కలగా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం | High Level Bridge construction job | Sakshi
Sakshi News home page

కలగా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం

Published Fri, Aug 9 2013 4:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

High Level Bridge construction job

ఝరాసంగం, న్యూస్‌లైన్ : మండలంలోని ఏడాకులపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ైెహ  లెవల్ బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిపోయేలా ఉంది. ఏడాది కింద ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు కింద రూ. 2 కోట్ల 45 లక్షలను విడుదల చేసింది. ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపారు. బ్రిడ్జి నిర్మాణం కోసం మొదట జేసీబీలతో గుంతలు తీశారు. పనులు చురుగ్గా సాగుతున్న సమయంలో వర్షాలు కురిసి నీరంతా గుంతల్లోకి చేరడంతో పనులు ముందుకు సాగ లేదు. తరువాత ఎండకాలంలో కూడా కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం మొదలైంది. 
 
 దీంతో పనులు చేపట్టే అవకాశం లేదు. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారా? బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందా? అని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో అందులో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. మండల పరిధిలోని జీర్లపల్లి గ్రామ సమీపంలో సైతం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి అయినా అప్రోచ్ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
 
 ఇప్పటికే నోటీసులిచ్చాం
 బ్రిడ్జి నిర్మాణంలో జాప్యానికి గల కారణాలపై ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులి చ్చాం. ఏడాది క్రితం పనులు ప్రారంభించినా అ ప్పుడే వర్షాలు పడడం, దీనిని తోడు గోతుల్లో వ ర్షపు నీరు నిల్వ ఉండడంతో పనులు చేయలేకపోయారు.  ప్రస్తుతం నీటిని మోటార్ల ద్వారా తోడి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం.
 - గంగాధర్, డీఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement