తులం బంగారం రూ.74 వేలు | Gold Rate In Pakistan Price On 12 August 2019  | Sakshi
Sakshi News home page

తులం బంగారం రూ.74 వేలు

Aug 13 2019 9:05 AM | Updated on Aug 13 2019 9:39 AM

Gold Rate In Pakistan Price On 12 August 2019  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నింగివైపు చూస్తున్న బంగారం ధరలు పెట్టుబడి దారుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, ఆభరణాల వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి పరుగుకు ఇప్పట్లో  బ్రేక్‌లు పడే అవకాశం కనిపించడంలేదు.  

ముఖ‍్యంగా పాకిస్తాన్‌లో పుత్తడి  ధర వింటే  గుండె గుభేలే. అవును.. ఇండియాతో పోలిస్తే.. పాకిస్తాన్‌లో బంగారం ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది.  నిన్న (సోమవారం ,ఆగస్ట్ 12) పాకిస్తాన్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.74,588గా ఉంది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్ (11.6638038 గ్రా) బంగారం రూ.87,000 గా ఉంది. పాకిస్తాన్‌లోని ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది.

24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 21 క్యారెట్లు, 18 క్యారెట్లు, 10 తులాల బంగారం ధరలు ఆయా నగరాల్లో ఇలా ఉన్నాయి. కరాచిలో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,588 ఉండగా, 24 క్యారెట్ల తుల బార్ రూ.87,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,373గా ఉంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, సియాల్‌కోట్ నగరాల్లో 24 క్యారెట్లు, 24 క్యారెట్లు తుల బార్స్, 22 క్యారెట్ల బంగారం వరుసగా.. రూ.74,588, రూ.87,000, రూ.68,373గా ఉన్నాయి.

మరోవైపు దేశీయంగా బంగారం ధరలు రూ.38 వేలు మార్క్‌ను అధిగమించాయి. అంతేకాదు త్వరలో రూ.40వేలకు చేరుకుంటుందని  బులియన్‌ వర్గాలు అంచా వేస్తున్నాయి. వెండి కూడా  దాదాపు ఇందే రేంజ్‌లో పరుగులు పెడుతోంది.  ఫెడ్‌ వడ్డీరేటు, అమెరికా చైనా  ట్రేడ్‌వార్‌  లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement