spend
-
సోషల్ మీడియాకు సీఎం సిద్ధరామయ్య ఖర్చెంత?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ప్రతీనెలా సోషల్ మీడియాకు ఎంత ఖర్చు చేస్తారనేది వెల్లడై వైరల్‌గా మారింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆర్టీఐ కార్యకర్త మారలింగ గౌర్ మాలీ పాటిల్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించడానికి ఎంత ఖర్చచేస్తారనేదానికి సమాధానం కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు. దీనికి ప్రభుత్వ ఏజెన్సీ కర్ణాటక స్టేట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ (ఎంసీఏ) సమాధానం తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 25 నుంచి మార్చి 2024 వరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్‌మీడియా కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆర్టీఐ అందించిన సమాచారం ప్రకారం సీఎంఓ ప్రతి నెలా దాదాపు రూ.53.9 లక్షలు ఖర్చు చేసింది. ఇందులో 18 శాతం జీఎస్టీ కూడా ఉంది. సిద్ధరామయ్య ఖాతాలను నిర్వహించే పాలసీ ఫ్రంట్ అనే కంపెనీకి ఈ చెల్లింపు జరిగింది. ఈ కంపెనీలో 25 మంది సభ్యులు ఉన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రులతో పోలిస్తే, సిద్ధరామయ్య సోషల్ మీడియాలో చాలా తక్కువ ఖర్చు చేస్తారని సీఎం కార్యాలయం తెలిపింది. -
Andhra Pradesh: తాగినంత నీరు..
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మంచినీటి సమస్యలన్నింటినీ పరిష్కరించి అన్ని ప్రాంతాలకు సంతృప్త స్థాయిలో రక్షిత మంచినీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో గ్రామంలో ప్రతి ఒక్కరికి రోజుకు కనీసం 55 లీటర్ల చొప్పున ఇంటి వద్దే కొళాయి ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. వచ్చే రెండేళ్లలో 2024 మార్చి నెలాఖరు వరకు గ్రామాల్లో రక్షిత మంచినీటి వసతుల కోసం రూ.17,989.32 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్ డబ్ల్యూఎస్) తయారు చేసిన నివేదికను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఇప్పటికే గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలున్నా నీటి సదుపాయం లేక వృథాగా ఉన్న చోట్ల శ్వాశత నీటి వసతి కల్పనకు రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లు, నదుల నుంచి ఏడాది పొడవునా కాల్వల ద్వారా రక్షిత మంచినీటి పథకాలకు నీళ్లు అందజేసే అవకాశం ఉన్న చోట అందుకనుగుణంగా చర్యలు చేపడతారు. అలా వీలుకాని చోట్ల మంచినీటి పథకాలకు అనుబంధంగా కొత్తగా బోర్లు తవ్వి క్లోరినేషన్ చేసి రక్షిత తాగునీటిని సరఫరా చేస్తారు. మొత్తం 56,448 పనులకు సంబంధించి ప్రణాళిక రూపొందించారు. 2,935 పంచాయతీల్లో 100 % రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా ఆర్డబ్ల్యూఎస్ విభాగం వీటిని 48,488 నివాసిత ప్రాంతాలుగా వర్గీకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.16 లక్షల ఇళ్లు ఉండగా 49.46 లక్షల ఇళ్లకు (51.97 శాతం) ప్రభుత్వం ఇప్పటికే ఇంటింటికీ కొళాయి సదుపాయాన్ని కల్పించింది. గత రెండేళ్లలో కొత్తగా 18.72 లక్షల ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. 2,935 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇళ్లకు ఇప్పుడు కొళాయిల ద్వారానే ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తోంది. జల్ జీవన్‌తో.. జల్ జీవన్ కార్యక్రమంలో భాగంగా వచ్చే రెండేళ్లలో రూ.3,090 కోట్ల వ్యయంతో 12,529 నివాసిత ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు కొత్తగా కుళాయిల ఏర్పాటుతో పాటు రోజూ నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు ఇళ్లు లేని పేదల కోసం ప్రభుత్వం జగనన్న హౌసింగ్ కాలనీలను ప్రత్యేకంగా నిర్మించి అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న హౌసింగ్ కాలనీల్లో కొత్తగా ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు రక్షిత మంచినీటి పథకాల కోసం రెండేళ్లలో రూ.3,250 కోట్లు వ్యయం చేయనున్నారు. తీవ్ర సమస్యలున్న చోట్ల తొలుత.. వచ్చే 35 ఏళ్లలో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంత మంచినీటి అవసరాలతో పాటు పారిశ్రామిక వినియోగాన్ని కూడా కలిపి రూ.50 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రణాళికను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తీవ్ర తాగునీటి సమస్యలున్న చోట్ల పనులను తొలుత ప్రాధాన్యతగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీరంలో ఉప్పునీటి కష్టాలు తీరేలా... ఉభయ గోదావరి జిల్లాల్లో సముద్ర తీరం వెంట ఉప్పనీటి కారణంగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాల్లో రూ.3,050 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులను రెండేళ్లలో చేపట్టనున్నారు. రూ.1,650 కోట్లు తూర్పు గోదావరిలో, రూ.1,400 కోట్లు పశ్చిమ గోదావరిలో ఖర్చు చేస్తారు. ప్రకాశం జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్లతో శ్వాశత రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తారు. చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.1,550 కోట్లతో పనులు చేపడతారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మంచినీటి కష్టాల పరిష్కారానికి వాటర్ గ్రిడ్ ద్వారా రూ.1,200 కోట్లతో శాశ్వత రక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మంచినీటి సౌకర్యాల కల్పనకు రూ.750 కోట్లు కేటాయించారు. ఉద్దానం, పులివెందుల, డోన్‌లో ఇప్పటికే.. రూ.700 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో, రూ.460 కోట్లతో వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో, రూ.224.32 కోట్లతో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో వాటర్ గ్రిడ్ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. నీటి పరీక్షలు, నిర్వహణకు రూ.425 కోట్లు రక్షిత మంచినీటి పథకాల ద్వారా రాష్ట్రమంతటా బోరు బావి నీటి నాణ్యత పరీక్ష, నిర్వహణ ఖర్చులకు రూ.425 కోట్లు కేటాయించారు. 20 ఏళ్లుగా... వృథాగా గుంటూరు జిల్లా రొంపిచర్లలో రెండు దశాబ్దాల క్రితం రూ.1.20 కోట్లతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకు, ఫిల్టర్ బెడ్ అన్నీ ఉన్నా నీటి వసతే లేక నిరుపయోగంగా మిగిలిపోయింది. గ్రామంలోని బోర్లు, బావుల్లో తగినంత నీరు లేకపోవడం, ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై ఆధారపడడంతో తాగునీటి పథకం మూలన పడింది. -
AP: జీతాలు, పింఛన్లకు మనకే ఖర్చెక్కువ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కన్నా రాబడి బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం.. తమ ఉద్యోగుల జీతభత్యాలపై ఇక్కడికన్నా తక్కువే వెచ్చిస్తున్నాయి. భౌగోళికంగా ఏపీ కన్నా పెద్ద రాష్ట్రాల్లోనూ జీతభత్యాల వ్యయం ఇక్కడికన్నా తక్కువే ఉంది. సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నెలవారీ గణాంకాలు దీన్ని వెల్లడించాయి. 2021–2022 తొలి ఏడు నెలల గణాంకాలను (ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు) విడుదల చేస్తూ... ఈ ఏడు నెలల్లో జీతాలు, పెన్షన్ల వ్యయం దాదాపు రూ.36వేల కోట్లకు పైగా అయిందని, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కానీ... గుజరాత్, తెలంగాణ వంటి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కానీ ఈ స్థాయి వ్యయాలు కాలేదంటూ గణాంకాలను బయటపెట్టింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఒక పక్క కరోనాతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గడిచిన రెండేళ్లలో దాదాపు 22వేల కోట్ల ఆదాయం తగ్గిపోగా... కోవిడ్ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణపై రూ.8వేల కోట్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. ఇలా రూ.30వేల కోట్లను కోవిడ్ మహమ్మారి మింగేసినప్పటికీ... ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లను చెల్లిస్తూ వస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2021–22 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వేతనాలు, పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.36,006.11 కోట్లు వెచ్చించింది. ఇందులో వేతనాల రూపంలో 24,681.47 కోట్లు ఖర్చు చేయగా పెన్షన్ల కింద రూ.11,324.64 కోట్లు వెచ్చించింది. ఇటీవల 11వ వేతన సవరణ కమిషన్ నివేదికపై సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ కూడా రాష్ట్రంలో వేతనాల వ్యయం చాలా ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆ కమిటీ రాష్ట్ర సొంత ఆదాయం కన్నా వేతనాలు వ్యయం ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రతీ ఐదేళ్లకోసారి వేతన సవరణను రాష్ట్రం భరించలేదని కూడా కీలకమైన వ్యాఖ్య చేసింది. అందుకు తగినట్లుగానే ఈ ఆర్ధిక ఏడాది వేతనాల వ్యయంపై కాగ్ గణాంకాలు కూడా ఉండటం గమనార్హం. ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం వేతనాల రూపంలో రూ.3500 కోట్లకు పైగా చెల్లిస్తోంది. పెన్షన్ల రూపంలో మరో 1500 కోట్లకు పైగా ప్రతీ నెల చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రతీ ఏటా వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతూనే ఉంది. -
కదిలితే చనిపోతుంది.. రోజుకు 22 గంటలు బెడ్‌పైనే..
నెదర్లాండ్స్: డ్రాన్‌టెన్‌కు చెందిన 27 ఏళ్ల సెలెస్ట్ వాస్ వీనెస్ అనే మహిళ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ (EDS) అని పేర్కొనే జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతుంది. ఇది వంశపారపర్యంగా సోకే అరుదైన వ్యాధి. దీంతో ఆమె రోజుకు 22 గంటలు మంచంమీదే పడుకుని ఉంటుంది. అయితే ఆమె ప్రత్యేక పైపుల ద్వారా కాల కృత్యాలను తీర్చుకుంటుంది. ఈ వంశపారపర్యం వ్యాధి వలన చర్మం, ఎముకలు, రక్తనాళాలు, అవయవాలకు సంబంధించిన కణజాలాలు తీవ్ర ప్రభావానికి గురౌతాయి. దీని వలన ఆ వ్యక్తిలో కదల్లేని స్థితి ఏర్పడుతుంది. దీంతో మెడ, వెన్నుపూసలు నిటారుగా నిలబడలేవు. కాగా, ఆమె గొట్టాల సహయంతో ద్రవ పదార్థాన్ని ఆహరంగా తీసుకుంటుంది. ఆమె శరీరంలోని కొన్ని భాగాలు కదలకుండా ఉండేందుకు 22 రింగులను తొడిగారు. ఆమె ఎక్కువగా కదిలితే చనిపోయే ప్రమాదం ఉంది. దాంతోనే ఆమె శరీరంలోని పలు భాగాలకు రింగులు అమర్చారు. ఆమె శరీరం సూర్యరశ్మి కిరణాలను కూడా తట్టుకొలేదు. దీంతో ఆమె ఎక్కువ సమయం చీకటిలోనే గడుపుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ ఇంకా ఎన్నిరోజులుంటానో తెలియదు.. శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నాను..ఇంకా బతకాలని లేదని బాధపడింది’ ..అయితే స్పెయిన్‌లోని బార్సినాలోని వైద్యులు ఆమె అరుదైన వ్యాధికి చికిత్స అందించడానికి ముందుకొచ్చారు. ఈ ఆపరేషన్‌కు అవసరమైన మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్ సహయంతో సేకరిస్తున్నారు. -
రూ.1000 కోట్లు తాగేస్తున్నారు..
ఇదీ జిల్లాలో మద్యం ప్రియుల తాగుడు ఖర్చు ఇళ్లు, ఒళ్లు గుల్లవుతున్నా పట్టించుకోరు మద్యపాన సేవకుల సంఖ్యా అధిరోహణమే రోజువారీ సంపాదనలో సగానికి పైగా జల్సాలకే భీమవరం టౌన్: జిల్లాలో గ’మ్మత్తు’ ఖర్చు ఏటా రూ.1200 కోట్ల వరకు ఉంటోంది. మద్యపాన ప్రియులు చేసే ఈ ఖర్చుతో గుండ్లకమ్మ, తాడిపూడి వంటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయవచ్చు. లేదంటే తోటపల్లి, తారకరామతీర్థ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయవచ్చు. ఇది కూడా కాదంటే ముసురుపల్లి, పుష్కర, మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయవచ్చు. అంటే మద్యం కోసం జిల్లాలో ప్రజలు ఎంతగా దుబారా చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరో కోణంలో చూసినా జిల్లాలో మద్యం ప్రియులు చేసే ఖర్చుతో పేద రోగుల పాలిట సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరి పోసి వేలాది మంది ప్రాణాలు కాపాడవచ్చు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్‌కు అవసరమైన నిధులను ఈ ఒక్క జిల్లా నుంచే అందించవచ్చు. 108 సేవలకు 15 ఏళ్ల వరకూ సరిపడా ప్రతిపాదిత నిధులను కేటాయించవచ్చు. జిల్లాలో జీప్లస్ 3 తరహాలో ఏటా 40 వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించవచ్చు. ఆశ్చర్యంగా ఉందా ఇది అక్షరాలా నిజం. మద్యం ప్రియుల ఖర్చు గ్రాఫ్ ఏటా పెరుగుతూనే ఉంది. మద్యం మత్తులో జోగే వారి సంఖ్య ఏటా పెరుగుతుండడంతో దానికి తగినట్లే రూ.100 కోట్లు అదనంగా ఖర్చు పెరుగుతోంది. ఇలా ఏటా జిల్లాలో రూ.1000 కోట్లు పైగా తాగుడుకు తగలేస్తున్నారంటే నమ్మక తప్పని పరిస్థితి. వ్యసనం మత్తులో ఇళ్లు, ఒళ్లు గుల్లవుతున్నా ఏటా మందుబాబులు చేస్తున్న ఖర్చు మాత్రం తగ్గడం లేదు. దీని తాలూకా గ్రాఫ్ రేటు ఏయేటి కాయేడు పెరుగుతూనే ఉంది. ఇందులో అధిక సంఖ్యలో యువత ఉండడం దిగ్భ్రాంతిని కలిగించే విషయం. ఉన్నత వర్గాలు, పేద వర్గాలు సైతం నెలవారి, రోజు వారి సంపాదనలో సగానికి పైగా జల్సాలకే వెచ్చిస్తుండగా వాటిలో మద్యం ఖర్చు పరిశీలిస్తే తల తిరుగుతోంది. జిల్లాలో మద్యం ప్రియులు నెలకు రూ.వంద కోట్లకు, రోజుకు రూ.3.35 కోట్లు లెక్కన ఖర్చు చేస్తున్నారు. 2005 వరకూ భీమవరం పట్టణంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఉండేది కాదు. ఆ తరువాత ఇక్కడి ఆదాయం చూసి ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 430 మద్యం దుకాణాలుండగా భీమవరం ఎక్సైజ్ పరిధిలోనే సుమారు 238 ఉన్నాయి. జిల్లాలో మద్యం అమ్మకాలు 200304లో రూ.187.16 కోట్లు 200405లో రూ.217.93 కోట్లు 200506లో రూ.300 కోట్లు జిల్లాలో మద్యం అమ్మకాలు 201415లో రూ.1014 కోట్లు 201516లో రూ.1111 కోట్లు 201617లో రూ.1208 కోట్లు -
టీచర్ల సొంతడబ్బుతో మిడ్ డే మీల్స్...
తిరువనంతపురం: కేరళ ఉపాధ్యాయులు విద్యార్థుల ఆహారంపై శ్రద్ధ వహిస్తున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం ఇస్తున్ననిధులు సరిపోకపోవడంతో టీచర్లు వారి సొంత డబ్బు ఖర్చు చేసి మరీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకు ముందు రోజుకు ఒక్కో విద్యార్థి భోజనానికి ఐదు రూపాయలు చొప్పున వెచ్చిస్తున్న ప్రభుత్వం.. ఇటీవల ఎనిమిది రూపాయలకు పెంచింది. అయితే పౌష్టికాహారం అందించేందుకు ఎనిమిది రూపాయలు సైతం చాలకపోవడంతో ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే మిగిలిన డబ్బును వెచ్చించి మధ్యాహ్న భోజన పథకాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు కనీస పౌష్టికాహారం అందించాలంటే రోజుకు ఒక్కొక్కరికి 12నుంచి 15 రూపాయలదాకా ఖర్చవుతుంది. అయితే కేరళ ప్రభుత్వం 8 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. ఇదికాకుండా వంటచెరకు, వంటగ్యాస్ కు అధికంగా ఖర్చవుతుంది. ఇదంతా తాము స్వయంగా చెల్లిస్తున్నామని అక్కడి ఉపాధ్యాయులు చెప్తున్నారు. ముఖ్యంగా స్కూల్లో ఇచ్చే పాలు, గుడ్డు వంటి ప్రొటీన్ ఫుడ్ ఆశించే బీద కుటుంబాల్లోని పిల్లలు పాఠశాలకు వస్తుంటారని, లేదంటే వారు డ్రాపవుట్స్ గా మారతారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. దీంతో చాలాశాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులే సొంత డబ్బును వెచ్చించడం, లేదా పూర్వ విద్యార్థులనుంచి విరాళాలు సేకరించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్ని పెద్ద బడుల్లో పేరెంట్, టీచర్స్ అసోసియేషన్ల సహకారంతో ముందుకు తీసుకెడుతుండగా.. చిన్న స్కూళ్ళలో మాత్రం టీచర్లే సొంతడబ్బుతో నిధులు సమకూర్చుకొని పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం పది రూపాయలైనా వెచ్చించకపోతే విజయవంతంగా పథకం కొనసాగించడం కష్టం అని వారు చెప్తున్నారు. స్థానిక మార్కెట్లలో ఒక్కో గుడ్డు 4 నుంచి 5 రూపాయల ఖరీదు ఉంటుంటే కొద్దిపాటి నిధులతో పథకం నిర్వహణ కష్టసాధ్యంగా మారుతోందంటున్నారు. ప్రతినెలా తన సొంత డబ్బునుంచి రూ. 3,500 ల వరకు స్కూల్లో మధ్యాహ్న భోజనానికి ఖర్చుచేస్తున్నట్లు ఓ అప్పర్ ప్రైమరీ స్కూలు ప్రిన్సిపాల్ చెప్తున్నారు. అలాగే ప్రైమరీ స్కూళ్ళలో టీచర్లు కూడ నెలకు మూడునుంచి నాలుగు వేల రూపాయలు తమ సొంత డబ్బు ఖర్చు చేస్తున్నామని, అయితే పిల్లల భోజనానికి ఖర్చుచేసేందుకు తాము బాధపడటం లేదని చెప్తున్నారు. ట్రావెన్కోర్ రాజవంశీయుల కాలంలో స్థాపించిన శతాబ్దాలనాటి తమ పాఠశాలలో చదివే విద్యార్థులు అంతా పేద కుటుంబాలవారు, నిరాశ్రయులేనని, వారికి భోజనం అందించడంలో ఎటువంటి రాజీ లేదని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. నిత్యావసరాల ధరలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో ఒక్కోసారి పాఠశాలను సందర్శించే పూర్వ విద్యార్థుల వినయపూర్వక సహకారాన్ని కూడ తీసుకుంటున్నామని ఆమె చెప్తున్నారు. ప్రతి గురువారం విద్యార్థులకు అందించే పాలకు తనతోపాటు సహ ఉపాధ్యాయులు కూడ డబ్బు వెచ్చిస్తారని, ఆరోజు ఏదైనా సెలవు వస్తే మాత్రం తాము వెచ్చించాల్సిన అవసరం ఉండదని ఆమె తెలిపారు. -
ఎన్నికల వ్యయం 5లక్షలకు పెంపు
-
కవ్వింత: దురాశ
సుజిత: సంగీత కచేరి ఎక్కడ జరిగినా ఎందుకు అంత ఖర్చు పెట్టి మీ అత్తగార్ని పంపుతావు? నయన: సంగీత కచేరి అంటే మా అత్త ప్రాణాలిస్తుందట, అందుకనీ... కోపం ‘‘నీకు నీ భార్య మీద బాగా కోపం వస్తే ఏం చేస్తావ్? చెయ్యి చేసుకుంటావా?’’ ‘‘లేదు, నా ఒక్కడికే వంట చేసుకుంటాను’’. అలా అర్థమైందా? ఎస్కలేటర్ ఆపరేటర్: ఏంటి సార్ ఎస్కలేటరు దాకా వచ్చి వెనక్కు వెళ్తున్నారు? కస్టమర్: ఎస్కలేటరు మీద వెళ్లే వాళ్లు కుక్కను చేత్తో ఎత్తుకుని వెళ్లాలని రాశారు కదా. నా దగ్గర కుక్క లేదు మరి. ముల్లు ‘‘ఇదేమిటయ్యా... అరికాలి నిండా ఇన్ని ముళ్లెలా గుచ్చుకున్నాయి?’’ ‘‘మొదట ఒక్క ముల్లే గుచ్చుకుంది డాక్టర్. ముల్లుని ముల్లుతోనే తీయాలని ప్రయత్నించీ... ఆందోళన భార్య: (పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి) సార్, మా ఆయన ఉదయమనగా కుక్కతో పాటు బయటకు వెళ్లారు. నాకేదో భయంగా ఉంది. ఎస్సై: ఎందుకమ్మా అంత ఆందోళన? భార్య: ఆందోళన అంటారేంటండీ, ఆ కుక్కను ఈ మధ్యే పదివేలు పెట్టి కొన్నాను. అదే ఆఖరు ‘‘హర్షవర్థనుడు ఏ యుద్ధంలో మరణించాడురా సోమేశ్వర్? ‘‘ఆయన చేసిన ఆఖరి యుద్ధంలో సార్’’ -
'బాబు అక్రమాలపై దర్యాప్తు జరిగితే జీవితాంతం జైల్లోనే'