మళ్లీ రూ. 27 వేల పైకి బంగారం
ముంబై: బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముంబై బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 27వేల స్థాయిని దాటి... రూ.27,155కు చేరింది. ఇది ఐదు నెలల గరిష్టం. బుధవారం నాటి ముగింపు రూ.26,980తో పోలిస్తే ఇది రూ.175 అధికం. ముందున్న పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ను తట్టుకోవటానికి ట్రేడర్లు కొంటుం డగా... అంతర్జాతీయ ట్రెండ్ కూడా దీనికి దోహదం చేసింది. అటు వెండి ధర కూడా రూ.515 పెరిగి కేజీ రూ.35,940 వద్ద స్థిరపడింది.
పది గ్రాముల (99.9 శాతం) స్వచ్ఛమైన బంగారం ధర బుధవారం రూ. 27,130 కాగా అది గురువారం రూ.175 పెరిగి రూ.27,305 వద్ద నిలిచింది. అటు 99.9 శాతం స్వచ్ఛమైన వెండి ధర కూడా బుధవారం కేజీ రూ.35,940 పలుకగా గురువారం అది ఒక్కసారిగా రూ.515 పెరిగి రూ.35,940కి చేరింది. రెండు వారాల అనంతరం ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకోవడంతో... ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచటం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.