మిశ్రమంగా స్పందిస్తున్న స్టాక్‌మార్కెట్లు | Indian equities fall after RBI reduces key lending rates | Sakshi
Sakshi News home page

మిశ్రమంగా స్పందిస్తున్న స్టాక్‌మార్కెట్లు

Published Wed, Aug 2 2017 3:13 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

Indian equities fall after RBI reduces key lending rates

ముంబై:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా   కీలకమైన వడ్డీరేట్లను తగ్గించడంతో స్టాక్‌మార్కెట్లు నెగిటివ్‌గా స్పందించినా మళ్లీ పుంజుకుని మిశ్రమంగా మారాయి. ఆరంభంనుంచి ఊగిసలాటల మధ్య ఉన్నప్పటికీ కీలక వడ్డీరేట్లలో 0.25 శాతం తగ్గింపును ప్రకటించడంతో మార్కెట్లలో నష్టాలు  పెరిగాయి.  ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్‌  నష్టాల్లోకి జారుకుంది. కీలకమైన సాంకేతిక స్థాయి 25వేలకు  ఎగువన ఉన్నప్పటికీ, స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది.   ఒకదశలో సెన్సెక్స్‌ 100 పాయింట్లు క్షీణించి 32, 301 నిఫ్టీ  31 పాయింట్ల నష్టంతో 10,083 స్తాయికి మళ్లాయి.  అనంతరం దాదాపు 50 పాయింట్లు రికవరీ అయ్యాయి.   బ్యాంక్‌ నిఫ్టీ కూడా నష్టాలను తగ్గించుకుంది. ఎస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓన్‌జీసీ నష్టాల్లోనూ సన్‌టీవీ, బయోకాన్‌, వోల్టాస్‌ లాభాల్లోను కొనసాగుతున్నాయి.  అయితే  టైర్‌ షేర్లు టాప్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి.  అయితే అశ్వినీ గుజ్రాల్‌ లాంటి ఎనలిస్టులు మాత్రం మార్కెట్‌  పటిష్టంగా ఉందని  వ్యాఖ్యానించారు.

2017-18లో తన మూడవ నెలవారీ ద్రవ్య విధాన సమీక్షలో అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు అంచనా వేసినట్టుగా  రిజర్వ్‌ బ్యాంక్‌   బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూలో కీలక వడ్డీ రేట్లలో పావు శాతం చొప్పున కోత పెట్టింది.రెపో రేటులో 25 బేసిస్‌ పాయింట్లు (పావు శాతం) కోత పెట్టడంతో ప్రస్తుత  రేటు 6 శాతానికి చేరింది.   రివర్స్‌ రెపోలోనూ 0.25 శాతం  కట్‌ చేయడంతో ఇది 5.75 శాతానికి దిగి వచ్చింది.    అలాగే  ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేటు  6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement