
కరపలో ముగ్గురు మహిళల ఆత్మహత్య
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాకినాడ రూరల్ మండలం కరపకు చెందిన సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి, రాశంశెట్టి సత్యవతి అనే ముగ్గురు మహిళలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.
దేవుడు తమని పిలుస్తున్నాడంటూ వారు మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరు పూజలు చేస్తూ, దేవుడు తమతో మాట్లాడుతున్నాడని, తన వద్దకు రమ్మన్నాడంటూ చెప్పేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.