గరుగుబిల్లి :తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో సాగునీరు అందించనున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపా రు. గురువారం ఆమె తోటపల్లి ప్రాజెక్టు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చం ద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని చె ప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్ర భుత్వం పని చేస్తుందన్నారు. మరో వా రం రోజుల్లో నిర్వాసితులు, రైతులతో సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
కాగా తోటపల్లి పాత రెగ్యులేటర్‌ను తొల గించకపోతే వరదలు వచ్చినప్పుడు ప్రా జెక్టుకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ హెచ్. హనుమంతురావు మంత్రికి వివరించారు. దీనిపై స్పందిం చిన మంత్రి తక్షణమే ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించి రెగ్యులేటర్‌ను తొలగిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మరో 15 రోజుల్లో ప్రాజెక్టు పరిధిలోని పనులను పూర్తి చేయాలని చెప్పా రు. సకాలంలో పనులు పూర్తి చేయకపో తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మా జీ ఎమ్మెల్యే వీటీ జనార్ధన్ థాట్రాజ్, టీడీపీ నాయకులు డి. ధనుంజయరావు, మాజీ ఎంపీపీ ఎం. పురుషోత్తంనాయుడు, డి. లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి వినతుల వెల్లువ
తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి సబ్ డివిజన్ కార్యాలయాన్ని తోటపల్లిలో ఏ ర్పాటు చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు ధనుంజయరావు మంత్రిని కోరా రు. పాలకొండ, రాజాంలో డివిజన్ కా ర్యాలయం ఉండడంతో నిత్యం ఇబ్బం దులు పడుతున్నారని వివరించారు. అలాగే హుద్‌హుద్ తుపానుకు సంబంధింంచిన నష్టపరిహరం ఇంతవరకు రాలేదని సంతోషపురం మాజీ సర్పంచ్ ఎ. గౌ రునాయుడు వినతిపత్రం అందజేశారు. నూతన తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సమీపంలోని ఏడు గ్రామాలకు కాలువలు ఏ ర్పాటు చేసి సాగునీరందించాలని నాగూ రు సర్పంచ్ మధుసూధనారావు కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
పేదల బాగుకోసమే చంద్రబాబు తపన...!
పార్వతీపురం : పేదల బాగుకోసం ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తపిస్తున్నారని మంత్రి మృణాళిని అన్నారు. గురువారం ఆమె పార్వతీపురం లోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్రంలో భూసేకరణ అన్నది కొత్తగా ఏర్పడిన రాష్ట్ర బాగు కోసం జరుగుతుందన్నారు. ఇంకా రాష్ట్ర రాజధాని ని ర్మాణానికి పునాది రాయ వేయకుండానే అభివృద్ధిగిట్టనివాళ్లు చంద్రబాబు పని తీ రును తప్పుపడుతున్నారని ఆరోపించా రు. జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో ముఖ్యమంత్రి తోటపల్లి ప్రాజెక్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
‘తోటపల్లి’పై ప్రత్యేక దృష్టి
Published Fri, Apr 24 2015 4:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement