కరప హైస్కూల్ డిజిటల్ క్లాస్ ఆదర్శప్రాయం
కరప హైస్కూల్ డిజిటల్ క్లాస్ ఆదర్శప్రాయం
Published Tue, Feb 21 2017 11:07 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
రాష్ట్రంలో సెకండ్, జిల్లాలో ఫస్టు
కరప (కాకినాడ రూరల్) : డిజిటల్ క్లాస్ నిర్వహణలో రాష్టంలో కరప హైస్కూలు ద్వితీయ స్థానం, జిల్లాలో ప్రథమస్థానం సాధించింది. ఈ విషయాన్ని అమరావతి విద్యా కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఈ గవర్నన్స్ కన్సల్టెంట్ సత్య సందీప్, డెవలప్‌మెంట్ కన్సల్టెంట్ ఎం.వంశీ తెలిపారు. స్థానిక నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా విద్యా శాఖ ఏపీఓ వి.సత్యనారాయణతో కలిసి వారు సందర్శించారు. డిజిటల్ క్లాస్ రూమును, విద్యాబోధన పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తంచేశారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను 172 గంటలు వినియోగించి గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రథమస్థానం పొందిందని వారు తెలిపారు. 152 గంటలతో కరప హైస్కూలు ద్వితీయ స్థానంలో ఉందన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను, అమలుచేస్తున్న టైంటేబుల్ వారు పరిశీలించారు. తాడేపల్లి, కరప హైస్కూళ్లు అనుసరిస్తున్న టైంటేబుల్, నిర్వహణ పరిశీలించి నివేదికను విద్యాశాఖ కమిషనరేట్‌కు అందజేస్తామన్నారు. రాష్టంలో మిగిలిన హైస్కూళ్లు కూడా ఈ విధానాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోజుకో సబ్జెక్టు చొప్పున విద్యార్థులకు చేస్తున్న డిజిటల్ బోధన చేస్తున్నట్టు వారికి హెచ్‌ఎం పీవీఎన్ ప్రసాద్ వివరించారు. స్టాఫ్ సెక్రటరీ కె.సాంబశివరావు, ఉపాధ్యాయులు టి.కృపాలాల్, జీవీ రంగనాథ్, పీఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement