
వడదెబ్బకు 51 మంది బలి
♦ రామగుండంలో 45 డిగ్రీలు నమోదు
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో మండుతున్న ఎండలు, వడదెబ్బకు తాళలేక ఆదివారం ఒక్కరోజే 51 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో 11 మంది, కరీంనగర్ జిల్లాలో 10 మంది, ఖమ్మం జిల్లాలో 9 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడుగురు, వరంగల్ జిల్లాలో 8 మంది, మెదక్ జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కరు చొప్పున వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నా.. వడగాడ్పుల తీవ్రత మాత్రం తగ్గడంలేదు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండురోజులపాటు వడగాడ్పులు వీస్తాయని, నాలుగు రోజులపాటు అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
ఆదివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
రామగుండం 44.7
నల్లగొండ 44.0
ఖమ్మం 44.0
ఆదిలాబాద్ 43.3
నిజామాబాద్ 43.1
హన్మకొండ 43.0
మెదక్ 42.4
హైదరాబాద్ 42.0
ఆంధ్రప్రదేశ్‌లో..
జంగమేశ్వరపురం 45.0
అనంతపురం 44.2
కడప 44.0
కర్నూలు 43.9
విజయవాడ 42.7
తిరుపతి 42.6