
సాక్షి, ముంబై: దేశంలో ఇంధన ధరలు బుధవారం కూడా ఆకాశం వైపే చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మోత మోగిస్తున్న పెట్రో ధరలు ఏమాత్రం కిందికి దిగి రావడం లేదు. మంగళవారంతో పోలిస్తే బుధవారం దేశవ్యాప్తంగా సగటున 14 పైసల చొప్పున పెట్రోలు ధరలు పెరిగాయి. దేశరాజధానిలో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ. 80.87, డీజిల్ ధర రూ. 72.97గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు లీటరు ధర రూ. 83.75, డీజిల్ ధర రూ.75.82గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర రూ. 88.26, డీజిల్ ధర రూ. 77.47 పలుకుతోంది.
హైదరాబాద్ : బుధవారం పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ ధర 15 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోలు ధర రూ.85.75 కాగా లీటర్ డీజిల్ ధర రూ.79.37గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment