న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ(2–19) నికరంగా రూ. 30,945 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇందుకు ప్రధానంగా దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, వడ్డీ రేట్లు వెనకడుగు వేయనున్న అంచనాలు, సానుకూల కార్పొరేట్ ఫలితాలు, స్టాక్స్ విలువలు దిగివస్తుండటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి.
డిపాజిటరీల గణాంకాల ప్రకారం మే నెల పెట్టుబడులను కలుపుకుంటే ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 16,365 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో రూ. 11,630 కోట్లు, మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినప్పటికీ.. జనవరి, ఫిబ్రవరిలలో రూ. 34,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ నెలలో రుణ సెక్యూరిటీలలో ఎఫ్‌పీఐలు రూ. 1,057 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: Rs 2000 Note Withdrawn: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత.. కీలక విషయాలు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment