాగునీరు అందించనున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపా రు. గురువారం ఆమె తోటపల్లి ప్రాజెక్టు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చం ద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని చె ప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్ర భుత్వం పని చేస్తుందన్నారు. మరో వా రం రోజుల్లో నిర్వాసితులు, రైతులతో సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కాగా తోటపల్లి పాత రెగ్యులేటర్‌ను తొల గించకపోతే వరదలు వచ్చినప్పుడు ప్రా జెక్టుకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ హెచ్. హనుమంతురావు మంత్రికి వివరించారు. దీనిపై స్పందిం చిన మంత్రి తక్షణమే ఆర్అండ్బీ అధికారులతో చర్చించి రెగ్యులేటర్‌ను తొలగిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మరో 15 రోజుల్లో ప్రాజెక్టు పరిధిలోని పనులను పూర్తి చేయాలని చెప్పా రు. సకాలంలో పనులు పూర్తి చేయకపో తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మా జీ ఎమ్మెల్యే వీటీ జనార్ధన్ థాట్రాజ్, టీడీపీ నాయకులు డి. ధనుంజయరావు, మాజీ ఎంపీపీ ఎం. పురుషోత్తంనాయుడు, డి. లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. మంత్రికి వినతుల వెల్లువ తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి సబ్ డివిజన్ కార్యాలయాన్ని తోటపల్లిలో ఏ ర్పాటు చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు ధనుంజయరావు మంత్రిని కోరా రు. పాలకొండ, రాజాంలో డివిజన్ కా ర్యాలయం ఉండడంతో నిత్యం ఇబ్బం దులు పడుతున్నారని వివరించారు. అలాగే హుద్‌హుద్ తుపానుకు సంబంధింంచిన నష్టపరిహరం ఇంతవరకు రాలేదని సంతోషపురం మాజీ సర్పంచ్ ఎ. గౌ రునాయుడు వినతిపత్రం అందజేశారు. నూతన తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సమీపంలోని ఏడు గ్రామాలకు కాలువలు ఏ ర్పాటు చేసి సాగునీరందించాలని నాగూ రు సర్పంచ్ మధుసూధనారావు కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. పేదల బాగుకోసమే చంద్రబాబు తపన...! పార్వతీపురం : పేదల బాగుకోసం ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తపిస్తున్నారని మంత్రి మృణాళిని అన్నారు. గురువారం ఆమె పార్వతీపురం లోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్రంలో భూసేకరణ అన్నది కొత్తగా ఏర్పడిన రాష్ట్ర బాగు కోసం జరుగుతుందన్నారు. ఇంకా రాష్ట్ర రాజధాని ని ర్మాణానికి పునాది రాయ వేయకుండానే అభివృద్ధిగిట్టనివాళ్లు చంద్రబాబు పని తీ రును తప్పుపడుతున్నారని ఆరోపించా రు. జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో ముఖ్యమంత్రి తోటపల్లి ప్రాజెక్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. -
టవేరాను ఢీకొన్న బస్సు, ముగ్గురు మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెజ్జంకి మండలం తోటపల్లి సమీపంలో టవేరా కారును ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఇంటి పెద్దల మృతితో బాధిత కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. వ్యాపార విషయమై హైదరాబాద్ నుంచి సొంతూరికి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో మొత్తం 8 మంది కారులో ఉన్నట్లు తెలిసింది. -
టవేరాను ఢీకొన్న బస్సు, ముగ్గురు మృతి