సెన్సెక్స్ కంపెనీల్లో ఎఫ్‌ఐఐల రికార్డు పెట్టుబడులు
న్యూఢిల్లీ: లాభాల దూకుడు చూపుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు సైతం పుంజుకుంటున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్ ముగిసేసరికి సెన్సెక్స్ షేర్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు 27%కు చేరుకున్నాయి. ఇది సరికొత్త రికార్డుకాగా, జూన్ క్వార్టర్ చివరికి ఇవి 22.5%గా నమోదయ్యాయి. ఈ వివరాలను గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ మెరిల్‌లించ్ ఒక నివేదికలో వెల్లడించింది.
ఎఫ్‌ఐఐలు అత్యధిక స్థాయిలో పెట్టుబడులకు దిగిన రంగాల జాబితాలో సాఫ్ట్‌వేర్, ఇంధనం చోటు చేసుకున్నాయి. ఇంధన సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ షేర్లను ఎఫ్‌ఐఐలు కొనుగోలు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఇక కన్జూమర్, టెలికాం, ఫైనాన్షియల్ రంగాలు సైతం ఎఫ్‌ఐఐలకు ఫేవరెట్‌గా నిలిచినట్లు పేర్కొంది.