చిన్నారి వివేక్‌సాయి కుటుంబ సభ్యలతో మాట్లాడుతున్న కలెక్టర్
మరో మూడు డెంగీ కేసులు
Published Fri, Sep 23 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
33కు చేరిన సంఖ్య
విజయనగరం ఫోర్ట్/మున్సిపాలిటీ : జిల్లాలో మరో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు సర్కార్ దోమలపై దండయాత్ర పేరుతో ఓ వైపు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న సమయంలో వ్యాధుల వ్యాప్తి అధికమవుతుండడం గమనార్హం. విజయనగరం పట్టణంలో రెండు, తోటపల్లిలో మరో డెంగీ కేసు శుక్రవారం నమోదయ్యాయి. విజయనగరం పట్టణంలోని లంక పందిరివీధికి చెందిన హాసిని, గాజులరేగకు చెందిన వివేక్‌సాయి , తోటపల్లికి చెంది స్పందనలకు డెంగీ సోకింది. హాసిని(హర్షిణి), వివేక్‌సాయిలు పట్టణంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బందాలు పర్యటిస్తున్నప్పుడే..
జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాధుల నియంత్రణకు 9 మెుబైల్ టీమ్‌లు పర్యటిస్తున్నాయి. వ్యాధులు రాకుండా ఏ జాగ్రత్తలు, తీసుకోవాలి, వేటి వల్ల దోమలు వద్ధి చెందుతాయి వంటి విషయాలపై మోబైల్ టీమ్‌లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే వ్యాధులు ప్రబలుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
డెంగీ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచించారు. పట్టణానికి చెందిన వివేక్ సాయి, హాసిని (హర్షిణి) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకష్ణ, కమిషనర్ జి.నాగరాజు ఆస్పత్రిని సందర్శించి చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ల్యాబ్ టెక్నీషియన్ ధ్రువీకరణ చేయకుండా డెంగీ జ్వరంగా ఎలా నిర్ధారించి, చికిత్స అందిస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. ఇందుకుసంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాని ఆదేశించారు. పరిశీలనలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ పట్నాయక్, ఆర్డీఓ శ్రీనివాసమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.
వైద్యాధికారి సంతకంతో డెంగీ నివేదిక
డెంగీ నివేదికలను వైద్యాధికారి సంతకం, స్టాంపు వేసి ఇవ్వాలని కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కేంద్రాస్పత్రిలో ఉన్న ఐడీఎస్‌పీ లేబరేటరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరికరాలను పరిశీలించారు. నివేదికలపై తప్పకుండా సంబంధిత వైద్యాధికారి సంతకం ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సుధాకర్ పట్నాయక్, డీసీహెచ్‌ఎస్ గరికిపాటి ఉషశ్రీ , కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement