high
-
అదీ గ్లాస్ బ్రిడ్జ్..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!!
ఎత్తయిన కొండ అంచున వాక్ వే .. అదీ గ్లాస్ బ్రిడ్జ్! రెయిలింగ్ నుంచి పక్కకు చూసినా.. నడుస్తూ కిందకు చూసినా.. గుండె జారిపోయే దృశ్యమే! ఇదేదో థ్రిల్లర్ మూవీలో సీన్ అనుకునేరు! చైనాలోని పర్యాటక ప్రాంతం. పేరు.. ఝాంగ్జాజే నేషనల్ ఫారెస్ట్ పార్క్!చైనాలో యునెస్కో గుర్తించిన ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్! భలే ఉంది కదా! చూడాలని మనసు ఉవ్విళ్లురుతోంది సరే... హార్ట్ బీట్‌ని కంట్రోల్లో పెట్టుకుని మరీ ఆ బ్రిడ్జి ఎక్కండి!ఇవి చదవండి: తొలి సజీవ కంప్యూటర్ని.. మీరెప్పుడైనా చూశారా!? -
37 నగరాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
దేశంలోని ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. 37 నగరాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్‌లోని ఫలోడి వరుసగా రెండో రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 49.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతకు ముందురోజు ఇక్కడి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఢిల్లీలోని ఎనిమిది చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యాయి. ముంగేష్పూర్, నజఫ్‌గఢ్‌లలో వరుసగా 48.3 డిగ్రీల సెల్సియస్, 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నాల్లో 47 డిగ్రీల సెల్సియస్, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాజస్థాన్‌లోని బార్మర్‌లో 49 డిగ్రీల సెల్సియస్, బికనీర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్, జైసల్మేర్‌లో 48.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని అకోలా, యవత్మాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.2 డిగ్రీల సెల్సియస్, 46.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మే 29 వరకు వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. -
RBI Governor Shaktikanta Das: అధికరేటు ఎప్పటివరకో... కాలమే చెప్పాలి
న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు కొంతకాలం అధిక స్థాయిలోనే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎంతకాలం ఈ స్థితి కొనసాగుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్, 2023లో ఆయన ఈ మేరకు ఒక ప్రసంగం చేస్తూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి సెంట్రల్ బ్యాంక్ జాగరూకతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ‘ఏకాగ్రతకు సంబంధించి అర్జునిడి కన్ను’’తో పోల్చారు. భారత్‌లో ద్రవ్యోల్బణానికి సంబంధించి ‘అంతర్జాతీయ ఇంధన ధరలే’ ప్రధాన సవాలుగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్–గాజా సంఘర్షణ అమెరికాసహా ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లోనూ భారత్ పటిష్ట ఆర్థిక పరిస్థితులను కలిగి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. భారత్ రూపాయి విలువ డాలర్ మారకంలో తీవ్ర ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రూ. 2,000 నోట్లు తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలో రూ. 10,000 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ మొత్తం కూడా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇదిలావుండగా, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని గవర్నర్ నేతృత్వంలో ఈ నెల మొదట్లో జరిగిన ఆరుగురు సభ్యుల ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయించినట్లు ఆ భేటీకి సంబంధించి తాజాగా వెలువడిన మినిట్స్ పేర్కొంది. ఫిబ్రవరి తర్వాత వరుసగా నాలుగు సమీక్షా సమావేశాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై రాజీలేని వైఖరి అవలంభిస్తామని తద్వారా కమిటీ స్పష్టం చేస్తోంది. -
చలికాలంలో భగభగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవి కాలం మాదిరి నమోదవుతున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. ఇంకా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనప్పటికీ సాధారణంగా ఈపాటికి వాతావరణం చల్లబడుతుంది. కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. సగటున 3–5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవి సీజన్‌ను తలపిస్తోంది. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతుండగా.. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటుండటంతో ఉష్ణోగ్రతలు సైతం అధికంగా నమోదవుతున్నాయి. మరో వారం ఇంతే... రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినప్పటికీ... తిరోగమన ప్రక్రియ చివరి దశలో ఉంది. మరో మూడు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వారం రోజులకు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో వాతావరణంలో మార్పులు ఉంటాయని, దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉషోగ్రతలను పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.2 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత అత్యల్పంగా మెదక్‌లో 18.3 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, భద్రాచలంలో 3.5 డిగ్రీలు, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, హనుమకొండలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడివాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
సెప్టెంబర్‌లో సేవల రంగం భేష్ - 13 సంవత్సరాల్లో ఇదే గరిష్టం!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం సెప్టెంబర్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టులో 60.1 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 61కి ఎగసింది. గడచిన 13 సంవత్సరాల్లో ఈ స్థాయికి ఎప్పుడూ ఇండెక్స్ పెరగలేదు. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త బిజినెస్, ఉపాధి అవకాశాలు సేవల రంగానికి దన్నుగా ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. బిజినెస్ ఆశావహ దృక్పదం మెరుగుపడుతోందని కూడా ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల రంగం సూచీ వరుసగా 26 నెలల నుంచీ వృద్ధి బాటన కొనసాగుతోంది. దాదాపు 400 మంది సేవల రంగ కంపెనీల ప్రతినిధుల ప్యానల్‌కు పంపిన ప్రశ్నలకు సమాధానాల ప్రాతిపదికన ఈ సూచీ కదలికలు ఉంటాయి. సేవలు, తయారీ కలిపినా సానుకూలమే.. కాగా, సేవలు, తయారీ రంగాలతో కూడిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఆగస్టులో 60.9 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 61కి ఎగసింది. గడచిన 13 సంవత్సరాల్లో చూస్తే, సెప్టెంబర్‌లో భారత్ వస్తు, సేవలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ తరహా పరిస్థితి ఈ 13 సంవత్సరాల కాలంలో ఇది రెండవసారి. కాగా, ఒక్క తయారీ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 58.6 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో ఐదు నెలల కనిష్టస్థాయి 57.5కు పడింది. ఈ రంగానికి సంబంధించి సెప్టెంబర్‌లో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి నెమ్మదించినట్లు పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్లో కొనుగోలు చేసే మేనేజర్లకు పంపిన ప్రశ్నాపత్రాల ప్రతిస్పందనల ప్రాతిపదికన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ మదింపు జరుగుతుంది. నేడు ఆర్బీఐ కీలక పాలసీ నిర్ణయాలు మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడురోజుల కీలక ద్వైమాసిక సమావేశాలు నేటితో (6వ తేదీ) ముగుస్తున్నాయి. ఈ భేటీ కీలక నిర్ణయాలను గవర్నర్ మీడియాకు శుక్రవారం వెల్లడిస్తారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ ఈ సమావేశాల్లో కూడా యథాతథంగా 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా నాలుగు ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథ రేటును కొనసాగించినట్లు అవుతుంది. -
ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్!
ఐఫోన్లు (iPhone), పలు ఇతర యాపిల్ (Apple) ఉత్పత్తులకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హై సివియారిటీ వార్నింగ్ ఇచ్చింది. పలు ఉత్పత్తుల్లో సాఫ్ట్వేర్లు సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఫోన్లు, యాపిల్ మ్యాక్‌లు, వాచ్‌లు, ఐపాడ్లలో ఉపయోగిస్తున్న పలు వర్షన్ల సాఫ్ట్వేర్లు సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందని సెర్ట్ఇన్ గుర్తించింది. ఆయా సాఫ్ట్వేర్లు టార్గెటెడ్ సిస్టమ్‌పై ఆర్బిటరీ కోడ్ అమలు చేయడానికి, భద్రతా పరిమితులను చేధించడానికి అటాకర్కు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రభావిత సాఫ్ట్వేర్లు ఇవే.. Apple macOS Monterey 12.7కి ముందు వెర్షన్లు Apple macOS Ventura సంస్కరణలు 13.6కి ముందు వెర్షన్లు Apple watchOS 9.6.3కి ముందు వెర్షన్లు Apple watchOS 10.0.1కి ముందు వెర్షన్లు Apple iOS 16.7కి ముందు వెర్షన్లు, iPadOS 16.7కి ముందు వెర్షన్లు Apple iOS 17.0.1కి ముందు వెర్షన్లు iPadOS 17.0.1కి ముందు ఉన్న వెర్షన్లు Apple Safari 16.6.1కి ముందు ఉన్న వెర్షన్లు సెక్యూరిటీ కాంపోనెంట్లో సర్టిఫికేట్ ధ్రువీకరణ, కెర్నల్, వెబ్‌కిట్ కాంపోనెంట్లో సమస్యల కారణంగా యాపిల్ ఉత్పత్తులలో సైబర్ దాడికి అవకాశాలు ఉన్నట్లు సెర్ట్ఇన్ పేర్కొంది. ప్రత్యేకంగా రూపొందించిన అభ్యర్థనను పంపడం ద్వారా ఈ అవకాశాలను అటాకర్ ఉపయోగించుకోవచ్చని హెచ్చరించింది. ఆయా వెర్షన్లకు ముందున్న సాఫ్ట్వేర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. (ఐఫోన్ 15పై అప్పుడే వెల్లువెత్తిన కంప్లైంట్లు..) -
టమాట భగ్గు:15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం
Retail inflation at 15 month high in July వినియోగదారుల ధరల సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా టమాట ధరలు భగ్గుమనడంతోపాటు పాటు ఇతర కూరగాయల ధర సెగతో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎగబాకిందని , ఈ ఒత్తిడిమరి కొంతకాలం కొనసాగ వచ్చని భావిస్తున్నారు. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడంతో జూలైలో 4.87 శాతం 15 నెలల గరిష్ట స్థాయికి చేరింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం జూలైలో 11.51శాతానికి పెరిగింది, అయితే ఫుడ్ అండ్ బేవరేజెస్ ద్రవ్యోల్బణం 10.57శాతానికి పెరిగింది. కూరగాయల రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ప్రతి ద్రవ్యోల్బణం -0.93శాతం నుండి గత నెలలో 37.34శాతాకి పెరిగింది. (SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ ఎండీకి భారీ షాక్!) వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఆ చిల్లర ద్రవ్యోల్బణాన్ని లెక్కగడతారు. జులైలో ఒక్కసారిగా పైకెగబాకడానికి కారణం టమాటాలు, ఇతర కూరగాయల ధరలు భగ్గుమనడమేనని డేటా పేర్కొంది. 2022 ఏప్రిల్ మాసంలో 7.79 శాతంగా నమోదైంది. -
అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ టెక్ కంపెనీ సీఈవోలు వీరే.. (ఫొటోలు)
-
వెరైటీ వెడ్డింగ్ పార్టీ.. చూస్తేనే గుండె గుబుల్..!
పెళ్లిరోజు మరుపురాని రోజు. అంతే ప్రత్యేకంగా గుర్తుండిపేయేలా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. మంచి దుస్తులు ధరిస్తారు. రొమాంటిక్ సెటప్ చేసుకుని పార్టీ చేసుకుంటారు. మరికొందరు సాంప్రదాయానికి ప్రముఖ్యతనిస్తారు. కానీ మనం తేలుసుకోబోయే జంట మాత్రం తమ వెడ్డింగ్ రోజునే సాహసాలు చేశారు. వెడ్డింగ్‌కి వచ్చిన బంధువులతో ఈ విన్యాసాలు చేశారు. వీడియో ప్రకారం.. పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తె ఇద్దరు వెడ్డింగ్ డ్రస్‌లో ఉన్నారు. అది చూడటానికే భయంకరమైన లొకేషన్లా ఉంది. లోతైన లోయలో స్కై డైవింగ్ చేస్తూ హౌరా..! అనిపించారు. ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే పేర్లు గల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అదే రోజున థ్రిల్లింగ్ కోసం ఇలా సాహసాలు చేశారు. రయ్.. రయ్ మంటూ రివ్వున లోయలోకి దూసుకెళ్లారు. ఈ వీడియోను తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by La libreta morada | Mariana (@lalibretamorada) ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇంత భయంకరమైన స్కై డైవింగ్ పెళ్లి రోజునే ఎందుకు బ్రో అంటూ కామెంట్లు పెట్టారు. 'జర భద్రం ర అయ్యా..!' అంటూ మరికొందర ఫన్నీగా కామెంట్లు పెట్టారు. కొత్తజంట సాహసాలు మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్ -
రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్ డిపాజిట్లు
ముంబై: ఆర్బీఐ రూ.2,000 నోటును ఉపసంహరిస్తున్నట్టు చేసిన ప్రకటన బ్యాంక్ డిపాజిట్లు భారీగా పెరిగేందుకు దారితీసింది. బ్యాంక్ డిపాజిట్లు ఆరేళ్ల గరిష్టానికి చేరి, జూన్ 30 నాటికి 191.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యవస్థలో రూ.2,000 నోటు రూపంలో మొత్తం రూ.3.62 లక్షల కోట్లు చెలామణిలో ఉండగా, ఇందులో 75 శాతానికి పైగా బ్యాంక్‌లోకి తిరిగొచ్చినట్టు ఈ నెల మొదట్లో ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం. అంటే రూ.2.7 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు కేవలం రూ.2,000 నోటు రూపంలోనే వచ్చినట్టు తెలుస్తోంది. ఏడాదిలో చూసుకుంటే బ్యాంక్ డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.191.6 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. 2017 మార్చి తర్వాత ఇదే గరిష్ట స్థాయి అని చెప్పారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగడం, రూ.2,000 నోటు ఉపసంహరణ ఇందుకు మద్దతుగా నిలిచినట్టు తెలిపారు. డిపాజిట్లు, రుణాల మధ్య వ్యత్యాసం 3.26 శాతం మేర జూన్ 30తో ముగిసిన పక్షం రోజుల్లో తగ్గింది. మరోవైపు రుణాల్లో వృద్ధి 16.2 శాతంగా ఉంది. ఇదీ చదవండి ➤ IT Dept clarification on PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ జూన్ 30తో ముగిసిన పక్షం రోజుల్లో రూ.143.9 లక్షల కోట్లకు రుణాలు పెరిగాయి. వ్యక్తిగత రుణాలు, ఎన్బీఎఫ్సీ, వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రుణ వితరణలో వృద్ధి 14.5 శాతంగానే ఉంది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాల (పీఎల్ఐ) మద్దతుతో మూలధన వ్యయాలు పెరుగుతుండడం, ఇక ముందూ రుణాలకు డిమాండ్‌ను నడిపిస్తుందని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. 2023–24లో 13–13.5 శాతం వృద్ధి చెందొచ్చని పేర్కొంది. -
WTC ఫైనల్ కోహీ VS గిల్
-
ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ(2–19) నికరంగా రూ. 30,945 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇందుకు ప్రధానంగా దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, వడ్డీ రేట్లు వెనకడుగు వేయనున్న అంచనాలు, సానుకూల కార్పొరేట్ ఫలితాలు, స్టాక్స్ విలువలు దిగివస్తుండటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం మే నెల పెట్టుబడులను కలుపుకుంటే ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 16,365 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో రూ. 11,630 కోట్లు, మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినప్పటికీ.. జనవరి, ఫిబ్రవరిలలో రూ. 34,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ నెలలో రుణ సెక్యూరిటీలలో ఎఫ్‌పీఐలు రూ. 1,057 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదీ చదవండి: Rs 2000 Note Withdrawn: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత.. కీలక విషయాలు వెల్లడి -
పండుగ పూట పసిడి ప్రియులకు షాక్, రికార్డు ధర
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచ మాంద్యం భయాల నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దేశీయమార్కెట్లో పసిడి ధర రూ. 56,200 దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ 1,898 డాలర్లు, వెండి ఔన్స్ 23.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం బంగారం ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుందనిహెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. తద్వారా ఆగస్టు 2020లో రూ. 56,191 నమోదైన మునుపటి రికార్డును అధిగమించింది. రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ 10 గ్రాముల ధర రూ.121 పెరిగి రూ.56,236కి చేరుకుంది. ఈ రోజు (జనవరి 13) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 220 ఎగిసి రూ. 56,290 స్థాయికి చేరింది. వెండి ధర కూడా ఇదే బాటలో ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారం రూ.56,290గా ఉంది. కిలో వెండి ధర 74వేల రూపాయలుగా ఉంది. బెంగళూరులో రూ.56,340కి వద్ద ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,250 గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ (మధ్యాహ్నం 3 గంటలకు) 10 గ్రాములు, దాదాపు 0.50 శాతం రూ. 56,140 పలికింది. బలహీనమైన డాలర్, అమెరికాలో ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు నెమ్మదించవచ్చనే అంచనాలు పసిడికి బలాన్నిస్తున్నాయి. డిసెంబర్లో యూఎస్ వినియోగదారుల ధరలు తగ్గడంతో రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్ట వచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
-
కొనకుండానే పేలుతున్న టపాకాయలు..!
-
హై క్యాష్ ట్రాన్సాక్షన్స్: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ విషయాలు మర్చిపోతే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ నిర్దిష్ట పరిమితికి మించి జరిపే నగదు లావాదేవీలపై ఒక కన్నేసి ఉంచుతుంది. పరిమితికి మించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే, ఐటీ శాఖ నుంచి నోటీసులు రావచ్చు. ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో చేసే ట్రాన్సాక్షన్స్‌పై ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్‌లో తప్పకుండా సమచారాన్ని అందించాలి. లేదంటే ఐటీ అధికారుల నుండి నోటీసులొచ్చే అవకాశం ఉంది. అలా నోటీసులు రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ సమాచారాన్ని ఐటీఆర్ ఫైలింగ్‌లో తెలియజేయాలి. అధిక-విలువ లావాదేవీలకు సంబంధించి వ్యక్తుల రికార్డులను యాక్సెస్ నిమిత్తం ఐటీ శాఖ అనేక ప్రభుత్వ సంస్థలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యంగా బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ఆస్తి సంబంధిత లావాదేవీలు, షేర్ మార్కెట్ పెట్టుబడులు సహా అధిక-విలువ నగదు లావాదేవీలపై ఐటీ విభాగం నిఘా ఉంచుతుంది. లావాదేవీలు థ్రెషోల్డ్ పరిమితిని మించి ఉంటే సమాచారాన్ని ఐటీఆర్ ఫైలింగ్‌లో పొందుపరచాలి. టాప్ 5 హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవో చూద్దాం. సేవింగ్స్ అకౌంట్ క్యాష్ డిపాజిట్ లిమిట్ ఒక వ్యక్తికి రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ తమ ఖాతాలో పరిమితికి మించి డిపాజిట్ చేస్తే.. నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అలాగే కరెంట్ అకౌంట్ లిమిట్‌ను రూ. 50 లక్షలు. ఈ పరిమితి దాటితే ఆదాయ పన్ను శాఖ నోటీసు ఇచ్చి వివరణ కోరవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు ఆదాయపు పన్ను శాఖ అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు నగదు రూపంలో చెల్లించే క్రెడిట్ కార్డ్ బిల్ పరిమితి రూ.1 లక్షగా ఉంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లావాదేవీల పరిమితి దాటితే ఐటీకి సమాచారం అందించాలి. లేదంటే నోటీసులు తప్పవు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఎఫ్డీలలో 10 లక్షలకు మించిన నగదు డిపాజిట్లపై ఐటీ విభాగానికి తెలియజేయాలి. ఫారమ్ 61Aని ఫైల్ చేయడం ద్వారా సింగిల్ లేదా మల్టిపుల్ ఫిక్స్డ్ డిపాజిట్లలో డిపాజిట్ చేసిన మొత్తం నిర్దిష్ట పరిమితికి మించి ఉంటే బ్యాంకులు లావాదేవీలను బహిర్గతం చేయాలి స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు దేశంలోని అన్ని ప్రాపర్టీ రిజిస్ట్రార్లు, సబ్-రిజిస్ట్రార్ వద్ద రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఏదైనా స్థిరాస్తిని విక్రయించడం లేదా కొనుగోలు చేయడం గురించి పన్ను అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు, బాండ్లు మ్యూచువల్ ఫండ్లు, స్టాక్‌లు, బాండ్లు లేదా డిబెంచర్లలో పెట్టుబడులకు సంబంధించిన నగదు లావాదేవీల పరిమితి ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించకూడదు. -
మెరిసిన ‘తెల్ల బంగారం’.. కిలో ఎంతంటే
సాక్షి, జడ్చర్ల (మహబూబ్‌నగర్): బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో తెల్ల బంగారం ఒక్కసారిగా మెరిసిపోయింది. యార్డు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బుధవారం రికార్డు స్థాయి ధర లభించింది. ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.6,025 మద్దతు ధర ప్రకటించగా.. ఏకంగా గరిష్టంగా రూ.8,829 పలికింది. కనిష్టంగా రూ.6,830 ధర లభించింది. కనిష్ట ధరలు కూడా మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడం విశేషం. బాలానగర్ మండలం చిన్నరేవల్లికి చెందిన రైతు శ్రీను తీసుకొచ్చిన పత్తికి అత్యధిక ధర వచ్చింది. ఇక మిగిలిన పంట ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఆర్ఎన్ఆర్ ధాన్యానికి గరిష్టంగా రూ.2,009 ధర రాగా, కనిష్టంగా రూ.1,409 పలికింది. హంసకు గరిష్టంగా రూ.1,679, కనిష్టంగా రూ.1,409, మొక్కజొన్నకు గరిష్టంగా రూ.1,810, కనిష్టంగా రూ.1,552, రాగులకు రూ.2,562, కందులకు గరిష్టంగా రూ.5,829, కనిష్టంగా రూ.5,014, ఆముదాలకు గరిష్టంగా రూ.5,400, కనిష్టంగా రూ.5,249 ధరలు కేటాయించారు. కిటకిటలాడిన మార్కెట్ పంట దిగుబడుల క్రయవిక్రయాలతో బాదేపల్లి మార్కెట్ కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి 1,922 బస్తాల పత్తి యార్డుకు విక్రయానికి వచ్చింది. అదేవిధంగా 2,200 బస్తాల ధాన్యం, 881 బస్తాల మొక్కజొన్న, 365 బస్తాల వేరుశనగ, 271 బస్తాల కందులు విక్రయానికి వచ్చింది. మరోవైపు రైతులకు ఆశించిన ధరలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల యార్డుకు 1,180 క్వింటాళ్ల వేరుశనగ గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 1180 క్వింటాళ్ల వేరుశనగ రాగ, క్వింటాలుకు గరిష్టం రూ. 8174, కనిష్టం రూ. 4866, సరాసరి రూ.7200 ధరలు వచ్చాయి. 3 క్వింటాళ్ల ఆముదం రాగా, క్వింటాలుకు గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 4510 ధరలు పలికాయి. 512 క్వింటాళ్ల వరి (సోన) రాగా, క్వింటాలుకు గరిష్టం రూ. 1929, కనిష్టం రూ. 1406, సరాసరి రూ. 1914 పలికింది. 41 క్వింటాళ్ల కంది రాగా, క్వింటాలుకు గరిష్టం రూ. 5266, కనిష్టం రూ. 4506, సరాసరి రూ. 5206 ధరలు లభించాయి. చదవండి: జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? -
KBR Park: కేబీఆర్ పార్కు టికెట్టు ధర పెంపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌లను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్(జనరల్) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది. అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
తగ్గేదేలే అంటున్న టమాటా.. కిలో ఎంతంటే..
సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు తగ్గనంటున్నాయి. గత నెల నుంచి ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. జంటనగరాల అవసరాలకు సరిపడా టమాటా సరఫరా కావడంలేదు. ప్రస్తుతం నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, బోయిన్పల్లి, మాదన్నపేట, ఎల్బీనగర్ మార్కెట్లలో టమాటా ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పక్క వ్యవసాయ మార్కెట్లలో ధరలు పెరిగిపోతుంటే, మరోపక్క కొందరు రిటైల్ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నగరానికి రోజుకు దాదాపు 100 నుంచి 120 లారీల టమాటా డిమాండ్ ఉంది. కానీ ప్రస్తుతం మార్కెట్‌కు సరఫరా అవుతోంది మాత్రం 40 నుంచి 50 లారీలే. తెలంగాణ జిల్లాల నుంచి టమాటా దిగుమతులు తగ్గడంతో పొరుగు రాష్ట్రాలపైనే వ్యాపారులు ఆధారపడాల్సివస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని రోజులుగా నగరానికి టమాటా తరలిస్తున్నారు. అయినా.. నగర అవసరాలను తీర్చలేకపోతున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి రోజుకు 10 నుంచి 15 లారీలు వస్తుండగా, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 35 లారీల మేరకు టమాటా దిగుమతి అవుతోంది. కానీ నగర అవసరాలకు దాదాపు 75 లారీల నుంచి 120 లారీల వరకు డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో టమాటా రూ.40 నుంచి రూ.45 పలుకుతోంది. రిటైల్ వ్యాపారులు రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. -
ఐదో రోజూ ఆగని సెగ : పెట్రో ధరలు ఆల్‌టైం హై
సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు వరుసగా ఐదో రోజు కొనసాగుతోంది. వినియోగదారుల గుండెలు గుభిల్లుమనేలా ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గత మంగళవారం నుంచి పరుగు తీస్తున్న ధరలు శనివారం కూడా అదే రేంజ్లో పెరిగాయి. వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు, డీజిల్‌పై 36 పైసల నుంచి 60 పైసల మేర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. (Petrol Diesel Prices : వాహనదారులకు చుక్కలే!) ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ.88.44, డీజిల్ రూ.78.74 ముంబైలో పెట్రోల్ రూ.94.93, డీజిల్ రూ.85.70 కోల్‌కతాలో పెట్రోల్రూ.89.73, డీజిల్రూ. 82.33 చెన్నైలో పెట్రోల్ రూ.90.70, డీజిల్ రూ.83.86 బెంగళూరులో పెట్రోల్ రూ.91.40, డీజిల్ రూ.83.47 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.91.96, డీజిల్ రూ. రూ.85.89 అమరావతిలో పెట్రోల్ ధర రూ.94.58 డీజిల్ రూ.87.99 మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.49 శాతం పెరుగుదలతో 62.66 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.54 శాతం పెరుగుదలతో 59.72 డాలర్లు చేరుకుంది. (పెట్రోలుపై రూ. 5 తగ్గించిన బీజేపీ సర్కార్) -
పెట్రో ధరలకు వ్యాట్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో పెట్రో ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పెంచిన దాదాపు 50 రోజుల తరువాత మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు రూ. 1.67లు పెరగ్గా, డీజిల్ ధర ఒక్కసారిగా రూ. 7.10 పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సోమవారం రూ .69.59 పలికిన లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ .71.26 పలుకుతోంది. అలాగే సోమవారం నాటి డీజిల్ ధర రూ .62.29 నుంచి రూ .69.29 కు పెరిగింది. చెన్నైలో కూడా పెట్రోల్ రూ .3.26 పెరిగింది. లీటరు పెట్రోలు ధర రూ. 75.54 డీజిల్ ధర 68.22 రూపాయలు పలుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన వ్యాట్ పెరుగుదల కారణంగా అసోం, హర్యానా, నాగాలాండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ .76.31, డీజిల్ ధర లీటరుకు రూ. 66.21 గా వుంది. కోల్‌కతాలో, పెట్రోల్ ధర లీటరుకు 73.30 రూపాయలు కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 65.62. అటు హైదరాబాద్, అమరావతిలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 73.97 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 67.82 అమరావతిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.74.61 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 68. 52 సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వుంటాయి. విదేశీ మారకపు రేటుతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరల సవరణ వుంటుంది. -
ధరల మంట: రీటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఆర్థికమందగమనంపై భయాలు, ద్రవ్యోల్బణంపై తీవ్ర ఆందోళన,. కొనసాగుతుండగానే జనవరి నెలలో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంచనాలకుమించి ఆరేళ్ల గరిష్టానికి చేరింది. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 7.59 శాతానికి పెరిగింది. డిసెంబర్ నెలలో 7.35 శాతంగా ఉంది.సీపీఐ డేటా గణాంకాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) బుధవారం వెల్లడించింది. 2019 జనవరిలో ద్రవ్యోల్బణ రేటు 2.05 శాతంగా ఉంది. ఎన్ఎస్ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆహార ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్లో 14.12 శాతం నుండి 13.63 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణ రేటు 2019 జనవరిలో (-) 2.17 శాతంగా ఉంది. ఈ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 50.19 శాతానికి పెరిగింది, 2019 డిసెంబర్లో 60.50 శాతంగా ఉంది. అదేవిధంగా, తృణధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 5.25 శాతం వేగంతో పెరిగాయి. పప్పుధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు ఈ నెలలో 16.71 శాతం పెరిగాయి. ముఖ్యంగా మార్చి 2019 నుంచి క్రమంగా పెరుగుతూ నింగిని తాకిన ఉల్లిపాయల ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేసింది. దీనికి తోడు కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తుల ధరల మంట దీనికి కారణంగా భావిస్తున్నారు. కాగా ఫిబ్రవరి నాటి పరపతి విధాన సమీక్షలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా వుంచింది. ద్రవ్యోల్బణం చాలా అనిశ్చితంగా ఉన్నందున రెపో రేటును 5.15 శాతంగానే ఉంచినట్టు ఆర్బీఐ వెల్లడించింది. అలాగే దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతానికి (2 శాతం మార్జిన్‌తో) అటూ ఇటూగా వుండాలే చూడాలని కేంద్రానికి ఆర్బీఐ ఆదేశించింది. మరోవైపు మందగమన పరిస్థితులకు అద్దం పడుతూ దేశంలోని పారిశ్రామిక ప్రగతి మరింత ఆందోళనకర స్థాయికి పడిపోయింది. ఇప్పటికే నెగటీవ్ జోన్లోకి చేరిన పారిశ్రామికోత్పత్తి డిసెంబరులో 0.3 శాతానికి పతమైంది. ఉత్పాదక రంగం క్షీణించి, ఏడాది క్రితం ఇదే నెలలో 2.5 శాతం వృద్ధిని సాధించింది. చదవండి : దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి -
భారత్‌కు అనుకూలించిన అంతర్జాతీయ వాతావరణం
సింగపూర్: భారత ఆర్థిక వ్యవస్థ 2019లో అంతర్జాతీయంగా ఉన్న సానుకూల వాతావరణంతో ప్రయోజనం పొందిందని, ఈక్విటీ, డెట్ విభాగాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కొన్నేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని సింగపూర్‌కు చెందిన బ్యాంకింగ్ గ్రూపు డీబీఎస్ ఓ నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి నిలకడగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా అధిక లిక్విడిటీ (పెట్టుబడులు), చమురు ధరలు నిలకడగా ఉండడం వంటివి సానుకూలించినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2019–20లో ఇప్పటి వరకు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సగటున 65 డాలర్లుగా ఉందని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 70 డాలర్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. -
తులం బంగారం రూ.74 వేలు
సాక్షి, న్యూఢిల్లీ : నింగివైపు చూస్తున్న బంగారం ధరలు పెట్టుబడి దారుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, ఆభరణాల వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి పరుగుకు ఇప్పట్లో బ్రేక్‌లు పడే అవకాశం కనిపించడంలేదు. ముఖ్యంగా పాకిస్తాన్లో పుత్తడి ధర వింటే గుండె గుభేలే. అవును.. ఇండియాతో పోలిస్తే.. పాకిస్తాన్లో బంగారం ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది. నిన్న (సోమవారం ,ఆగస్ట్ 12) పాకిస్తాన్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.74,588గా ఉంది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్ (11.6638038 గ్రా) బంగారం రూ.87,000 గా ఉంది. పాకిస్తాన్‌లోని ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 21 క్యారెట్లు, 18 క్యారెట్లు, 10 తులాల బంగారం ధరలు ఆయా నగరాల్లో ఇలా ఉన్నాయి. కరాచిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,588 ఉండగా, 24 క్యారెట్ల తుల బార్ రూ.87,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,373గా ఉంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, సియాల్కోట్ నగరాల్లో 24 క్యారెట్లు, 24 క్యారెట్లు తుల బార్స్, 22 క్యారెట్ల బంగారం వరుసగా.. రూ.74,588, రూ.87,000, రూ.68,373గా ఉన్నాయి. మరోవైపు దేశీయంగా బంగారం ధరలు రూ.38 వేలు మార్క్‌ను అధిగమించాయి. అంతేకాదు త్వరలో రూ.40వేలకు చేరుకుంటుందని బులియన్ వర్గాలు అంచా వేస్తున్నాయి. వెండి కూడా దాదాపు ఇందే రేంజ్లో పరుగులు పెడుతోంది. ఫెడ్ వడ్డీరేటు, అమెరికా చైనా ట్రేడ్‌వార్ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. -
ఏడాది గరిష్టానికి పసిడి ధరలు
సాక్షి, ముంబై: పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు పెరగడంతో పసిడి మిసమిసలాడుతోంది. అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధరలు బుధవారం సంవత్సర గరిష్టానికి చేరాయి. 10 గ్రాముల బంగారం రూ. 150 పెరిగి రూ. 32,500కు చేరింది. అయితే వెండి కిలో మీద స్వల్పంగా.. అంటే రూ. 20 తగ్గి రూ. 39,730గా పలుకుతోంది. ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్లతో పాటు స్థానిక జువెల్లర్స్ జరుపుతున్న ట్రేడింగ్స్ తో పుత్తడి ధరలు నింగివైపు చూస్తున్నాయి. విదేశీ మార్కెట్లో ధోరణి, పండుగ, పెళ్లిళ్ల సీజన్ కారణంగా స్థానిక నగలవారి కొనుగోలుతో ఈ ఏడాది అత్యధికంగా బంగారం ధరలను పెంచింది. జాతీయ రాజధానిలో, 99.9% బంగారం మరియు 99.5% స్వచ్చత బంగారం 10 గ్రా.150 రూపాయలు పెరిగి వరుసగా రూ.32,500, రూ.32,350గా ఉంది. సావరిన్ చాలా ఎనిమిది గ్రాములు ధర రూ. 100పెరిగా 24,800ని తాకింది. మరోవైపు ధంతేరస్, దీపావళి పర్వదినాలు సమీపిస్తున్న దృష్ట్యా కొనుగోళ్లు పుంజుకుని, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడర్ల అంచనా. -
నాలుగేళ్ల గరిష్టానికి చమురు ధర
సాక్షి,న్యూఢిల్లీ: చమురు ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ఇరాన్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్‌ధర నాలుగేళ్ల గరిష్టానికి చేరింది. లండన్ మార్కెట్లో తాజాగా బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా 83 డాలర్లనూ దాటేసింది. ఇదే విధంగా నైమెక్స్ చమురు సైతం 73 డాలర్లను అధిగమించింది. ప్రస్తుతం బ్రెంట్ బ్యారల్ 0.57 శాతం ఎగసి 83.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.43 శాతం పెరిగి 73.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నవంబరు 4 నుంచి ఇరాన్‌పై ఆంక్షలు అమలుకానున్న నేపథ్యంలోఆయిల్ ధరలకు 100 డాలర్ల చేరనుందనే అంచనా మరింత ఊపందుకుంది. మరోవైపు డాలరుతో మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం క్షీణించింది. శుక్రవారం కొంతమేర బలపడినప్పటికీ ప్రస్తుతం 33 పైసలు నష్టంతో 72.82 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా పెట్రో ధరలు మరింత మండుతున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ చమురు మార్కెట్లోని పరిస్థితుల కారణంగా ఇప్పటికే ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.91 ల మార్క్‌ను అధిగమించింది. అంతేకాదు ఈ చమురు సెగ ఏవియేషన్ కంపెనీలను మరింత బలంగా తాకనుంది. విమానయాన ఇంధన ఏటీఫ్ ధరలు మరింత పెరగనున్నాయనే అంచనాలతో ఏవియేషన్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. స్పైస్‌జెట్ దాదాపు 5 శాతం, జెట్ ఎయిర్వేస్ దాదాపు 5 శాతం, ఇంటర్‌గ్లోబ్ 2 శాతం నష్టపోతున్నాయి. అటు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. -
పెట్రో సెగ: మంచి రోజులు ఎపుడు?
సాక్షి, ముంబై: పెట్రోలు, డీజిల్ ధరలకు అడ్డకట్ట పడే అవకాశం దరిదాపుల్లో కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఇంధన ధరల రోజువారీ సమీక్షలో భాగంగా శుక్రవారం కూడా ధరలు పెరిగి హై స్థాయిల్లో కొనసాగుతున్నాయి. పెట్రోలుపై 28 పైసలు, డీజిల్ ధరలు 22 పైసలు పెరిగింది. ముఖ్యంగా వాణిజ్య రాజధాని ముంబైలో ధరలు వినియోగదారుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ .88.67, రూ.77.82 గా ఉన్నాయి. దీంతో వినియోగదారులు పెట్రో సెగపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా ఇంధన ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. బీజీపీ ప్రభుత్వం వాగ్దానం చేసిన ఆ అచ్ఛేదిన్ ఎప్పుడొస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 81లు, డీజిల్ ధర రూ.73.30 గా ఉంది. చెన్నైలో పెట్రోలు రూ.84.19, డీజిల్ ధర రూ.84.05. హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.85.88గాను, డీజిల్ ధర రూ.85.75 గా ఉంది. కోలకతాలో పెట్రోలు రూ.82.87, డీజిల్ ధర రూ.82.74గా ఉంది. Petrol and diesel prices in Mumbai are Rs 88.67/litre and Rs 77.82/litre respectively, locals say, "Don't know what the government is doing? It should reduce fuel prices. Achhe din kab aayenge?" pic.twitter.com/zCSIVQdxCF — ANI (@ANI) September 14, 2018 -
పెట్రో సెగ : టుడే అప్డేట్
సాక్షి, ముంబై: దేశంలో ఇంధన ధరలు బుధవారం కూడా ఆకాశం వైపే చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మోత మోగిస్తున్న పెట్రో ధరలు ఏమాత్రం కిందికి దిగి రావడం లేదు. మంగళవారంతో పోలిస్తే బుధవారం దేశవ్యాప్తంగా సగటున 14 పైసల చొప్పున పెట్రోలు ధరలు పెరిగాయి. దేశరాజధానిలో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ. 80.87, డీజిల్ ధర రూ. 72.97గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు లీటరు ధర రూ. 83.75, డీజిల్ ధర రూ.75.82గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర రూ. 88.26, డీజిల్ ధర రూ. 77.47 పలుకుతోంది. హైదరాబాద్ : బుధవారం పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ ధర 15 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోలు ధర రూ.85.75 కాగా లీటర్ డీజిల్ ధర రూ.79.37గా ఉంది. -
14 నెలల గరిష్టానికి డబ్ల్యుపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: డబ్ల్యుపీఐ మరోసారి పెరిగింది. మే నెల టోకు ధరల ద్రవ్యోల్బణం 4.45 శాతానికి పెరిగింది. దాదాపు14 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. కొన్ని ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరడంతో డబ్ల్యూపీఐ కూడా గరిష్టానికి చేరింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో డబ్ల్యుపిఐ 3.18 శాతం పెరగ్గా , గత ఏడాది మే నెలలో 2.26 శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్ నెలలో 0.89 శాతంతో పోలిస్తే మే నెలలో కూరగాయల ధరలు 2.51 శాతం పెరిగాయి. మొత్తం టోకు ధరల సూచీలో ఐదో స్థానంలో ఉన్న ప్రాథమిక వస్తువులు మే నెలలో 3.16 శాతం పెరిగింది. మే నెలలో పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం కూడా పెరిగి 13.15 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 7.85 శాతంగా ఉండగా, గత ఏడాది 11.81 శాతం పెరిగింది. ఏప్రిల్ నెల9.45 శాతందనుంచి పెట్రోల్ ధరలు మేనెలలో 13.90 శాతం మేర పెరిగాయి. గత ఏప్రిల్‌లో 13.01 శాతంతో పోలిస్తే డీజిల్ ధరలు 17. 34 శాతం పెరిగాయి. -
ఫెడ్ వడ్డన: రూపాయి జంప్
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి గురువారం సానుకూలంగా ప్రారంభమైంది. ఫెడ్ వడ్డీ రేటు పెంపు నిర్ణయంతో అమెరికా కరెన్సీ డాలర్ బలహీన పడిన నేపథ్యంలో రూపాయి పుంజుకుంది. నిన్నటి ముగింపు నుంచి కోలుకుంది. డాలరు మారకంలో రూపాయి 8పైసలు ఎగిసి 67.57 వద్ద మొదలైంది. బుధవారం 16పైసలు క్షీణించిన రూపాయి 67.65 వద్ద ఒకవారం కనిష్టాన్ని నమోదు చేసింది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలరులో అమ్మకాలకు దిగినట్టు ట్రేడర్లు చెబుతున్నారు. అంచనాలకు అనుగుణంగా ఫెడ్ 0.25 శాతం వడ్డీ రేటును పెంచడంతోపాటు ఈ ఏడాది మరో రెండుసార్లు పెంపు ఉండవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా అమెరికా ఫెడ్ తన ఫండ్స్ రేటును 25శాతం పెంచింది. దీంతోపాటు 2018 మరోరెండుసార్లు, 2019లోనాలుగుసార్లువడ్డీ రేట్ల వడ్డన ఉంటుందనే సంకేతాలిచ్చింది. దీంతో అటు ఆసియా మార్కెట్లు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. -
దూసుకుపోతున్న రూపాయి
సాక్షి, ముంబై: 2018 కొత్త ఏడాది ఆరంభంలోనే అదరగొట్టిన దేశీయ కరెన్సీ రూపాయి మరింత దూసుకుపోతోంది. జనవరి 1న డాలర్ మారకంలో 5నెలల గరిష్టాన్ని నమోదు చేసిన రూపాయి మంగళవారం కూడా తన హవా కొనసాగించింది. వరుసగా రెండో రోజూకూడా బాగా పుంజుకుని 63.48 డాలర్ల వద్ద జూన్22, 2015నాటి (రెండున్నరేళ్ల)అత్యధిక స్థాయిని నమోదు చేసింది. 15పైసలు లాభపడి 63.54 వద్ద ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లపెంపు అంచనాలతో డాలర్‌కు డిమాండ్ క్షీణించినట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
న్యూ ఇయర్లో రూపాయి మెరుపులు
సాక్షి, ముంబై: కొత్త ఏడాది ఆరంభంలో ఈక్విటీ మార్కెట్లు నిరాశ పరిస్తే దేశీయ కరెన్సీ మాత్రం ఉత్తేజాన్ని ఇచ్చింది. డాలర్ మారకంలో రుపీ సుమారు 5 నెలల గరిష్టాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే 63.65 స్థాయిని నమోదు చేసింది. ఆగస్టు, 2017 తరువాత ఈ స్థాయిని తాకింది. అంతేకాదు 2018 సంవత్సరంలో రూపాయి విలువ మరింత పుంజుకుంటుందని ఎనలిస్టులు పేర్కొనడం విశేషం. డాలర్ మారకంతో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. శుక్రవారం 21 పైసలు పెరిగి 63.87 వద్ద ముగిసింది . కాగా సోమవారం 41 పైసలు ఎగిసి 63.63 స్థాయిని టచ్ చేసింది. అమెరికన్ కరెన్సీ డాలర్లో బ్యాంకర్లు, ఎగుమతిదారులు భారీ అమ్మకాలు తదితర కారణాలు దేశీయ కరెన్సీకి సానుకూలంగా మారాయని నిపుణుల అంచనా. అటు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూపాయికి మద్దతు లభించింది. బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ భారీ నష్టాల్లో ముగిసినప్పటికీ మార్కెట్లు స్థిరంగా ఉండడం రూపాయికి లాభించింది. 2017లో రూపాయి 6శాతం ఎగిసింది. అలాగే డాలర్ కూడా ఇతర గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే లాభాలనే గడించింది. మరోవైపు 2018 మొదటి త్రైమాసికంలో రూపాయి 63 స్థాయికి చేరుతుందని ఫారెక్స్ సలహా సంస్థ ఐఎఫ్ఎ గ్లోబల్ పేర్కొంది. 2018 సంవత్సరం రూపాయికి సానుకూలంగా ఉండనుందని ఫారెక్స్ ఎడ్వైజరీ సంస్థ తెలిపింది. -
జనసంద్రమైన వాడపల్లి
-మార్మోగిన గోవిందనామం -భక్తులకు ట్రాఫిక్ కష్టాలు -వీఐపీల రాకతో గంటల తరబడి క్యూలైన్లో.. -ఉత్తర ద్వార దర్శనానికి బ్రేక్ ఆత్రేయపురం (కొత్తపేట):కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శనివారం శ్రావణమాసం త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివార్ని దర్శించుకున్నారు. ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది. శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ని ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి మొక్కుబడులు చెల్లించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో పర్యవేక్షకులు సాయిరామ్ , శ్రీదేవి ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ట్రాఫిక్ స్తంభించడంతో అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. లొల్ల వంతెన వద్ద గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఆలయంలో ప్రముఖుల తాకిడి అధికంగా ఉండటంతో గంటల తరబడి క్యూలైన్లు నిలిపివేయడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్లో భక్తులు సుమారు 3 గంటల పాటు పడిగాపులు పడ్డారు. ఆలయంలో ఉత్తర ద్వారం నిలుపుదల చేయడంతో పాటు మరో మార్గం ఏర్పాటు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని భక్తులు వాపోయారు. ప్రముఖులు, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం ప్రధాన మార్గం ద్వారా వెళ్లడంతో భక్తులు స్వామి వారి దర్శనం కోసం అష్టకష్టాలు పడ్డారు. స్వామి వారి సన్నిధిలో అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసస్నకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల సత్కారం అందుకున్నారు. ఆలయ చైర్మన్ నరసింహరావు, ఈవో సత్యనారాయణరాజు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. -
శాంసంగ్ లాభాలు హై జంప్
సియోల్: దక్షిణ కొరియా టెక్నాలజీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాభాల్లో దూసుకుపోయింది. సంస్థ కిందటి త్రైమాసికంలో గైడెన్స్‌ను అధిగమించి క్యూ2లో73శాతం వృద్ధితో భారీ లాభాలను నమోదు చేసింది. ముఖ్యంగా గత మూడు నెలల్లో మొమరీ చిప్ ద్వారా వచ్చిన ఆదాయంతో క్వార్టర్ 2 లాభాలు భారీగా పుంజుకున్నాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో పాటు బై బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ సంవత్సరంలో ఇది మూడవసారి కావడం విశేషం. గురువారం ప్రకటించిన సంస్థ ఆదాయ ఫలితాల్లో ఆజూన్క్వార్టర్లో రికార్డ్ ఆపరేటింగ్ లాభాలను సాధించింది.ఆ పరేటింగ్ లాభం గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 72.7 శాతం పెరిగింది. 14.1 లక్షల కోట్ల డాలర్లకు (12.68 బిలియన్ డాలర్లు) సాధించిందని శాంసంగ్ పేర్కొంది. ఆదాయం 19.8 శాతం పెరిగి 61 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. జూలైలో 14 ట్రిలియన్ల గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే థర్డ్ క్వార్టర్లో 15 ట్రిలియన్ కంటే ఎక్కువ (మూడవ త్రైమాసికంలో లాభాలు) లాభాలను ఆర్జించనుందని ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్‌లో విశ్లేషకుడు గ్రెగ్ రో చెప్పారు. మెమోరీ చిప్స్, స్మార్ట్ఫోన్లు, టెలివిజన్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ శాంసంగ్ రికార్డు లాభాలను పూర్తిస్థాయిలో సాధించినుందని భావిస్తున్నారు. శాంసంగ్ మొబైల్ వ్యాపారంలో త్రైమాసిక లాభాల కంటే మెరుగైన పనితీరు పెరగడంతో, ఎక్కువగా లాభాలు ఆర్జించిందని విశ్లేషకులు చెప్పారు. అలాగే 1.7 ట్రిలియన్ డాలర్ల (1.53 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేయనుంది. దీంతో జనవరి నెలలో ప్రకటించిన బై బ్యాక్ తో కలిపి మొత్తం బై వ్యాక్ విలువ 9.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే 2 ట్రిలియన్ల సొంత వాటాలను రద్దును కూడా ప్రకటించింది. మెమరీ చిప్ సూపర్-సైకిల్ కారణంగా మూడవ-త్రైమాసిక ఆదాయం, రెండవ త్రైమాసికాన్న దాటిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
లోవకు భక్తజన వెల్లువ
తలుపులమ్మను దర్శించుకున్న లక్ష మంది గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్ తునిరూరల్ : జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢమాస మూడో ఆదివారం కావడం.. వాతావరణం అనుకూలంగా ఉండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక వాహనాల్లో భక్తులు వస్తూనే ఉన్నారు. లక్ష మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్. చంద్రశేఖర్ తెలిపారు. అమ్మవారి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటలు భక్తులు క్యూల్లో వేచి ఉండాల్సి వచ్చింది. పులిహోర ప్రసాదం మధ్యాహ్నం 12.30 గంటలకే నిండుకుంది. వివిధ విభాగాలు ద్వారా దేవస్థానానికి రూ.6,70,282 ఆదాయం లభించినిట్టు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అవస్థలు భారీగా తరలివచ్చి భక్తులకు వసతి గదులు లభించకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ఒక మోస్తరు వర్షం కురుస్తుండడంతో భక్తులు చిత్తడితో అవస్థలు పడ్డారు. దేవస్థానం అధీనంలో ఉన్న 125 కాటేజీలు, పొంగలి షెడ్లను భక్తులకు ఇచ్చారు. అవి లభించని వారు చెట్లను, కొండ దిగువన ఉన్న మామిడి, జీడి మామిడి తోటలను, ప్రైవేట్ పాకలను ఆశ్రయించారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది ప్రైవేట్ పాకల యజమానులు రూ.800 - రూ.1200 వరకు అద్దెలను డిమాండ్ చేశారు. కొంతమంది తమ వాహనాల్లోనే వంటలు, భోజనాలు చేశారు. స్తంభించిన ట్రాఫిక్ పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, బస్సులు, కార్లు, ఇతర భారీవాహనాలపై భక్తులు లోవ దేవస్థానానికి భక్తులు చేరుకున్నారు. లోవ కొత్తూరు ఎర్రచెరువు వద్ద కల్వర్టు నిర్మాణంలో ఉండడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు ఆధ్వర్యంలో తుని రూరల్, కోటనందూరు ఎస్సైలు సుధాకర్, శంకరరావు, 80 మంది పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. బెల్టు షాపుల హవా లోవదేవస్థానంలో తలుపులమ్మతల్లిని దర్శించేందుకు భారీ సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతో మందుబాబులతో మద్యం దుకాణం కిక్కిరిసిపోయింది. మందుబాబులు మంచి జోష్‌మీద ఉండడంతో బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. టోల్‌గేటు వద్ద నుంచి ఘాట్ రోడ్డు వరకు 40 నుంచి 50 బెల్టు షాపులు వెలసినట్టు అంచనా. అయినప్పటికీ ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. -
పెడదోవకు కేరాఫ్ హైవే
రాజానగరం : ఇంతవరకు వాహాన ప్రమాదాలకే తావిస్తున్న జాతీయ రహదారి, వాటితోపాటు సుఖ వ్యాధులు వ్యాప్తికి కూడా కారణమవుతుంది. మొన్నటి వరకు ఈ రహదారి వెంబడి ఉన్న పలు కాకా హోటళ్లే అడ్డాగా సాగిన అసాంఘీక కార్యకలాపాలు ఇప్పుడు చెట్టు పుట్ట అనే తేడా లేకుండా, పగలు, రాత్రి అనే సమయంతో నిమిత్తం లేకుండా యధేచ్చగా జరిగిపోతున్నాయి. దీనితో అభం, శుభం తెలియని కుర్రకారు వీటి ఆకర్షణకు లోనై ఎయిడ్స్ వంటి ప్రమాదకరమైన సుఖవ్యాధులను అంటించుకుని మొగ్గ దశలోనే జీవితాలను బలిచేసుకుంటున్నారు. వీటిని నిరోధించవలసిన పోలీసులు పరిధి, వారధి అంటూ మడికట్టుకుని కూర్చుంటే అవకాశవాదులు బ్రోతల్స్తో చేతులు కలిపి అంకిన కాడికి విఠులను దోచుకుంటున్నారనే ఆరోపణలకు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో తుని నుండి రావులపాలెం వరకు సుమారు 130 కిమీ పొడవున 16వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించి ఉంది. ఈ రహదారిలో రావులపాలెం నుండి వేమగిరి వరకు కూరగాయల తోటలు, పూల నర్సరీలు ఉంటే, వేమగిరి నుండి తుని వరకు మామిడి, జీడిమామిడి తోటలుతోపాటు పుంకానుపుంకాలుగా వేసిన లేఅవుట్లు ఉన్నాయి. దివాన్‌చెరువు, లాలాచెరువులో 1500 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు కూడా ఉంది. ఏ ప్రాంతంలో ఏమున్నాగాని వాటినే అడ్డాగా చేసుకుని అసాంఘీక కార్యకలాపాలకు నిర్భయంగా సాగిస్తున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం నుండి రాజానగరం వరకు ఆదికవి నన్నయ యూనివర్సిటీతోపాటు ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు ఎక్కువగా ఉండటంతో తెలిసీ తెలియని వయస్సులో యవ్వన దశలో ఉన్న యువత వీటికి ఆకర్సితులై నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. టార్చిలైట్స్తో సిగ్నల్స్ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న తోటలు, లేఅవుట్లలో పెరిగిన తుప్పలు అసాంఘీక కార్యకలాపాలకు నెలవుగా తయారువుతున్నాయి. లాలాచెరువులోని పుష్కర వనం ప్రాంతంతోపాటు దివాన్‌చెరువు నుండి గైట్ కళాశాల వరకు ఉన్న రిజిర్వు ఫారెస్టు, నన్నయ యూనివర్సిటీ సమీపంలోని ఆర్కె టైన్ షిప్, జెకె గార్డన్స్, పగటి సమయంలో కూడా అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఈ ప్రాంతాలతోపాటు రహదారి పొడవునా రాత్రి సమయాలలో విటులను టార్జిలైట్స్ వేసి మరీ ఆకర్షిస్తున్నా నిఘా వ్యవస్త నిశ్చేతనంగా చూస్తుంది. దారి పొడవునా ఉన్న తోటులు, తుప్పల నుండి టార్చ్ లైట్ సిగ్నల్స్ వస్తే చాలు అటుగా పోయే విటులు తమ వాహనాలను సైతం రోడ్డు ప్రక్కన పార్కు చేసి లైట్ సిగ్నల్స్ వచ్చిన వైపు వెళ్లి, కోరిక తీర్చుకుని వస్తున్నారు. ఈ సమయంలో వారికి అంటుకునే రోగాల గురించి, తమనే నమ్ముకున్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం లేదు. అయితే ఏ అవకాశం లేని వారు ఈ రొంపిలోకి వస్తారని, కుటుంబ పరిస్తితులే వారిని ఈ విధంగా మారుస్థాయని బ్రోతల్స్ పట్ల జాలి చూపించే వ్యక్తులు వారి ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత గురించి కూడా ఆలోచించాలి. ఇదో రకమైన దోపీడీ .. జాతీయ రహదారి వెంబడి పెరిగిపోతున్న అసాంఘీక కార్యకలాపాలను నియంత్రించవలసిన పోలీసు వ్యవస్త ఈ విషయంలో పూర్తిగా నిర్వీర్యమైందనే చెప్పవచ్చు. తమ పై బాస్‌లు కూడా ఈ విషయమై పెద్దగా సీరియస్‌నెస్ చూపకపోవడంతో కొంతమంది పోలీసు కానిస్టేబుల్స్ బ్రోతల్స్ సాయంతో దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులు ఇటీవల కాలంలో ఎక్కువగా వీరి ఆకర్షణకు లోనవుతున్నారు. అటువంటి వారిలో బాగా రిచ్‌గా కనిపించిన వారు ఎవరైనా ఉంటే బ్రోతల్స్ ఫోన్ ద్వారా తనకు టచ్‌లో ఉండే కానిస్టేబుల్‌కి వర్తమానం పంపడం, ఆ పై అతను వేగిరమే అక్కడకు చేరుకుని ఇరువురిని చెడామడా తిట్టి, పోలీసు స్టేషనుకు రమ్మంటూ బెదిరించడం, దానితో ఆ యువకుడు భయపడిపోయి, తన వద్ద ఉన్నదంతా నిలువుదోపిడీగా అతని చెల్లించుకోవడం ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఇదే విషయాన్ని కొంతమంది పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినాగాని ఎటువంటి ప్రయోజనం లేదు, సరికదా వారి వివరాలు ఇస్తే యాక్షన్ తీసుకుంటామనడం కొసమెరుపు. ఉపాధి చూపితే ఈ పని మానేస్తాం ఈ పని చేయడానికి మాకు కూడా రోతగానే ఉంది. కాని ఏం చేస్తాం, మా జీవితాలతోపాటు మరికొందరి జీవితాలను కూడా మేమే పోషించాలి. గత్యంతరం లేని స్థితిలో ఈ పనిచేస్తున్నాం. ప్రభుత్వం మాలాంటోళ్లకు సరైన ఉపాధి చూపితే ఈ పని మానేసి, హాయిగా సంసార పక్షంగా బ్రతుకుగడపాలను కుంటున్నాం. కాని మాకు ఉపాధి ఎవరు చూపుతారు, నాయకులు మాటలు చెప్పడమేగాని ఆచరణలో కనిపించడం లేదు. - పేరు వద్దని ఓ మహిళ తన ఆర్థిక ఇబ్బందులను వివరించింది. -
వేడెక్కుతోంది...
- 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు - చింతూరులో అత్యధికంగా 43 డిగ్రీలు - మరో వారం రోజులు ఇంతే అమలాపురం : భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా అగ్నిగుండంగా మారిపోతోంది. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విలీన మండలమైన చింతూరులో శనివారం ఏకంగా 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. రాజమహేంద్రవరం, పచ్చని కోనసీమలో సైతం 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. కాకినాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తుని, మండపేట వంటి ప్రాంతాల్లో సైతం ఇదే ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం పది గంటల తరువాత బయటకు రావాలంటనే భయపడుతున్నారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో కూడా 33 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం, వేడి గాలులతో సామాన్యులు అపసోపాలు పడుతున్నారు. ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం విశేషం. ఈ వారం మరింత తీవ్రత... ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వారం పొడవునా అత్యధిక ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాల్లో ఎండతీవ్రత ఎక్కువగ ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పుడే ఎండతీవ్రతలు ఇలా ఉంటే రోహిణిలో ఎలా తట్టుకునేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. -
మూత‘బడే’నా!
ప్రాథమికోన్నత పాఠశాలల రద్దుకు సర్కారు యోచన పాఠశాల వివరాల సేకరణలో ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ వర్గాలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ రద్దుకే ఈ కుట్ర : నిరుద్యోగులు అధికారంలోకి ఎవరొచ్చినా ముందుగా ప్రయోగాలకు వేదికయ్యేది విద్యాశాఖే. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోగా.. తాజాగా విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. - భానుగుడి(కాకినాడ) జిల్లా వ్యాప్తంగా 331 మండల పరిషత్ ప్రాథమికోన్నత, 12 మున్సిపల్ ప్రా«థమికోన్నత, 31 ఎయిడెడ్ ప్రాథమికోన్నత, 43 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలున్నాయి. ఇందులో 36,230 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం తొలుత పదిమంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేయాలని, 19 మంది విద్యార్థులుంటే ఒక ఉపాధ్యాయుడిని, 60 మంది విద్యార్థులకు 1:30 నిష్పత్తి చొప్పున ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని యోచించింది. అయితే దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వకపోయినా.. ప్రస్తుతం విద్యాశాఖాధికారుల నుంచి జిల్లాలో ఉన్న ప్రా«థమికోన్నత పాఠశాలలు, విద్యార్థులు, ఇతర వివరాలను సేకరిస్తోంది. ఇవి పాఠశాలలను రద్దు చేసే వ్యూహంలో భాగమేనని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. లంక గ్రామాల పరిస్థితేంటి? ఉన్నత పాఠశాలలు ఇకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటే ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. జిల్లాలో లంక గ్రామాలన్నీ ఉన్నత పాఠశాలలకు 5 కి.మీ. దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి విద్యార్థులు సైకిల్, కాలిబాటన వచ్చే అవకాశాలు లేవు. ఉన్నత పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు జిల్లాలో 100కి పైగా ఉన్నట్టు అంచనా. వీటిని మూసివేస్తే ఆయా గ్రామాల్లోని విద్యార్థులు సుదూర ప్రాంతాలకు రాలేక శాశ్వతంగా విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇది ముమ్మాటికీ డీఎస్సీని అడ్డుకోవడమే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కేస్తోందని నిరుద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేషనలైజేషన్, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల మూసివేత వంటి చర్యలు భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకుండా చేసే యోచనే అని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. పాఠశాలల మూసివేతకు వ్యతిరేకం ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న చర్యలకు యూటీఎఫ్ పూర్తి వ్యతిరేకం. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కితీసుకోవాలని కోరాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు పోరాటం చేస్తాం. ప్రాథమికోన్నత పాఠశాలలనే పూర్తిగా మూసివేయాలన్న ఆలోచనే కరెక్ట్ కాదు. - బీవీ రాఘవులు, యూటీఎఫ్ జిల్లా అ««ధ్యక్షుడు. విద్యాహక్కు చట్టాన్ని కాలరాయడమే. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించడం ముమ్మాటికీ విద్యాహక్కు చట్టాన్ని కాలరాయడమే. ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయాలన్న జీవో వచ్చిన తక్షణమే ఆందోళనలతో రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నాం. -పి. సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ పనికిమాలిన చర్య పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి పాటుపడాల్సిన ప్రభుత్వం విద్యార్థులు లేరని పాఠశాలలను మూసివేయడం పనికి మాలిన చర్య. ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్‌లు, సబ్జెక్టు నిపుణులు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్య పెరగకుంటే అప్పుడు పాఠశాలలను మూసివేయాలి గానీ వసతులు లేకుండా విద్యార్థులు లేరని మూసివేయడం తగదు. కేవీ శేఖర్, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ సంఘటితంగా పోరాడతాం. జాక్టో, ఫ్యాప్టోలతో పాటుగా, నిరుద్యోగ సంఘాలను సైతం కలుపుకుని ఈ విషయమై పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిస్తే ఇప్పటి వరకు విజయం సాధించలేని విషయమేదీలేదు. ఈ నిర్ణయం ప్రతీ పేద విద్యార్థికి చేటుచేసేదే గనుక అంతా సంఘటితమై ఖండించాలి. - చింతాడ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
వేగంగా రోడ్డు విస్తరణ పనులు
కలెక్టర్ కార్తికేయ ఆదేశం కాకినాడ సిటీ : జిల్లాలో జాతీయ రహదారి 216, ఏడీబీ రోడ్డు విస్తరణ పనులకు భూసేకరణ పనులు వేగవంతం చేసి, ప్రాజెక్ట్ పనులు సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టుహాలులో రెవెన్యూ, నేషనల్ హైవేస్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్‌హెచ్ 216, ఏడీబీ రోడ్ల భూసేకరణ పనులను డివిజన్ల వారీగా సమీక్షించారు. సమావేశానికి ఎన్‌హెచ్ 216 ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్‌ను వెనక్కు పంపించి వేశారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే 216 భూసేకరణపై ప్రజల నుంచి పలు వినతులు వచ్చాయని ఈ మేరకు పనుల కోసం చేపట్టిన భూసేకరణలో పెగ్ మార్కింగ్ కన్నా ఎక్కువ భూమిని తీసుకున్నచోట్ల సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ఈ సర్వేను రెవెన్యూ, సంబంధిత ఏజెన్సీ ద్వారా చేపట్టి స్థానిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రెండు, మూడు రోజుల్లో సమగ్ర పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని ఆయ మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. భూసేకరణలో భాగంగా ఏడీబీ రోడ్డు పనుల్లో ఆక్రమణలో ఉన్నవారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తున్నాం గాని ఎన్‌హెచ్ 216 పనుల్లో ఆక్రమణల్లో ఉన్నవారికి పరిహారం చెల్లించడం లేదని మతపరమైన కట్టడాలను మాత్రమే ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే చర్యలు చేపడుతున్నారని జేసీ–2 రాధాకృష్ణమూర్తి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, ఆర్డీవోలు ఎల్.రఘుబాబు, విశ్వేశ్వరరావు, సంబంధిత మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ద్రవ్యోల్బణం పెరిగింది.. ఉత్పత్తి తగ్గింది!
న్యూఢిల్లీ : వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయికి ఎగిసింది. ఇంధన ధరలు పెరుగడంతో మార్చి నెల ద్రవ్యోల్భణం పెరిగినట్టు బుధవారం విడుదలైన డేటాలో వెల్లడైంది. ధరలు పెరుగుతాయని ముందుగానే ఊహించిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను యథాతథంగా ఉంచింది. వారి అంచనాల మేరకే ద్రవ్యోల్బణం ఎగిసింది. గత నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పైకి ఎగిసినట్టు ప్రభుత్వ డేటాలో తెలిసింది. 2016 అక్టోబర్ నుంచి ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదలని తేలింది. ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం 3.65 శాతానికి ఎగిసినప్పటికీ, ఇంత వేగంగా పెరుగలేదని గణాంకాల మంత్రిత్వశాఖ డేటాలో వెల్లడైంది. ఫిబ్రవరి నెలలో 3.91శాతంగా ఉన్న రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం మార్చి నెలలో ఏకంగా 5.56 శాతానికి పెరిగింది. ఆహారపు ధరలు కూడా 1.93 శాతం పైకి వెళ్లాయి. కానీ ముందస్తు నెలతో పోల్చుకుంటే ఇది తక్కువేనని తెలిసింది. ఓ వైపు వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరుగగా.. మరోవైపు పారిశ్రామికోత్పత్తి అనూహ్యంగా ఫిబ్రవరి నెలలో 1.2 శాతం పడిపోయింది. జనవరి నెలలో ఈ ఉత్పత్తి 2.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. కానీ పారిశ్రామికోత్పత్తి 1.3 శాతం వృద్ధి నమోదుచేస్తుందని రాయిటర్స్ అంచనావేసింది. ప్రస్తుతం రాయిటర్స్ అంచనాలు తప్పాయి. -
‘పురుషోత్తపట్నం ఎత్తిపోతల’ బాధిత రైతులకు ఊరట
–2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి -హైకోర్టు తీర్పుతో పెరగనున్న పరిహారం -ఒనగూరనున్న అనేక ప్రయోజనాలు సీతానగరం : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణలో భూములు కోల్పోయే రైతులు శుక్రవారం నాటి హైకోర్టు తీర్పుతో ఊరట చెందారు. గతంలో భూసేకరణలో తమ భూములు ఇచ్చేందుకు సుమారు 230 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టారు. మిగిలిన రైతులు తమ భూములు ఎకరానికి రూ.28 లక్షలకు ఇచ్చేది లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. భూములకు ధర చెల్లింపులో 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ న్యాయవాది బి.రచనారెడ్డి రైతుల తరఫున పిటిషన్ వేశారు. 2013 భూసేకరణ చట్టం వర్తింపుతోనే ఎత్తిపోతల పథకానికి భూములు తీసుకోవాలని శుక్రవారం హైకోర్టు జడ్జి శేషసాయి తీర్పు చెప్పారని రైతులు తెలిపారు. ఈ తీర్పుతో ప్రభుత్వం నాలుగు రెట్ల ధరను పరిహారంగా అందించాలి. అలాగే ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. దీనితో పాటు ఈ భూములపై ఆధారపడిన కూలీలకు ఆరునెలల కూలి చెల్లించాలి. భూములు కోల్పోయే కుటుంబంలోని 18 ఏళ్ళు నిండిన యువకులకు ఉద్యోగం లేదా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి. అలాగే ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించి, గ్రామ సభలు జరపాలి. బహుళ పంటలు పండే భూములకు రెట్టింపు పరిహారం చెల్లించాలి. ఇలా పలు అంశాలు 2013 భూసేకరణ చట్టంలో పొందుపర్చి ఉన్నాయి. వీటిని అమలు పర్చాలంటే ఆరునెలలు పట్టే అవకాశం ఉంది. అయితే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన రైతుల భూముల్లో పనులు యథావిధిగా జరుగుతాయి. -
మద్యం వ్యాపారులకు షాక్
– సుప్రీం ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అబ్కారీ శాఖ – జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న దుకాణాల లైసెన్సులు నెలాఖరుతో రద్దు – 500 మీటర్ల దూరంలో పెట్టుకునేందుకు అనుమతి – జిల్లాలో 500 మద్యం దుకాణాలు – సుప్రీం తీర్పునకు ప్రభావితమయ్యే దుకాణాలు 376 – జూన్ వరకు లైసెన్స్ ఉండడంతో ఆందోళనలో వ్యాపారులు – రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో వేసిన పిటీషన్‌పై ఆశలు సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను ఏప్రిల్ 1వ తేదీలోపు తొలగించాలని గత డిసెంబర్ 15న సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును రాష్ట్ర అబ్కారీ శాఖ అమలులో పెడుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలను నడపడమే కారణమని సుప్రీం కోర్టు పై విధంగా తీర్పు వెలువరించిన విషయం విదితమే. గురువారం జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణ యజమానులకు అబ్కారీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. రెండేళ్ల వరకు మద్యం దుకాణాల నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు జూన్ 30 వరకు ఉండడంతో తాము తీవ్రంగా నష్టపోతామని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 500 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి 376 దుకాణాలున్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. సుప్రీం తీర్పు ప్రభావం జిల్లాలో 376 (75 శాతం) దుకాణాలపై పడుతోంది. తాము మద్యం వ్యాపారులకు ఇచ్చిన లైసెన్స్ జూన్ 30 వరకు ఉందని, అప్పటి వరకు వెలుసుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. వారం రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని అబ్కారీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠలో మద్యం వ్యాపారులున్నారు. మరోచోట ఏర్పాటుకు అబ్కారీ అధికారులతో కమిటీ కోర్టు తీర్పు ప్రకారం మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో ఉండాలి. వాటిని చేరుకునేందుకు నేరుగా మార్గం ఉండకూడదు. అంతేకాకుండా జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి కనిపించే విధంగా ఉండకూడదు. రహదారులపై ఉంటే వాటి లైసెన్స్ రద్దు అవుతుంది. అయితే అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో కనిపించకుండా ఉండే ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేసుకుంటే ఆ లైసెన్స్ జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది. మద్యం వ్యాపారులు నష్టపోకుండా ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్, సంబంధింత డివిజన్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మద్యం వ్యాపారులు స్థలం ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకుంటే ఈ కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేస్తుంది. ఆందోళనలో మద్యం వ్యాపారులు... వచ్చే మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) మద్యం వ్యాపారానికి మంచి సీజన్. వేసవి కాలం కావడంతో బీర్ల అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. ఏడాదంతా చేసిన వ్యాపారం ఒక ఎత్తయితే చివరి మూడు నెలలు చేసే వ్యాపారం మరో ఎత్తు. సుప్రీం తీర్పు నేపథ్యంలో తాము తీవ్రంగా నష్టపోతామని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 500 దుకాణాల్లో జాతీయ రహదారుల వెంట కేవలం 36 మద్యం దుకాణాలున్నాయి. రాష్ట్ర రహదారులు వెంట 340 మద్యం దుకాణాలు న్నాయి. జాతీయ రహదారులు నగరాలు, పట్టణాలకు వెలుపల వెళుతుండగా, రాష్ట్ర రహదారులు మాత్రం పట్టణాలు, నగరాలల్లో ఉన్నాయి. దీంతో అధిక సంఖ్యలో మద్యం దుకాణాలు సుప్రీం తీర్పునకు ప్రభావితం అవుతున్నాయి. 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు ఉన్నా ఇప్పటికిప్పుడు స్థలం దొరకడం కష్టమని మద్యం వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దొరికినా దుకాణం ఏర్పాటు, స్థలం లీజు ధర యజమాని ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉందని వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న దుకాణానికి జూన్ వరకు అద్దె చెల్లించామని, ఇప్పడు అది కోల్పోవడంతోపాటు, కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. సుప్రీం తీర్పును అమలు చేస్తున్నాం... డిసెంబర్ 15న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని వాటి యజమానులకు గురువారం నోటీసులు జారీ చేశాం. 500 మీటర్ల దూరంలో తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు మద్యం వ్యాపారి స్థలం చూసుకుని దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం. ఇందుకు డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిషనర్ కమిటీ వేశారు. బడి, గుడి, ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో, ఇతర నిబంధనలకు అనుగుణంగా స్థలం ఉంటే కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తీర్పులో జూన్ వరకు వెలుసుబాటు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ వేసింది. అతి త్వరలో దీనిపై విచారణ జరగనుంది. – ఎస్. లక్ష్మీకాంత్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, అబ్కారీ శాఖ, రాజమహేంద్రవరం. -
కరప హైస్కూల్ డిజిటల్ క్లాస్ ఆదర్శప్రాయం
రాష్ట్రంలో సెకండ్, జిల్లాలో ఫస్టు కరప (కాకినాడ రూరల్) : డిజిటల్ క్లాస్ నిర్వహణలో రాష్టంలో కరప హైస్కూలు ద్వితీయ స్థానం, జిల్లాలో ప్రథమస్థానం సాధించింది. ఈ విషయాన్ని అమరావతి విద్యా కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఈ గవర్నన్స్ కన్సల్టెంట్ సత్య సందీప్, డెవలప్మెంట్ కన్సల్టెంట్ ఎం.వంశీ తెలిపారు. స్థానిక నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా విద్యా శాఖ ఏపీఓ వి.సత్యనారాయణతో కలిసి వారు సందర్శించారు. డిజిటల్ క్లాస్ రూమును, విద్యాబోధన పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తంచేశారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను 172 గంటలు వినియోగించి గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రథమస్థానం పొందిందని వారు తెలిపారు. 152 గంటలతో కరప హైస్కూలు ద్వితీయ స్థానంలో ఉందన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను, అమలుచేస్తున్న టైంటేబుల్ వారు పరిశీలించారు. తాడేపల్లి, కరప హైస్కూళ్లు అనుసరిస్తున్న టైంటేబుల్, నిర్వహణ పరిశీలించి నివేదికను విద్యాశాఖ కమిషనరేట్‌కు అందజేస్తామన్నారు. రాష్టంలో మిగిలిన హైస్కూళ్లు కూడా ఈ విధానాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోజుకో సబ్జెక్టు చొప్పున విద్యార్థులకు చేస్తున్న డిజిటల్ బోధన చేస్తున్నట్టు వారికి హెచ్ఎం పీవీఎన్ ప్రసాద్ వివరించారు. స్టాఫ్ సెక్రటరీ కె.సాంబశివరావు, ఉపాధ్యాయులు టి.కృపాలాల్, జీవీ రంగనాథ్, పీఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హైవేలపై వైన్ దుకాణాలకు నో
ఏప్రిల్ నుంచి లైసెన్స్‌లను పునరుద్ధరించం కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటన 28వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నుంచి జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను అనుమతించేది లేదని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రకటించారు. 28వ రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో గురువారం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారుల వెంబడి ఉన్న వైన్ షాపుల లైసెన్స్ మార్చి నెలాఖరుతో ముగుస్తుందని, ఆ తర్వాత వాటిని పునరుద్ధరించబోమని చెప్పారు. వాహనాల సంఖ్యలోను, ప్రమాదాల్లో కూడా రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో ఉందన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామని కలెక్టర్ చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. జాతీయ రహదారుల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్డు మరమ్మతులను త్వరలో చేపడతారన్నారు. రోడ్ల భద్రత అనేది పాఠశాలల స్థాయిలో పాఠ్యంశంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వాహన డ్రైవర్లు అతి వేగానికి నిర్లక్ష్యానికి, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. దీనివల్ల పోలీసు శాఖకు చెందిన ఇంటర్ సెప్టార్ వాహనం సాయంతో ఆ ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించవచ్చన్నారు. అలాగే డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా నివారణ చర్యలు కూడా చేపట్టినట్టు తెలిపారు. రూ. 1100 కోట్లతో జాతీయ రహదారి అభివృద్ధి సమావేశంలో రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ జాతీయ రహదారి 216ను జిల్లా పరిధిలో రూ.1100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే సామర్లకోట- రాజానగరం ఏడీబీ రోడ్డును రూ.325 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరిస్తామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే 292 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇన్చార్జి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) సిరి ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ డీసీహెచ్ డాక్టర్ పవన్ కిషోర్, సమాచారశాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్ కూడా ప్రసంగించారు. అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కె.చంద్రయ్య, ఎంవీఐలు నరసింహారావు, శివకామేశ్వరరావు, వీజీఎస్ తిలక్, ఆర్.సురేష్, శ్రీనివాస్, ఆయేషా, కల్యాణి, ఎం.రవికుమార్, పరంధామరెడ్డి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
వైద్యరంగంలో ఆత్మహత్యలెక్కువే..!
ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు వైద్యరంగంలో ఎక్కువే వైద్య కళాశాలలో స్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ గార్లపాటి వంశీ గుంటూరు మెడికల్ : ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో వైద్యరంగానికి చెందిన వారు ఎక్కువగానే ఉన్నారని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ గార్లపాటి వంశీ చెప్పారు. గుంటూరు వైద్య కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో సోమవారం ‘‘సెల్ఫ్ డైరెక్టెడ్ వయలెన్స్ ఇన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్’’ అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో డాక్టర్ వంశీ మాట్లాడుతూ గుంటూరులో వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం పత్రికల్లో చదివి కనీసం ఒక్క జీవితాన్నైనా కౌన్సెలింగ్ చేసి కాపాడాలనే ఉద్దేశంతో గుంటూరు వచ్చినట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచన ఉన్న వారు అందరూ ఆత్మహత్యకు పాల్పడరని, ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసిన అందరూ ప్రాణాలు కోల్పోరన్నారు. ప్రవర్తనలో మార్పుల వల్ల తమను తాము గాయపరుచుకుంటారని, వీరు ప్రత్యేకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎక్కువ ఒత్తిడికి గురవుతారన్నారు. వాలంటీర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, మెడికోలు,, ఫిజీషియన్లు, సైకాలజిస్టులు, అందరూ ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారని, కౌన్సెలింగ్ తీసుకునేందుకు సుముఖంగా ఉండరన్నారు. వైద్య విద్యలో చేరిన తొలి మూడునెలల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, ఎక్కువగా ఉంటాయని, భారత దేశంలో ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు మొదటి సంవత్సరం ప్రారంభంలో 8 శాతం, ఏడాది చివరలో 22 శాతం ఈ ఆలోచన కలిగి ఉన్నారన్నారు. వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన కలిగి ఉన్నారనే విషయాన్ని బయటకు చెప్పరని, కళాశాల పరువు పోతుందని యాజమాన్యాలు ఈ విషయాన్ని దాస్తాయని చెప్పారు. ప్రతి ఏడాది 300 నుంచి 400 మంది ఫిజీషియన్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మన దేశంలో 2010 నుంచి 2014 మధ్య 16 మంది వైద్య విద్యార్థులు చనిపోగా, వీరిలో తొమ్మిదిమంది వృత్తిపరమైన కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ లక్షణాలు గమనిస్తే... మనుషుల్లో కలిసేందుకు ఆసక్తి చూపకపోవడం, మాట్లాడకుండా మౌనంగా ఎక్కువ కాలం ఉండి పోవడం, వైద్యం కోసం వచ్చిన రోగులను విసుక్కోవడం, కోపగించుకోవడం, వృత్తి పట్ల ఆసక్తి లేకపోవడం, సరిగా నిద్రపోకపోవడం, కొద్దిపాటి విషయాలకే చికాకు పడడం, తదితర లక్షణాలు గమనిస్తే వీరు ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన కలిగి ఉన్నట్టు గుర్తించాలని చెప్పారు. ఒత్తిడి నివారణ మార్గాలను అన్వేషించాలని, సన్నిహితులతో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతోందన్నారు. ప్రతి వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు చేరిన మొదటి ఏడాది రెండు దఫాలుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా వైద్య రంగ నిపుణులు ఆత్మహత్యలకు పాల్పడకుండా నివారించవచ్చన్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ పెద్ద కుటుంబాలు విడిపోయి చిన్న కుటుంబాలు అవడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పేందుకు పెద్దలు తోడు లేకపోవడం వల్ల చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. పిల్లలు ఏది అవ్వాలనుకుంటున్నారో తల్లిదండ్రులే నిర్ణయించి బలవంతంగా వారిపై తమ అభిప్రాయాలు రుద్దడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకుని సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. సదస్సులో గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మార్కండేయులు, పలు వైద్య విభాగాధిపతులు, పలువురు వైద్యులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
బండ బాదుడు
-గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంపు -జిల్లా వినియోగదారులపై రూ. 2.10 కోట్లు భారం తణుకు: నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటితోపాటు తాజాగా గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు గుదిబండగా మారింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ.39 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులకు పెనుభారమయ్యింది. పెరిగిన ధరతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.2.10 కోట్లు మేర భారం పడనుంది. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతున్న చమురు కంపెనీలు తాజాగా రాయితీ గ్యాస్ సిలెండర్లపై భారం మోపడం సమంజసం కాదని మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాపై భారం... జిల్లాలో మొత్తం 7.50 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో సుమారు 2 లక్షల మంది దీపం గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారు. హెచ్‌పీ, భారత్, ఇండేన్ గ్యాస్ డిస్టిబ్యూటర్ కేంద్రాలు 42 ఉండగా వీటి ద్వారా ప్రతి నెలా 5.40 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. రోజుకు దాదాపు 50 వేల మంది సిలిండర్ బుకింగ్ చేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న గ్యాస్ సిలెండర్ ధర రూ.537 కాగా నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో రూ. 72 చొప్పున రాయితీ మొత్తం జమ అవుతోంది. ఈనెల 1 నుంచి రాయితీపై పంపిణీ చేసే గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నులన్నీ కలిపితే పెంచిన ధరతో కలిపి గ్యాస్ సిలెండర్ ధర రూ.576కు చేరింది. ఈ లెక్కన జిల్లా వినియోగదారులపై దాదాపు రూ.2.10 కోట్ల భారం పడనుంది. ధరలు పెంచడం దారుణం పప్పుల ధరలు ఆకాశాన్నంటడంతో వంటింటి బడ్జెట్ పెరిగింది. ఇలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్ ధర పెంచడం దారుణం. ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండటం లేదు. ధరలు ఇలా పెంచుకుంటూ వెళితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలా బతికేది. ఎం.సరస్వతి, గృహిణి, తణుకు ఎలా బతికేది.. కార్తీకమాసం కావడంతో ఇప్పటికే కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతోపాటు ఇటీవల పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేశారు. దీనికి తోడు ఇప్పుడు గ్యాస్ సిలెండర్ ధరను ప్రభుత్వం పెంచేసింది. ఇలా ధరలు పెంచుకుంటూపోతే ఎలా బతికేది.? కె.నాగమణి, గృహిణి, దువ్వ -
టపాసుల వ్యాపారుల్లో కనపడని దీపావళి వెలుగు
-
బీసీల ఉన్నతి కోసమే విదేశీ విద్య
కవాడిగూడ: బీసీలు ఉన్నత శిఖరాలకు చేరడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి విదేశీ విద్యను సులభతరం చేసి, ఆర్ధిక సహాయంగా 20 లక్షల నిధులు కేటాయించారని ఆల్ ఇండియా బీసీ డెవలప్మెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు గట్టు రామచందర్‌రావు అన్నారు. శుక్రవారం కవాడిగూడలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణలో భాగంగా బీసీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఏటా విదేశీ విద్య కోసం 300 మంది బదులు 500 మంది విద్యార్థులను ఎంపిక చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్, రాష్ట్ర అధ్యక్షులు సదానంద్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి దూడల శంకర్‌గౌడ్, ఉపాధ్యక్షులు రంగరాజ్ గౌడ్, నాయకులు హరీష్, వీరశంకర్, చంద్రయ్య,ప్రకాష్ గౌడ్, వేణు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన సీపీఎం
కాకినాడ సిటీ : దివీస్ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివీస్ బాధిత గ్రామాల్లో ఒకటైన పంపాదిపేటలో ఈ నెల 6వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు సభ జరగకుండా అడ్డుకున్నారన్నారు. సెప్టెంబర్ 10l, 13, 22 తేదీల్లో ఏదో ఒకరోజు బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్‌ను కోరామని, ఈ మూడు సందర్భాలలోను 144 సెక్షన్ అమలులో ఉన్నందున తాము బహిరంగసభకు అనుమతి ఇవ్వడంలేదని డీఎస్పీ తెలిపారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. -
కొనసాగుతున్న వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మంగళవారం రాత్రి 16 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మంత్రాలయంలో 31.4 మి.మీ., వర్షపాతం నమోదయింది. ఆలూరులో 30.6 మి.మీ., ఆళ్లగడ్డలో 18.4, గోస్పాడులో 18.2, పెద్దకడుబూరులో 16, ప్యాపిలిలో 15.4, తుగ్గలిలో 10, మద్దికెరలో 10 మి.మీ., ప్రకారం వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ., ఉండగా ఇప్పటి వరకు 151.6 మి.మీ., వర్షాలు కురిశాయి. అంటే 21 శాతం అధికంగా వర్షం కురిసింది. 14 మండలాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం నమోదయింది. -
ఆర్నెల్లలో గోవధ, విక్రయాలు నిషేధించండి..!
సిమ్లాః దేశంలో ఆరు నెలల్లో గోవధ నిషేధించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆవు, దూడలు, గొడ్డు మాంసం వాటి ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులతోపాటు, విక్రయాలను సైతం నిషేధించాలని పేర్కొంది. ఇచ్చిన వ్యవధిలోపు నిషేధంపై పూర్తిశాతం చర్యలు తీసుకోవాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బీఫ్ బ్యాన్ పై కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా గోవులు, లేగదూడల అమ్మకాలు, మాంసం ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులపై నిషేధం విధించాలని కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. బీఫ్ బ్యాన్ సమస్య ఆయా రాష్ట్రాల పరిథిలోనికి వస్తుందంటూ గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను కేంద్రం తిరస్కరించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 14 అక్టోబర్ 2015 న కోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించిన జస్టిస్ రాజీవ్ శర్మ, కస్టిస్ సురేష్ వార్ థాకుర్ లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి చురకలు వేసింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. ఇప్పటినుంచీ ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. వివరాలకు సంబంధించిన ఓ కాపీని జాతీయ లా కమిషన్ కు కూడా పంపించింది. గోవులు ప్రజలకు ఆహారాన్ని, ఔషధాలను, అవస్థాపనను అందించే గోవులను వధించడం దారుణమని... ఆవుల రవాణాను నిలిపివేయాలని, వాటి రక్షణకోసం ప్రత్యేకంగా గోశాలలు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ హిమాచల్ రాష్ట్రానికి చెందిన హిందూమత సంస్థ భారతీయ గోవంశ్ రక్షణ్ సంవర్థన్ పరిషద్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ విధంగా ప్రతిస్పందించింది. మొత్తం 71 పేజీల తీర్పులో ఆర్థిక, మత పరమైన రెండింటిలోనూ ఆవు యొక్క ప్రాముఖ్యతను గుర్తించినట్లు కోర్టు తెలియజేసింది. గోరక్షణలో భాగంగానే హిందువులు సైతం గోవును దైవంగా నమ్ముతారని, పవిత్రంగా భావిస్తారని తెలిపింది. -
అవే కూరగాయాలు
దిగిరామంటున్న ధరలు వరదలకు నీటమునిగిన కూరగాయల పంటలు వేసవిలో మండడం మొదలైన కూరగాయల రేట్లు నేటికీ ఆదిశలోనే కొనసాగుతున్నాయి. కొన్నింటి ధర స్వల్పంగా తగ్గినప్పటికీ మిగిలినవాటి రేట్లు పెరగడంతో జనం బెంబేలెత్తుతున్నారు. గోదావరి వరదలు మన ప్రాంతంలోని కూరగాయల పంటలను దెబ్బతీయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అమలాపురం : వేసవి ఆరంభంలో చుక్కలనంటిన కూరగాయల ధరలు ఇప్పటికీ దిగి రావడం లేదు. వేసవి ఎండలకు మన ప్రాంతంలో పంటలు దెబ్బతినడంతో టమాటా, బీన్స్ గింజలు, చిక్కుడు కాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెల నుంచి ఇతర ప్రాంతాల్లో పంట కాలం పూర్తి కావస్తుండడంతో క్యాప్సికమ్, బంగాళాదుంప వంటి వాటి ధరలకు రెక్కలొచ్చాయి. వీటి ధరల తగ్గుతాయనుకుంటున్న సమయంలో గోదావరికి వరదలు రావడంతో కూరగాయ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దాంతో కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. క్యాప్సికమ్ ధర కేజీ రూ.80 వరకు ఉంది. వారం రోజుల క్రితం దీని ధర రూ.90. బీట్రూట్, క్యారెట్ ధరలు రూ.40 ఉండగా, అల్లం ధర రూ.60 వరకు ఉంది. బీన్స్కాయల ధర రూ.60, బంగాళాదుంప రూ.24 నుంచి రూ.26 వరకు ఉంది. టమాటా ధర గత నెలకన్నా తక్కువ అనిపిస్తున్నా ఇప్పటికీ కేజీ రూ.32 వరకు ఉండడం విశేషం. ఇవన్నీ దిగుమతి చేసుకొనేవే. బంగాళాదుంప కోల్‌కతా నుంచి, మిగిలిన కాయగూరలు బెంగళూరు, చిత్తూరుల నుంచి దిగుమతి అవుతున్నాయి. అక్కడ పంట కాలం పూర్తి కావస్తుండడం, ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలతో కొంత పంట దెబ్బతినడం, ఎగుమతులకు అనువైన వాతావరణం లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి. గత వారంతో పోల్చుకుంటే వీటి ధరలు స్వల్పంగా తగ్గినా సాధారణ స్థాయికి వీటి వచ్చే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ముంచిన వరదలు గోదావరికి వచ్చిన వరదలు కూరగాయ రైతులను ఎక్కువగా నష్టపరిచాయి. ఆలమూరు, కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయ పంటలు సాగవుతుంటాయి. చిక్కుడు, గోరుచిక్కుడు, ఆనప, దొండ, బీర, పొట్ల, కాకరకాయ వంటి పందిరి కూరగాయలు, బెండ, టమాట, వంగ వంటి కాయగూరలతోపాటు తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల సాగు ఎక్కువ. ముఖ్యంగా ఆలమూరు, పి.గన్నవరం, అయినవిల్లిలో విస్తృతంగా వీటిని సాగు చేస్తుంటారు. గోదావరి వరదల ప్రభావం ఈ మండలాలపైనే ఎక్కువగా ఉంది. ఉద్యానశాఖ అంచనా ప్రకారం 2,928 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అయితే వాస్తవంగా ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా. ఈ ప్రభావంతో స్థానికంగా పండే ఈ రకం కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. -
‘పాడి పరిశ్రమాభివృద్ధి’ ఆస్తులపై హైకోర్టుకు..
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేయాలని ఏపీ అభ్యర్థన సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆస్తులను తమ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకు బదిలీ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మే 6న జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పునర్విభజన చట్టం ప్రకారం డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆస్తుల విభజన ఇంకా జరగలేదన్నారు. దీనిపై కేంద్ర జోక్యాన్ని కోరామని, కేంద్ర స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లాలాపేటలోని మిల్క్, డెయిరీ యూనిట్లు, చిల్లింగ్ కేంద్రాలు, సోమాజిగూడలోని అతిథి గృహం బదలాయించుకున్న ఆస్తుల్లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎలా బదలాయించుకుంటారు? కేంద్ర నిర్ణయం కోసం ఏపీ సర్కార్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆస్తులను ఎలా బదలాయించుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది ఏకపక్ష చర్య కాదా? అని నిలదీసింది. దీనికి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి బదులిస్తూ.. పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారమే ఆస్తులను బదలాయించుకున్నామన్నారు. ప్రధాన భవనంలో 4 అంతస్తుల్లో 2 అంతస్తులు తాము, 2 అంతస్తులు ఏపీ ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. కామన్ ఫెసిలిటీస్ విషయంలో సంబంధిత కార్యదర్శితో మాట్లాడి తగిన ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు కొంత గడువు కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
భారత సరిహద్దుల్లో భద్రత పెంపు
న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దులనుంచి ఎవ్వరూ భారత్ లోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించింది. అంతర్జాతీయ సరిహద్దులనుంచి భారత్ లోకి ప్రవేశించే మార్గాల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు దేశాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్తోం, మేఘాలయ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి, ఆయామార్గాలనుంచి ఎవ్వరూ దేశంలోకి చొరబడకుండా చూడాలని అధికారులకు, భద్రతా బలగాలకు సూచించింది. ఢాకా దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ బంగ్లాదేశ్ దౌత్య అధికారులతోనూ, సెక్యూరిటీ ఏజెన్సీలతోనూ చర్చిస్తున్నారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే అక్కడి భారతీయులంతా క్షేమంగానే ఉన్నట్లు ఢాకాలోని భారత హై కమిషన్ వెల్లడించింది. ఢాకాలోని గుల్షన్ ప్రాంతం హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్ పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో హోటల్లోని సిబ్బందితోపాటు, అక్కడున్న కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బందీలుగా ఉన్నవారిని రక్షించేందుకు సైనికులు 11 గంటలపాటు శ్రమించారు. భద్రతా దళాలు, ఉగ్రమూకలకు మధ్య జరిగిన పోరులో ఆరుగురు ఉగ్రవాదులు మరణించగా.. ఘటనలో మొత్తం 20 దాకా చనిపోయినట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. సెన్సేషన్లు సృష్టించడం టెర్రరిజం అంతానికి సహకరించదని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడంలో మీడియా ఇతోధికంగా సహకరించాలని ప్రభుత్వం మీడియాకు సూచించింది. బంగ్లాదేశ్ ను స్నేహపూర్వక దేశంగా ఇప్పటికే గుర్తించామని, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది సైతం టెర్రరిజాన్ని అణచివేసేందుకు గట్టి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలిపింది. -
మళ్లీ పసిడి మెరుపులు...
- నాలుగువారాల గరిష్టం - అంతర్జాతీయ అంశాలు కారణం న్యూయార్క్/న్యూఢిల్లీ: యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై అంచనాలు, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపులో ఆలస్యం వంటి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి అంశాలు పసిడికి బలంగా మారుతున్నాయి. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ధర వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్లోనూ పెరిగింది. క్రితం ముగింపుతో పోల్చితే కడపటి సమాచారం అందేసరికి చురుగ్గా ట్రేడవుతున్న ఆగస్టు డెలివరీ కాంట్రాక్ట్ ధర ఔన్స్(31.1గ్రా)కు 10 డాలర్ల లాభంతో 1,286 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే 16 తరువాత ఈ స్థాయికి పసిడి ధర చేయడం ఇదే తొలిసారి. తిరిగి రూ. 30,000 పైకి ఇక దేశీయంగానూ పసిడి పరుగులు తీసింది. కొనుగోళ్ల మద్దతుతో ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒకేరోజు రూ.480 ఎగసింది. రూ.30,070కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే మొత్తం ఎగసి రూ.29,920కి ఎగసింది. వెండి ధర కేజీకి రూ.470 పెరిగి రూ.41,520 వద్దకు చేరింది. -
అధీన రేఖవద్ద హైఅలర్ట్, తీవ్రవాదులకోసం జల్లెడ!
జమ్మూః శ్రీనగర్ సిటీలో సోమవారం ఉదయం జరిగిన ఉగ్రదాడి తమ పనేనంటూ తీవ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిదీన్ ప్రకటించడంతో వారికోసం సైన్యం జల్లెడ పడుతోంది. జడిబల్ పోలీసు స్టేషన్ పై ఉదయం జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందడంతో సైన్యం అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. మెహబూబా ముఫ్తి సారధ్యంలోని పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వేర్పాటువాద గెరిల్లా దాడి జరిగింది. పాకిస్తాన్ మద్దతుతో అక్కడే శిక్షణ పొందిన ఉగ్రవాదులు సరిహద్దులగుండా భారత్ లోకి చొరబడేందుకు చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో సైన్యం నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. భారీగా సాయుధ తీవ్రవాదులు జడిబల్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఏఎస్ఐ అహ్మద్, కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ లు దాడిలో అక్కడికక్కడే మరణించగా.. మరో పోలీసు తీవ్రంగా గాయపడి, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. అయితే ఇటువంటి ఉగ్రదాడులపై ఆర్మీ, పోలీసులు, ఇతర ఏజెన్సీలు దృష్టి సారించాయని టెర్రరిస్టులను ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టేది లేదని జీవోసీ అధికారి సతీష్ దువా తెలిపారు. ఇటువంటి దాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిద్ధంగా ఉన్నాయన్నారు. -
టూరిస్ట్ స్పాట్ లోనూ..!
సిమ్లా: వేసవిలో ఉపశమనం కోసం సిమ్లాకు వెళ్దామనుకుంటున్నారా? అయితే, మీరు తప్పులో కాలేసినట్లే..! ఎప్పుడు చల్లగా ఆహ్లాదంగా ఉండే ఈ టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు హాట్ హాట్ గా ఉంది. శుక్రవారం రికార్డు స్థాయిలో దాదాపు 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో కూల్ కూల్ గా సేద తీరడానికి పట్టణానికి వచ్చిన యాత్రికులందరూ వేడి, ఉక్కపోతతో బెంబేలెత్తిపోయారు. కాగా, దేశవ్యాప్తంగా శుక్రవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్ లో అత్యధికంగా 51 డిగ్రీలు, అహ్మదాబాద్ లో వందేళ్ల గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీలు గా నమోదయింది. -
మండనున్న పప్పు ధరలు
న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ పప్పు ధరలు కొండెక్కనున్నాయా..? గృహవినియోగదారుల బడ్జెట్ లో మళ్లీ వీటి మోత మోగనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. సగటు కన్నా తక్కువగా పప్పుధాన్యాల ఉత్పత్తి అవడంతో ఈ ధరలు భగ్గుమననున్నాయట. ధరలు తగ్గడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నా డిమాండ్-సప్లై కి మధ్య లోటు ఏర్పడటంతో వచ్చే నాలుగు, ఐదు నెలలో ఈ ధరలు పెరగనున్నాయట. సాధారణ రుతుపవనాల కాలం ఏర్పడి వచ్చే పంట కాలంలో తగినంత ఉత్పత్తి మార్కెట్లోకి వస్తేనే ఈ ధరలకు బ్రేక్ పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా 17నెలల పాటు క్షీణత దశలో ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం, ఏప్రిల్ లో మొదటిసారి పెరిగింది. ఆహార, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడంతోనే ఈ ద్రవ్యోల్బణం కొంతమేర పెరిగినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ లో పప్పు ధాన్యాల రిటైల్ ధరలు 37శాతం పెరిగాయి. ఇన్ని నెలలూ టోకు ధరల ద్రవ్యోల్బణంలో ఆహార ఉత్పత్తులు పడిపోయి డీప్లేషన్ కొనసాగినా.... దశాబ్దకాలంగా పప్పుధరలు పెరుగుతూనే ఉన్నాయని గణాంకాలు తెలిపాయి. కరువు నేపథ్యంలో ఆహారధాన్యాల ఉత్పత్తి కొంతమేర తగ్గినా.. మొత్తంగా చూస్తే వీటి ఉత్పత్తి బాగానే ఉందని గణాంకాలు చూపించాయి. గతేడాది 252.02 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఈ ఏడాది(2015-16)లో 252.53 మిలయన్ టన్నులుగా నమోదయ్యాయి. గోధుమ ఉత్పత్తి మాత్రమే 86.53 మిలియన్ టన్నుల నుంచి 94.04మిలియన్ టన్నులకు పెరిగింది. అయితే వరి, ముతక ధాన్యాలు, పప్పుధాన్యాల ఉత్పత్తి మాత్రం పడిపోయ్యాయి. పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోవడంతో, మార్కెట్లో ఉన్న డిమాండ్ ను ఇవి అందుకోలేకపోతున్నాయి. గతేడాది 17.15 టన్నులుగా ఉన్న వీటి ఉత్పత్తి, ఈ ఏడాది 17.06 మిలియన్ టన్నులకు పతనమైందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పప్పుధాన్యాల లోటు నుంచి బయటపడి, వీటి ధరలను అదుపుచేయడానికి ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరను పెంచాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస మద్దతు ధర పెంచడంతోనే వీటి ఉత్పత్తిని పెంచి డిమాండ్ ను పూరించవచ్చని అంటున్నారు. -
దూసుకుపోతున్న బంగారం, వెండి
ముంబై: డాలర్ బలహీనతతో అటు ఆసియా మార్కెట్లు జోరుమీద ఉండగా, ఇటు విలువైనమెటల్ ధరలు కూడా సానుకూల ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి. డాలర్ రికార్డు పతనంతో బంగారం,వెండి,ప్లాటినం, ధరలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. జపాన్ యెన్ తో పోలిస్తే డాలర్ ధర మరింత బలహీనంగా ట్రేడవుతూ వుండటం బులియన్ మార్కెట్ కు ఉత్సాహాన్నిచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది స్తబ్దుగా వున్న బంగారం ధరలు ఊపందుకున్నాయి. మంగళవారం స్వల్ప నష్టాలను నమోదు చేసినా 15 నెలల గరిష్టానిక చేరువలో ఉంది. అటు వెండి ధరలు కూడా నలభైవేల స్థాయికి పైన స్థిరంగా ట్రేడవుతున్నాయి. అమెరికా డాలర్ బలహీనతతో బులియన్ మార్కెట్ లో పాజిటివ్ ట్రెండ్ నెలకొందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రభావంతో పసిడి ధరలు ముప్పయివేలకు పైన నిలదొక్కుకొని ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతాలను అందించింది. అటు సిల్వర్ ధరలుకూడా 15 నెలల గరిష్టానికి చేరువలో ఉన్నాయి. వెండి ధరలు 41, వేలకు పైన స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం 10. గ్రా.30285 రూ. లు వుండగా, వెండి కిలో 41, 217రూ. లుగా నమోదైంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ గత వారం ప్రకటించిన విధానంతో జపాన్ కరెన్సీ యెన్ విలువ భారీగా పెరిగింది. దీని ప్రభావం అమెరికా డాలర్ పైపడడంతో బులియన్ ధరలు 15 నెలల గరిష్టానికి చేరుకోనున్నాయి. అలాగే బులియన్ ఫండ్ వాల్యూ బాగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫండమెంటల్స్ పాజిటివ్ గా ఉన్నాయని అంచనావేస్తున్నారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ ఫండ్స్ అత్యధికంగా పెరిగాయంటున్నారు. అటు భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలతో మొదలై స్థిరంగా ట్రేడవుతున్నాయి. పసిడి నికర లాంగ్ పొజిషన్స్ ఏప్రిల్ తో పోలిస్తే కొద్దిగా తగ్గినప్పటికీ, స్పెక్యులేటివ్ ఆర్థిక పెట్టుబడిదారులు బంగారంవైపు మొగ్గు చూపునున్నారని కామర్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే ట్రెండ్ వెండి, ప్లాటినం, పల్లాడియంకు వర్తిస్తుందని తెలిపింది. స్పెక్యులేటర్ల రికార్డు స్థాయి కొనుగోళ్లతో వెండి ధరలు వరుసగా మూడు వారాలు లాభాల్లో కొనసాగాయని, ఈ బుల్లిష్ ట్రెండ్ ఇకముందు కూడా కొనసాగునుందని పేర్కొంది. అటు వెంటి నాణాలకు కూడా బాగా డిమాండ్ పెరిగినట్టు సమాచారం. మరో విలువైన మెటల్ ప్లాటినంకూడా తన హవాను కొనసాగిస్తోంది. 10 నెలల గరిష్టాన్ని అధిగమించి దూసుకుపోతోంది. ఔన్స్ ధర 1076రూ. పల్లాడియం ఔన్సు దర 617.47 దగ్గర ట్రేడవుతూ పాజిటివ్ ట్రెండ్ తో మార్కెట్ లో మెరుపులు మెరిపిస్తున్నాయి. -
వడదెబ్బకు 51 మంది బలి
♦ రామగుండంలో 45 డిగ్రీలు నమోదు సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో మండుతున్న ఎండలు, వడదెబ్బకు తాళలేక ఆదివారం ఒక్కరోజే 51 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో 11 మంది, కరీంనగర్ జిల్లాలో 10 మంది, ఖమ్మం జిల్లాలో 9 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడుగురు, వరంగల్ జిల్లాలో 8 మంది, మెదక్ జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కరు చొప్పున వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నా.. వడగాడ్పుల తీవ్రత మాత్రం తగ్గడంలేదు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండురోజులపాటు వడగాడ్పులు వీస్తాయని, నాలుగు రోజులపాటు అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత రామగుండం 44.7 నల్లగొండ 44.0 ఖమ్మం 44.0 ఆదిలాబాద్ 43.3 నిజామాబాద్ 43.1 హన్మకొండ 43.0 మెదక్ 42.4 హైదరాబాద్ 42.0 ఆంధ్రప్రదేశ్‌లో.. జంగమేశ్వరపురం 45.0 అనంతపురం 44.2 కడప 44.0 కర్నూలు 43.9 విజయవాడ 42.7 తిరుపతి 42.6 -
నెత్తిపై నిప్పుల వాన
రాష్ట్రంలో భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలు.. తీవ్ర వడగాడ్పులు.. భరించలేని ఉక్కపోతతో తెలంగాణ ఉడికిపోతోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయి. శుక్రవారం తెలంగాణకు అతి వడగాడ్పుల హెచ్చరిక చేసిన వాతావరణ శాఖ దాన్ని శనివారం కూడా కొనసాగించింది. మరో రెండు మూడు రోజులపాటు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఈ సీజన్లోనే శనివారం ఎక్కువ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకటి రెండు మినహా అన్ని ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోయాయి. ఆరు జిల్లా కేంద్రాల్లోనైతే ఏకంగా సాధారణం కంటే ఏడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. మండుతున్న నల్లగొండ, ఖమ్మం నల్లగొండ పట్టణం శనివారం అగ్నిగుండంగా మారింది. వరుసగా రెండు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20 ఏళ్ల రికార్డును బద్దలుకొడుతూ శుక్రవారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. శనివారం 44.8 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఎండ తీవ్రతతో ఖమ్మం జిల్లా భగభగలాడుతోంది. శనివారం కొత్తగూడెంలో ఏకంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో ఆ ప్రాంతం నిప్పులకొలిమిని తలపించింది. ఐదు నిమిషాల పాటు కూడా ఎండలో ఉండలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు విద్యుత్ సరఫరాతో అంతరాయంతో జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మణుగూరులో 46, ఖమ్మం పట్టణంలో 45, భద్రాచలంలో 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లా రామగుండంలో శనివారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం వివిధ జిల్లాల్లో వడదెబ్బకు 54 మంది బలయ్యారు. -
అక్షరాలా అగ్నిగుండమే
తెలంగాణలో నిప్పుల సెగలు 20 ఏళ్లలో తొలిసారి తీవ్ర వడగాడ్పుల హెచ్చరిక రామగుండం, నిజామాబాద్‌లో నిప్పుల వాన కొత్తగూడెం, మణుగూరు, హైదరాబాద్‌ల్లోనూ అంతే సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం పతాకస్థాయికి చేరుకోవటంతో గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ కేంద్రం శుక్రవారం తెలంగాణకు తీవ్ర వడగాడ్పుల హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక శనివారం కూడా అమల్లో ఉంటుందని తెలిపింది. ఏప్రిల్‌లో ఇలా వడగాడ్పుల హెచ్చరిక జారీ చేయడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఐదారు డిగ్రీలు అదనంగా నమోదైతే దాన్ని వడగాడ్పుల పరిస్థితిగా పేర్కొంటారు. సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువైతే తీవ్ర వడగాడ్పుల హెచ్చరిక జారీ చేస్తారు. శుక్రవారం రామగుండంలో 46.1, నిజామాబాద్‌లో 45.1, ఆదిలాబాద్‌లో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు భారత వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది. దీని పరిధిలో తెలంగాణవ్యాప్తంగా 11 అబ్జర్వేటరీలు మాత్రమే ఉన్నాయి. దాంతో మిగతా చోట్ల ఉష్ణోగ్రతలను అది లెక్కించలేకపోతోంది. నిజానికి శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరుల్లో 48 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్థానిక కేంద్రాలు తేల్చాయి. ఆ ప్రాంతాలన్నీ నిప్పుల కొలిమిని తలపించాయి. మణుగూరు, కొత్తగూడెంలలో శుక్రవారం సాయంత్రం తీవ్ర ఈదురుగాలులతో వాన పడటంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ ప్రచండ భానుడి ప్రతాపానికి విలవిల్లాడింది. శుక్రవారం 43 డిగ్రీలు నమోదైంది. నగరంలో ఏప్రిల్‌లో 1973 ఏప్రిల్ 30న నమోదైన ఆల్‌టైం గరిష్టం 43.3 డిగ్రీలకు ఇది దాదాపు సమానం! గాల్లో తేమ 19 శాతానికి తగ్గడంతో వడగాల్పుల ఉదృతితో నగరజీవికి చుక్కలు కనిపించాయి. శని, ఆదివారాల్లోనూ ఎండతోపాటు వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అగ్నిగుండం... రామగుండం... కరీంనగర్ జిల్లా రామగుండంలో 1988లో నమోదైన అల్‌టైం రికార్డు 46.8 డిగ్రీలకు చేరువగా శుక్రవారం 46.1 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్‌లో గత పదేళ్లలో గరిష్టంగా 45.1 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండల్లో 44 డిగ్రీలను మించింది. జూన్‌లో నైరుతి రుతుపవనాలు వచ్చేదాకాఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంటోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు త్వరలో 50 డిగ్రీలకు చేరే ప్రమాదముంది. పశ్చిమ, వాయవ్య వేడి గాలులతో ఉష్ణోగ్రతలు అంతకంతకూ హెచ్చుతున్నాయి. గాల్లో తేమ, మబ్బులు లేక సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతుండటమే ఎండల మంటలకు కారణమని వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యవసర పనుంటే తప్ప ఉదయం 11-సాయంత్రం 4 మధ్య బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బతో 40 మంది మృత్యువాత సాక్షి నెట్వర్క్: వివిధ జిల్లాలో వడదెబ్బతో శుక్రవారం 40 మంది మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎనిమిది మంది, నల్లగొండ జిల్లాలో 11 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో నలుగురు, కరీంనగర్ జిల్లాలో 8 మంది, వరంగల్‌లో ఏడుగురు, మెదక్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతల వివరాలు కేంద్రం గరిష్ఠం కనిష్ఠం రామగుండం 46.1 30.2 నిజామాబాద్ 45.1 32.1 ఆదిలాబాద్ 44.8 26.0 మెదక్ 44.2 28.2 నల్గొండ 44.0 29.0 మహబూబ్‌నగర్ 43.2 30.5 హైదరాబాద్ 43.0 29.8 హన్మకొండ 42.8 25.9 ఖమ్మం 42.0 28.0 భద్రాచలం 42.0 29.0 హకీంపేట 41.4 28.1 -
ఢిల్లీ మెట్రో రైల్లో ఉచిత హైస్పీడ్ వై-ఫై!
న్యూ ఢిల్లీ: ఢిల్లీ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త! ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) రోజువారీ ప్రయాణీకుల కోసం మరో ప్రత్యేక సౌకర్యం కల్పించనుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో వంద శాతం ఉచిత వైఫై సేవలతో రవాణా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా దేశంలోని అతి పెద్ద వీడియో నెట్ వర్క్ సంస్థలైన టెక్నోశాట్ కాం, పింగ్ నెట్ వర్క్ ల తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిరోజూ ఢిల్లీ మెట్రోను వినియోగించే సుమారు 35 లక్షలమంది ప్రయాణీకులకు కావలసిన కంటెంట్ ను సమర్థవంతంగా అందించేందుకు ప్రస్తుతం ఆ సంస్థలు ప్రకటన దారులతో కలసి ఆసక్తిగా ముందుకొస్తున్నాయి. ఇకపై ఢిల్లీ నగరంలో మెట్రోలో ప్రయాణించే వారంతా ఉచిత వైఫై వినియోగించుకునే సౌకర్యాన్ని డీఎంఆర్సీ కల్పించనుంది. ఓ ప్రత్యేక యాప్ ద్వారా ఇంటర్నెట్ లో లాగిన్ అయ్యి, హైస్పీడ్ బ్రాడ్ బాండ్ సౌకర్యాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు ఈ యాప్ ప్రయాణీకులకు అదనపు సౌకర్యాల్లో భాగంగా సమయం ప్రకారం ఆయా ప్రదేశాలను, గమ్యస్థానాలను సూచించడంతోపాటు వివిధ మార్గాల మధ్య నావిగేషన్ గా సహాయపడుతుంది. ఇప్పటికే ఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులో వైఫై సేవలను టెక్నో శాట్ కామ్ అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన యూరప్ లోని థాలిస్, ఎస్ఎన్సీఎఫ్, ఎన్ టీవీ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్ళలో ఉపయోగించే హై స్పీడ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సేవలను అందించే 'టి ట్రాక్ 2.0 వేవ్ టు సొల్యూషన్' నెట్ వర్క్ ను ఇక్కడ వినియోగించనున్నారు. 4 జీ కన్నా మూడు రెట్టు అధికమైన 50 ఎంబిపీఎస్ వైఫై సర్వీస్ ను ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ప్రయాణీకులకు అందించనున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. ప్రతిరోజూ సుమారు 35 లక్షల మంది ప్రాయాణీకులతో నడుస్తున్న ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది ప్రారంభించే కొత్త మార్గాలతోపాటు, ఇంటర్ కనెక్ట్ మార్గాల ఆరంభంతో ప్రయాణీకుల సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తోంది. -
‘మండే’మంటలు
రాష్ట్రంలో 15 చోట్ల 44 డి గ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు చిన్నచింతకుంటలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత పెరుగుతున్న వడదెబ్బ మృతులు.. ఇప్పటికే 150కి చేరిన సంఖ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరుగుతోంది. ఏప్రిల్‌లోనే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో సాధారణం కంటే ఐదారు డిగ్రీలకుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తట్టుకోలేక ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలు దాటిందంటేనే బయటికి రావడానికి జంకుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం వడ్డెమానులో 45.05 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. అలాగే రాష్ట్రంలో 15 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వడగాల్పులు తీవ్రంగా వీస్తుండడంతో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 150 మంది వరకు మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు వడదెబ్బ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇదిలావుంటే వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం విఫలం అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే... వరంగల్ జిల్లా మేడారంలో 44.16 డిగ్రీల ఉష్ణోగ్రత, పరకాలలో 44.53 డిగ్రీలు, దుగ్గొండలో 44.87, కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో 44.02, మహదేవపూర్‌లో 44.82, తిరుమలపూర్లో 44.31, ముస్తాబాద్‌లో 44.28, కొత్తఘాట్లో 44.76, ఖమ్మం జిల్లా ఏడూళ్లబయ్యారంలో 44.82, సీతారాంపట్నంలో 44.87, గార్లలో 44.67, నల్లగొండ జిల్లా మోత్కూర్ లో 44.87 అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌లోని మల్కాపూర్‌లో 42.96, చిలకలగూడలో 41.04, తిర్మలగిరిలో 41.51 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 95 శాతం ప్రాంతంలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు రికార్డు అవడం గమనార్హం. దీంతో ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావడానికి జనం హడలిపోతున్నారు. -
మళ్లీ రూ. 27 వేల పైకి బంగారం
ముంబై: బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముంబై బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 27వేల స్థాయిని దాటి... రూ.27,155కు చేరింది. ఇది ఐదు నెలల గరిష్టం. బుధవారం నాటి ముగింపు రూ.26,980తో పోలిస్తే ఇది రూ.175 అధికం. ముందున్న పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్‌ను తట్టుకోవటానికి ట్రేడర్లు కొంటుం డగా... అంతర్జాతీయ ట్రెండ్ కూడా దీనికి దోహదం చేసింది. అటు వెండి ధర కూడా రూ.515 పెరిగి కేజీ రూ.35,940 వద్ద స్థిరపడింది. పది గ్రాముల (99.9 శాతం) స్వచ్ఛమైన బంగారం ధర బుధవారం రూ. 27,130 కాగా అది గురువారం రూ.175 పెరిగి రూ.27,305 వద్ద నిలిచింది. అటు 99.9 శాతం స్వచ్ఛమైన వెండి ధర కూడా బుధవారం కేజీ రూ.35,940 పలుకగా గురువారం అది ఒక్కసారిగా రూ.515 పెరిగి రూ.35,940కి చేరింది. రెండు వారాల అనంతరం ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకోవడంతో... ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచటం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బీజేపీ రథసారధి ఎన్నికకు రంగం సిద్ధం
-
కరీంనగర్లో 'హై అలర్ట్'
-
బెంగళూరులో బ్యాగ్ కలకలం!
-
విమాన ధరలని మించి బస్సు ఛార్జీలు
-
'కోడి పందేలకు అనుమతివ్వం'
-
చికెన్@డబుల్ సెంచరీ
హైదరాబాద్: చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నా యి. మొన్నటి వరకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.160కి లభించిన స్కిన్లెస్ చికెన్‌పై కిలోకు రూ.40 వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో లైవ్ కోడి కేజీ 120, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.175, స్కిన్లెస్ రూ.205కు అమ్ముతున్నారు. గత వారం చికెన్ (స్కిన్‌తో) కిలో రూ.140, స్కిన్ లెస్ రూ.160 కు లభించింది. సోమవారం నుంచి స్కిన్ లెస్ చికెన్ కేజీ డబుల్ సెంచరీ దాటేసింది. దీంతో సామాన్యులు చికెన్ వైపు చూడాలంటేనే హడలెత్తే పరిస్థితి తలెత్తుతోంది. పండుగల గిరాకీతో... క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల గిరాకీని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు ధరలు పెంచినట్లు తెలుస్తోంది. నగర మార్కెట్లో ఒక్కోచోట ఒక్కోరకంగా ధరలు ఉండటమే ఇందుకు నిదర్శనం. సంక్రాంతి వరకు చికెన్ ధరలు అస్థిరంగానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్లు, మటన్ ధర లు కూడా రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే పప్పులు, నూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో ఆ లిస్ట్‌లో చికెన్ కూడా చేరిపోయిందని మాంసం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పప్పు.. నిప్పు
► ఆకాశాన్నంటుతున్న పప్పుల ధరలు ► కందిపప్పు ధర కిందటేడాదితో పోలిస్తే రెట్టింపు ► గత ఏడాది కిలో రూ. 75.. ఇప్పుడు రూ. 150 ► వారంలోనే రూ. 40 పెరుగుదల ►రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడం.. ►విదేశాల్లో నిల్వలు పడిపోవడమే కారణం ►మిగతా పప్పుల ధరల్లోనూ 35 శాతం నుంచి ► 45 శాతం దాకా పెరుగుదల ► మిర్చి, చింతపండు, వేరుశనగ నూనెల రేట్లూ పైపైకే.. ► కందులకు రికార్డు ధర.. తాండూరు: తాండూరు మార్కెట్లో కందులు రికార్డు ధర పలికాయి. శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు కందులకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,625 ఉండగా గరిష్టంగా రూ.10,400, కనిష్టంగా రూ. 9,950 ధర పలికింది. ఈ ధరలకు యార్డులో 42 క్వింటాళ్ల కందులను కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. సీజన్, అన్ సీజన్లో అయినా కందులకు ఇంత భారీ ధర రావడం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంటే.. మరోవైపు పప్పులు నిప్పుల్లా మండిపోతున్నాయి! రాష్ట్రంలో పప్పుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కంది పప్పు ధర గతేడాది ఇదే సమయంలో రూ.75 ఉండగా ఇప్పుడది రూ.150కి పెరిగింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో 15 శాతం మేర కంది సాగు తగ్గిపోవడం, దిగుమతి చేసుకుంటున్న దేశాల్లోనూ సాగు తగ్గి, నిల్వలు నిండుకోవడంతో భవిష్యత్తులో కంది ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు. ధర పెరగడమే కాదు.. మున్ముందు కంది పప్పుకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఏటా 1.90 లక్షల టన్నుల కందిపప్పు అవసరం ఉండగా గతేడాది కేవలం 80 వేల టన్నుల కందిపప్పు మాత్రమే లభించింది. రబీలో తగ్గిన సాగు కారణంగా కందిపప్పు లభ్యత ఏకంగా 41 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది సైతం కందిసాగు 2.78 లక్షల హెక్టార్లకు గానూ 2.12 లక్షలకు మాత్రమే పరిమితమైంది. మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యా దేశాల నుంచి దీనిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ కూడా వర్షాభావం వల్ల సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పప్పుకు డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడంతో కొరత పెరిగింది. వారం కిందటే కందిపప్పు ధర రూ.110 వరకు ఉందని, కేవలం వారం రోజుల్లోనే ధర అమాంతం రూ.40 మేర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మున్ముందు మరింత పెరుగుదలకు అవకాశం ఉండడంతో కందిపప్పు నిల్వలపై కేంద్రం పరిమితిని విధించింది. హైదరాబాద్‌లో హోల్‌సేలర్ అయితే 4 వేల క్వింటాళ్లు, రిటైలర్ అయితే 125 క్వింటాళ్లను మించి నిల్వ చేయరాదని, మిగతా ప్రాంతాల్లో హోల్‌సేలర్ 2,500 క్వింటాళ్లు, రిటైలర్ 100 క్వింటాళ్లను మించి నిల్వ చేయరాదని నిర్దేశించింది. అయినా మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో వ్యాపారులు పప్పును రహస్యంగా గోడౌన్లకు తరలిస్తున్నారు. పెసళ్లకు పెరుగుతున్న ధర తాండూరు: మార్కెట్ యార్డులో పెసళ్ల ధర కూడా క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం క్వింటాలు పెసళ్లకు గరిష్టంగా రూ.7,590, కనిష్టంగా రూ.6,300, సగటు ధర రూ. 6,800 పలికిందని మార్కెట్ కమిటీ వర్గాలు తెలియజేశాయి. సగటు ధర ప్రకారం రూ. 25.16 లక్షల విలువచేసే 370 క్వింటాళ్ల పెసళ్లను కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. మిగతా పప్పులూ అదే దారి.. పెసర, మినప, శనగపప్పు ధరలూ ఆకాశంలోనే ఉన్నాయి. వీటి సాగు కూడా తగ్గిపోవడంతో 45 నుంచి 55 శాతం వరకు ధరలు పెరిగిపోయాయి. పెసర పప్పు ధర ప్రస్తుతం రూ.110 వరకు ఉండగా మినపపప్పు కిలో రూ.140 నుంచి రూ.150 మధ్య ఉంది. శనగపప్పు రూ.70 వరకూ ఉంది. నిత్యావసర సరుకులు మిర్చీ, చింతపండు, వేరుశనగ నూనె ధరలూ మండిపోతున్నాయి. మిర్చీ ధర గత ఏడాది కిలో రూ.79.35 ఉండగా ఇప్పుడు రూ.105 పైనే ఉంది. వేరుశనగ నూనె ధర గతేడాది రూ.90 ఉండగా.. ప్రస్తుతం రూ.120కి చేరింది. పప్పులు, నిత్యావసర ధరల్లో పెరుగుదల ఇలా.. (రూపాయల్లో) సరుకు గతేడాది ప్రస్తుతం కందిపప్పు(ఒకటో ర కం) 73.64 150 కందిపప్పు(రెండో రకం) 65.18 145 మినప్పప్పు 84.77 140-150 పెసరపప్పు 94.93 110 శనగపప్పు 43.34 70 చింతపండు 67.73 85 మిర్చి 79.35 105 వేరుశనగ నూనె 88.08 110 నెలలో ఒక వ్యక్తి తలసరి వినియోగం ఇలా ఉండాలి సరుకు వినియోగం (గ్రాముల్లో) కందిపప్పు 432 పెసరపప్పు 84 శనగపప్పు 52 మినప్పప్పు 129 శనెగనూనె 241 చింతపండు 69 మిర్చీ 717 సాగు విస్తీర్ణం పడిపోయిందిలా.. (హెక్టార్లలో) పంట సాధారణం సాగు జరిగింది కందిపప్పు 2.78 లక్షలు 2.12 లక్షలు పెసరపప్పు 1.29 లక్షలు 1.04 లక్షలు మినపపప్పు 39 వేలు 27 వేలు వేరుశనగ 21 వేలు 5 వేలు మిర్చీ 58 వేలు 3 వేలు తాండూరులో క్వింటాలు కందులు రూ.10,400 -
పప్పుల మంట..కూరగాయలతో తంటా!
-
భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: బుధవారం నాటి స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 316 పాయింట్ల లాభంతో 27,194 దగ్గర, నిఫ్టీ 96పాయింట్ల లాభంతో 8,223 దగ్గర ప్రారంభయ్యాయి. నిన్నభారీ నష్టాలతో కుప్పకూలిన దేశీయ మార్కెట్లు బుధవారం పాజిటివ్‌గా కనిపించాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ మరియు కాపిటల్ గూడ్స్ సెక్టార్ లోని షేర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. మరోవైపు యూస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి తొమ్మిది పైసలు లాభపడి 64.08 దగ్గర ఉంది. -
ఎయిర్‌ఫోర్స్ భూములుపై పిటిషన్లు కొట్టివేత
అర్హులైనవారి దరఖాస్తులపైనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కోసం సేకరించిన భూమికి పరిహారం చెల్లించాలంటూ వచ్చే అన్ని అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని మెదక్, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లింపు అభ్యర్థనలతో అర్హులైన వ్యక్తుల నుంచి వచ్చే దరఖాస్తులను మాత్రమే ఆధారాలను చూసిన తరువాత పరిగణనలోకి తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించింది. పరిహారం చెల్లింపు నుంచి తీసుకున్న రూ.7.20 కోట్లను తిరిగి సికింద్రాబాద్, డిఫెన్స్ ఎస్టేట్ అధికారికి చెల్లించాలని మెదక్ కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ మొత్తాన్ని మూడేళ్లపాటు తన వద్దనే ఉంచుకుని, ఆ మూడేళ్లలో అర్హులైన వ్యక్తు లు పరిహారం కోసం రాకపోతే, ఆ తరువాత ఆ మొత్తాన్ని రక్షణశాఖ ఖాతాకు మళ్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఇటీవల తీర్పు వెలువరించారు. వివరాలు... మెదక్ జిల్లా, దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఏర్పాటు కోసం 1960-62 సంవత్సరాల్లో మొత్తం 6807 ఎకరాలు సేకరించింది. ఇందులో 5315 ఎకరాలకు అధికారులు కంచె ఏర్పాటు చేశారు. మిగిలిన భూమి కంచె బయట ఉంది. ఈ నేపథ్యంలో దాచారం గ్రామానికి చెందిన కె.బాలమ్మ మరి కొం దరు అకాడమీ ఎదురుగా ఉన్న భూమి నుంచి అధికారులు తమను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను తెప్పిం చుకుని పరిశీలించారు. కంచె బయట ఉన్న భూములను గతంలో పరిహారం చెల్లించిన తరువాతనే సేకరించారని తేల్చారు. కాబట్టి పిటిషనర్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. పిటిషనర్లకు జరిమానా విధిస్తూ పిటిషన్లను కొట్టివేశారు. -
ఆ వ్యత్యాసాలెందుకు?
పూర్తి వివరాలను మా ముందుంచండి జేఎన్టీయూకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని సౌకర్యాలు ఏఐసీటీఈ, పీసీఐ నిబంధనల మేరకు ఉన్నాయో..? లేదో..? తేల్చేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ సమర్పించిన నివేదికలోని వివరాలతో జేఎన్టీయూ (హైదరాబాద్) సమర్పించిన నివేదిక వివరాలు సరిపోలకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని జేఎన్టీయూ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), భారతీయ ఫార్మసీ మండలి (పీసీఐ) నిర్ధేశించిన నిబంధనల మేరకు 143 ఇంజనీరింగ్, 7 ఫార్మసీ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేవని, ఆ కాలేజీల్లో భారీ లోపాలున్నాయని, అందువల్ల వాటికి అఫిలియేషన్‌ను నిరాకరిస్తున్నట్లు పేర్కొంటూ జేఎన్టీయూ గత నెల 29న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీన్ని సవాల్‌చేస్తూ కాలేజీలు గురువారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
బుల్ జోరు, సెన్సెక్స్ న్యూ హై!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు కోనసాగుతోంది. సోమవారం ఆరంభంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 28027 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల వృద్ధితో 8383 పాయింట్లను నమోదు చేసుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల ప్రభావం, బ్లూచిప్ కంపెనీల షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ పరుగు కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హ్యాంగ్ సెంగ్ 389 పాయింట్లు, తైవాన్ 133 పాయింట్ల లాభాన్ని నమోదు చేసుకున్నాయి. సన్ ఫార్మా, ఐటీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లార్సెన్, జిందాల్ స్టీల్, సిప్లా, హిండాల్కో, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
సత్వర తీర్పుతోనే నమ్మకం
పీలేరు, న్యూస్‌లైన్: కేసుల సత్వర తీర్పుతోనే ప్రజలకు న్యాయస్థానాలపై నమ్మకం ఏర్పడుతుందని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ కే.చంద్రభాను అన్నారు. శనివారం పీలేరులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆయన ప్రారంభించారు. 22 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎప్పుడు జిల్లాకు వచ్చినా సొంత ఊరికి వచ్చినంత ఆనందంగా ఉంటుందన్నారు. తీర్పులు త్వరితగతిన, సత్వరం పరిష్కరించేలా న్యాయవాదులు కృషిచేయాలన్నారు. ఓ పంచాయతీ కేం ద్రంలో ఐదు కోర్టులు ఉన్న దాఖలా లు పీలేరులో మినహా రాష్ట్రంలో మరెక్కడా లేవన్నారు. పీలేరు బార్ అసోసియేషన్ పనితీరు బాగుందని కితాబిచ్చారు. స్థానికంగా కోర్టు భవనాల నిర్మాణం కోసం 2.47 ఎకరాల స్థలాన్ని ఇచ్చారని, ఇందుకోసం మార్కెట్ విలువ ప్రకారం రూ.1.6 కోట్లు గతంలోనే చెల్లించామని గుర్తుచేశారు. ఇప్పుడు మరో రూ.కోటి చెల్లిస్తే స్థలాన్ని పూర్తి స్థాయిలో అప్పగిస్తామని రెవెన్యూ మెలిక పెట్టినట్లు వాపోయారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక న్యాయవాదులకు సూచించారు. తక్కువ మంది న్యాయమూర్తులు ఉన్నందున అన్ని కోర్టులలో జడ్జీల నియామకం చేపట్టలేకపోయామన్నారు. అంతకుముందు జస్టిస్ కేసీ.భానుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం ఆయన్ను స్థానిక బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రవిబాబు, మూడో అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు, 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి రాజమౌళిశర్మ, పీలేరు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు వీ.కృష్ణమూర్తి, వెంకట కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఎం.డీ.రఫీఅన్సారీ, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు 5 కొత్త కోర్టులు మదనపల్లెక్రైం : చిత్తూరు జిల్లాకు ఐదు కొత్త కోర్టులు మంజూరైనట్టు హైకోర్టు న్యాయమూర్తి కే.చంద్రభాను తెలిపారు. శనివారం మదనపల్లె రెండో అదనపు జిల్లా కోర్టు ఆవ రణలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కోర్టులపై సమీక్ష నిర్వహించినప్పుడు మదనపల్లెలో 3 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బార్ అసోసియేషన్ సభ్యుల సూచన మేరకు అదనపు కోర్టును మంజూరు చేయిం చామని ఆయన వెల్లడించారు. తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో 10 ఎకరాల విస్తీర్ణంలో కోర్టుల సముదాయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. మదనపల్లె బార్ అసోసియేషన్ నూతన కార్యాలయ నిర్మాణానికి 16 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు గుర్తుచేశారు. జిల్లాలో ప్రస్తుతం 54 కోర్టులు ఉన్నాయని, శనివారం పీలేరులో ఒక కోర్టు, మదనపల్లెలో మరో కోర్టు ప్రారంభించడంతో ఈ సంఖ్య 56కు పెరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు వెంకట్రమణ, ఎస్ఎస్ఎస్ జయరాజ్‌లు పాల్గొన్నారు. -
కలగా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం
ఝరాసంగం, న్యూస్‌లైన్ : మండలంలోని ఏడాకులపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ైెహ లెవల్ బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిపోయేలా ఉంది. ఏడాది కింద ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు కింద రూ. 2 కోట్ల 45 లక్షలను విడుదల చేసింది. ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపారు. బ్రిడ్జి నిర్మాణం కోసం మొదట జేసీబీలతో గుంతలు తీశారు. పనులు చురుగ్గా సాగుతున్న సమయంలో వర్షాలు కురిసి నీరంతా గుంతల్లోకి చేరడంతో పనులు ముందుకు సాగ లేదు. తరువాత ఎండకాలంలో కూడా కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం మొదలైంది. దీంతో పనులు చేపట్టే అవకాశం లేదు. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారా? బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందా? అని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో అందులో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. మండల పరిధిలోని జీర్లపల్లి గ్రామ సమీపంలో సైతం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి అయినా అప్రోచ్ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే నోటీసులిచ్చాం బ్రిడ్జి నిర్మాణంలో జాప్యానికి గల కారణాలపై ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులి చ్చాం. ఏడాది క్రితం పనులు ప్రారంభించినా అ ప్పుడే వర్షాలు పడడం, దీనిని తోడు గోతుల్లో వ ర్షపు నీరు నిల్వ ఉండడంతో పనులు చేయలేకపోయారు. ప్రస్తుతం నీటిని మోటార్ల ద్వారా తోడి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. - గంగాధర్, డీఈ