lifetime
-
కార్డులు ఎక్కువైతే చిక్కులేనా..?
ఆరాధన (31) ఐటీ ఉద్యోగి. ప్రయాణాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక పర్యటనకు సిద్ధమైపోతుంది. ఇటీవల ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన సందర్భంలో క్రెడిట్ కార్డ్ కంపెనీ సేల్స్ ఉద్యోగి ఆమెకు ఎదురుపడ్డాడు. మంచి ఫీచర్స్‌తో కూడిన క్రెడిట్ కార్డ్ అంటూ.. అందులోని ఉపయోగాలు చదివి వినిపించే ప్రయత్నం చేశాడు. నిజానికి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్న ఆసక్తి ఆరాధ్యకు ఎంతమాత్రం లేదు. కానీ, ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదని, దేశీయంగా ప్రీమియం ఎకానమీ విమాన టికెట్ల కొనుగోలుపై మూడు రెట్లు అధికంగా రివార్డు పాయింట్లు ఆఫర్ చేస్తుందని చెప్పగా, ఆ పాయింట్ ఆమెకు ఎంతో నచి్చంది. దీనికితోడు షాపింగ్ చేసిన ప్రతి సందర్భంలో సాధారణ రివార్డ్ పాయింట్లు వస్తాయని చెప్పాడు. దీంతో అప్లికేషన్‌పై సంతకం చేసి ఇచ్చేసింది. కార్డు చేతికి వచి్చన ఏడాది తర్వాత కానీ, వాస్తవాలు ఆమెకు తెలియలేదు. కార్డ్ కంపెనీ వార్షిక రుసుము అంటూ రూ.3,000 చార్జ్ చేసింది. సేల్స్ ఏజెంట్ చెప్పినట్టు సదరు క్రెడిట్ కార్డ్ జీవిత కాలం ఉచితమేమీ కాదని అర్థమైంది. అప్పుడు కార్డ్ నిబంధనలు, షరతులు చదివిన తర్వాత కానీ ఆమెకు అర్థం కాలేదు ఆ కార్డ్ తన అవసరాలను తీర్చేది కాదని. వార్షిక ఫీజు మినహాయించాలంటే కార్డ్ కంపెనీ పెట్టిన లక్ష్యం మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఆర్థిక సంబంధ నిర్ణయం తీసుకునే ముందు (కొనుగోళ్లు, పెట్టుబడులు) పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఏం జరుగుతుందన్న దానికి ఆరాధ్యకు ఎదురైన అనుభవమే నిదర్శనం. తమ అవసరాలకు అనుకూలమైన క్రెడిట్ కార్డ్‌కే పరిమితం కావాలని ఇది సూచిస్తోంది. క్రెడిట్ కార్డ్‌తో వచ్చే ప్రయోజనాలు చూసి చాలా మంది ఒకటికి మించిన కార్డులు తీసుకుంటూ ఉంటారు. అసలు ఒకరికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలి..? క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు ఏం చూడాలి? ఒకటికి మించిన కార్డులు ఉంటే ఎలా నడుచుకోవాలి..? ఈ విషయాలపై అవగాహన కల్పించడమే ఈ కథనం ఉద్దేశం. ఏ అవసరం కోసం..? కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వారు ముందు తమ అవసరాలు ఏంటో తేల్చుకోవాలి. రుణాలకు కొత్త వారు అయి, మంచి క్రెడిట్ స్కోరును నిర్మించుకోవాలని అనుకునే వారు తక్కువ ఫీజుతో కూడిన ప్రాథమిక స్థాయి క్రెడిట్ కార్డ్‌కు పరిమితం కావాలి. అప్పటికే దెబ్బతిన్న క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవాలని అనుకుంటే, అప్పుడు సెక్యూర్డ్ కార్డ్‌ను తీసుకుని వినియోగించుకోవడం సరైనది. ఒకటికి మించి కార్డులు ఉంటే, అప్పుడు అవి తీర్చలేని అవసరాలతో కూడిన కొత్త కార్డ్‌ను తీసుకోవచ్చు. కొన్ని కార్డ్‌లు రివార్డ్ పాయింట్లు, ఎయిర్‌మైల్స్ లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, అన్నీ కలిపి బండిల్‌గా ఇస్తుంటాయి. ఈ రివార్డ్‌లు తమకు ఎంత వరకు ఉపయోగమన్నది ఆలోచించుకోవాలి. తమ అవసరాలకు అనుకూలమంటే తీసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లలో లాంజ్ సేవలను ఉచితంగా అందించే కార్డులు కూడా ఉన్నాయి. విదేశీ లావాదేవీలపై ఫీజుల్లేని, సినిమా టికెట్లపై, రెస్టారెంట్ చెల్లింపులపై అదనపు డిస్కౌంట్లు ఆఫర్ చేసే కార్డుల్లో తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. వినియోగం ముఖ్యం.. కార్డుతో వినియోగం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ప్రతి నెలా వినియోగించుకున్నంత మేర పూర్తిగా తిరిగి చెల్లిస్తారా..? లేక బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేస్తారా.? కనీస మొత్తాన్ని చెల్లించి, మిగిలిన బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు తక్కువ వడ్డీ రేటును చార్జ్ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. పరిమిత బడ్జెట్‌తో కుటుంబాన్ని నడిపించే వారికి తక్కువ రేటు వసూలు చేసే కార్డ్‌లు అనుకూలం. దీర్ఘకాలంలో వీటితో ఎంతో ఆదా చేసుకోవచ్చు. యూజర్లు కార్డ్‌తో ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారన్నది విశ్లేíÙంచుకోవాలని మై మనీ మంత్ర మార్కెట్ ప్లేస్ ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు. కార్డుల మధ్య ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉంటుందన్నారు. ‘‘తరచూ ప్రయాణించే వారు ఎయిర్‌మైల్స్ లేదా హోటల్ పాయింట్లను ఆఫర్ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. కార్డుపై అయ్యే వ్యయాలతో పోలిస్తే ప్రయోజనాలు మెరుగ్గా ఉండాలన్నది మర్చిపోవద్దు. ఒకటికి మించిన ప్రయోజనాలు ఆఫర్ చేసే కార్డులకు వార్షిక ఫీజు ఉంటుంది. కనుక ఆయా ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేట్టు అయితేనే సదరు కార్డులు తీసుకోవాలి. అప్పుడే వార్షిక ఫీజు చెల్లించడం ప్రయోజనకరంగా అనిపిస్తుంది’’అని రాజ్ ఖోస్లా సూచించారు. ఖర్చులు–ప్రయోజనాలు కార్డు వార్షిక ఫీజు కంటే వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉండాలి. ఏటా ఇంత ఖర్చు చేస్తేనే వార్షిక రుసుము మినహాయింపు అనే షరతు ఉంటే.. మీ వినియోగం అదే స్థాయంలో ఉంటుందా? అన్నది చూసుకోవాలి. కార్డ్‌ను తక్కువగా వినియోగించుకునే వారికి వార్షిక రుసుముతో వచ్చేవి అనుకూలం కాదు. కార్డులు సాధారణంగా వార్షిక రుసుం, యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్), బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ ఫీజు, విదేశీ లావాదేవీల రుసుంతో వస్తాయి. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ అంటే.. ప్రతి నెలా కార్డ్ బిల్లుపై కొంత మొత్తం చెల్లించి, క్యారీ ఫార్వార్డ్ చేసుకునే మిగిలిన బ్యాలన్స్‌పై అమలు చేసే వడ్డీ రేటు. క్రెడిట్ స్కోరు, కార్డు ఏ రకం అన్న దాని ఆధారంగా ఈ వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. కనుక ప్రతి నెలా పూర్తి బిల్లు చెల్లించలేని వారికి తక్కువ ఏపీఆర్ ఉండే కార్డు అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఒక అధ్యయనం ప్రకారం అధిక శాతం మంది కార్డ్ కస్టమర్లు తాము పొందే రివార్డులతో పోలిస్తే కార్డు కంపెనీకి చెల్లించే ఫీజులు, వడ్డీయే ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ‘‘కార్డ్ సంస్థ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు ఫీజుల కంటే మెరుగ్గా ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలి. తక్కువ రివార్డులు, అధిక వార్షిక ఫీజుతో కూడిన ప్రాథమిక క్రెడిట్ కార్డ్ ఏమంత ఉపయోగకరం కాకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో తక్కువ వార్షిక ఫీజుతో లేదా అసలు వార్షిక ఫీజు లేని కార్డులు ఎన్నో ఉన్నాయి’’అని పైసా బజార్ క్రెడిట్ కార్డుల విభాగం హెడ్ రోహిత్ చిబ్బార్ పేర్కొన్నారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లే వారు అంతర్జాతీయ లావాదేవీలకు చార్జ్ వసూలు చేయని కార్డులు తీసుకోవడం లాభదాయకమని సూచించారు. అలాగే, రివార్డుల శాతాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అన్ని రకాల కొనుగోళ్లపై ఫ్లాట్ 2 శాతం చొప్పున రివార్డులు ఆఫర్ చేస్తుంటే, అది మంచి డీల్ అవుతుంది. ఎన్ని కార్డులు..? ఒకరికి ఎన్ని కార్డులు ఉండాలన్న దానికి ఎలాంటి నియమం లేదు. కాకపోతే ఎక్కువ కార్డ్‌లు ఉంటే, వాటితో పాటు రిస్‌్కలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. ‘‘ఒకటికి మించి క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, విడిగా ఒక్కో దానిని సరైన రీతిలో వినియోగిస్తూ గరిష్ట స్థాయిలో ఆదా చేసుకోవాలి’’ అని చిబ్బార్ పేర్కొన్నారు. ప్రతి కార్డ్‌కు ఉండే బిల్లింగ్ సైకిల్‌కు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. అప్పుడు నెలవారీ నగదు ప్రవాహాలను తెలివిగా వినియోగించుకోవచ్చన్నారు. విడిగా ఒక్కో కార్డ్‌లో వినియోగించకుండా మిగిలిపోయిన లిమిట్, అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుంది. ఒకటికి మించిన కార్డులు కలిగిన వారు, సరైన రీతిలో ఉపయోగించుకోకుండా, ఎక్కువగా వాడేస్తే అది రుణ ఊబిలోకి తీసుకెళుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక లిమిట్‌తో ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం, అన్నింటినీ గరిష్ట పరిమితి మేరకు వినియోగిస్తుంటే అది క్రెడిట్ స్కోర్‌కు మంచిది కాదు. ఎందుకంటే అది అధిక రిస్క్‌కు దారితీస్తుంది. సంఖ్యతో సంబంధం లేకుండా తమ అవసరాలకు పక్కాగా నప్పే కార్డ్ ఉండాలన్నది ప్రాథమిక నియమం. ఎక్కువగా ప్రయాణించని వారికి ట్రావెల్ ప్రయోజనాలతో కూడిన క్రెడిట్ కార్డుతో వచ్చేదేమీ ఉండదు. కార్డులు ఎక్కువైతే వార్షికంగా చెల్లించే ఫీజులు, నికరంగా ఒరిగే ప్రయోజనం ఎంతన్న విశ్లేషణ అవసరం. ఎన్ని కార్డులు ఉన్నా, ఎంత వినియోగించుకున్నా, గడువులోపు పూర్తి బిల్లు చెల్లించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అది రుణ పరపతిపై ప్రభావం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. కార్డును సమీక్షించుకోవాలి.. క్రెడిట్ కార్డ్ తీసుకునే సమయంలో చెప్పిన ప్రయోజనాలు ఎప్పటికీ కొనసాగుతాయని అనుకోవద్దు. కార్డ్ సంస్థ ఎప్పుడైనా అందులోని ప్రయోజనాల్లో మార్పులు చేయవచ్చు. ఈ విషయాలను ఈ మెయిల్ రూపంలో తెలియజేస్తాయి. కార్డ్ కంపెనీల నుంచి వచ్చే మెయిల్స్‌ను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకని ఏడాదిలో రెండు సార్లు అయినా, క్రెడిట్ కార్డు నియమ, నిబంధనలు, ప్రయోజనాలను సమీక్షించుకోవాలి. రివార్డ్ పాయింట్లను కూడా రెడీమ్ చేసుకోవాలి. లేదంటే అవి కాలం చెల్లిపోయే ప్రమాదం ఉంటుంది. మారిన నియమ, నిబంధనల ప్రకారం ఇక మీదట సంబంధిత క్రెడిట్ కార్డ్ ప్రయోజనకరం కాదని గుర్తిస్తే, దాన్ని రద్దు చేసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేసుకుంటే, అది తాత్కాలికంగా క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుందని గుర్తు పెట్టుకోవాలి. అనుకూలతలు ► ఒకటికి మించి క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, అప్పుడు ఒక్కో కార్డు వారీ వినియోగించుకునే పరిమితి 50 శాతం మించకుండా చూసుకోవచ్చు. ఇది క్రెడిట్ స్కోర్‌కు అనుకూలం. ►ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతూ, అన్ని బిల్లులను గడువులోపు చెల్లించేట్టు అయితే క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు దారితీస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో రుణాలు వేగంగా, ఆకర్షణీయమైన రేటుకు లభిస్తాయి. ►క్రెడిట్ కార్డ్ సంస్థలు ట్రాక్ రికార్డ్ మెరుగ్గా ఉన్న వారికి అదనపు లిమిట్ ఆఫర్ చేస్తుంటాయి. అత్యవసరాల్లో ఈ అదనపు పరిమితి ఉపయోగపడుతుంది. మరిన్ని రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు అందుకోవచ్చు. ప్రతికూలతలు ►ఒకటే కార్డ్ ఉంటే వినియోగ నిష్పత్తి (కార్డ్ యుటిలైజేషన్ రేషియో) గరిష్ట స్థాయిలో ఉంటుంది. ►ఒకటికి మించి కార్డులు ఉంటే ప్రతీ కార్డ్ బిల్లును పరిశీలిస్తూ, గడువులోపు వాటి బిల్లులు చేయడం కొంత అదనపు శ్రమతో కూడినది. కార్డ్‌లు ఎక్కువై, సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమైతే అది స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ►ఒకటికి మించి కార్డ్‌లు ఉంటే, క్రమశిక్షణతో, వివేకంగా వినియోగించుకోకపోతే అది రుణ ఊబిలో చిక్కుకునేందుకు కారణమవుతుంది. ►అవసరం లేకుండా ఎక్కువ కార్డులు నిర్వహిస్తుంటే, వాటికి చెల్లించే ఫీజుల రూపంలో నష్టపోవాల్సి వస్తుంది. -
మహిళల జీవితకాలం ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో మగవారి ఆయుర్దాయం కంటే ఆడవారిదే ఎక్కువని తేలింది. మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువ కాలం జీవిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య గణాంకాల నివేదిక– 2019ను తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రజల జీవిత కాలాన్ని, ఆరోగ్య రంగంలో ఆయా దేశాల స్థానాన్ని విశ్లేషించిం ది. ప్రపంచంలో సరాసరి మహిళలు 74.2 ఏళ్లు జీవి స్తుండగా, మగవారు 69.8 ఏళ్లు బతుకుతున్నారని పేర్కొంది. అయితే అదనంగా మహిళలు బతికే 4.4 ఏళ్లు కూడా ఒంటరితనం, పేదరికం, వ్యాధులతోనే కాలం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అదే భారత్‌లో పురుషులు సరాసరి 67.4 ఏళ్లు, మహి ళలు 70.3 ఏళ్లు బతుకుతున్నారని తేల్చింది. అంటే 2.9 ఏళ్లు అధికంగా మహిళల జీవితకాలం ఉంది. జపాన్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా మహిళలు 87.1 ఏళ్లు, పురుషులు 81.1 ఏళ్లు బతుకుతున్నారు. 18 ఏళ్ల ఆయుర్దాయ వ్యత్యాసం.. ఇక ప్రపంచంలో మహిళలతో పోలిస్తే పురుషుల ఆయుర్దాయం తగ్గడానికి ఏదో ఒకట్రెండు కారణాలు అనుకోలేమని, 40 ప్రధాన కారణాలున్నాయని విశ్లేషిం చింది. అందులో 33 కారణాలు అధికంగా దోహదం చేస్తాయని పేర్కొంది. గుండెపోటు, ఊపిరితిత్తుల కేన్సర్, టీబీ, రోడ్డు ప్రమాదాలు వంటివి ఉన్నాయి. ఇక తక్కువ ఆదాయం కల దేశాల్లో పుట్టినవారి ఆయుర్దాయం 62.7 ఏళ్లు కాగా, అధికాదాయ దేశాల ప్రజల ఆయుర్దాయం మాత్రం ఏకంగా 80.8 ఏళ్లు. అంటే అధికాదాయ దేశాల కంటే అల్పాదాయ దేశాల ప్రజల ఆయుర్దాయం 18.1 సంవత్సరాలు తక్కువ. ఈ దేశాల జాబితాలో భారత్ కూడా ఉండటం గమనార్హం. తక్కువ ఆదాయం గల దేశాల్లో ఆయుర్దాయం తక్కువ ఉండటానికి 10 ప్రధాన కారణాలు ప్రత్యేకంగా ఉన్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ఆయుర్దాయం 2.09 ఏళ్లు తగ్గింది. అతిసార వ్యాధులతో 1.97 ఏళ్లు, గుండెపోట్లతో 1.45 ఏళ్లు, ఎయిడ్స్‌తో 1.45 ఏళ్లు, టీబీతో 1.35 సంవత్సరాలు, గుండె జబ్బులతో 1.35 ఏళ్లు, మలేరియాతో 10 నెలలు, రోడ్డు ప్రమాదాలతో ఏడున్నర నెలలు, పోషకాహార లోపంతో 6 నెలలు, ఇతరత్రా కారణాలతో మరో ఏడాదిన్నర ఆయుర్దాయం తగ్గుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2016లో మధుమేహం, గుండెపోటు, కిడ్నీ, కేన్సర్ తదితర వ్యాధుల కారణంగా 4.10 కోట్ల మంది చనిపోయారు. అంటే మొత్తం ప్రపంచంలో ఆ ఏడాది చనిపోయినవారిలో ఈ సంఖ్య ఏకంగా 71 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తుంది. పట్టణాల్లో పది మందిలో ఒకరికి కాలుష్యం కాటు.. పట్టణాలు, నగరాల్లో ప్రతీ పది మందిలో ఒకరు వాయు కాలుష్యం బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వాయుకాలుష్యం కారణంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల కేన్సర్, ఇతర శ్వాసకోశ వ్యాధులు రావడానికి ప్రమాదముంది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం వంటి కారణాల వల్ల 2016లో ఏకంగా 70 లక్షల మంది చనిపోయారు. ఇక పరిశుభ్రమైన తాగునీటిని వాడుతున్న ప్రజల శాతం పెరిగింది. 2015లో 71 శాతం మంది ప్రజలు పరిశుభ్రమైన నీరు తాగుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 2016లో పారిశుద్ధ్యలోపం, అపరిశుభ్రమైన నీటివల్ల 9 లక్షల మంది చనిపోయారని తెలిపింది. అందులో ఐదేళ్లలోపు చిన్నారులు డయేరియా కారణంగా 4.70 లక్షల మంది చనిపోయారు. 80.80 కోట్ల మంది 10 శాతానికి పైగా ఖర్చు ప్రపంచంలో సగం జనాభాకు అత్యవసర వైద్య సేవలే అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వీరికి తప్పనిసరిగా వైద్యం అందాల్సిన అవసరముందని చెప్పింది. ప్రపంచంలోని జనాభాలో 80.80 కోట్ల మంది తమ ఇంటి ఖర్చులో 10 శాతం పైగా వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. తమ ఇంటి ఖర్చులో వైద్యానికి అధికంగా ఖర్చు చేసిన ఫలితంగా 2010లో ఏకంగా 9.70 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లాల్సి వచ్చింది. అంటే వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం వంటి పరిణామాలతో ఈ పరిస్థితి తలెత్తింది. పెద్ద చిన్నా అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ మందుల కొనుగోళ్లకే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ పది వేల మందికి 15 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. షుగర్, బీపీ, గుండె, కిడ్నీ సంబంధింత వ్యాధులకు థాయ్‌లాండ్ కంటే కూడా భారత్‌లో యూనివర్సల్ హెల్త్ కవరేజీ ఎక్కువగా లేకపోవడం గమనార్హం. శ్రీలంకలో 62 శాతం జనాభాకు యూనివర్సల్ హెల్త్ కవరేజీ అందుతుండగా, దేశంలో కేవలం 56 శాతం మందికే అందుతోంది. గర్భిణిలు ఆసుపత్రికి వస్తే ప్రసవం చేయడానికి నిపుణులైన వైద్య సిబ్బంది ఉండటం లేదు. దీనివల్ల మాతా శిశుమరణాలు అధికంగా సంభవిస్తున్నాయని తెలిపింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ హెల్త్ కేర్ అందుబాటులోకి వస్తేనే ప్రజల ఆరోగ్య ప్రమాణాలు, ఆయుర్దాయం పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పిలుపునిచ్చింది. దేశంలో ఆరోగ్య స్థితిగతులు.. –భారత్‌లో 17.3 శాతం మంది తమ ఇంటి ఖర్చులో 10 శాతానికి పైగా వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. 3.9 శాతం మంది 25 శాతం పైగా ఖర్చు చేస్తున్నారు. –ప్రతీ 10 వేల మంది జనాభాకు 7.8 మంది డాక్టర్లుండగా, నర్సులు 21.1 మంది ఉన్నారు. –ప్రతీ లక్ష మందిలో 204 మందికి క్షయ వ్యాధి ఉంది. –ప్రతీ వెయ్యి మందిలో 7.7 మందికి మలేరియా వచ్చే ప్రమాదముంది. –మద్యం, పొగాకు తాగడం వంటి కారణాల వల్ల దేశంలో గుండె జబ్బులు, కేన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. మద్యం, పొగాకును పురుషులు ఎక్కువగా బానిసలవుతున్నారు. -
వెనక్కి తగ్గిన ఎయిర్టెల్ : రెండు కొత్త ప్లాన్లు
సాక్షి,ముంబై: టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ ప్రత్యర్థుల దెబ్బకు దిగి వచ్చింది. దేశీయంగా తన స్థానాన్ని నిలబెట్టు కునేందుకు భారీ కసరత్తే చేస్తోంది. ఈ నేపథ్యంలో లైఫ్ టైం యాక్టివేషన్‌కు సంబంధించి రెండు కొత్త ప్లాన్లను తిరిగి లాంచ్ చేసింది. కోట్లమంది ఖాతాదారులు నష్టపోయినా పరవాలేదంటూ ఇటీవల జీవితకాల చందాదారులకు కోసం ప్రత్యేకంగా రూ.30 కనీస రీచార్జ్ పథకాన్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఖాతాదారులనుంచి స్పందన కరువవ్వడంతో ఎయిర్టెల్ వెనక్కి తగ్గక తప్పలేదు. కొత్త ఎత్తుగడతో తాజాగా రూ.100, 500 రూపాయల విలువైన ప్రీపెయిడ్ ప్లాన్లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్లలో డేటా, ఎస్ఎంఎస్ల సదుపాయాన్ని అందించలేదు. కేవలం టాక్ టైంను మాత్రం అందిస్తోంది. దీనితోపాటు లైఫ్ టైం ఇన్కమింగ్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లు మై ఎయిర్టెల్ యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. రూ.100 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు (అవుట్ గోయింగ్ కాల్స్) టాక్ టైం రూ.81.75 అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ కాల్స్ (జీవితకాలం కాల్స్‌ను స్వీకరించడానికి అనుమతి) రూ.500 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ప్లాన్ టాక్‌టైం రూ.420.73 వాలిడిటీ 28 రోజులు ( అవుట్గోయింగ్ కాల్స్) అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ కాల్స్ (జీవితకాలం కాల్స్‌ను స్వీకరించడానికి అనుమతి) -
హార్ట్ బ్రేక్ కావొద్దంటే.. ఇవి తప్పనిసరి..!
హార్ట్ ఒక హార్డ్ వర్కర్...! పిండం ఏర్పడ్డ ఆరో వారంలో మొదలైన హార్ట్‌బీట్ మరణం నాటివరకూ ఆగదు. అందుకే ఆ హర్డ్‌వర్క్‌ను హార్ట్వర్క్ అనీ చెప్పవచ్చు. హార్ట్ చాలా సిన్సియర్...! ఒంట్లోని అన్ని అవయవాలకూ తానే రక్తం ఇస్తుంది కదా!అయినా సరే... క్యూలో నిలబడి తన వంతు రేషన్ తీసుకున్నట్టుగా తన వాటా రక్తాన్ని కరోనరీ ఆర్టరీ ద్వారా ఎంతో సిన్సియర్‌గా అందుకుంటుంది. జీవితమంతా పనిచేసే అంతటి హార్డ్వర్కర్నూ, ఆ సిన్సియర్నూహాస్పిటల్ మెట్ల వరకూ రాకుండా కాపాడుకోవాలా, వద్దా? మరి అదెలాగో చూడండి. గుండె చాలా కష్టపోతు. అదెంత శ్రమ చేస్తుందో చూస్తే గుండె ఝల్లుమనాల్సిందే! దాని పని చూస్తే గుండె పిండేసినట్టవుతుంది. పనిపరంగా చూస్తే... గుండె ఒక అద్భుతం. రోజులో అది దాదాపు లక్షసార్లు స్పందిస్తుంది. విశ్రాంతి లేకుండా ఇలా స్పందిస్తూ ఉండటం వల్ల ఏడాదిలో అది 3.78,43,200 సార్లూ, జీవితకాలంలో (80 ఏళ్లు అనుకుంటే) దాదాపు 302 కోట్లకు పైగా సార్లు కొట్టుకుంటుందని తెలిస్తే గుండె చెదురుతుంది. ఇంతా చేస్తే మనిషిలో ఉండేది 5 నుంచి 6 లీటర్ల రక్తమే. అయినా అదే మాటిమాటికీ గుండె ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి నిమిషానికీ 72 సార్లు కొట్టుకుంటూ, దాదాపు రోజులో 6,000 నుంచి 7,500 లీటర్ల రక్తాన్ని తన ద్వారా పంప్ చేస్తూ ఉంటుంది. మీకో విషయం తెలుసా? ఇక ఒక రోజులో గుండె నుంచి పంప్ చేసే రక్తాన్ని నేరుగా ప్రవహింపజేస్తే అది కవర్ చేసే దూరం 19,000 కి.మీ. ఉంటుంది. ఒక మనిషి జీవితకాలంలో అతడి గుండె పంప్ చేసే రక్తాన్ని మన ఇంట్లోని ఏదైనా నల్లా/కొళాయి నుంచి ప్రవహింపజేస్తే అది 45 ఏళ్లపాటు ఎడతెరిపి లేకుండా నిరంతరాయంగా అలా కారుతూనే ఉంటుంది. ఇదీ గుండె చేసే పని! ఇలా గుండె చేసే శ్రమ చూశాక ఎవ్వరికైనా గుండె తరుక్కుపోవడం ఖాయం. మరింత కష్టపడే దాన్ని మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి కదా! గుండె అధ్యయనం గురించి కాస్తంత చరిత్ర ఇది అనాదిగా గుండె గురించిన ఊహలూ, అధ్యయనాలూ, పరిశోధనల చరిత్రంతా ఆసక్తికరమే. మానవాళికి తెలిసినమేరకు గుండెకు సంబంధించి కొంత శాస్త్రీయంగా చెప్పింది క్రీస్తుపూర్వం 304 నుంచి క్రీ.పూ. 250 మధ్యకాలంలో జీవించిన గ్రీకు ఫిజీషియన్ ఎరాసిస్ట్రేటస్. ఆయన తొలిసారిగా మంచి రక్తం, చెడు రక్తం ప్రవహించే రక్తనాళాలు వేర్వేరుగా ఉంటాయని తెలిపాడు. గుండె ద్వారా రక్తం ప్రవహించే తీరును ఆధునిక కాలం నాటి అధ్యయనాలకు దాదాపుగా కాస్తంత దగ్గరగా అంచనా వేశాడు. ఇక క్రీసుశకం 130 నుంచి క్రీస్తుశకం 210 మధ్య కాలంలో జీవించిన క్లాడియస్ గెలనస్ తొలిసారిగా గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం వెళ్తుందని చెప్పాడు. అంతేకాదు... గుండె నుంచి మొత్తం శరీరానికి రక్తం అందుతుందంటూ... గుండె స్పందనలకూ, నాడీ స్పందనలకు సంబంధం ఉందని ఊహించాడు. అయితే ఒకసారి కండరాల కోసం రక్తం ఇంధనంలా దహించుకుపోయాక ఎప్పటికప్పుడు కొత్త ఇంధనంలా రక్తం మళ్లీ మళ్లీ పుడుతుందని గేలనస్ ఊహించాడు. మరో పరిశోధకుడు ఆండ్రియాస్ వెసాలియస్ (క్రీ.శ. 1514–1564) రాసిన ‘డీ హ్యూమనీ కార్పొరిస్ ఫ్యాబ్రికా లిబ్రీ సెప్టమ్’ అనే గ్రంథంలోనూ గుండె నిర్మాణం తీరుతెన్నులు వర్ణితమయ్యాయి. ఇక గుండె ఏం చేస్తుందన్నది కరెక్ట్‌గా చెప్పింది మాత్రం ఇంగ్లాండు ఫిజీషియన్ విలియమ్ హార్వే (క్రీ.శ. 1578–క్రీ.శ. 1657). ఆయన మొట్టమొదటిసారిగా 1616లో గుండె రక్తాన్ని పంప్ చేస్తుందని కనుగొన్నాడు. తాను రాసిన ‘ఏన్ అనటామికల్ డిస్క్విజిషన్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ ద హార్ట్ అండ్ బ్లడ్’ అనే పుస్తంలో గేలనస్ చెప్పిన అంశాల్లోని పొరపాట్లను సవరించాడు. వాటిని వివరించాడు. ఇలా క్రీస్తుపూర్వం నుంచి గుండెను గురించి చేసిన పరిశోధనలూ, పడ్డ శ్రమ చూస్తే మన గుండెలు తరుక్కుపోవాల్సిందే. ఆ అభూత కల్పనలు చదివితే గుండెలు జారిపోతాయి. చివరికి హార్వే వల్ల గుండె మిస్టరీ వీడటంతో మానవాళి గుండెలపై నుంచి ఓ బరువు తొలగినట్లయ్యింది. అయితే హార్వే తర్వాత పరిశోధనలు వేగం పుంజుకొని, కార్డియాలజీ రంగంలో ఎంతో అభివృద్ధి చోటు చేసుకొని, ఈనాటికీ ఎందరో రోగుల్లో గుండెధైర్యం నింపింది... ఇంకా నింపుతోంది. ఆ పురోగతి అలా నిరంతరాయంగా సాగుతూనే ఉంది. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, డైరెక్టర్, పల్స్ హార్ట్ సెంటర్, హైదరాబాద్ హార్ట్ ఎటాక్‌లూ... తరుగుతున్న వయసు చెదురుతున్న గుండెనిబ్బరం ఒకప్పుడు గుండెపోటు ఏ అరవైలు దాటాకో వచ్చేది. జీవనశైలి మార్పులతో గుండెవ్యాధుల రిస్క్ 50లకు వచ్చింది. ఆ తర్వాత క్రమంగా 40లకు పడిపోయింది. ఆశ్చర్యకరంగా ఇరవై–పాతికేళ్లలోపు వారికీ ఇప్పుడు గుండెపోటు వస్తోంది. పాశ్చాత్య దేశవాసులతో పోలిస్తే గుండెపోటుకు కారణమైన ‘కరోనరీ ఆర్టరీ డిసీజ్’ వచ్చే అవకాశాలు మన దేశవాసుల్లోనే మరీ ఎక్కువ. ఈ జబ్బు 14 ఏళ్ల చిన్నారికి కూడా రావడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది. 1990లతో పోలిస్తే 2020 నాటికి కేసుల సంఖ్య మహిళల్లో 120 శాతం ఎక్కువగానూ, పురుషుల్లో 137 శాతం ఎక్కువగా ఉండవచ్చన్నది గుండె గుభేలుమనిపించే ఒక అంచనా! ప్రమాదకరమైన ఈ గుండెజబ్బులకు కారణాలూ ఎక్కువే. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. సాధారణంగా మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు వయసు పెరుగుతున్న కొద్దీ గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. ఇప్పుడు చాలా చిన్నవయసులోనే ఇలా రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది. ఇలా జరగడానికి కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. రక్తనాళాల్లో పేరుకునే కొవ్వును ‘ఫ్లేక్స్’ అంటారు. ఈ ఫ్లేక్స్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ఫ్లేక్స్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు)గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు. కొందరిలోనైతే ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే గుండెపోటు వస్తుంది. దీన్నే సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. యువతలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం, ఆల్కహాల్, పొగతాగే అలవాటు కూడా గుండెపోటుకు ఒక కారణం. డాక్టర్ అనిల్ కృష్ణ, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఎండీ., మాక్స్‌క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్ మంచి ఆహారంతో గుండెకు హాయి మొదటి నుంచీ గుండెకు మేలు చేసే ఆహారాన్ని తీసుకుంటే అది గుండెజబ్బులను నివారిస్తుంది. ఆహారం విషయంలో కొవ్వులది ఒక విలక్షణ భూమిక. గుండెకు పైన మంచి రక్షణ కోసం ప్యాకింగ్ రూపంలో కొవ్వులు మేలు చేస్తాయి. కానీ అవే కొవ్వులు రక్తనాళాల లోపల ఉంటే కీడు చేస్తాయి. గుండె చాలా కీలకం అన్న విషయం తెలిసిందే కదా. అంతటి విలువైన దానికి చిన్నా చితకా దెబ్బలు తగిలినా షాక్ అబ్జార్బర్‌లా ఉండేందుకు నేచురల్‌గానే దాని చుట్టూ కొవ్వు ఉండేలా జాగ్రత్త తీసుకుంది ప్రకృతి. అందుకే గుండె బాగుండాలంటే బయట మాత్రమే ఉండి, రక్తనాళాల్లో లేకుండా ఉండేత పరిమిత మోతాదుల్లో కొవ్వుల్ని తీసుకోవాలి. గుండెకు మేలు చేసే ఆహారాలేమిటో చూద్దాం. టొమాటోలలో గుండెకు ఆరోగ్యమిచ్చే లైకోపిన్ అనే పోషకం ఉంటుంది ∙బాదంపప్పు, అక్రోటులలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఈ’ ఉంటుంది ∙బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలాన్ని ఇస్తాయి ∙అవిసె గింజలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. పీచు పదార్థం కూడా ఎక్కువే ∙ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. ∙హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే ∙దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కనీసం మూడు నెలల పైగా దానిమ్మ గింజలు తింటే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. అలాగే, యాపిల్ పండ్లు కూడా ∙విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. పండ్ల రసాల్లో పంచదార కలుపుకోకపోతే ఇంకా మంచిది ∙అరటి పండులోని పొటాషియమ్, మెగ్నీషియమ్‌లు రక్తపోటును తగ్గిస్తాయి. గుండెపోటుకు అధిక రక్తపోటు కూడా ఒక రిస్క్‌ఫ్యాక్టర్. దీన్ని తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండెపోటు రిస్క్ తప్పుతుందన్నమాట ∙నేరేడు, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ పండ్లలో ఉండే మ్యాంగనీస్, పొటాషియమ్ రక్తపోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తాయి. అలాగే కర్బూజాలో ఉండే పొటాషియమ్ కూడా ∙యాప్రికాట్స్ గుండెకు మంచివి ∙సాల్మన్ ఫిష్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే మంచిదంటూ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది ∙డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరి గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. అయితే మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం లేదు. డార్క్‌చాక్లెట్లను కూడా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ సూర్యప్రకాశ్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, ముషీరాబాద్, హైదరాబాద్ గుండె ధైర్యాన్నిచ్చే... గుండె పరీక్షలు గుండెపోటు మనిషిని అమాంతం అకస్మాత్తుగా ఉనికిలో లేకుండా చేస్తుందని తెలిసింది కదా. ఆ ముప్పునుంచి రక్షించుకోవడానికి మనకు చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. ఈసీజీ: ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. గుండెపోటు అయితే 80, 90 శాతం కేసుల్లో ఆ విషయం నిర్ధారణ అవుతుంది. అంతేకాదు... గతంలో వారికి గుండెపోటు వచ్చి ఉండి, అప్పుడా విషయం రోగికి తెలియకున్నా ఈ పరీక్షతో అది తెలిసిపోతుంది. అంటే...గతంలో ఎప్పుడో వచ్చిన గుండెపోటునూ దీంతో గుర్తించవచ్చన్నమాట. అయితే కొన్నిసార్లు చాలా చిన్న గుండెపోటును ఈసీజీ గుర్తించలేకపోవచ్చు. గుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా గుండెపోటు వల్ల కలిగే మార్పులను ఈసీజీ పరీక్ష వెంటనే నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులేమీ లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. ఇక కొందరిలో అబ్నార్మల్ ఈసీజీ వస్తే ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. అంతమాత్రానే గుండెజబ్బులు ఉన్నాయని నిర్ధారణ చేయలేం. అప్పుడు మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. 2 డీ ఎకో పరీక్ష: ఇది గుండెస్పందనల్లోనూ, గుండె కండరంలోనూ వచ్చిన మార్పులను తెలుపుతుంది. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెజబ్బు కారణంగానే అని తెలుసుకునేందుకు ఎకో పరీక్ష దోహదం చేస్తుంది. టీఎమ్‌టీ పరీక్ష: ట్రెడ్మిల్ అనే పరికరం మీద వేగంగా నడవటం ద్వారా గుండెపై కాస్త ఒత్తిడి కలిగించి చేసే పరీక్ష ఇది. నడక లేదా ఇతర శారీరక శ్రమ సమయంలో గుండె పనితీరును తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటుకు కారణమైన కరోనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) ఉందా లేదా అని ఈ పరీక్షతో తెలుస్తుంది. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోని అడ్డంకులనూ ఈ పరీక్ష గుర్తిస్తుంది. గుండె లయ (రిథమ్)లో ఉన్న లోపాలనూ పసిగడుతుంది. యాంజియోగ్రామ్: గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేకపోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా ఈ పరీక్ష చేయాల్సి వస్తుంది. ఇందులో గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి తెలుస్తాయి. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. యాంజియోతో పాటు సీటీ యాంజియో అనే పరీక్షలో కచ్చితత్వం మరింత ఎక్కువ. హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు: ఇది ఒక రక్తపరీక్ష. గుండెపోటు వచ్చిన నాలుగు గంటల లోపు రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్ అనే రసాయనాలు పెరుగుతాయి. ఈ పరీక్షతో ఆ విషయం నిర్ధారణ అయితే... అదెంత చిన్నదైనప్పటికీ గుండెపోటు వచ్చిందన్న విషయం కచ్చితంగా నిర్ధారణ అవుతుంది. ఇదీ ప్రోటోకాల్... ప్రపంచవ్యాప్తంగా 2012లో ఐరోపా, అమెరికా, వరల్డ్ ఫెడరేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందాలతో పాటు పలువురు శాస్త్రవేత్తలు గుండెపోటు నిర్ధారణ కోసం నిర్దిష్టంగా ఒక ప్రొటోకాల్‌ను రూపొందించారు. అది... ∙హై సెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు గుండెపోటు వచ్చిన రోగిలో తప్పక పెరుగుతాయి. ఛాతీనొప్పిని గుండెపోటుగా పరిగణించాలంటే ట్రోపోనిన్‌లు పెరగడంతో పాటు... ఈ కింది అంశాలు ఉండాలి ∙ఛాతీనొప్పి లేక ఆయాసం గుండెపోటుకు సంబంధించినదని తెలియాలి ∙ఈసీజీలో మార్పులు కనిపించాలి ∙ఎకో పరీక్షలో గుండె కండరం స్పందనల్లో మార్పులు కనిపించాలి ∙యాంజియోగ్రామ్ పరీక్షలో రక్తనాళాల్లో రక్తం గడ్డలు కనుగొనాలి. అప్పుడే ఆ ఛాతీ నొప్పిని గుండెపోటుగా నిర్ధారణ చేయవచ్చు. డాక్టర్ సి. రఘు, చీఫ్ కార్డియాలజిస్ట్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్‌పేట్, హైదరాబాద్ గుండెపోటుకు మంచి నిద్రతో చెక్... చూడ్డానికి బద్దకం, నిద్రా ఒకేలా అనిపించినా... వీటిల్లో చాలా తేడా ఉంది. నిద్ర ప్రశాంత సముద్రమైతే... బద్దకం తాత్కాలిక అలల్లాంటిది. బద్ధకంతో అలల్లాంటి కల్లోలం నెలకొంటే... ప్రశాంత నిద్రా సంద్రంలో ఎన్నో ఆరోగ్య నిధులు దొరుకుతాయి. గుండె విషయంలోనూ ఇంతే సత్యం. ఎందుకంటే... బద్ధకం శారీరక శ్రమను తగ్గించి గుండెకు హానిచేస్తుంది. నిక్షేపమైన గాఢ నిద్ర గుండెకు నిధిలా మేలు చేకూర్చుతుంది. నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలతో గుండెపోటును ఎలా నివారించవచ్చో చూద్దాం. ∙మధ్యాహ్నం పూట తీసే చిన్న కునుకు గుండెకూ, మెదడుకూ మంచిది. భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం వల్ల మీ సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి ∙మరీ తక్కువ నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. మరీ ఎక్కువ నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక ∙తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ. తగినంత నిద్రపోయేవారితో పోలిస్తే తక్కువ నిద్రపోయేవారు 70 శాతం ఎక్కువగా జబ్బుపడతారు. నిద్రలేమి ఉండేవారిలో మిగతావారితో పోలిస్తే కనీసం 25% మెదడు సామర్థ్యం తక్కువ ఉంటుంది ∙నిద్రలేమితో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. రోజూ వేళకు నిద్రపోయి, వేళకు లేవండి. కోపంగా ఉన్న సమయంలో నిద్రకు ఉపక్రమించవద్దు. ఈ జాగ్రత్తలు పాటిస్తే... గుండె గురించి బెంగ లేకుండా హాయిగా గుండెల మీద చెయ్యివేసుకొని నిద్రపోవచ్చు. డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ హృదయాధ్మాత్మికంతో సంపూర్ణ ఆరోగ్యం ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా, మానసికంగానే కాదు... ఆధ్యాత్మికంగానూ ఆరోగ్యంగా ఉండాలంటోది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాంతో గుండెను భారతీయ ఆధ్యాత్మికత తాలూకు కోణాల్లోనూ చూడవచ్చని చెబుతున్నారు గుండెనిపుణులు. ఇలా మనం అరిషడ్వర్గాలను గుండెతో ముడేసి కాస్తంత విశ్లేషిద్దాం రండి. అరిషడ్వర్గాలంటే... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటికీ గుండెకూ సంబంధమేమిటంటారా? ఉంది. మొదటిది కామం. అది ఆరోగ్యకరంగానూ, ధర్మబద్ధంగానూ అవసరమే అన్నది భారతీయ తత్వవేత్తల మాట. అందుకే దాన్ని మూడో పురుషార్థంగా చెప్పారు. దాన్ని నెరవేర్చడానికి అవసరమైనది అంగస్తంభన. నలభై – యాభై ఏళ్ల వయసులో ఎప్పుడైనా అంగస్తంభనల్లో లోపం కనిపిస్తే ఆందోళన పడాల్సింది ప్రణయానందం కోసం కాదు... ప్రాణాల కోసం! ఎందుకంటే... అత్యంత సన్నటి రక్తనాళాల్లోకి రక్తం వేగంగా ప్రవహిస్తేనే స్తంభన జరుగుతుంది. అలా జరగలేదంటే సూక్ష్మమైన క్యాపిల్లరీస్‌లో కొవ్వులు చేరాయేమో, అందుకే ఆ ప్రక్రియ జరగడం లేదేమో అని అనుమానించాలి. ఇక్కడి క్యాపిల్లరీస్‌లో కొవ్వు చేరినప్పుడు, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరొనరీ ఆర్టరీ ధమనుల్లోనూ కొవ్వు చేరి ఉండవచ్చని సందేహించాలి. ఇలా పురుషార్థాలలో మూడవది ‘ఐదు’ప్రాణాలను... అదే పంచప్రాణాలను కాపాడుతుంది. ఈ విషయంలో మహిళలకు ఒక మినహాయింపు ఉంది. మెనోపాజ్ వరకూ వాళ్లలో స్రవించే ఈస్ట్రోజెన్ వాళ్లకు గుండెపోటు ముప్పు నుంచి సహజ రక్షణ ఇస్తుంది. మెనోపాజ్ తర్వాత మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు అరిషడ్వర్గపు రెండో అంశమైన క్రోధాన్ని చూద్దాం. ఆగ్రహం, ఆవేశాలప్పుడు ఒంట్లో వచ్చే మార్పులే తీవ్ర ఒత్తిడిలోనూ కనిపిస్తాయి. కోçపంలోనూ ఒత్తిడిలోనూ ఒంట్లో అడ్రినాలిన్ అనే జీవరసాయనం స్రవిస్తుంది. జీవరసాయన చర్యలు, ఫిజియాలజీ పరంగా ఒత్తిడిని రెండో అరిషడ్వర్గానికి సమానంగా పరిగణించవచ్చు. ఈ ఒత్తిడి నేరుగా గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. నేటి ఆధునిక జీవితంలో ఆఫీసులో పని, సాధించాల్సిన లక్ష్యాలు, టైమ్ లోపు నెరవేర్చాల్సిన టార్గెట్లు, కుటుంబంలో కలహాలు, పిల్లల భవిష్యత్తు వంటివి ఒత్తిడిని మరికొంత పెంచుతాయి. ఇలా ఒత్తిడి పెరిగినప్పుడల్లా గుండె బేజారైపోతుంది. అప్పుడు శరీరం ‘గుండెధైర్యం తెచ్చుకొని పోరాడు లేదా గుండెచిక్కబట్టుకొని పారిపో’ అనే పరిస్థితికి సన్నద్ధమవుతుంది. ఈ ప్రక్రియలో ఒంట్లో ఎడ్రినాలిన్, కార్టిజోల్స్ అనే రసాయనాలు వెలువడి ఒంట్లోని ప్రతి అవయవాన్నీ దెబ్బతీస్తాయి. గుండెపై ఆ హాని ప్రభావం చాలా ఎక్కువ. ఒత్తిడి – గుండె ఒత్తిడికి సంబంధించి ఇటీవలి ఒక అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఉద్యోగస్తుల్లో పై అధికారుల ప్రవర్తన, కొలీగ్స్ మధ్య పోటీ, ఉద్యోగం పోతుందన్న అభద్రతతో కూడిన ఆందోళన వంటి అంశాలు గుండెపోటు ముప్పును 20 శాతం పెంచుతున్నట్లు తేలింది. ఇలా ఒత్తిడి పెరిగినప్పుడల్లా అది గుండెజబ్బులను తెస్తుంది. ఒత్తిడి శరీరంలో అత్యవసర పరిస్థితిని సృష్టిచడంతో మన అవయవాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రక్తపోటు పెరగడం, రక్తంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గడం వంటివి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవన్నీ మనకు గుండెను దడదడలాడించే అంశాలే. డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ హైదరాబాద్ అరిషడ్వర్గాలలో మూడు, నాలుగు లోభ, మోహాలు. వీటిల్లో మోహాన్ని మొదట చూద్దాం. మోహం అంటే ఇక్కడ ప్రాపంచిక కోరికలు. మనకు దక్కంది ఏదైనా కావాలని బలంగా కోరుకున్నప్పుడు ‘గుండెమంట’ పెరుగుతుంది. ఇక లోభం. అంటే ఉన్నదాన్ని పోగొట్టుకోలేకపోవడం. ఈ రెండూ పుట్టగానే కోరింది కావాలనీ, ఉన్నది దక్కదేమోననే ఒత్తిడీ, ఆ ఒత్తిడితో నాళాల్లో రక్తపు వేగం పెరుగుతాయి. ఇలా రక్తపోటు వచ్చి... అది గుండెపోటుకు దారితీయవచ్చు. దాంతో గుండెల్లో పట్టాల నిర్మాణం జరిగి... ఒకసారి గుండెపోటు గానీ వస్తే... తర్వాత రెండో పోటు ఎప్పుడో ఏమోననే ఆందోళనతో ఆ పట్టాల మీద గుండెల్లో రైళ్లు పరుగెత్తడం నిత్యం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాతవి మద, మాత్సర్యాలు. ఈ రెంటి వల్ల గుండెపై పడే ప్రభావాలు దాదాపు ఒకేలా ఉంటాయి. పక్కవారికి ప్రమోషన్లు, ఆదాయాల్లో తేడాల కారణంగా ఈర్ష్యకు ఇంచుమించు సమానమైన మాత్సర్యంలోనూ కలిగేదీ ఒకరకమైన ఒత్తిడే. ఇక మదం విషయానికి వస్తే... ప్రమోషన్లూ, పదోన్నతులు కలిగిన వారు... తమకు ఎవరైనా అడ్డు చెప్పినప్పుడు వారి అహం దెబ్బతింటుంది. దాంతో పెరిగే అహంకారం వల్ల రెండో అరిషడ్వర్గమైన క్రోధం సమయంలో ఒంట్లో కలిగే జీవరసాయనచర్యలే జరుగుతాయి. అందుకే అరిషడ్వర్గాలలోని మొదటిది ఒక పరీక్షలా ఉపయోగపడితే మిగతావన్నీ ఒత్తిడిని తీవ్రంగా పెంచి గుండెకు హాని చేస్తాయి. అందుకే త్రిగుణాలైన సత్వ, రజో, తమో గుణాల్లో... సాత్వికాన్ని పెంపొందించుకొని, తామస, రజో గుణాలను తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడు గుంyð నెమ్మదించి, మనకు మేలు కలుగుతుందంటున్నారు వైద్యశాస్త్రపు తాత్వికత ఎరిగిన నిపుణులు. అంతేకాదు... భారతీయ ఆధ్యాత్మికత మనకు వరంగా ఇచ్చిన మరో అస్త్రం ధ్యానం. అది మనకు గుండెనిబ్బరం ఇస్తుందన్నది తథ్యం. నిరూపితమైన సత్యం. – యాసీన్ -
ఏకకాలంలో.. జీవితకాలపు దెబ్బ..!
జీవనోపాధికి చిన్నపాటి వాహనాలను నడుపుకునే వారిపై ‘జీవితకాలపు’ దెబ్బ పడుతోంది. వాహనాలకు జీవితాకాలపు పన్ను ఏకకాలంలో వసూలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదల పాలిట శాపంగా మారింది. ప్యాసింజర్ ఆటోలు, మినీ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్ (3 వేల కేజీలలోపు బరువు)కు జీవితకాలం పన్ను విధించనున్నారు. మూడు నెలల కొకసారి పన్నులు వసూలు చేసే విధానానికి రవాణా శాఖ స్వస్తి పలికింది. జూలై 1నుంచి జీవితకాలపు పన్నును ముక్కు పిండి ఏకకాలంలో వసూళ్లకు ఉపక్రమించింది. తిరుపతి అన్నమయ్య సర్కిల్ : జిల్లాలో సుమారు 54 వేల వాహనాలు జీవితకాలపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్యాసింజర్ ఆటోలు 27,633, మినీ గూడ్స్ వెహికల్స్ (మూడు చక్రాల వాహనాలు) 3,835, టాటా ఏస్, మహేంద్ర మ్యాక్స్ (నాలుగు చక్రాలు) వాహనాలు సుమారు 10 వేల వరకు ఉన్నాయి. తిరుపతి పరిధిలో ప్యాసింజర్ ఆటోలు 11,784, మినీ గూడ్స్ వెహికల్స్ 1,174, టాటా ఏస్, మహేంద్ర మ్యాక్స్ వాహనాలు 2,126 ఉన్నాయి. వీటి జీవిత కాల పన్ను చెల్లింపు గడువు 6 నెలలుగా నిర్ణయించి ప్రభుత్వం ప్రకటించింది. కొత్తవాటికి రిజిస్ట్రేషన్ సమయంలోనే పన్ను.. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ సమయంలోనే లైఫ్ టైం ట్యాక్స్ వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణికులను తరలించే ప్యాసింజర్ ఆటోలకు ఆటో విలువలో రెండు శాతం మొత్తాన్ని పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. వాహనం ఇది వరకే రిజిస్ట్రేషన్ అయి మూడేళ్లు గడిచి ఉంటే, దాని విలువలో 1.5 శాతం పన్ను కట్టాల్సిందే. 6 నుంచి 9 ఏళ్ల లోపు రిజిస్ట్రేషన్ అయివుంటే 1.3 శాతం పన్ను, 9 ఏళ్లు మించితే 1 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. కొత్త మినీ ట్రాన్స్‌ఫోర్టు వెహికల్ (మూడువేల కేజీల వరకు బరువున్న లగేజీ వాహనం)కు వాహన విలువలో 7 శాతం జీవిత కాలం పన్ను చెల్లించాలి. మూడేళ్లలోపు రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు 6.5 శాతం, 6 నుంచి 9 ఏళ్ల లోపు రిజిస్ట్రేషన్ వాహనాలకు 4 శాతం, 9 ఏళ్లు పైబడిన వాహనాలకు దాని విలువలో 1 శాతం పన్ను ఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ– వాహనాలకు ఇదే పరిస్థితి.. రిజిస్ట్రేషన్ సమయంలో ఈ–రిక్షాకు రూ.1000, ఈ–కారుకు రూ.2వేలు చొప్పున జీవికాలపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు ఐదేళ్లు మించిన ఈ–రిక్షాకు రూ.900లు, ఈ –కారుకు రూ.1800 చెల్లించే విధానం ఉంది. పన్ను ఎగవేతకు ముకుతాడు.. జిల్లాలో సకాలంలో పన్నులు చెల్లించని ఎగవేతదారులను అరికట్టే ఉద్దేశంతో రాష్ట్ర రవాణా శాఖ జీవిత కాలంపు పన్ను విధానాన్ని ఏక కాలంలో చెల్లించే విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో సకాలంలో పన్ను వసూలు చేయవచ్చని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. త్రైమాసిక పన్ను చెల్లింపు వి«ధానంలో బకాయిలు ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయి రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతోంది. పన్ను చెల్లించని వాహనాలపై కేసులు నమోదు చేయడం, వాటిని జప్తు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుత జీవిత కాలపు పన్ను విధానంతో ఎటువంటి ఇబ్బందులకు తావులేకుండా పన్నులు నిక్కచ్చిగా సకాలంలో వసూలు చేయవచ్చు. జూలై 1వ తేది నుంచి పకడ్బందీగా.. వాహన యజమానులు పన్ను చెల్లింపు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా జీవితకాల పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్యాసింజర్ ఆటోలు, మినీ గూడ్స్ వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ సమయంలోనే లైఫ్‌టైం టాక్స్ వసూలు చేస్తారు. ఇప్పటికే తిరుగుతున్న వాహనాలకు (ప్రస్తుతం ఉన్న పాతవాహనాలకు) 6నెలల గడువు ఇస్తారు. గడువులోపు వాహన యాజమానులు జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికీ పన్ను చెల్లించని వాహనాలపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుంది. – జి. వివేకానందరెడ్డి. ఆర్టీవో, తిరుపతి -
పన్ను ఎగవేత అంత వీజీ కాదు
సాక్షి, సిటీబ్యూరో: పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాల నమోదులో అక్రమాలను అరికట్టేందుకు రవాణాశాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వాహనాల జీవితకాల పన్నుపైన ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయాల ఆదాయానికి గండి కొట్టే విధంగా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దళారులతో కుమ్మక్కై వాహనాల జీవితకాల పన్ను ఎగ్గొడుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించేందుకు జాతీయ సమాచార కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్)లోని ‘వాహన్ సారధి’ తో మొత్తం వాహనాలను అనుసంధానించాలని నిర్ణయించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినా వాటి వివరాలు వెంటనే వాహన్ సారథిలో నిక్షిప్తమవుతాయి. అలాగే వాహనాల ఖరీదు, వాటిపైన ప్రభుత్వానికి చెల్లించవలసిన జీవితకాల పన్ను మొత్తం కూడా నమోదవుతుంది. దీంతో ప్రాంతీయ రవాణా అధికారి నుంచి కిందిస్థాయి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, క్లర్క్‌లు ఎలాంటి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉండదు. మరోవైపు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాలను కూడా వెంటనే తెలుసుకొని జీవితకాల పన్నును కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇటీవల నగరంలోని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో కొందరు అధికారులు దళారులతో కుమ్ముక్కై సుమారు 800 వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో సుమారు రూ.1.5 కోట్ల మేర ప్రభుత్వాదాయానికి గండి పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారి, మరో ముగ్గురు క్లర్క్‌లను సస్పెండ్ చేయడంతో పాటు, సదరు ప్రాంతీయ రవాణా అధికారిని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. బండ్లగూడ తరహాలో మరోసారి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఎన్ఐసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. బండ్లగూడ అక్రమాలపై విచారణ .. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన 500 నుంచి 1000 వాహనాలు రోజూ గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదవుతాయి.ఈ సమయంలో వాహనాల ఇన్వాయీస్, వాహనాల వయస్సును పరిగణనలోకి తీసుకొని జీవితకాల పన్ను వసూలు చేయాలి. ఉదాహరణకు కర్ణాటకకు చెందిన రూ.6.5 లక్షల మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు హైదరాబాద్‌కు బదిలీ అయినప్పుడు 12 శాతం పన్ను వసూలు చేయాలి. ఒకవేళ అది రెండేళ్ల కిందటి వాహనం అయితే 10 శాతం చొప్పున తీసుకోవాలి. కానీ బండ్లగూడలో ఇలాంటి లెక్కలు లేకుండా, ఇన్వాయిస్ నమోదు చేయకుండా ఏకంగా 800 వాహనాలపైన అతి తక్కువ జీవితకాల పన్ను విధించారు. ఒక్కో వాహనంపై సగటున రూ.55000 ఆదాయం రావలసి ఉండగా, అందులో రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకే ప్రభుత్వ ఆదాయానికి జమ చేశారు. మిగతా సొమ్మును దళారులు, అధికారులు కాజేసినట్లు గుర్తించారు.అలా రూ.కోటి 50 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టింది. ఈ ఉదంతంపై ప్రస్తుతం రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావును ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. ఎన్ఐసీతో అనుసంధానం ఇలా... కేంద్ర జాతీయ సమాచార వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్ఐసీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్ఐసీలో ‘వాహన్,సారధి’ ఒక ప్రత్యేక ఆప్షన్. ఇందులో ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదయ్యే వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సుల వివరాలను నిక్షిప్తం చేస్తారు. అలాగే పొరుగు రాష్ట్రాల వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సుల సమాచారాన్ని కూడా ఈ ఆప్షన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ఐసీతో రవాణాశాఖ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అనుసంధానం కాకపోవడం వల్ల ఆ లోపా న్ని అవకాశంగా మార్చుకొని కొంతమంది అధికారులు సొమ్ము చేసుకున్నారు. వాహనాలపై రావలసిన జీవితకాల పన్నును ఎగ్గొట్టారు. ఎన్ఐసీతో అనుసంధానం కావడం వల్ల పొరు గు రాష్ట్రాల వాహనాలను హైదరాబాద్‌లో, తెలంగాణ లో ఎక్కడ నమోదు చేసినా వాటి వాస్తవ ధరలు, వివరాల ప్రకారమే నమోదు చేయాల్సి ఉంటుంది. -
3 పరోటాలు తింటే జీవితాంతం ఫ్రీ మీల్స్
-
70శాతం మహిళలపై అత్యాచారం!
పపువా న్యూగినియా: పపువా న్యూగినియాలో 'లిలి జో' అనే మహిళకు నలుగురు పిల్లలు. ఆమె గత ఏడాది ప్రారంభం నుంచి జైలులో ఉంటోంది. తన ఏడాది కుమారుడు కూడా తనతోపాటే ఉన్నాడు. ఇంతకీ ఆమె ఏదైనా నేరం చేసిందా అంటే అదేంకాదు. మరి నేరం చేయనప్పుడు కావాలని జైలులో.. ఆ చీకటి గదిలో ఎందుకు ఉంటోందని అనుకుంటున్నారా.. అందుకు ప్రధాన కారణం అక్కడ మహిళలకు ఏ మాత్రం భద్రత లేకపోవడమే. ఎక్కడ ఉన్నా తనపై ఏదో ఒకరకమైన దాడి తప్పదని భావించిన జో.. తన ఏడాది కుమారుడితోపాటు జైలు అధికారులను బ్రతిమిలాడుకొని పోర్ట్ మోరెస్బీ అనే జైలులో ఉంటోంది. సాధారణంగా రక్షణకోసం ఎన్నో రకాల మార్గాలు ఉన్నా వాటిపై నమ్మకం లేక ఒక మహిళ ఏకంగా జైలు ఆశ్రయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆ దేశంలో మహిళల దుర్భర స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పపువా న్యూగినియా పసిఫిక్ తీరాన ఉన్న ఓ చిన్న ద్వీపం. ఆస్ట్రేలియాకు 100 మైళ్ల దూరంలో ఉంది. సాధారణంగానే ఎక్కువ ఎజెన్సీ ప్రాంతాన్ని కలిగి ఉండటంతోపాటు గిరిజన జనాభాను కూడా అధికంగా కలిగిన ఈ దేశం ఇప్పుడు ఓ ముఖ్య విషయం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. అదే మహిళలపై అత్యాచారాల ఘటనల అంశంతో.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 70శాతం మంది మహిళలు తమ జీవిత కాలంలో లైంగిక దాడులకు, భౌతిక దాడులకు గురవుతున్నారని అక్కడి తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. దాదాపు 50శాతం మంది మహిళలు తమ వివాహ సమయానికంటే ముందే ఈ ఆకృత్యాలకు బలవుతున్నారని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది. కాగా, వీరిపై ఈ అరాచకాలకు పాల్పడేవారు 40శాతం మంది పురుషులు వివాహం అయినవారేనని కూడా ఆ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఈ ద్వీపం గురించి 'ప్రపంచంలోనే ఈ ద్వీపం మహిళలకు అత్యంత అపాయకరమైనది' అని వెల్లడించింది. ఈ ద్వీపంలోని జనాభాలో 70శాతం మంది అంటే దాదాపు 70 లక్షల మంది మహిళలు తమ జీవిత కాలంలో అత్యాచారానికో, శారీరక హింసలకు గురైన వారే ఉన్నారని పేర్కొంది. మహిళలను ఎంత దారుణంగా హింసించేవారంటే అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి ఈడ్చి కొడుతుండేవారు. ఇలాంటి దృశ్యాలను చూపించే వీడియోలు, ఫొటోలు ఇప్పటికే కోకొల్లలుగా ఉన్నాయి. మహిళలపై అసలు ఈ ఆకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయని పరిశీలిస్తే.. లైంగిక, భౌతిక దాడులకు పాల్పడే పురుషుల నుంచి రక్షించేందుకు ఎలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం ఒక కారణమైతే, నిరక్షరాస్యత, మౌడ్యం, మూర్ఖత్వం, పురుషత్వ అహంకారం కూడా ఇక్కడ ప్రజ్వరిల్లుతోంది. అంతేకాకుండా నిత్యం పేదరికంతో సతమతమవుతున్న ఈ ద్వీపంలో ఆస్పత్రులకు, వైద్య సేవలకు కావాల్సిన నిధులు అందడం లేదు. అంతేకాకుండా కఠిన చట్టాలు కూడా లేకపోవడం మరొక కారణం. 1971లో ఆ ప్రాంతంలో తీసుకొచ్చిన ఓ చట్టం కూడా అక్కడ మహిళలను వేధించేందుకు అనుకూలంగా ఉంది. -
కాలం
జీవన కాలమ్ ఇప్పుడిప్పుడు 90 నుంచి 100 సంవత్సరాలు బతుకు తున్నవారిని చూస్తున్నాం. మొన్న మా మిత్రుడు అంటు న్నాడు- ఈ తరంలో పుట్టిన పిల్లలు తేలికగా 110 సంవత్స రాలు జీవిస్తారని. విత్తనాల కల్తీ, కులాంతర, దేశాంతర వివాహాల కారణంగా జీవక ణాల ఆరోగ్యం-ఏదైనా కావచ్చు. జానీ ట్రువాంట్ అనే రచయిత తన పుస్తకానికి ఒక బూతు శీర్షికని ఉంచాడు. ఆయన చెప్పాడూ- ఈ విశ్వాంతరాళంలో-భూమి వయసు కొన్ని కోట్ల సంవత్స రాలు అనుకుంటే- మానవుని జీవన పరిమాణం ఒక నానో సెకను. అంటే ఒక సెకనులో నూరుకోట్ల వం తుట! ఈ వ్యవధిలోనే మన మతాలు, పదవులు, సుఖా లు, భవిష్యత్తు- ఆ పరిధిలో ఆలోచిస్తే ఇవన్నీ హాస్యా స్పదంగా కనిపిస్తాయి. అయితే సృష్టిలో అత్యంత సుని శితమైన ఆలోచనా సరళి గల ప్రాణి- మానవుడయితే, అత్యంత క్రమశిక్షణ, అనూహ్యమైన సామాజిక స్పృహ, సామాజిక జీవనాన్ని గడిపే ప్రాణి- చీమ. చీమ నుంచి ఇప్పటికీ-ఈ మాట పొరపాటు- ఎప్పటికీ నేర్చుకోవల సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే చీమ ఆయుః ప్రమాణమెంత? ఎంత సులువుగా, ఎంత ప్రయత్న రహితంగా చచ్చిపోతుంది? కొన్ని వేల చీమలు, కొన్ని గంటలు, రోజుల పాటు సామూహికంగా కృషి చేసి ఒక పాముని చంపెయ్య గలవు. మనం? రెండు కులాలు, రెండు రాష్ట్రాలు, రెండు వర్గాలు, రెండు మనుషులు కలసి జీవించలేం. కలిస్తే మానభంగమయినా, పక్క వాడి బతుకుని నాశనం చేయడమయినా జరుగుతుంది. మన దృక్పథంలోనే ఏదో లోపం చచ్చింది. కాలం గురించి మాట్లాడుతున్నాను కనుక- దాదా పు 45 సంవత్సరాల కిందట చూసిన ఒక సినీమా ఇప్ప టికీ నా మనసులో గిరికీలు కొడుతూనే ఉంటుంది. హైద రాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చిక్కడపల్లిలో ఉన్న ఏదో థియేటర్లో చూశాను. నా పక్కన అన్నపూర్ణా సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూ దనరావుగారున్నారు. ఇప్పటికీ ఆ సినీమా పేరు, దేశం పేరూ, వివ రాలూ గుర్తు పెట్టుకోలేకపోయినం దుకు ఎంతగానో కుంగిపోతుం టాను. దురదృష్టం. రెండవ ప్రపంచయుద్ధం, తత్కారణంగా జర్మన్ నియంత హిట్లర్ చేసిన దారుణ మారణకాం డని గురించిన కథలు, నవలలు, చిత్రాలు కోకొల్లలు. సెల్యూలాయిడ్ మీద ఎన్నో మహాకావ్యాలు అవత రించాయి. ఒక మనిషిని హింసిం చడానికి మార్గాలేవీ? శారీరకమైన హింస, తన ఆత్మీయులను తన ముందే హింసించడం, ప్రాణం తీయడం, జైల్లో మగ్గే టట్టు చూడడం, ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం పైన ఉటంకించిన వేటి జోలికీ పోలేదు. మరేమిటి మానవుడిని హింసించేది? ఏది మానవుని జీవన సర ళిని, చైతన్యాన్ని పూర్తిగా అణగదొక్కి-అతని చేతనని స్తబ్దం చేయగలుగుతుంది? ఏది భయంకరమైన హింస? మనిషిలో ‘కాల’గమన చైతన్యాన్ని ఆపగలిగితే అది భయం కరమైన హింస-అంటాడు కథకుడు. అద్భుతం. బహుశా కారాగారాల్లో బంధించి, చీకటికోణాల్లో నేర గాళ్లని మగ్గేటట్టు చేసి, బయట ప్రపంచంలో ఏం జరు గుతుందో తెలియకుండా వారి‘కాల’ం స్పృహని ఘనీ భవింపచేయడమే శిక్షగా మనం నిర్దేశిస్తున్నాం. ఇదీ చిత్రం. ఇరవై ముప్పయ్ మందిని జైల్లో పెట్టారు. అందరూ కలసే ఉన్నారు. బయట కాలం స్పృహ వారికి చేరకుండా చేశారు. కానీ జైల్లో ఖైదీలు కాలాన్ని తమకు తామే పునరుద్ధరించుకున్నారు. కాలం స్పృహ జారిపోకుండా నిలుపుకున్నారు. ఎలా? నిరంత రాయంగా ఇద్దరు సెకన్లు లెక్కపెడుతు న్నారు. ‘‘ఒకటి- రెండు, ఒకటి-రెండు, ఒకటి - రెండు(వన్, టూ; వన్, టూ; వన్, టూ) ఇలాగ. మరొకరు నిమిషాలని లెక్కవే స్తున్నారు. అందరూ కలసి- సామూహికంగా ఉద యాన్ని గుర్తుపట్టారు. సాయంకాలాన్ని గుర్తు పట్టారు. రాత్రిని గుర్తుపట్టారు. రోజులు తెలుస్తున్నాయి. కాలం గడుస్తోంది. నిలిచిపోలేదు. వారి మనస్సుల్లో ‘కాల చైతన్యం' నశించలేదు. వారి జీవితాలు చలనవంతంగా ఉన్నాయి. ఇప్పుడు శత్రువు- వాళ్ల లెక్కని- అంటే కాలాన్ని గుర్తించడానికి వారు చేసే ప్రయత్నాన్ని చెడగొట్టాలని ప్రయ త్నించాడు. కాలచైతన్యం- వారి ఆక లినీ, ఒంటరితనాన్నీ, స్తబ్దతనీ జయించింది. శత్రువు- వాళ్లని ఒకా నొక ప్లేన్‌లో శిక్షించాలనుకున్నాడు. ఖైదీ తెలివిగా ఆ ప్లేన్‌ని అధిగమించి ‘‘కాలం’’ కాన్సెప్ట్‌ని నష్టపోకుండా పట్టుకున్నాడు. కేవలం శారీరకమైన, లౌకికమైన స్థాయిని దాటి మరొక ప్లేన్‌లో హింసని నిలిపిన చిత్రం. రోటీన్ మారణహోమాన్ని గురించిన ఇన్ని చిత్రాల మధ్య ఇది నాకు తల మానికంగా తోస్తుంది. మానవ జీవన సరళికి- కాలం పెద్ద ఊతం. ఒక సెకనులో 10 కోట్ల వంతు జీవిత ప్రమాణం ఉన్న మాన వుడు- అయిదేళ్ల పదవిని, పాతికేళ్ల కీర్తిని, 50 ఏళ్ల ఆనం దాన్ని మరొక కోణంలో చూడగలిగితే- దృక్పథం ఎంత సాంద్రమో, ఎంత ఉదారమూ, ఎంత గంభీరమూ అవుతుందో! చీమల్లో ఐన్‌స్టీన్, రమణ మహర్షి ఉండి ఉండరు. కానీ అదే తన జీవన పరమార్థం, అదే ఆఖరిక్షణం అన్నట్టు చీమ శ్రద్ధగా, సామూహికంగా, కమిటెడ్‌గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది తీసే పరుగు సైన్యం మీద ఒక్క నీటి చుక్క పడితే చెల్లాచెదురై, మళ్లీ అంతలో తన ఐకమత్యాన్ని ప్రోది చేసుకుంటుంది. ఆలోచనని అనితర సాధ్యంగా సాధించిన మాన వుడు- ఈ ఒక్క గుణాన్ని గుర్తు పట్టగలిగితే ఈ ప్రపం చం ఎంత హృద్యంగా ఉంటుంది? ఒక హిరోషిమా, ఒక బాబ్రీ మసీదు, ఒక బొంబాయి మారణహోమం- ఎంత అర్థరహితంగా కనిపిస్తాయి? వరస తప్పక నడిచే చీమల దండులో ఒక చీమ మరొక చీమను చంపడం ఏనాడ యినా చూశామా? కాలం స్పృహ సంస్కారాన్ని పెంచుతుంది. మానవ స్వభావానికి ఉదాత్తతని మప్పుతుంది. అన్ని టికీ మించి జీవితానికి ఒక విలువనీ, పరమార్థాన్నీ సం తరిస్తుంది. అది హాస్యాస్పదమైనంత బుద్బుదప్రాయం కనుక. - గొల్లపూడి మారుతీరావు -
ఆ బాధ ఎప్పటికీ...
ఆఫ్ ద ఫీల్డ్ న్యూఢిల్లీ: ఫేర్వెల్ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం అనేది తనని జీవితకాలం బాధిస్తూనే ఉంటుందని ఇటీవల రిటైరైన డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చెప్పాడు. జట్టుకు తన సేవలు అవసరం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే, ఢిల్లీలో చివరిసారి టెస్టు ఆడి వీడ్కోలు పలికేవాడినని... కానీ నాటి సెలక్టర్లు తనకు అలాంటి అవకాశం ఇవ్వలేదని మరోసారి బాధపడ్డాడు. ‘దేశం తరఫున 12 సంవత్సరాలు ఆడిన క్రికెటర్‌కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అర్హత ఉండదా’ అని వీరూ ప్రశ్నించాడు. తన విషయంలోనే కాదని, దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏ క్రికెటర్‌కైనా ఒక వీడ్కోలు మ్యాచ్ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఢిల్లీలో జరిగే చివరి టెస్టు సందర్భంగా సెహ్వాగ్‌ను బీసీసీఐ సన్మానిస్తుందనే వార్త వినిపిస్తోంది. ‘అలా జరిగితే మంచిదే. ఒకవేళ బీసీసీఐ పట్టించుకోకపోతే ఢిల్లీ క్రికెట్ సంఘమైనా ఆ పని చేస్తుందని భవిస్తున్నాను’ అని వీరూ అన్నాడు. అలాగే జట్టును ఎంపిక చేసే సమయంలో సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా వరసగా ఐదు మ్యాచ్‌లలో విఫలమైన వారిని జట్టులోంచి తీసేయాలని అభిప్రాయపడ్డాడు. మిగిలిన జట్లతో పోలిస్తే పాకిస్తాన్‌పై తాను ఎక్కువ నిలకడగా ఆడేవాడినని, ఆ జట్టుతో మరో రెండు సిరీస్‌లు ఆడి ఉంటే తన కెరీర్ పరుగులు 10 వేలు (వీరూ చేసింది 8,586) దాటేవని అన్నాడు. -
ఓ వ్యక్తి @ 25 వేల సెల్ఫీలు
లండన్: ఓ వ్యక్తి తన జీవితంలో ఎన్ని సెల్ఫీలు తీసుకోవచ్చు..? 1980 తర్వాత జన్మించిన వారు ముసలివాళ్లు అయ్యే వరకు సెల్ఫీలు తీసుకుంటే ఎన్ని సేకరించవచ్చు..? ఓ పరిశోధన ప్రకారం ఒక్కొక్కరు తమ జీవితకాలంలో సగటున 25 వేలకు పైగా సెల్ఫీలను తీసుకోవచ్చు..! 'లస్టర్ ప్రీమియం వైట్' నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సెల్ఫీల సరదా ఉన్నవారు తమ జీవితంలో సరాసరిన 25,676 సెల్ఫీలు తీసుకుంటారని అంచనా వేసింది. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్లో ఎకౌంట్లు ఉన్నవారికి సెల్ఫీల సరదా ఎక్కువ ఉందని వెల్లడించింది. 1000 మంది అమెరికన్లు సర్వే చేయగా.. ఏదైనా వేడుక లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గడిపిన సందర్భంగా సెల్ఫీలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇక 63 శాతం మంది సెల్ఫీలు తీసుకోవడానికి విహార యాత్ర అనువైన ప్రదేశమని అభిప్రాయపడ్డారు. సగంమంది సెల్ఫీలు తీసుకునేముందు జట్టును సవరించుకుంటామని తెలిపారు. మరో 53 శాతం మంది సెల్ఫీ దిగేముందు అద్దంతో తమ ముఖం చూసుకుంటామని చెప్పారు. 47 శాతం సెల్పీలకు ముందు ముఖకవళికలను ప్రాక్టీస్ చేస్తామని వెల్లడించారు. 95 శాతం మంది కనీసం ఒక్క సెల్పీ అయినా తీసుకున్నారని ఆ సర్వేలో తేలింది. -
జీవితకాలం పూర్తయితే.. చార్మినార్‌నైనా కూలగొట్టాల్సిందే!
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హన్మకొండ అర్బన్: నిర్మాణం యొక్క జీవితకాలం పూర్తయి, శిథిలావస్థకు చేరి, ప్రజలకు ఇబ్బందికరంగా మారినప్పుడు ప్రజాభీష్టం మేరకు చార్మినార్ వంటి నిర్మాణమైనా కూల గొట్టి కొత్త కట్టడం నిర్మించాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నా రు. శనివారం కాజీపేటలోని ఎన్ఐటీ సమీపంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, కలెక్టరేట్‌ను ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ప్రదేశంలో ఆధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో 20 అంతస్తుల నూతన భవనం నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. పురాతన భవనాలను వందల కోట్లు వెచ్చించి 10 సంవత్సరాల వయసు పెంచడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. అందువల్ల పురాతన భవనాల స్థానంలో పూర్తిగా కొత్తభవనాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. నూతన భవనం ఉస్మానియా ఆస్పత్రి పేరు మీదనే నిర్మితమవుతుందని ఆయన స్పష్టం చేశారు. రోగులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముస్లింలు, గిరిజనులకు 12%రిజర్వేషన్లు సుధీర్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లిం, మైనారిటీలు, గిరిజనులకు చెందాల్సిన 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ ఏడాదిలోని బిల్లును తెస్తామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. హన్మకొండలో శనివారం జరిగిన ‘ఈద్ మిలాప్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమూద్ అలీ మాట్లాడారు. -
బుల్ జోరు, సెన్సెక్స్ న్యూ హై!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు కోనసాగుతోంది. సోమవారం ఆరంభంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 28027 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల వృద్ధితో 8383 పాయింట్లను నమోదు చేసుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల ప్రభావం, బ్లూచిప్ కంపెనీల షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ పరుగు కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హ్యాంగ్ సెంగ్ 389 పాయింట్లు, తైవాన్ 133 పాయింట్ల లాభాన్ని నమోదు చేసుకున్నాయి. సన్ ఫార్మా, ఐటీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లార్సెన్, జిందాల్ స్టీల్, సిప్లా, హిండాల్కో, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
తిరుమలలడ్డు జీవితకాలం ఇకపై 90రోజులు
-
పెరిగిన ప్రజల జీవితకాలం
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014 లెక్కల ప్రకారం ప్రజల జీవితకాలం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 2012లో పుట్టిన బాలికలు 73 సంవత్సరాలు, బాలురైతే 68 సంవత్సరాలు జీవిస్తారు. పేద దేశాల్లో నివసిస్తున్న ప్రజల జీవితకాలం గత రెండు దశాబ్దాల్లో సగటున 9 ఏళ్లు పెరిగింది. ఆయా దేశాల్లో శిశు ఆరోగ్యం కోసం మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్లే ప్రధానంగా ఈ మార్పు సాధ్యం అయింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 1990-2012 మధ్య కాలంలో ప్రజల సగటు జీవితకాలం పెరుగుదలను పరిశీలించిన ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ మేరకు గురువారం తన వార్షిక నివేదికలో పేర్కొంది. -
'బాబు అక్రమాలపై దర్యాప్తు జరిగితే జీవితాంతం జైల్లోనే'