శాంసంగ్ లాభాలు హై జంప్
సియోల్: దక్షిణ కొరియా టెక్నాలజీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాభాల్లో దూసుకుపోయింది. సంస్థ కిందటి త్రైమాసికంలో గైడెన్స్‌ను అధిగమించి క్యూ2లో73శాతం వృద్ధితో భారీ లాభాలను నమోదు చేసింది. ముఖ‍్యంగా గత మూడు నెలల్లో మొమరీ చిప్ ద్వారా వచ్చిన ఆదాయంతో క్వార్టర్ 2 లాభాలు భారీగా పుంజుకున్నాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో పాటు బై బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ సంవత్సరంలో ఇది మూడవసారి కావడం విశేషం.
గురువారం ప్రకటించిన సంస్థ ఆదాయ ఫలితాల్లో ఆజూన్‌క్వార్టర్‌లో రికార్డ్ ఆపరేటింగ్ లాభాలను సాధించింది.ఆ పరేటింగ్ లాభం గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 72.7 శాతం పెరిగింది. 14.1 లక్షల కోట్ల డాలర్లకు (12.68 బిలియన్ డాలర్లు) సాధించిందని శాంసంగ్ పేర్కొంది. ఆదాయం 19.8 శాతం పెరిగి 61 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. జూలైలో 14 ట్రిలియన్ల గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే థర్డ్ క్వార్టర్‌లో 15 ట్రిలియన్ కంటే ఎక్కువ (మూడవ త్రైమాసికంలో లాభాలు) లాభాలను ఆర్జించనుందని ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్లో విశ్లేషకుడు గ్రెగ్ రో చెప్పారు.
మెమోరీ చిప్స్, స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ శాంసంగ్ రికార్డు లాభాలను పూర్తిస్థాయిలో సాధించినుందని భావిస్తున్నారు. శాంసంగ్ మొబైల్ వ్యాపారంలో త్రైమాసిక లాభాల కంటే మెరుగైన పనితీరు పెరగడంతో, ఎక్కువగా లాభాలు ఆర్జించిందని విశ్లేషకులు చెప్పారు. అలాగే 1.7 ట్రిలియన్ డాలర్ల (1.53 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేయనుంది. దీంతో జనవరి నెలలో ప్రకటించిన బై బ్యాక్ తో కలిపి మొత్తం బై వ్యాక్ విలువ 9.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే 2 ట్రిలియన్ల సొంత వాటాలను రద్దును కూడా ప్రకటించింది. మెమరీ చిప్ సూపర్-సైకిల్ కారణంగా మూడవ-త్రైమాసిక ఆదాయం, రెండవ త్రైమాసికాన్న దాటిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.