కవాడిగూడ: బీసీలు ఉన్నత శిఖరాలకు చేరడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి విదేశీ విద్యను సులభతరం చేసి, ఆర్ధిక సహాయంగా 20 లక్షల నిధులు కేటాయించారని ఆల్ ఇండియా బీసీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు గట్టు రామచందర్‌రావు అన్నారు. శుక్రవారం కవాడిగూడలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణలో భాగంగా బీసీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఏటా విదేశీ విద్య కోసం 300 మంది బదులు 500 మంది విద్యార్థులను ఎంపిక చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్, రాష్ట్ర అధ్యక్షులు సదానంద్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి దూడల శంకర్‌గౌడ్, ఉపాధ్యక్షులు రంగరాజ్ గౌడ్, నాయకులు హరీష్, వీరశంకర్, చంద్రయ్య,ప్రకాష్ గౌడ్, వేణు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.