కరీంనగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెజ్జంకి మండలం తోటపల్లి సమీపంలో టవేరా కారును ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఇంటి పెద్దల మృతితో బాధిత కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. వ్యాపార విషయమై హైదరాబాద్ నుంచి సొంతూరికి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో మొత్తం 8 మంది కారులో ఉన్నట్లు తెలిసింది.