బుల్ జోరు, సెన్సెక్స్ న్యూ హై!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు కోనసాగుతోంది. సోమవారం ఆరంభంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 28027 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల వృద్ధితో 8383 పాయింట్లను నమోదు చేసుకున్నాయి.
ఆసియా మార్కెట్లలో సానుకూల ప్రభావం, బ్లూచిప్ కంపెనీల షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ పరుగు కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హ్యాంగ్ సెంగ్ 389 పాయింట్లు, తైవాన్ 133 పాయింట్ల లాభాన్ని నమోదు చేసుకున్నాయి.
సన్ ఫార్మా, ఐటీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లార్సెన్, జిందాల్ స్టీల్, సిప్లా, హిండాల్కో, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.