Indian equities
-
ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ(2–19) నికరంగా రూ. 30,945 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇందుకు ప్రధానంగా దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, వడ్డీ రేట్లు వెనకడుగు వేయనున్న అంచనాలు, సానుకూల కార్పొరేట్ ఫలితాలు, స్టాక్స్ విలువలు దిగివస్తుండటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం మే నెల పెట్టుబడులను కలుపుకుంటే ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 16,365 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో రూ. 11,630 కోట్లు, మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినప్పటికీ.. జనవరి, ఫిబ్రవరిలలో రూ. 34,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ నెలలో రుణ సెక్యూరిటీలలో ఎఫ్‌పీఐలు రూ. 1,057 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదీ చదవండి: Rs 2000 Note Withdrawn: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత.. కీలక విషయాలు వెల్లడి -
మిశ్రమంగా స్పందిస్తున్న స్టాక్‌మార్కెట్లు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన వడ్డీరేట్లను తగ్గించడంతో స్టాక్‌మార్కెట్లు నెగిటివ్‌గా స్పందించినా మళ్లీ పుంజుకుని మిశ్రమంగా మారాయి. ఆరంభంనుంచి ఊగిసలాటల మధ్య ఉన్నప్పటికీ కీలక వడ్డీరేట్లలో 0.25 శాతం తగ్గింపును ప్రకటించడంతో మార్కెట్లలో నష్టాలు పెరిగాయి. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లోకి జారుకుంది. కీలకమైన సాంకేతిక స్థాయి 25వేలకు ఎగువన ఉన్నప్పటికీ, స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. ఒకదశలో సెన్సెక్స్ 100 పాయింట్లు క్షీణించి 32, 301 నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 10,083 స్తాయికి మళ్లాయి. అనంతరం దాదాపు 50 పాయింట్లు రికవరీ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాలను తగ్గించుకుంది. ఎస్‌బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓన్జీసీ నష్టాల్లోనూ సన్‌టీవీ, బయోకాన్, వోల్టాస్ లాభాల్లోను కొనసాగుతున్నాయి. అయితే టైర్ షేర్లు టాప్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే అశ్వినీ గుజ్రాల్ లాంటి ఎనలిస్టులు మాత్రం మార్కెట్ పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. 2017-18లో తన మూడవ నెలవారీ ద్రవ్య విధాన సమీక్షలో అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు అంచనా వేసినట్టుగా రిజర్వ్ బ్యాంక్ బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూలో కీలక వడ్డీ రేట్లలో పావు శాతం చొప్పున కోత పెట్టింది.రెపో రేటులో 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) కోత పెట్టడంతో ప్రస్తుత రేటు 6 శాతానికి చేరింది. రివర్స్ రెపోలోనూ 0.25 శాతం కట్ చేయడంతో ఇది 5.75 శాతానికి దిగి వచ్చింది. అలాగే ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. -
సెన్సెక్స్ కంపెనీల్లో ఎఫ్ఐఐల రికార్డు పెట్టుబడులు
న్యూఢిల్లీ: లాభాల దూకుడు చూపుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు సైతం పుంజుకుంటున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్ ముగిసేసరికి సెన్సెక్స్ షేర్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు 27%కు చేరుకున్నాయి. ఇది సరికొత్త రికార్డుకాగా, జూన్ క్వార్టర్ చివరికి ఇవి 22.5%గా నమోదయ్యాయి. ఈ వివరాలను గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ మెరిల్లించ్ ఒక నివేదికలో వెల్లడించింది. ఎఫ్ఐఐలు అత్యధిక స్థాయిలో పెట్టుబడులకు దిగిన రంగాల జాబితాలో సాఫ్ట్వేర్, ఇంధనం చోటు చేసుకున్నాయి. ఇంధన సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ షేర్లను ఎఫ్ఐఐలు కొనుగోలు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఇక కన్జూమర్, టెలికాం, ఫైనాన్షియల్ రంగాలు సైతం ఎఫ్ఐఐలకు ఫేవరెట్‌గా నిలిచినట్లు పేర్కొంది. -
242 పాయింట్లు అప్
గత రెండు వారాల్లోలేని విధంగా స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగశాయి. ఉదయం నుంచీ లాభాల్లోనే కదులుతూ ట్రేడింగ్ గడిచేకొద్దీ మరింత బలపడ్డాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు పుంజుకుని 25,723 వద్ద ముగిసింది. వెరసి రెండు రోజుల భారీ నష్టాలకు చెక్ పడింది. గత వారం చివరి రెండు రోజుల్లో సెన్సెక్స్ 606 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా, వినియోగ వస్తువులు, ఐటీ, పవర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ 3-1.5% మధ్య పురోగమించాయి. ఇక నిఫ్టీ కూడా 81 పాయింట్లు ఎగసి 7,684 వద్ద నిలిచింది. ఉక్రెయిన్, గాజాలలో ఆందోళనలు ఉపశమించడం, ముడిచమురు ధరలు క్షీణించడం, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్పిరిటో శాంటో యాజమాన్య నిర్వహణను పోర్చుగీస్ కేంద్ర బ్యాంక్ చేపట్టడం వంటి అంశాలు అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంట్‌ను మెరుగుపరచాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. డాలరుతో మారకంలో బలహీనపడ్డ రూపాయి ఐటీ షేర్లకు జోష్‌నివ్వగా, ఆర్బీఐ పాలసీ సమీక్ష, జూలై నెలలో పుంజుకున్న వాహన విక్రయాల నేపథ్యంలో ఆటో, క్యాపిటల్ గూడ్స్ తదితర రంగాల షేర్లకు ప్రోత్సాహం లభించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. 5 మాత్రమే: సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ ద్వయం, భారతీ, సిప్లా మాత్రమే అదికూడా 1%లోపు నష్టపోయాయి. మిగిలిన బ్లూచిప్స్‌లో ఇన్ఫోసిస్ దాదాపు 4% జంప్‌చేయగా, హిందాల్కో, సెసాస్టెరిలైట్, విప్రో, మారుతీ, భెల్, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, ఐటీసీ, ఐసీఐసీఐ 3-1% మధ్య లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు రూ. 373 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 251 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సిండికేట్ బ్యాంక్ 7% డౌన్: లంచం పుచ్చుకున్న నేరానికి చైర్మన్ ఎస్కే జైన్‌ను సీబీఐ అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపడంతో సిండికేట్ బ్యాంక్ షేరు 7% పతనమై రూ. 134 వద్ద ముగిసింది. ఈ కేసుతో సంబంధమున్న ప్రకాష్ ఇండస్ట్రీస్ షేరు 20% కుప్పకూలగా, భూషణ్ స్టీల్ 3.5% నష్టపోయింది. ట్రేడైన షేర్లలో 1,810 పుంజుకోగా, 1,108 మాత్రమే నష్టపోయాయి. -
మార్కెట్ క్రాష్
* అంతర్జాతీయ పరిణామాలతో భారీగా పడిన సూచీలు * సెన్సెక్స్ 414, నిఫ్టీ 119 పాయింట్లు పతనం * 26,000 దిగువకి సెన్సెక్స్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీ కోత ప్రణాళికలు, రుణాల చెల్లింపులో అర్జెంటీనా డిఫాల్టు కావడం తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ మార్కెట్లలో కలకలం రేపాయి. ఆ ప్రభావం దేశీ మార్కెట్లు, రూపాయిపైనా పడింది. అమ్మకాలు వెల్లువెత్తడంతో కీలక సూచీలు కుప్పకూలాయి. రూపాయి మూడు నెలల కనిష్టానికి పడిపోగా.. మార్కెట్లు మూడు వారాల్లో తొలిసారి అత్యధిక స్థాయి నష్టాలను నమోదు చేశాయి. శుక్రవారం సెన్సెక్స్ ఏకంగా 414 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పతనమయ్యాయి. మూడు వారాల కాలంలో సూచీలు ఇంత పెద్ద యెత్తున క్షీణించడం ఇదే ప్రథమం. జూలై 8న సెన్సెక్స్ 518 పాయింట్లు పడిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా సెన్సెక్స్ కీలకమైన 26,000 పాయింట్ల దిగువకి పడిపోయింది. యూరోజోన్ గణాంకాలు బలహీనంగా ఉండటం, అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిందన్న వార్తలతో ఆసియా దేశాల సూచీలు నష్టపోయాయి. అటు యూరప్‌లో సూచీలు కూడా 1.5-2 శాతం నష్టాలతో ట్రేడయ్యాయి. క్రితం ముగింపుతో పోలిస్తే శుక్రవారం బలహీనంగానే ప్రారంభమైన సెన్సెక్స్.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ద్వితీయార్థంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. చివరికి 1.6 శాతం పతనంతో 25,480.84 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 1.54 శాతం క్షీణతతో 7,602.60 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. రైల్వే బడ్జెట్ సమర్పించిన మర్నాడు జూలై 8న నిఫ్టీ అత్యధికంగా 163.95 పాయింట్లు నష్టపోయింది. ఆర్థిక అక్షరాస్యతపై ఎన్ఎస్ఈ టీవీ ప్రోగ్రాం చిన్న పట్టణాల్లో నివసించే వారిలో ఆర్థికాంశాలపై అవ గాహన పెంచే దిశగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ), అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్చేంజేస్ మెంబర్స్ (ఎఎన్ఎంఐ) సంయుక్తంగా టీవీ కార్యక్రమాన్ని రూపొందించాయి. ‘సమృద్ధి కీ పాఠశాల’ పేరిట 26 ఎపిసోడ్స్‌ను తయారు చేశాయి. ఆగస్టు 2 నుంచి ప్రతి శనివారం ఉదయం 8.30 గం.లకు దూరదర్శన్‌లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుందని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. లిస్టెడ్ సంస్థలపై కన్నేసి ఉంచండి : స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ ఆదేశం ముంబై: లిస్టింగ్ నిబంధనలు, గుడ్ గవర్నెన్స్ నిబంధనల ఉల్లంఘన ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలపై ఒక కన్నేసి ఉంచాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. స్టాక్ ఎక్స్చేంజీలను ఆదేశించింది. వార్షిక సర్వ సభ్య సమావేశాల నిర్వహణ సహా ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించాలని శుక్రవారం జారీచేసిన ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. షేర్హోల్డర్లు లక్ష పైగా ఉన్నా, వారికి కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశమివ్వకుండా పలు లిస్టెడ్ గ్రూప్ కంపెనీల్లోని సంస్థలు కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏజీఎంలను ముగించేస్తున్న ఉదంతాలు తమ దృష్టికి వచ్చినట్లు సెబీ తెలిపింది. ఈయూ సంస్థలతో ఒప్పందం.. ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌కి (ఏఐఎఫ్) సంబంధించి యూరోపియన్ యూనియన్‌లో భాగమైన 27 స్టాక్‌మార్కెట్స్ నియంత్రణ సంస్థలతో సెబీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా నియంత్రణ సంస్థలు.. ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ మేనేజర్ల పర్యవేక్షణ సమాచారాన్ని ఇచ్చి.. పుచ్చుకునేందుకు, పరస్పరం సహకరించుకునేందుకు, ఏఐఎఫ్‌లను నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. -
బంగారం వెలవెల..సెన్సెక్స్ మిలమిల!
2014లో మార్కెట్ లో బంగారంపై పైచేయి భారత ఈక్వీటిలు సాధించింది. మార్కెట్ లో బంగారం ధర 5 శాతం క్షీణించడంతో ప్రస్తుతం సంవత్సరంలో ఈక్విటీలపై 23 శాతం లాభాల్ని ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నారు. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 22.76 శాతం వృద్ధిని ఇన్వెస్టర్లకు అందించించింది. విదేశీ నిధుల ప్రవాహం, దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగ్గా ఉండటంతో భారత ఈక్వీటీలు మంచి వృద్ధిని సాధించాయి. సాధారణంగా ఈక్వీటీలు జోరుమీదున్నప్పుడు బంగారం ధరలు తగ్గడం సాధారణంగా జరుగుతుంటాయి. 2013 డిసెంబర్ 31 తేదిన 10 గ్రాముల బంగారం ధర 29800, వెండి ధర కేజీకి 43755 వేలు. అయితే క్రితం ముగింపులో బంగారం 28370 వద్ద, వెండి 44800 వద్ద ముగిసింది. గత డిసెంబర్ లో సెన్సెక్స్ 21,170 పాయింట్లను నమోదు చేసుకోగా, ప్రస్తుతం జీవితకాలపు గరిష్ట స్థాయిని 26300 నమోదు చేసుకుని గత శుక్రవారం 25,991 వద్ద స్థిరపడింది. -
మార్కెట్లకు ఐటీ షేర్ల ఊతం
ఐటీ స్టాక్స్ తోడ్పాటుతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 25,641.56 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 7,663.90 వద్ద ముగిశాయి. రెండు సూచీలూ రెండు వారాల గరిష్టంలో ముగిశాయి. మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం కూల్చివేత ఘటనతో రాజకీయమైన పరిణామాలపై ఆందోళన కారణంగా శుక్రవారం ఆసియా మార్కెట్లు బలహీనపడటం దేశీ మార్కెట్లపైనా ప్రభావం చూపింది. దీంతో, దేశీ మార్కెట్లూ బలహీనంగా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టమైన 25,713 స్థాయిని కూడా తాకినా చివరికి 0.31 శాతం లాభంతో ముగిసింది. క్రితం రోజు ఐటీ దిగ్గజం టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించడంతో ఐటీ స్టాక్స్ బాగా లాభపడ్డాయి. టీసీఎస్ 2.58 శాతం, విప్రో 1.83 శాతం, ఇన్ఫోసిస్ 0.31 శాతం లాభాలు నమోదు చేశాయి. అటు బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సంస్థల షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. అయితే, ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తున్న స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 617 పాయింట్లు పెరిగినట్లయింది. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, వర్షపాతం మెరుగవుతుండటం వల్ల అధిక ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖం పడుతుండటం వంటివి ఇందుకు దోహదపడినట్లు కోటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింటు గ్రూప్ రీసెర్చ్ దీపేన్ షా తెలిపారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 574 కోట్ల కొనుగోళ్లు జరపగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 283 కోట్ల మేర విక్రయించారు. రూ. 5,000 కోట్ల సమీకరణలో హిందాల్కో న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ తాజాగా రూ. 5,000 కోట్ల మేర నిధులను సమీకరించనుంది. సంస్థలకు ఈక్విటీ షేర్లు, బాండ్లు జారీ ద్వారా గానీ లేదా ఇతర మార్గాల్లో గానీ సమీకరించే ప్రతిపాదనను డెరైక్టర్ల బోర్డు ఆమోదించిందని కంపెనీ తెలిపింది. ఆగస్టు 14న జరిగే సమావేశంలో దీనికి షేర్‌హోల్డర్ల అనుమతి పొందనున్నట్లు వివరించింది. హిందాల్కో ప్రధానంగా అల్యూమినియం, కాపర్ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద అల్యూమినియం రోలింగ్ కంపెనీ ఇది. -
ఫలితాలు, ఎఫ్ఐఐలపైనే దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారంలో కీలకమైన ఆర్థిక గణాంకాలేవీ వెలువడే అవకాశం లేనందున త దుపరి త్రైమాసిక ఫలితాలపైనే ఇన్వెస్టర్లు దృష్టిపెట్టే అవకాశమున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వారంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ, లుపిన్, గ్లెన్‌మార్క్ ఫార్మా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ కన్జూమర్, ర్యాన్‌బాక్సీ ఉన్నాయి. కాగా, ఫలితాలతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరును కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని తెలిపారు. గత కొన్ని నెలలుగా ర్యాలీ బాటలో సాగిన దేశీ మార్కెట్లు ప్రస్తుతం కొంతమేర వెనకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సార్వత్రిక ఎన్నికలు ఒక కారణంగా, వివిధ దిగ్గజాల మిశ్రమ ఫలితాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ నెల 16న వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రస్తుతం వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారని చెప్పారు. ఇదే తీరు కొనసాగవచ్చు మార్కెట్లలో గత వారం కనిపించిన అమ్మకాల ధోరణి ఈ వారం కూడా కొనసాగవచ్చునని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. అయితే అంతర్గతంగా సెంటిమెంట్ సానుకూలంగానే ఉన్నదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం మార్కెట్లు వేచిచూస్తున్నాయని వివరించారు. గత కొద్ది వారాల్లో వచ్చిన పటిష్ట ర్యాలీ కారణంగా గరిష్ట స్థాయిలవద్ద కొంతమేర స్థిరీకరణ జరిగే అవకాశముందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు నిధి సరస్వత్ పేర్కొన్నారు. నిఫ్టీ 6,500-6,850 రానున్న రోజుల్లో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 6,500-6,850 పాయింట్ల మధ్య కదిలే అవకాశమున్నదని సరస్వత్ అంచనా వే శారు. ఎన్నికల ఫలితాలు మార్కెట్లను భారీ ఒడిదుడుకులకు లోనుచేస్తాయని చెప్పారు. మొత్తంగా ట్రెండ్ సానుకూలంగానే ఉన్నదని, కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తారని అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ అంశాలవైపు చూస్తే... యూఎస్ ఉద్యోగ గణాంకాలు సోమవారం ట్రేడింగ్‌పై ప్రభావం చూపవచ్చునని అత్యధిక శాతం మంది నిపుణులు పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో కొత్తగా 2,88,000 ఉద్యోగాలు జతకాగా, నిరుద్యోగ రేటు 6.3%కు తగ్గింది. ఏప్రిల్‌లో రూ. 9,000 కోట్లు దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల పెట్టుబడులివి న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు, ఫలితంగా సంస్కరణలు వేగమందుకుంటాయన్న ఆశలు ఎఫ్ఐఐలకు ప్రోత్సాహమిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఏప్రిల్ నెలలోనూ ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్‌లో 160 కోట్ల డాలర్లు (రూ. 9,600 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. తద్వారా వరుసగా ఎనిమిదో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. గత ఆగస్ట్‌లో ఎఫ్ఐఐలు నికరంగా రూ. 5,923 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాక ప్రతీ నెల నికరంగా ఇన్వెస్ట్ చేస్తూనే రావడం విశేషం! కాగా, ఏప్రిల్‌లో రుణ సెక్యూరిటీలలో ఎఫ్ఐఐలు నికరంగా రూ. 9,185 కోట్ల అమ్మకాలు చేపట్టారు.