హైకోర్టును ఆశ్రయించిన సీపీఎం
Published Wed, Sep 28 2016 11:13 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM
కాకినాడ సిటీ : దివీస్ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివీస్ బాధిత గ్రామాల్లో ఒకటైన పంపాదిపేటలో ఈ నెల 6వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు సభ జరగకుండా అడ్డుకున్నారన్నారు. సెప్టెంబర్ 10l, 13, 22 తేదీల్లో ఏదో ఒకరోజు బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్‌ను కోరామని, ఈ మూడు సందర్భాలలోను 144 సెక్షన్ అమలులో ఉన్నందున తాము బహిరంగసభకు అనుమతి ఇవ్వడంలేదని డీఎస్‌పీ తెలిపారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు.
Advertisement
Advertisement