
అగర్తల: త్రిపుర నార్త్ జిల్లాలో ఒక వ్యక్తి తన ఇంటికి సమీపంలో అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. అయితే అతని కుటుంబసభ్యులు మాత్రం రెండు రోజుల క్రితం 17 ఏళ్ల కన్నకూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మంగళవారం సదరు వ్యక్తి తన ఇంటికి కొద్ది దూరంలో చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కాగా వ్యక్తి మృతిపై ప్రాథమిక విచారణ జరుగతుందని.. అది ఆత్మహత్యా.. లేక హత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ భానుపద చక్రవర్తి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment