వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ప్రజలు మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... వైఎస్ జగన్ మీద ఉన్న కేసులు ఎలా పెట్టారో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. అక్రమ కేసులను వైఎస్ జగన్ ధైర్యంగా ఎదుర్కొంటుంటే.. చంద్రబాబు మాత్రం తనపై ఉన్న ఒక్క కేసులకు స్టేలు తెచ్చుకుని బతుకుతున్నారని మండిపడ్డారు.