
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 2న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కరపలో గ్రామ సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో కరప గ్రామానికి చేరుకుని పైలాన్ ఆవిష్కరించనున్నారు.
అనంతరం హైస్కూల్ ప్రాంగణంలో వివిధ స్టాల్స్ సందర్శన అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సభ అనంతరం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విశాఖపట్నంలో జరిగే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతికుమార్ వివాహానికి హాజరవుతారు. తిరిగి రాత్రికి తాడేపల్లి చేరుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment