'బాబు అక్రమాలపై దర్యాప్తు జరిగితే జీవితాంతం జైల్లోనే' | 'Babu has to spend in jail lifetime if probe conducted in his regularities' | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 19 2013 2:50 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులపై దర్యాప్తుచేసే జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ''చంద్రబాబూ నీక్కూడా కొడుకు ఉన్నాడు. నీ కొడుకు ఎలా పెరిగాడు? ఎలా ఆస్తులు సంపాదించాడో అందరికీ తెలుసు. 9 ఏళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని నీ కొడుకు సంపాదించాడని కేసు వేస్తే... దాని ఆధారంగా జైల్లో పెడితే... నీకు ఎలా ఉంటుంది? చంద్రబాబూ!'' అని ప్రశ్నించారు. 44 అంశాల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎన్నికల దగ్గర నుంచి పదవుల పందేరం దాకా చంద్రబాబు కుమ్మక్కయ్యారన్నారు. వైఎస్ జగన్‌పై కేసులన్నీ రాజకీయకోణంతోనే వేశారన్నారు. చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం జగన్‌కు బెయిల్‌ ఖాయమని నిపుణులే చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో చంద్రబాబు, అతని బృందం కీచురాళ్లరొద చేస్తున్నారన్నారని విమర్శించారు. దర్యాప్తు చేసిన తర్వాత ఛార్జిషీట్లు వేశారన్న విషయం మరిచారన్నారు. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నది చంద్రబాబు కాదా? అని పద్మ ప్రశ్నించారు. కోర్టు విచారణలో ఉన్నకేసును కూడా ప్రభావితంచేయడానికి యత్నిస్తున్నారన్నారు. దీంతోనే ఈ కేసు రాజకీయ కేసని తేలిపోయిందన్నారు. జగన్‌ను దోషిగా నిర్ధారించే ఆధారాల్లేవు కాబట్టే టీడీపీ శ్వేత పత్రం డ్రామా ఆడుతోందన్నారు. జగన్‌పై కేసు నిలబడదు కాట్టే శ్వేపత్రం వేస్తామని టీడీపీ చెబుతుందని చెప్పారు. చంద్రబాబు జైలు శిక్షకు గురయ్యే 18 అంశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. వీటిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదలచేయగలరా? అని ప్రశ్నించారు. జగన్‌ బయటకు వస్తే తట్టుకోలేమని చంద్రబాబు బేజారెత్తిపోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మతి భ్రమించిందన్నారు. కోర్టులను, కేంద్రాన్ని, దర్యాప్తు సంస్థలను ప్రభావితంచేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని విమర్శించారు. జగన్‌ను జైల్లోనే ఉంచాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌ కాళ్లు పట్టుకుంటున్నాడన్నారు. చేస్తున్న పనులను చూస్తే ఆయన్ని రాజకీయ నాయకుడిగా కూడా గుర్తించడంలేదన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement