
సాక్షి,ముంబై: టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ ప్రత్యర్థుల దెబ్బకు దిగి వచ్చింది. దేశీయంగా తన స్థానాన్ని నిలబెట్టు కునేందుకు భారీ కసరత్తే చేస్తోంది. ఈ నేపథ్యంలో లైఫ్ టైం యాక్టివేషన్‌కు సంబంధించి రెండు కొత్త ప్లాన్లను తిరిగి లాంచ్ చేసింది.
కోట్లమంది ఖాతాదారులు నష్టపోయినా పరవాలేదంటూ ఇటీవల జీవితకాల చందాదారులకు కోసం ప్రత్యేకంగా రూ.30 కనీస రీచార్జ్ పథకాన్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఖాతాదారులనుంచి స్పందన కరువవ్వడంతో ఎయిర్‌టెల్ వెనక్కి తగ్గక తప్పలేదు. కొత్త ఎత్తుగడతో తాజాగా రూ.100, 500 రూపాయల విలువైన ప్రీపెయిడ్ ప్లాన్లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే ఈ ప్లాన్లలో డేటా, ఎస్‌ఎంఎస్‌ల సదుపాయాన్ని అందించలేదు. కేవలం టాక్ టైంను మాత్రం అందిస్తోంది. దీనితోపాటు లైఫ్ టైం ఇన్‌కమింగ్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లు మై ఎయిర్‌టెల్ యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
రూ.100 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్
వాలిడిటీ 28 రోజులు (అవుట్ గోయింగ్ కాల్స్)
టాక్ టైం రూ.81.75
అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ కాల్స్ (జీవితకాలం కాల్స్‌ను స్వీకరించడానికి అనుమతి)
రూ.500 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ప్లాన్
టాక్‌టైం రూ.420.73
వాలిడిటీ 28 రోజులు ( అవుట్‌గోయింగ్ కాల్స్)
అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ కాల్స్ (జీవితకాలం కాల్స్‌ను స్వీకరించడానికి అనుమతి)
Comments
Please login to add a commentAdd a comment