karapa
-
పుంగనూరు గిత్త దూడ ఎత్తు 16 అంగుళాలు
కాకినాడ జిల్లా, కరప మండలం జెడ్. భావారం గ్రామంలో పుంగనూరు జాతి గిత్త దూడ 16 అంగుళాల ఎత్తుతో జన్మించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మరీ పొట్టిగా ఉండటంతో గ్రామంలోని రైతులు వింతగా చూస్తున్నారు. పుంగనూరు ఆవు బుధవారం ఉదయం ఈ దూడకు జన్మనిచ్చిందని ఆ గ్రామానికి చెందిన రైతు కంచెర్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ దూడ 16 అంగుళాల ఎత్తు, 36 అంగుళాల పొడవు, 4 కిలోల బరువు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. – కరపరైతులకు ‘జల’గండంవరుసగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామ రైతులకు కష్టాలు తప్పడం లేదు. వీరి పంట భూములు బాహుదానదికి అవతల ఉండటంతో ఏటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు బాహుదా గెడ్డలోకి నీరు చేరడంతో కోత కోసిన ధాన్యం ఓవులను ఇంటికి తెచ్చేందుకు రైతులు పీకల్లోతు నీటిలోకి దిగాల్సి వచ్చింది. ప్రభుత్వం మినీ వంతెన నిర్మిస్తేనే ‘జలగండం’ తప్పుతుందని అన్నదాతలు చెబుతున్నారు. – ఇచ్ఛాపురం రూరల్‘మా రోడ్డు చూడండి..’తమ రోడ్డు దుస్థితిని చూడాలంటూ విజయనగరం జిల్లా వంగర మండలం భాగెంపేట యువకులు రోడ్డుకోసం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అరసాడ జంక్షన్ నుంచి భాగెంపేట వరకు అధ్వానంగా ఉన్న రోడ్డును డ్రోన్ కెమెరాలో బుధవారం చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నీలయ్యవలస, భాగెంపేట, పటువర్ధనం, శ్రీహరిపురం, దేవకివాడ ఆర్అండ్ఆర్ కాలనీ గ్రామాలకు ఈ గోతులమయమైన రోడ్డే గతని, అధికారులు సమస్యపై స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో బస్సు సర్వీసును నిలిపివేశారని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించకుంటే నిరసన తెలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – వంగరచదవండి: బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..! -
వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..
తన ప్రేమను కాదందన్న అక్కసుతో మానవ మృగంలా మారిపోయి యువతిని దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. కత్తిలో నరికి అత్యంత దారుణంగా అమాయకురాలిని పొట్టన పెట్టుకున్నాడు. ఉన్మాదిలా మారి తమ కూతురి ప్రాణం బలిగొన్న రాక్షసుడిని ఉరి తీయాలని హతురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ క్రైం: ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్యనారాయణ చేతిలో హతమైన కాదా దేవికపై జరిగిన దాడి అత్యంత పాశవికమైనదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. కాకినాడ జీజీహెచ్‌లో దేవిక మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి నివేదిక ప్రకారం.. దేవికను నిందితుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమె ముఖం, మెడ భాగాల్లో లోతైన గాట్లు పడ్డాయి. సూర్యనారాయణ ఆమె కాలర్ బోన్లో కత్తి దింపి ఎడమ వైపునకు చీల్చేశాడు. రెండువైపులా నరకడంతో మెడలోని రక్తనాళాలు పూర్తిగా తెగిపోయాయి. దేవిక మరణానికి అదే కారణమని గుర్తించారు. విచక్షణారహితంగా కత్తితో పొడుస్తూండటంతో దేవిక రెండు చేతులూ అడ్డం పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేసింది. అయితే అంతకు మించిన బలంతో అతడు కత్తితో పొడవడంతో దేవిక రెండు మోచేతుల పైభాగాల్లో లోతైన గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఎడమ చేతి ఎముకను సత్యనారాయణ నరికేశాడు. ఆమె రెండు భుజాలు శరీరం నుంచి వేరు పడ్డాయి. ఎడమ భుజానికి ఆధారమైన హ్యూమరస్ ఛిద్రమైంది. అక్కడి ఎముకలో సైతం కత్తి దిగింది. కత్తి నేరుగా మెడలో దించిన ఆనవాళ్లున్నాయి. దేవిక శరీరంలో మొత్తం 15 బలమైన గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆ రాక్షసుడిని ఉరి తీయాలి చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం చేసుకుంటుందనుకుంటే ఇలా దారుణంగా హత్యకు గురవుతుందని ఊహించలేదని దేవిక కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తమ వద్దే పెరిగి, చదువుకుంటోందని, ఉద్యోగం వస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందని అనుకుంటే దేవుడు అన్యాయం చేశాడంటూ దేవిక అమ్మమ్మ బోరున రోదించింది. అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటుందని హైదరాబాద్‌లో తాము నిశ్చింతగా ఉంటే కిరాతకుడి చేతిలో తమ కూతురు బలైపోయిందని దేవిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెని హత్య చేసిన రాక్షసుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. (క్లిక్: ప్రేమోన్మాది ఘాతుకం.. పట్టపగలే నడిరోడ్డుపై కిరాతకం) దేవిక కుటుంబానికి ప్రభుత్వం అండ: మంత్రి చెల్లుబోయిన వేణు రామచంద్రపురం/కె.గంగవరం: ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కాదా దేవిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడి ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కరప మండలం కూరాడలో హత్యకు గురైన కాదా దేవిక తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను మంత్రి వేణు కె.గంగవరంలో ఆదివారం సాయంత్రం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఆటవికంగా హత్యకు పాల్పడిన హంతకుడిపై ప్రభుత్వం తర్వతగతిన విచారణ పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు ప్రస్తావించకూడదని, ప్రతి ఒక్కరూ ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం మండల విప్ కొప్పిశెట్టి లక్ష్మణ్, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు నరాల ఏడుకొండలు, వైఎస్సార్సీపీ నాయకుడు పంపన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరిట బురిడీ
కరప: మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన మాయమాటలకు ఒక యువకుడు మోసపోయి రూ.12.33 లక్షల వరకు పోగొట్టుకున్న ఘటన కరప మండలం వేములవాడ శివారు సిరిగలపల్లంకలో వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం రాకపోయేసరికి మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు కరప పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కరప ఎస్సై డి.రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు... వేములవాడ శివారు సిరిగలపల్లంక గ్రామానికి చెందిన గుత్తుల లోవరాజు ఐటీఐ చదివాడు. ఏ ఉద్యోగం రాకపోయేసరికి స్థానికంగా రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. లోవరాజు ఏడాదిన్నర క్రితం వరసకు సోదరి అయిన విజయవాడ అడ్డరోడ్డులో ఉంటున్న మేడిశెట్టి దుర్గ ఇంటికి వెళ్లాడు. దుర్గ పొరుగున ఉండే దాసరి సువర్ణకుమారికి తమ్ముడు లోవరాజును పరిచయం చేసి, ఏదైనా ఉద్యోగం చూడాలని అడిగింది. తెలిసినవారున్నారని, వారితో మాట్లాడి, ఉద్యోగం వచ్చేలా చేస్తానని సువర్ణకుమారి నమ్మకంగా చెప్పింది. వీరి మాటలు నమ్మిన లోవరాజు రూ.1.90 లక్షలు దుర్గ ఖాతాకి, రూ.2.19 లక్షలు గోవాడ జాస్మిన్ ఖాతాకు, రూ.65 వేలు శ్రీరాముని శివరామకృష్ణప్రసాద్‌కు, రూ.50 వేలు నాగేంద్రకు, రూ.54 వేలు చిట్టూరి వెంకటేశ్వరరావుకి, రూ.80 వేలు బసువర్తుల శ్రీనివాస్‌నాయక్‌కు, రూ.25 వేలు చప్పిడి దుర్గాలక్ష్మి ఖాతాలకు ఫోన్‌పే ద్వారా దఫదఫాలుగా జమ చేశాడు. తర్వాత తన సోదరి దుర్గ సమక్షంలో రూ.5.50 లక్షలు సువర్ణకుమారికి చెల్లించాడు. ఇలా రూ. 12.33 లక్షలు చెల్లించిన తర్వాత ఉద్యోగం రాకపోయేసరికి దుర్గ, సువర్ణకుమారిలను అడగడంతో సమాధానం చెప్పకుండా విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. చాలాసార్లు అడిగినా పట్టనట్టు వ్యవహరించారు. గతేడాది ఫిబ్రవరి నెల 22వ తేదీన బాలగంగాధర్ తిలక్ మేనేజ్మెంట్, ఏడీఎం ఏపీజెన్కో, విజ్జేశ్వరం పేరిట తప్పుడు జాయినింగ్ ఆర్డర్ తయారు చేసి, ఆఫీసు నుంచి కాల్ వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరాలని లోవరాజుకు చెప్పారు. వారి మాయమాటలు నమ్మిన లోవరాజు ఇంటికి వచ్చేశాడు. ఎంతకూ కాల్ లెటర్ రాకపోయేసరికి వారిచ్చిన ఆర్డర్ కాపీ అడ్రస్‌కు వెళ్లి అడగగా ఫోర్జరీ సంతకాలతో అపాయిమెంట్ లెటర్ ఇచ్చారని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. సొమ్ములు తీసుకున్నవారిని నిలదీయడంతో దుర్భాషలాడుతూ, దిక్కున్నచోట చెప్పుకోమంటూ నిర్లక్ష్యంగా చెప్పడంతో జరిగిన మోసాన్ని గ్రహించాడు. కరప పోలీసుస్టేషన్లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రమేష్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామ వలంటీర్ నుంచి సర్పంచ్‌గా..
కరప: గతనెల వరకు ఆమె గ్రామ వలంటీర్. నేటి నుంచి గ్రామ సర్పంచ్. తమ కళ్ల ముందు తిరుగుతూ కనిపించే అమ్మాయి సర్పంచ్ అయిందంటే ఆ గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కరప మండలం గొర్రిపూడి గ్రామానికి చెందిన కానూరు రమాదేవి ఇంటర్ వరకు చదువుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రామవలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొంది, గ్రామవలంటీర్‌గా విధుల్లోకి చేరింది. ఏడాదిన్నరగా తనకు కేటాయించిన 50 కుటుంబాలను కలసి, ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు రావడంతో గొర్రిపూడి గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. వైఎస్సార్ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు చీకాల సుబ్బారావు ప్రోత్సాహంతో రమాదేవి వలంటీర్ పదవికి రాజీనామా చేసి, పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. ఈ గ్రామంలో జరిగిన త్రిముఖపోటీలో 508 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 4,229 ఓట్లు పోలవ్వగా రమాదేవికి 2002, సమీప ప్రత్యర్థికి 1494 ఓట్లు, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి 613 ఓట్లు రావడంతో 508 ఓట్ల మెజార్టీతో గ్రామవలంటీర్ రమాదేవి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి కురసాల కన్నబాబు, గ్రామపెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కొత్త ఎన్నికైన సర్పంచ్ రమాదేవి తెలిపారు. (చదవండి: 24ఏళ్లకే సర్పంచ్..) వీరికి లక్కుంది..! -
గ్రామ సచివాలయాలను ప్రారంభించిన సీఎం జగన్
-
తండ్రి విద్యనందిస్తే..తనయుడు ఉద్యోగమిచ్చాడు..
సాక్షి, కాకినాడ: ‘తండ్రి విద్యనందిస్తే...తనయుడు ఉద్యోగం అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అలాంటి ఉద్యోగదాత జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ద్వారా నాకు ఓ బంగారు భవిష్యత్‌ను అందించారని’ విలేజ్ సర్వేయర్‌గా ఎంపికైన విజయదుర్గ తెలిపింది. తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయదుర్గ మాట్లాడుతూ..‘మా నాన్నగారు సామాన్య ఆటో డ్రైవర్. నేను రెండో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ ఆస్తమా పేషెంట్ అయినా... ఆమె మందుల ఖర్చును పక్కనపెట్టి మా చదువుల కోసం వెచ్చించి పదో తరగతి వరకూ చదివించింది. ఇక పై చదువులు చదవలేనని అనుకుంటున్న సమయంలో... మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తండ్రిగారు విద్యనందిస్తే...తనయుడు ఉద్యోగం అందించారు. ఎల్లప్పుడూ రుణపడి ఉంటా’ అని పేర్కొంది. నన్ను ఉద్యోగవంతుడిని చేశారు.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో తాము భాగస్వామ్యులు కావడం ఆనందంగా ఉందని... గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలనను అందించేలా తమ వంతు కృషి చేస్తామని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా ఎంపికైన సాయి మణికంఠ తెలిపాడు. ‘తండ్రి విద్యకు సహకారం అందించి విద్యావంతుడ్ని చేస్తే... ఆయన తనయుడు జగనన్న సచివాలయ ఉద్యోగం ఇచ్చి... ఉద్యోగవంతుడిని చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే ఇన్నివేల ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగులంతా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 13వేలమందిమి ఎంపిక అయ్యాం. గత మూడేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నా. లక్షల ఉద్యోగాలను ఎంతో పారదర్శకంగా చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. ఆయన ‘చెప్పిందే చేస్తాను... చేసేదే చెబుతాను’ అంటూ... మేనిఫెస్టోనే భగవద్దీత, ఖురాన్, బైబిల్‌గా పేర్కొన్నారు. ‘నేను విన్నాను...నేను ఉన్నాను’ అని వైఎస్ జగన్ ఎలా చెప్పారో..అలాగే సచివాలయ ఉద్యోగులుగా మేము కూడా అలానే పని చేస్తాం.’ అని మణికంఠ స్పష్టం చేశాడు. నా బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తా.. డిజిటల్ అసిస్టెంట్ మంగాదేవి మాట్లాడుతూ...మా నాన్నగారు సాధారణ రైతు. మేం నలుగురు సంతాపం. చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు. మా నాన్నగారు చదవించే స్థాయిలో లేనప్పుడు... వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకున్నాం. గవర్నమెంట్ ఉద్యోగం చేయడం నా కల. దాన్ని సాకారం చేసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారం అందించారు. టాలెంట్ అందరికీ ఉంటుంది. అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆ అవకాశం ఉపయోగించుకుని నేను మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి...మాట తప్పిన ముఖ్యమంత్రిని చూపాం. అయితే... చెప్పింది చేసి చూపించిన ముఖ్యమంత్రి మన ముందు ఉన్నారు. ఉద్యోగ నిర్వహణలో.. నిష్పక్షపాతంగా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తాను’ అని తెలిపింది. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన విజయదుర్గ, సాయి మణికంఠ, మంగాదేవికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. చదవండి: సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు -
వాళ్లందరికీ స్మార్ట్ఫోన్లు: సీఎం జగన్
సాక్షి, తూర్పు గోదావరి: గ్రామ సచివాలయాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ముఖ్యమంత్రి గ్రామ సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలన్నారు. అవినీతిరహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్ప ప్రయత్నమే సచివాలయ వ్యవస్థ అని సీఎం స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి గ్రామంలో 10శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రతి రెండువేల మంది జనాభాకు ఒక సచివాలయంను ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు. సచివాలయ ఉద్యోగులందరికీ స్మార్ట్ఫోన్లు అందిస్తామని సీఎం ప్రకటించారు. అలాగే ప్రతి 50 ఇళ్లకు అదనంగా ఒక వాలంటీర్‌ను నియమించామన్నారు. సభలో సీఎం మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. 1,34,978 మందికి శాశ్వత ఉద్యోగాల కల్పన రికార్డ్. ఇకపై గ్రామల్లోనే 500కుపైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2020 జనవరి 1 నాటికి గ్రామ సచివాలయాల్లో పూర్తి సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారానే రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడమే మా లక్ష్యం. ప్రభుత్వ పథకాలను, పాలనను ప్రతి గడపకు తీసుకెళ్లడం మా ధ్యేయం. గ్రామాల్లో పాలన చాలా అధ్వానంగా ఉంది. గత ప్రభుత్వంలో లంచాలు ఇవ్వనిదే పని జరిగేది కాదు. అలాంటి వ్యవస్థను శాశ్వతంగా రూపుమాపడమే సచివాలయాల కర్తవ్యం. చదవండి: ఏపీలో అందుబాటులోకి గ్రామ సచివాలయ వ్యవస్థ 25లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు గుడిబడి అన్న తేడా లేకుండా ప్రతి గ్రామంలో బెల్టు షాపులను తెరిచిన చరిత్ర గత పాలకులది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే మద్యం అమ్మకాలను 20శాతం తగ్గించాం. ఉగాది నాటికి ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులను కల్పిస్తాం. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా మా పాలన సాగుతోంది. రానున్న రోజుల్లో కచ్చితంగా వందశాతం అక్షరాస్యతను సాధిస్తాం. ప్రతి ప్రభుత్వ పథకాలను డోర్‌డెలివరీ చేస్తాం. ఎవరైనా వాలంటీర్లు అవినీతి, పక్షపాతానికి పాల్పడితే 1902కు ఫోన్ చేసి నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. అక్టోబర్ 15న వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభిస్తాం. జనవరి 26న అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం. ఉగాది నాటికి 25లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం’ అని అన్నారు. -
ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఈ కార్యక్రమానికి లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి గ్రామ సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలు ఇవాళ్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సచివాలయ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అంకిత భావంతో సేవలు అందించాలని ఆయన ....ఉద్యోగులకు సూచిస్తూ ఆటోగ్రాఫ్ చేశారు. అనంతరం హైస్కూలు గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ స్ధలానికి చేరుకున్న సీఎం జగన్ ప్రభుత్వ పథకాల ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అలాగే సభా వేదికపై అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. కాగా సచివాలయాల్లో పని చేయడానికి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1,34,918 లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. -
కరపలో సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు తొలి అడుగు మహాత్ముని జయంతి రోజైన బుధవారం వేస్తున్నారు. గ్రామ సచివాలయం ప్రారంభించేందుకు బుధవారం ఉదయం ఆయన తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో కాకినాడ రూరల్ నియోజకవర్గపరిధిలోని కరప గ్రామానికి బయల్దేరారు. సీఎం జగన్ పర్యటన వివరాలు: ⇔హెలికాప్టర్లో బయలుదేరి 10.30 గంటలకు కరపలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ⇔ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారులో 10.35 గంటలకు కరప గ్రామ సచివాలయం వద్దకు చేరుకుంటారు. సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి లోనికి తీసుకెళతారు. అక్కడ ఏర్పాటుచేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించి, గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి, సచివాలయ ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ⇔ 10.50 గంటలకు గ్రామ సచివాలయం నుంచి బయలుదేరి పక్కనే హైస్కూలు గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ స్ధలానికి 10.55 గంటలకు చేరుకుంటారు. ⇔ 11.10 గంటల వరకు సభాస్ధలివద్ద ఏర్పాటు చేసిన స్టాఫ్‌ను సీఎం జగన్ సందర్శిస్తారు. అక్కడే గ్రామసచివాలయం స్టాప్‌తో ఇంటరాక్ట్ అవుతారు. 11.10 గంటలకు సభాస్థలికి సీఎం జగన్ చేరుకుని అక్కడ గాంధీ మహాత్ముని, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి, దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం జ్యోతి వెలిగిస్తారు. వందేమాతరం ప్రార్థనతో సభా కార్యక్రమాలను ప్రారంభమవుతాయి. ⇔ 11.20 కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఐదు నిమిషాలు ప్రసంగించి, జిల్లా రిపోర్టు ఇస్తారు. 11.55 గంటల వరకు మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని తదితరులు ప్రసంగిస్తారు. తర్వాత ఇద్ద రు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాలను సీఎం జగన్ అందజేస్తారు. ⇔ ఆ తర్వాత రామవరం హైస్కూలు చదువుతున్న 10వ తరగతి విద్యార్ధిని హర్షిత 4 లక్షల ముత్యాలతో రూపొందించిన నవరత్న పథకాల ప్రేమ్‌ను, 6వ తరగతి విద్యార్ధి సాయికిరణ్ 2,700 పేపర్ క్లిప్సింగ్స్‌తో తయారు చేసిన పాదయాత్ర ఆల్బమ్‌ను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. తర్వాత సీఎం స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేస్తారు. ⇔ మధ్యాహ్నం 12.10 గంటలకు సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఉపన్యాస అనంతరం 1.25 గంటల వరకు పింఛన్లు, రేషన్‌కార్డులు, బ్యాంక్ లింకేజీ రుణాలు చెక్కులను లబ్ధిదారులకు సీఎం అందజేస్తారు. స్వచ్ఛ అవార్డులను ప్రదానం చేస్తారు. ⇔ 1.25 గంటలకు సభా స్ధలి నుంచి కారులో బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 1.40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి తాడేపల్లికు చేరుకుంటారు. -
2న ‘తూర్పు’లో సీఎం జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 2న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కరపలో గ్రామ సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో కరప గ్రామానికి చేరుకుని పైలాన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం హైస్కూల్ ప్రాంగణంలో వివిధ స్టాల్స్ సందర్శన అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సభ అనంతరం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విశాఖపట్నంలో జరిగే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతికుమార్ వివాహానికి హాజరవుతారు. తిరిగి రాత్రికి తాడేపల్లి చేరుకోనున్నారు. -
కరపలో ముగ్గురు మహిళల ఆత్మహత్య
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాకినాడ రూరల్ మండలం కరపకు చెందిన సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి, రాశంశెట్టి సత్యవతి అనే ముగ్గురు మహిళలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. దేవుడు తమని పిలుస్తున్నాడంటూ వారు మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరు పూజలు చేస్తూ, దేవుడు తమతో మాట్లాడుతున్నాడని, తన వద్దకు రమ్మన్నాడంటూ చెప్పేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కరప హైస్కూల్ డిజిటల్ క్లాస్ ఆదర్శప్రాయం
రాష్ట్రంలో సెకండ్, జిల్లాలో ఫస్టు కరప (కాకినాడ రూరల్) : డిజిటల్ క్లాస్ నిర్వహణలో రాష్టంలో కరప హైస్కూలు ద్వితీయ స్థానం, జిల్లాలో ప్రథమస్థానం సాధించింది. ఈ విషయాన్ని అమరావతి విద్యా కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఈ గవర్నన్స్ కన్సల్టెంట్ సత్య సందీప్, డెవలప్మెంట్ కన్సల్టెంట్ ఎం.వంశీ తెలిపారు. స్థానిక నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా విద్యా శాఖ ఏపీఓ వి.సత్యనారాయణతో కలిసి వారు సందర్శించారు. డిజిటల్ క్లాస్ రూమును, విద్యాబోధన పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తంచేశారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను 172 గంటలు వినియోగించి గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రథమస్థానం పొందిందని వారు తెలిపారు. 152 గంటలతో కరప హైస్కూలు ద్వితీయ స్థానంలో ఉందన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను, అమలుచేస్తున్న టైంటేబుల్ వారు పరిశీలించారు. తాడేపల్లి, కరప హైస్కూళ్లు అనుసరిస్తున్న టైంటేబుల్, నిర్వహణ పరిశీలించి నివేదికను విద్యాశాఖ కమిషనరేట్‌కు అందజేస్తామన్నారు. రాష్టంలో మిగిలిన హైస్కూళ్లు కూడా ఈ విధానాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోజుకో సబ్జెక్టు చొప్పున విద్యార్థులకు చేస్తున్న డిజిటల్ బోధన చేస్తున్నట్టు వారికి హెచ్ఎం పీవీఎన్ ప్రసాద్ వివరించారు. స్టాఫ్ సెక్రటరీ కె.సాంబశివరావు, ఉపాధ్యాయులు టి.కృపాలాల్, జీవీ రంగనాథ్, పీఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు
కరప : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీఈఓ ఆర్.నరసింహారావు తెలిపారు. నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించి డిజిటల్ తరగతిని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ చత్రాతి రామచంద్రుడు మహాలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీహెచ్ రామచంద్రరావు సహకారంతో జిల్లాలో 100 డిజిటల్ తరగతులు, ప్రభుత్వ నిధులతో 17 డిజిటల్ తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలో 660 పాఠశాలలున్నాయని, దశలవారీగా అన్నింటిలో డిజిటల్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఒక డిజిటల్ తరగతికి రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని రెండు కంప్యూటర్లు, ప్రొజెక్టర్, మానిటర్ సమకూరుస్తామన్నారు. దాతలు ముందుకువచ్చి రూ.45 వేలు విరాళంగా ఇస్తే ప్రభుత్వం రూ.1.05 లక్షలు ఇస్తుందన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు అన్నిసబ్జెక్టులకు 3డీలో విద్యాబోధన జరుగుతుందన్నారు. 10వ తరగతి పరీక్షలకు కార్యాచరణ ఈ ఏడాది కొత్తపద్ధతి (సీసీ మెథడ్)లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున మంచిఫలితాలు సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు డీఈఓ తెలిపారు. పాతపద్ధతిలో ఇచ్చినట్టుగా స్టడీమెటేరియల్ ఇవ్వబోమన్నారు. రామచంద్రపురం డీవై ఈఓ ఆర్ఎస్ గంగాభవానీ, ఎంఈఓ ఎంవీవీ సుబ్బారావు, హెచ్ఎం ప్రసాద్, స్టాప్సెక్రటరీ కె.సాంబశివరావు, పీఎ¯ŒSవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
టీచర్ బదిలీపై జెడ్పీటీసీ వీరంగం
డీఈవోతో వాగ్వాదం రాజీనామా చేస్తానని బెదిరింపు పాఠశాలకు తాళం వేస్తానని హెచ్చరిక కరప : తనకు చెప్పకుండా పాతర్లగడ్డ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలిని డెప్యుటేష¯ŒSపై అరట్లకట్ట హైస్కూల్‌కు బదిలీ చేయడంపై జెడ్పీటీసీ బుంగా సింహాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీ చేసిన ఉపాధ్యాయురాలిని పాతర్లగడ్డ తీసుకురాకపోతే పాఠశాలకు తాళం వేస్తానని, తన సొంత గ్రామంలోనే విలువ లేనప్పుడు పదవెందుకు, జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు. ఉండాల్సిన పోస్టుల కంటే ఎక్కువ ఉన్నందునే డెప్యుటేష¯ŒSపై బదిలీ చేయాల్సి వచ్చిందని డీఈఓ ఆర్.నరసింహారావు చెప్పినా వినిపించుకోకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ ఆర్.నరసింహారావు బుధవారం సందర్శించారు. జెడ్పీటీసీ సింహాద్రి హైస్కూల్‌కు వచ్చి పాతర్లగడ్డలో ఉపాధ్యాయుల పనితీరు బాగుండటంలేదు. విద్యాబోధన బాగుండటంలేదని, విద్యార్ధులు వెనుకబడి పోతున్నారని, ఇదే విషయాన్ని ఎంఈఓ, ఇతర అధికారులకు చెప్పినా ఫలితం లేకపోగా తనకు చెప్పకుండానే తెలుగు ఉపాధ్యాయురాలు వీబీటీ సుందరిని అరట్లకట్ట హైస్కూల్‌కు బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అరట్లకట్ట హైస్కూల్లో 400 మంది విద్యార్థులున్నారని, అక్కడ తెలుగు టీచర్ లేక ఇబ్బందిగా ఉండటంతో పాతర్లగడ్డలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండటంతో డెప్యూటేష¯ŒSపై బదిలీ చేశానని డీఈఓ నరసింహా రావు బదులిచ్చారు. పాతర్లగడ్డ ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపరచి, విద్యాబోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అయినా సంతృప్తి చెందని జెడ్పీటీసీ మండలంలో ఎన్నో పాఠశాలలుండగా తమ పాఠశాల టీచర్‌ను బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. డీఈఓ నరసింహారావుతో పాటు డీవైఈఓ ఆర్ఎస్ గంగాభవానీ, ఎంఈఓ ఎంవీవీ సుబ్బారావు, ఎంపీడీఓ అన్నెపు ఆంజనేయులు, హెచ్ఎం పీవీఎ¯ŒS ప్రసాద్ తదితరులు జెడ్పీటీసీకి నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోకుండా వెళ్లిపోయారు. -
కుళాయి నీటిలో వానపాములు, రొయ్యపిల్లలు!
కరప (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా కరప మండలం ఎస్వీపేటలోని వీధి కుళాయి నుంచి నీటితోపాటు వానపాములు, రొయ్యపిల్లలు వచ్చాయి. తాళ్లరేవు మండలం జి.వేమవరంలోని సామూహిక రక్షిత నీటి పథకం నుంచి ఆరు గ్రామాలకు మంచి నీరు సరఫరా అవుతుంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం విడుదలైన నీటిని కరప మండలం ఎస్వీపేట వాసులు పట్టుకుంటుండగా వానపాములు, రొయ్య పిల్లలు వచ్చాయి. దీంతో జనం ఆందోళన చెందారు. కొద్దిసేపటి తర్వాత శుభ్రమైన మంచి నీరు రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు రంగంలోకి దిగారు. మంచి నీటి పథకం నిర్వహణను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆందోళన
కరప :ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ముగ్గురు ఆడపిల్ల లు పుట్టిన తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ కరప పోలీసుస్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపింది. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించింది. పెనుగుదు రు గ్రామానికి చెందిన రమణమ్మ అదే గ్రామానికి చెంది న తుమ్మలపల్లి వేణు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లయి 19 ఏళ్లయిందని, ఆ తర్వాత వేణు తన అక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని రమణమ్మ తెలిపిం ది. ఆపైన మళ్లీ తనను హైదరాబాద్ తీసుకెళ్లాడని, గతయేడాది గ్రామానికి తీసుకొచ్చాడని చెప్పింది. ఆపైన కొన్నాళ్లకు తమను వదిలి వెళ్లిపోయాడని వాపోయింది. దీనిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని రవణమ్మ తెలిపింది. ముగ్గురు ఆడపిల్లలతో ఎలా బతకాలో అర్థం కావడంలేదని రోదించింది. తన భర్త బంధువుల ఇంటివద్దే ఉండి, లేడని చెప్పిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని ఆమె తెలిపింది. ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశానని పేర్కొంది. కరప ఎస్సై బి.వినయ్ప్రతాప్ను వివరణ కోరగా మార్చిలో ఈకేసు నమోదుచేశా మని, వేణు బంధువులను పిలిపించి విచారించామని చెప్పారు. కేసు విచారణలో ఉందని, నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.