Samsung Electronics
-
గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ: లాంచింగ్ ముందే హల్చల్,ఐఫోన్‌కు ఝలక్?
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నెక్స్ట్ గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్న అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఎస్ 23 సిరీస్‌లో మూడు కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో ఈ సిరీస్ విడుదల కానుంది. ఈ క్రమంలో ధర, డిజైన్, ఫీచర్ల గురించి లీక్‌లు మొదలయ్యాయి. స్పెసిఫికేషన్ల పరంగా, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ 200ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తోంది. 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, రెండు 10ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో రియర్ క్వాడ్-కెమెరా మరో ప్రధాన ఆకర్షణ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ ఫీచర్లు 6.8 అంగుళాల 2x డైనమిక్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ఆండ్రాయిడ్ 13 One UI 5.0 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జింగ్ ధర (అంచనా) రూ. 1,14,990 యాపిల్ ఐఫోన్14 ప్రో మాక్స్‌కు షాక్? అయితే యాపిల్ 14 ప్రో మాక్స్‌తో పోలిస్తే 8జీబీ ర్యామ్ సహా, 200 ఎంపీ కెమెరా, డిస్ప్లే చివరికి ధర విషయంలో కూడా మెరుగ్గా ఉన్న శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్, యాపిల్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని పలు అంచనాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. -
విముక్తి దినోత్సవం.. ‘శామ్సంగ్’ వారసుడికి అధ్యక్షుడి క్షమాభిక్ష
సియోల్: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వారసుడు లీ సహా ప్రముఖ కార్పొరేట్లు తదితర 1,700 మందికి దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విముక్తి దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రకటించనున్నారు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక జపాన్ వలస పాలన నుంచి విముక్తి పొందిన రోజును దక్షిణ కొరియా ఏటా ఆగస్ట్ 15న విముక్తి దినోత్సవం జరుపుకుంటుంది. శామ్సంగ్ అనుబంధంగా ఉన్న రెండు సంస్థల విలీనం కోసం 2015లో అప్పటి అధ్యక్షురాలు పార్క్‌కు ఆ సంస్థ వారసుడైన లీ జే యంగ్ భారీగా ముడుపులు అందజేశారు. ఈయనతోపాటు లొట్టే గ్రూప్ చైర్మన్ షిన్ డాంగ్ బిన్ తదితరుల నుంచి కూడా అధ్యక్షురాలు భారీగా లంచాలు అందుకున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అధ్యక్షురాలు పార్క్ పదవి నుంచి వైదొలిగారు. ఆమెకు సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెకు గత ఏడాది అధ్యక్షుడు మూన్ క్షమాభిక్ష ప్రకటించారు. 30 నెలల జైలు శిక్ష పడిన శామ్సంగ్ వారసుడు లీకి కూడా గత ఏడాది పెరోల్ లభించింది. తాజాగా, అధ్యక్షుడి క్షమాభిక్షతో మిగిలిన జైలు జీవితం కూడా ముగియనుంది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే అధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్తలకు క్షమాభిక్షలు ప్రకటించారని దక్షిణ కొరియా న్యాయశాఖ శుక్రవారం పేర్కొంది. -
పేటెంట్‌కు లేటెందుకు!
అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సీరియస్‌గా ఇలా అంటాడు... ‘పేటెంట్ అనేది టెక్నాలజీకి కీ లాంటిది. టెక్నాలజీ అనేది ప్రొడక్షన్‌కు కీ లాంటిది’ ‘మోస్ట్ సీరియస్ మెన్’గా పేరున్న, మూడువందల పేటెంట్లకు సొంతదారైన సెర్బియన్–అమెరికన్ ఇన్వెంటర్ నికొల టెస్లా చాలా తేలికగా ఇలా అంటాడు... ‘నా ఐడియాను ఎవరో దొంగిలించారు అనే బాధ కంటే, వారికంటూ ఒక ఐడియా ఎందుకు లేదు అనే బాధ నాలో ఎక్కువగా ఉంటుంది’ ... ఎవరు ఎలా అన్నా, ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు పేటెంట్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మెరికల్లాంటి యూత్‌తో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ సౌత్ కొరియన్ సాంకేతిక దిగ్గజం శాంసంగ్. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 7,500 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 50 శాతం మన దేశం నుంచే ఉన్నాయి. ఈ పేటెంట్ ఫైలర్స్ ఫస్ట్ టైమ్ ఇన్వెంటర్స్. మిలీనియల్స్, జెన్ జెడ్‌ను సాంకేతికంగా తీర్చిదిద్దడంలో బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన శ్రీ–బి (శాంసంగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్–బెంగళూరు) బాగా ఉపయోగపడుతుంది. శ్రీ–బికి ప్రత్యేకమైన ఐపీ(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) బృందం ఉంది. ఇది యువతరానికి ఇన్వెన్షన్–క్రియేషన్ ట్రైనింగ్, ఇన్వెన్షన్ ప్రాసెస్‌కు ఉపకరించే అడ్వాన్స్డ్ ఇన్వెంటివ్ స్టెప్ ట్రైనింగ్ ఇస్తుంది. పేటెంట్ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నల్ పోర్టల్ ఏర్పాటు చేసింది. వీటిద్వారా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎమర్జింగ్ ఏరియాలుగా చెప్పుకునే 5జీ, ఏఐ, ఐవోటి, కెమెరా అండ్ విజన్ టెక్నాలజీస్‌కు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయి. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకునే వాటిలో ఎక్కువ భాగం అంకుర సంస్థలుగా మొదలుకావడం విశేషం. ‘యువతరం ఆవిష్కర్తలను చూసి గర్వపడుతున్నాం. ఎదుగుతున్న దశలోనే అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. వారికి శాంసంగ్ అన్ని విధాల అండగా ఉంటుంది’ అంటున్నారు శ్రీ–బి సీటీవో అలోక్‌నాథ్. ‘కొత్త ఆవిష్కరణల కోసం జరుగుతున్న ఈ ప్రయాణం యువతరం మనస్తత్వానికి తగినట్లుగానే ఆటపాటలతో హుషారుగా సాగుతుంది’ అంటున్నారు శ్రీ–బి డిజైన్ మెనేజర్ స్వాధా జైశ్వాల్. సాంకేతిక జ్ఞానం మాత్రమే కాకుండా ఇన్స్పైరింగ్ స్టోరీలు వినిపించడం ద్వారా యువతరంలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి సంస్థలు. మచ్చుకు ఒకటి... పదిహేనేళ్ల వయసులోనే వైద్యరంగం ముక్కున వేలేసుకునేలా చేశాడు జాక్ అండ్రాక (యూఎస్). ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ముందుగా, తక్కువ ఖర్చుతో గుర్తించే సాధనానికి రూపలకల్పన చేసి ‘ఐకానిక్ ఇన్వెంటర్ ఆఫ్ జెనరేషన్ జెడ్’గా కీర్తి అందుకున్నాడు జాక్. అయితే జాక్ చదువులో అద్భుతాలు సాధిస్తున్న విద్యార్థి ఏమీకాదు. సాధారణ విద్యార్థే. తన ఆవిష్కరణకు మూలం గూగుల్ అనేది ఆశ్చర్యకరమైన వాస్తవం! తన దగ్గరి బంధువు ఒకరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో చనిపోయాడు. దీంతో ఆ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆ క్యాన్సర్‌కు కారణం ఏమిటి? ఏ దశలో గుర్తిస్తున్నారు? పరీక్షలు ఏమిటి? సర్వైవర్ల శాతం ఎంత... మొదలైన విషయాలను గూగుల్ ద్వారా తెలుసుకోగలిగాడు. ‘ఈజీ, చీప్, సింపుల్, సెన్సెటివ్ అండ్ సెలెక్టివ్’ అనే మూలసూత్రంతో రిసెర్చ్ ప్రపోజల్ తయారు చేసుకొని, క్యాన్సర్‌పై పరిశోధిస్తున్న 200 మందికి పంపించాడు. 199 మంది తిరస్కరించారు. ఒక్కరు మాత్రం ‘బహుశా వీలవుతుందేమో!’ అన్నారు. ఇక జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ(మేరిలాండ్)లో ప్రయోగాలు చేయడానికి అనుమతి అనేది చా...లా కష్టంగా దొరికింది. ఎన్నో అవాంతరాలను తట్టుకొని తన కలను సాకారం చేసుకున్న జాక్ ఇప్పుడు మరికొన్ని కలలు కంటున్నాడు. వాటిని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే జాక్ ది ఒంటరిపోరు. అయితే శ్రీ–బిలాంటి సంస్థల వల్ల కలలు కనే యువతరానికి ఒంటరిపోరు తప్పుతుంది. శక్తిమంతమైన మద్దతు దొరుకుతుంది. -
శామ్సంగ్ టైజెన్- టీవీ ఓఎస్‌లలో టాప్
సియోల్: గ్లోబల్ టీవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్లో టైజెన్ అతిపెద్ద ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)గా ఆవిర్భవించినట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ పేర్కొంది. టైజెన్ ఓఎస్‌ను లైనక్స్ ఆధారంగా శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, ఇంటెల్ కార్ప్ అభివృద్ధి చేశాయి. ఈ ఏడాది(2020) మూడో క్వార్టర్లో శామ్సంగ్ టీవీ విక్రయాలు జోరు చూపడం టైజెన్ ఓఎస్‌కు బూస్ట్ నిచ్చినట్లు టీవీ పరిశ్రమను సమీక్షించే స్ట్రాటజీ అనలిటిక్స్ తెలియజేసింది. తాజా వివరాల ప్రకారం టైజెన్ 12.5 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవం ద్వారా ఇతర ఓఎస్‌లను వెనక్కి నెట్టినట్లు వెల్లడించింది. ఈ బాటలో ఎల్జీకి చెందిన వెబ్ ఓఎస్, సోనీ ప్లేస్టేషన్, రోకు టీవీ ఓఎస్, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ అండ్రాయిడ్ ప్రధాన ఓఎస్లుగా నిలిచినట్లు పేర్కొంది. చదవండి: (3 నిముషాలకు టిక్‌టాక్ వీడియోలు!) 1.18 కోట్లు ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో ప్రపంచవ్యాప్తంగా శామ్సంగ్ 1.18 కోట్ల స్మార్ట్ టీవీలను విక్రయించినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఏ ఇతర కంపెనీ అమ్మకాలకంటే ఇవి ఎక్కువకాగా.. దీంతో 15.5 కోట్ల టైజెన్ ఓఎస్ స్మార్ట్ టీవీలు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నట్లు వివరించింది. గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం వృద్ధిగా తెలియజేసింది. ప్రపంచంలోనే టీవీ విక్రయాలలో తొలి ర్యాంకులో ఉన్న శామ్సంగ్కు టైజెన్ కొత్త ఆదాయ వనరుగా నిలుస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల పలువురు వినియోగదారులు సంప్రదాయ పే చానళ్లు, ప్రసార ప్లాట్‌ఫామ్స్ నుంచి స్ట్రీమింగ్ సర్వీసులకు మళ్లుతున్నట్లు తెలియజేసింది. ఫలితంగా ఇటీవల శామ్సంగ్ ప్రకటనదారులు, కంటెంట్ ప్రొవైడర్లను ఆకట్టుకునే ప్రణాళికలు అమలు చేస్తోంది. తద్వారా వేగంగా ఎదుగుతున్న టైజెన్ను టీవీ ప్రకటనల విభాగంలో నాయకత్వ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 8.13 కోట్లు ప్రపంచవ్యాప్తంగా క్యూ3లో స్మార్ట్ టీవీలు, మీడియా స్ట్రీమర్లు, గేమింగ్ కన్సోల్స్ తదితర కనెక్టెడ్ టీవీ డివైస్‌లు 8.13 కోట్లకు చేరినట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ వెల్లడించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 19 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కారణంగా హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో భారీ డిమాండ్ నెలకొనడం ఇందుకు సహకరించినట్లు తెలియజేసింది. దీంతో 2020 డిసెంబర్‌కల్లా 7 శాతం వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల కనెక్టెడ్ టీవీ డివైసెస్‌లు వినియోగంలోకి రానున్నట్లు అభిప్రాయపడింది. -
జూన్‌కల్లా శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 ఫోన్
ముంబై, సాక్షి: వచ్చే జూన్‌కల్లా గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 పేరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ విడుదల చేయనున్నట్లు దక్షిణ కొరియన్ అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోల్డబుల్ ఫోన్.. ఎస్ పెన్ సపోర్ట్‌తో లభించనున్నట్లు తెలియజేసింది. తద్వారా ప్రీమియం విభాగంలోని గలాక్సీ నోట్ సీరిస్ ప్రొడక్టులను ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్.. నిలిపివేసే అవకాశముట్లు అభిప్రాయపడింది. ఆధునిక టెక్నాలజీలతో కూడిన అంటే.. ఎస్ పెన్(ఎలక్ట్రానిక్ పెన్) సపోర్ట్‌తోపాటు.. అండర్ డిస్ప్లే కెమెరా(యూడీసీ) ఫీచర్‌ను సైతం జెడ్ ఫోల్డ్3లో ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఆధునిక సాంకేతికలో భాగంగా కెమెరాను ఓలెడ్ స్ర్కీన్ అడుగుభాగాన అమర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో కెమెరాకు డిస్ప్లేలో హోల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదని వివరించింది. యూడీసీ ఫీచర్‌తో జెడ్ ఫోల్డ్3 స్క్రీన్ ట్యాబ్లెట్ పీసీని పోలి ఉంటుందని అభిప్రాయపడింది. పెద్ద డిస్ప్లేలు.. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ వచ్చే జనవరిలో విడుదల చేయ తలపెట్టిన గలాక్సీ ఎస్21 అల్ట్రా(అంచనా)లోనూ ఎస్ పెన్ ఫీచర్‌ను అందించనున్నట్లు అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల డిస్ప్లేలో లభించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గలాక్సీ ఎస్ 21 సిరీస్‌లో 3 ఫోన్లను 2021 జనవరి నుంచీ విడుదల చేసే వీలుట్లు తెలియజేసింది. ఎస్21 6.2 అంగుళాలు, ఎస్21 ప్లస్ 6.7 అంగుళాల స్క్రీన్లతో విడుదలకానున్నట్లు వెల్లడించింది. -
ఇది భలే బంతి ‘బల్లీ’
-
ఇది భలే బంతి ‘బల్లీ’
లాస్ ఏంజెలిస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వినియోగదారుల ప్రదర్శనలో శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బంతి రూపంలో ఉన్న ఓ చిన్న రోబోను మంగళవారం ఆవిష్కరించింది. బల్లీగా నామకరణం చేసిన ఈరోబో వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది దానికున్న చిన్న చక్రాల ద్వారా ఇల్లంతా తిరుగుతూ అందులో అమర్చిన కెమెరా ఇంటికి కాపలా కాస్తుంది. ఇంటికి వచ్చే , పోయే వారి గురించి యజమానిని హెచ్చరిస్తుంది. పెద్ద వాళ్లు ఇంట్లో నడిచేందుకు తోడ్పడుతుంది. అది మన ముందంటే ముందు, మన వెనకంటే వెనక నడుస్తూ కదలికలను రికార్డు చేస్తుంది. రమ్మంటే వస్తుంది. దూరంగా పొమ్మంటే పోతుంది. సెల్‌ఫోన్ ద్వారానే కాకుండా వాయిస్ కాల్‌తో కూడా ఈ బంతి లాంటి రోబో స్పందిస్తుంది. హలో అంటే హలో చెబుతుంది. పెద్ద వాళ్ల చేతుల్లో రిమోట్ కంట్రోల్లా కూడా పనిచేయడం ఇందులో ఉన్న ఇంకో విశేషం. ఈ రోబో టీవీ, టేప్ రికార్డర్, రేడియో లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ ఆన్ చేయమంటే ఆన్ చేస్తుందీ, ఆఫ్ చేస్తుంది. మనం ఇంట్లో లేనప్పుడు ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలకు కంపెనీ ఇవ్వడం ఇందులోని మరో విశేషం. శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈవో హెచ్ఎస్ కిమ్ దీన్ని ప్రదర్శించి చూపారు. -
చైనాలో తయారీకి శాంసంగ్ గుడ్‌బై
సియోల్: పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా చైనా నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా చైనాలో తమ మొబైల్ ఫోన్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా పోటీ తీవ్రంగా పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాదే ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్ ఇటీవల జూన్‌లో మరో ప్లాంటులో ఉత్పత్తి ఆపివేసింది. ప్రస్తుతం హువైజూలోని చివరి ప్లాంటును కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవలే బీజింగ్‌లోని స్మార్ట్‌ఫోన్స్ ప్లాంటును మూసివేసిన మరో పోటీ సంస్థ సోనీ.. థాయ్‌ల్యాండ్‌లో మాత్రమే తయారీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో శాంసంగ్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు చైనాలో తయారీ నిలిపివేస్తున్న శాంసంగ్.. ఇటు భారత్, వియత్నాం దేశాల్లో తమ ప్లాంట్ల సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది. దీంతో ఈ దేశాల మార్కెట్లు శాంసంగ్‌కు మరింత కీలకంగా మారుతున్నాయి. 1 శాతానికి పడిపోయిన వాటా.. చైనాలో దేశీ కంపెనీలైన హువావే టెక్నాలజీస్, షావోమీ సంస్థల నుంచి శాంసంగ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. చౌక ఫోన్లు కావాలనుకునే చైనీయులు.. దేశీ స్మార్ట్ఫోన్లను, కాస్త ఖరీదైనవి కోరుకునే వారు యాపిల్ లేదా హువావే వంటి సంస్థల మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో 2013లో చైనాలో దాదాపు 15 శాతంగా నమోదైన శాంసంగ్ మార్కెట్ వాటా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1 శాతానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక చైనా మార్కెట్లో శాంసంగ్ పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, చైనాలో తయారీ నిలిపివేసినప్పటికీ.. మొబైల్స్ అమ్మకాలు య«థాప్రకారం కొనసాగుతాయని శాంసంగ్ పేర్కొంది. ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలు, పరికరాలను అంతర్జాతీయంగా ఇతర సైట్లకు తరలిస్తున్నట్లు వివరించింది. కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, 2017 నాటి గణాంకాల ప్రకారం.. చైనాలో శాంసంగ్ ఉద్యోగులు సుమారు 6,000 మంది ఉండగా, 6.3 కోట్ల యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఆ ఏడాది అంతర్జాతీయంగా శాంసంగ్ 39.4 కోట్ల హ్యాండ్‌సెట్స్‌ను తయారు చేసింది. -
శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ఫస్ట్ లుక్
శాన్ఫ్రాన్సిస్కో: సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రదర్శించింది. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. దీనికోసం యాప్‌లను సిద్ధం చేయాల్సిందిగా ఆండ్రాయిడ్ డెవలపర్లను శాంసంగ్ కోరింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా మొబైల్ ప్రోడక్ట్ స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ డెనిసన్ 7.3 అంగుళాలు స్క్రీన్‌తో ఈ డివైస్ మోడల్‌ను ప్రదర్శించారు. ప్రస్తుతానికి కేవలం ఫోను డిజైన్ మాత్రం విడుదల చేసిన కంపెనీ దీనిని ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేదీ స్పష్టం చేయలేదు. చూడ్డానికి పాకెట్ సైజ్‌లో ట్యాబ్లాగాన కనిపించే ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర, పేరు, ప్రత్యేకతల వివరాలు ఇంకా వెల్లడించ లేదు. అయితే 7.3 అంగుళాల తెరతో మధ్యకు మడతపెట్టేందుకు వీలుగా ఇది ఉంటుందట. కాగా.. ఇటీవలే చైనా సంస్థ రాయల్ కార్పొరేషన్ 7.8 అంగుళాల ఆండ్రాయిడ్ మడతపెట్టే ఫోనును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శాంసంగ్, ఎల్జీ, హువావేల కంటే ముందుగానే అద్భుత ఆవిష్కారం చేసి పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
రికార్డు ప్రాఫిట్స్, షేర్హోల్డర్స్కు పండుగ
సియోల్ : దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ రికార్డు త్రైమాసిక లాభాలను నమోదుచేసింది. తన మెమరీ చిప్‌లకు గ్లోబల్‌గా ఏర్పడ్డ బలమైన డిమాండ్‌తో, ఈ ఏడాది రెండో సారి శాంసంగ్ లాభాల్లో దంచికొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్లో కంపెనీ లాభాలు 11.19 ట్రిలియన్ ఓన్లకు పెరిగాయి. రెవెన్యూలు కూడా 30 శాతం పెరిగి 62.05 ట్రిలియన్ ఓన్లగా నమోదయ్యాయి. ఈ రికార్డు లాభాల అనంతరం శాంసంగ్ 26 బిలియన్ డాలర్లను వాటాదారులకు తిరిగి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని వాటాదారులకు పంచనుంది. దీంతో శాంసంగ్ వాటాదారుల పండుగ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది వరకు డెవిడెండ్లను రెండింతలు చేసి, 9.6 ట్రిలియన్ ఓన్లను చెల్లించనున్నట్టు శాంసంగ్ పేర్కొంది. కంపెనీ వద్దనున్న నగదు, నగదుతో సమానమైనవి సెప్టెంబర్ ముగింపుకు 76 ట్రిలయన్ ఓన్లకు పెరిగాయి. ఇవి ముందు క్వార్టర్‌తో పోలిస్తే 8 శాతం ఎక్కువ. అంతేకాక 2017లో భారీగా మూలధన వ్యయాలు ఎన్నడు లేనంత పెరిగినట్టు కూడా కంపెనీ చెప్పింది. కొత్త చిప్ ఫ్యాక్టరీల అభివృద్ధి కారణంతో ఈ వ్యయాలు 81 శాతం ఎగిసి 46.2 ట్రిలియన్ ఓన్లుగా నమోదైనట్టు వివరించింది. అయితే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్న దీనికి, మొబైల్ డివిజన్ నుంచి వచ్చిన ఆపరేటింగ్ లాభాలు 19 శాతం కిందకి పడిపోయాయి. ఈ ఏడాది విడుదల చేసిన గెలాక్సీ ఎస్8, నోట్8లు ముందస్తు వాటి కంటే మంచిగానే అమ్మకాలు నమోదుచేసినప్పటికీ, మొత్తంగా వీటి లాభాలు పడిపోయినట్టు తెలిసింది. కంపెనీకి ఎక్కువగా లాభాలు ఇంటర్నెట్-కనెక్టెడ్ డివైజ్‌లు, సర్వర్ల నుంచి వచ్చినట్టు వెల్లడైంది. -
అనూహ్య నిర్ణయం: శాంసంగ్ సీఈవో రాజీనామా
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అవినీతి కేసులో గ్రూప్ అధినేత జే వై.లీ జైలు పాలవడంతో ఆ కంపెనీలో నాయకత్వంపై ఆందోళనకర పరిస్థితుల తలెత్తడంతో, వాటికి మరింత ఆజ్యం పోస్తూ ఆ కంపెనీ సీఈవో, సీఈవో క్వాన్ ఓహ్-హున్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. శాంసంగ్ చిప్, డిస్ప్లే అధినేతగా ఉన్న ఆయన ఊహించని విధంగా వైదొలగడం కంపెనీలో చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి లీ అరెస్టు అయిన తర్వాత ఈయనే కంపెనీలో ముఖ్య పాత్ర పోషించారు. ఈయన రాజీనామా కంపెనీ రికార్డు క్వార్టర్ ఆపరేటింగ్ ప్రాఫిట్లను అంచనావేస్తున్న సమయంలో వెలువడింది. నేడు శాంసంగ్ తన క్వార్టర్ ఫలితాలను వెలురించనుంది. శాంసంగ్ రికార్డు రాబడులను సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగో క్వార్టర్లో కూడా మంచి ప్రదర్శననే కనబర్చనని రీసెర్చ్ సంస్థ స్కోర్ సీఈవో పార్క్ జు-గన్ చెప్పారు. మెమరీ చిప్స్, డిస్ప్లే వ్యాపారాలు వంటి కాంపోనెంట్స్ బిజినెస్‌లకు క్వాన్ అధినేతగా ఉన్నారు. మెమరీ చిప్స్, స్మార్ట్ఫోన్లు, టీవీల్లో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీదారిగా ఉన్న శాంసంగ్, ఈ ఏడాది రికార్డు లాభాలను నమోదుచేయబోతుంది. మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరుగడంతో దీని లాభాలు కూడా మంచిగానే ఎగుస్తున్నట్టు తెలుస్తోంది. -
శాంసంగ్ లాభాలు హై జంప్
సియోల్: దక్షిణ కొరియా టెక్నాలజీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాభాల్లో దూసుకుపోయింది. సంస్థ కిందటి త్రైమాసికంలో గైడెన్స్‌ను అధిగమించి క్యూ2లో73శాతం వృద్ధితో భారీ లాభాలను నమోదు చేసింది. ముఖ్యంగా గత మూడు నెలల్లో మొమరీ చిప్ ద్వారా వచ్చిన ఆదాయంతో క్వార్టర్ 2 లాభాలు భారీగా పుంజుకున్నాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో పాటు బై బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ సంవత్సరంలో ఇది మూడవసారి కావడం విశేషం. గురువారం ప్రకటించిన సంస్థ ఆదాయ ఫలితాల్లో ఆజూన్క్వార్టర్లో రికార్డ్ ఆపరేటింగ్ లాభాలను సాధించింది.ఆ పరేటింగ్ లాభం గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 72.7 శాతం పెరిగింది. 14.1 లక్షల కోట్ల డాలర్లకు (12.68 బిలియన్ డాలర్లు) సాధించిందని శాంసంగ్ పేర్కొంది. ఆదాయం 19.8 శాతం పెరిగి 61 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. జూలైలో 14 ట్రిలియన్ల గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే థర్డ్ క్వార్టర్లో 15 ట్రిలియన్ కంటే ఎక్కువ (మూడవ త్రైమాసికంలో లాభాలు) లాభాలను ఆర్జించనుందని ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్‌లో విశ్లేషకుడు గ్రెగ్ రో చెప్పారు. మెమోరీ చిప్స్, స్మార్ట్ఫోన్లు, టెలివిజన్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ శాంసంగ్ రికార్డు లాభాలను పూర్తిస్థాయిలో సాధించినుందని భావిస్తున్నారు. శాంసంగ్ మొబైల్ వ్యాపారంలో త్రైమాసిక లాభాల కంటే మెరుగైన పనితీరు పెరగడంతో, ఎక్కువగా లాభాలు ఆర్జించిందని విశ్లేషకులు చెప్పారు. అలాగే 1.7 ట్రిలియన్ డాలర్ల (1.53 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేయనుంది. దీంతో జనవరి నెలలో ప్రకటించిన బై బ్యాక్ తో కలిపి మొత్తం బై వ్యాక్ విలువ 9.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే 2 ట్రిలియన్ల సొంత వాటాలను రద్దును కూడా ప్రకటించింది. మెమరీ చిప్ సూపర్-సైకిల్ కారణంగా మూడవ-త్రైమాసిక ఆదాయం, రెండవ త్రైమాసికాన్న దాటిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
శాంసంగ్ డ్యామేజ్ కంట్రోల్ ఆఫర్ అదుర్స్
సియోల్: శాంసంగ్ గెలాక్సీనోట్ 7, 7ఎస్ స్మార్ట్ ఫోన్ వివాదంతో అష్టకష్టాలు పడుతున్న కొరియా మొబైల్ మేకర్ డ్యామేజ్ కంట్రోల్ లో పడింది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకోసం లక్ష రూపాయల భారీ పరిహారం అందిస్తోంది. ఇప్పటికే స్వదేశీ (కొరియా) మార్కెట్లో రీప్లేస్మెంట్ మొదలు పెట్టిన సంస్థ భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సుమారు రూ.60 వేల (880డాలర్లు) విలువ చేసే గెలాక్సీనోట్ 7ఎస్ ను వాపస్ ఇచ్చిన వినియోగదారులకు రూ. 30,000ల విలువచేసే కూపన్ తో పాటు, అదనంగా రూ. 70,000 మొబైల్ క్రెడిట్ అందించనుంది. ఐఫోన్7 , ఎల్జీ జీ 5 లాంటి ఇతర మొబైల్స్ ను ఎంచుకున్న వారికి 30 వేల కూపన్ తో 70 వేల సహాయం అందించనుంది. అలాగే మరో ఖరీదైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ ఎంచుకున్న వారికి ఫోన్ తో పాటు అదనంగా రూ. 70,000 మొబైల్ క్రెడిట్ అందించనుంది. యూజర్ల భారీ అసౌకర్యాన్ని పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ రూ.100,000 అందుకోవాలనుకుంటే, నవంబర్ 30 వరకు శాంసంగ్ ఫోన్లను వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఏడాది చివరకు అందుబాటులో ఉంటుందనీ, అలాగే ఆయా దేశాల ప్రకారం పరిహారం వేర్వేరుగా ఉంటుందని తెలిపింది. దీంతో భారీ నష్టాల నుంచి శాంసంగ్ షేర్లు కోలుకున్నాయి. 2.4 శాతానికి పైగా పుంజుకున్నాయి. కాగా బ్యాటరీ తయారీ లోపాలతో పేలిపోతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను గ్లోబల్ గా రీకాల్ చేసింది. రీప్లేస్ చేసిన ఫోన్లు కూడా ప్రమాదానికి గురికావడంతో శాశ్వతంగా వీటికి ముగింపు పలికింది. మరోవైపు ఈ రీకాల్ కోసం యూజర్లకు ఫైర్ ప్రూఫ్ బాక్సులు, గ్లౌజులను సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శాంసంగ్ విడుదల చేసిన వీడియో ట్విట్టర్ లో జోకులు పేలిన సంగతి తెలిసిందే. -
శామ్సంగ్ ప్రింటర్స్ వ్యాపారం హెచ్‌పీ గూటికి...
బిలియన్ డాలర్లకు కొనుగోలు న్యూయార్క్: ప్రింటర్స్ విభాగంలో హెచ్‌పీ కంపెనీ అతిపెద్ద కొనుగోలుకు తెరతీసింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ప్రింటర్స్ వ్యాపారాన్ని 1.05 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్టు సోమవారం ప్రకటించింది. 55 బిలియన్ డాలర్ల ఏ3 ప్రింటర్స్ విభాగంలో హెచ్‌పీ స్థానం మరింత బలపడేందుకు ఈ కొనుగోలు దోహదం చేయనుంది. ఈ డీల్‌లో భాగంగా 6,500కు పైగా ప్రింటర్ పేటెంట్లు సైతం హెచ్‌పీ పరం అవుతాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులు హెచ్‌పీ గూటి కిందకు వస్తారు. వీరిలో 1,300 మంది ఇంజనీర్లు సైతం ఉన్నారు. శామ్సంగ్కు దక్షిణ కొరియాలో ప్రధాన ఇంజనీరింగ్ కేంద్రం ఉండగా, అమెరికా, భారత్, చైనా, జపాన్, రష్యా, కెనడా తదితర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌పీకి దేశీయంగా బెంగళూరులో ఆర్అండ్డీ కేంద్రం ఉండగా, ప్రింటర్స్ విభాగంలో మొత్తం 2వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ డీల్ 12 నెలల్లో ముగుస్తుందని భావిస్తున్నారు. ఈ డీల్ అనంతరం ఓపెన్ మార్కెట్ ద్వారా 10 నుంచి 30 కోట్ల డాలర్లను మూలధన పెట్టుబడిగా పెట్టేందుకు శామ్సంగ్ అంగీకరించినట్టు హెచ్‌పీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రింటర్స్ విభాగంలో ఇది తమకు అతిపెద్ద కొనుగోలు అని, దీంతో కాపీయర్ విభాగంలో వృద్ధి అవకాశాలు పెరుగుతాయని హెచ్‌పీ ప్రకటించింది. ఐటీ సేవల్లో ప్రముఖ కంపెనీ అయిన హ్యులెట్పేకర్డ్ నుంచి పది నెలల క్రితమే ప్రింటర్, కంప్యూటర్ల వ్యాపారం విడివడి హెచ్‌పీగా ఏర్పడింది. కంపెనీ లాభాల్లో అత్యధిక శాతం ప్రింటర్ ఇంక్, టోనర్ల విక్రయాల ద్వారానే వస్తోంది. -
డిమాండ్‌లో దూసుకెళ్తున్న గెలాక్సీ నోట్7
ఐరిస్ స్కానర్‌తో ప్రత్యేక ఆకర్షణగా వినియోగదారుల ముందుకు వచ్చిన కొత్త గెలాక్సీ నోట్7కు డిమాండ్ భారీగా పెరుగుతుందట. కంపెనీ అంచనాలను అధిగమించి ఈ ఫోన్ డిమాండ్ నమోదవుతుందని టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. గ్లోబల్‌గా సప్లైను డిమాండ్ అధిగమించడంతో లాంచింగ్ కావాల్సిన మార్కెట్లలో ఆవిష్కరణ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్టు శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ప్రీమియం డివైజ్, తమ వ్యాపారాలను మరింత వృద్ధి బాటలో నడిపిస్తుందని, అత్యధిక రాబడులను ఆర్జించడానికి దోహదం చేస్తుందని ప్రపంచపు స్మార్ట్‌ఫోన్ రారాజు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్7కు పెరుగుతున్న డిమాండ్‌తో దానికి పోటీగా మరో టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలల్లోనే ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతుంది. గణనీయమైన స్మార్ట్‌ఫోన్ విక్రయాలతో ఈ త్రైమాసికంలో కూడా శాంసంగే ఆధిపత్యంలో నిలుస్తుందని కంపెనీ వెల్లడిస్తోంది. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా సప్లై చేయలేని నేపథ్యంలో శాంసంగ్ రెవెన్యూలను కోల్పోవాల్సి వస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది కూడా కర్వ్డ్ డిస్ప్లే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌ను శాంసంగ్ ఆశించిన మేర సప్లై చేయలేకపోయిందని గుర్తుచేశారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా త్వరలోనే గెలాక్సీ నోట్7 ఉత్పత్తులు చేపడతామని కంపెనీ తెలిపింది. సప్లై సమస్యను వెంటనే పరిష్కరించి డిమాండ్‌ను చేధిస్తామని వెల్లడిస్తోంది. -
హువాయి ని సవాల్ చేసిన శాంసంగ్
-
హువాయి ని సవాల్ చేసిన శాంసంగ్
బీజింగ్: టెక్నాలజీ దిగ్గజం, దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హువాయి టక్నాలజీస్ మధ్య చెలరేగిన పెటెంట్ వివాదంలో మరింత ముదురుతోంది. పేటెంట్ ఉల్లంఘన ఆరోపణలతో చైనా లోని బహుళ కోర్టులో హువాయ్ పై దావా వేసినట్టు శాంసంగ్ శుక్రవారం వెల్లడించింది. తన పేటెంట్ హక్కులను ఆరింటిని హువాయి ఉల్లంఘించిందని కంపెనీ చెబుతోంది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో చివరికి న్యాయాస్థానానికి ఆశ్రయించినట్టు పేర్కొంది. తమ మేధో హక్కులను కాపాడుకోవడానికి చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది. అయితే తమకుఎలాంటి నోటీసులు రాలేదని.. వస్తే తగినచర్యలు తీసుకుంటామని హువాయి చెప్పింది. మేధో సంపత్తి హక్కుల వివాదాలు చర్చలతో పరిష్కారంకాకపోవడంతో వ్యాజ్యంతో పరిష్కరించడానికి తరచూ సమర్థవంతమైన మార్గంగా ఉంటోందని కంపెనీ వెల్లడించింది. కాగా తమ 4జీ సెల్యులార్ సమాచార సాంకేతిక, ఆపరేటింగ్ వ్యవస్థలు, యూజర్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ పేటెంట్లు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ ఏడాది మే నెలలో చైనీస్ సంస్థ హువాయీ...శాంసంగ్ పై అమెరికా, చైనా కోర్టులలో దావా వేసింది. అయితే యాపిల్ శాంసంగ్ మధ్య జరిగిన పేటెంట్ యుద్ధంలో చివరికి శాంసంగ్ విజయం సాధించింది. మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని యాపిల్ చెల్లించాలనికోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ తాజా పోరులో విజయం ఎవరిదో వేచి చూడాలి. -
శామ్ సంగ్ పై పేటెంట్ దావా..!
రెండు ఆసియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజాల మధ్య న్యాయపోరాటం తీవ్రతరమవుతోంది. హ్యువాయ్ సంస్థ తన స్మార్ట్ ఫోన్ ప్రత్యర్థి శామ్ సంగ్ పై చైనాలో మరో పేటెంట్ దావాను ఫైల్ చేసింది. 16 శామ్ సంగ్ ఉత్పత్తులు హ్యువాయ్ పేటెంట్ హక్కులను అతిక్రమించాయని ఆరోపణలు చేస్తూ ఈ దావాను నమోదుచేసింది. ఈ హక్కుల ఉల్లంఘనల కింద 120 లక్షల డాలర్ల (దాదాపు రూ. 90 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొబైల్ టెర్మినల్, డిస్ ప్లే కు సంబంధించిన విధానాలను శామ్ సంగ్ ఉల్లంఘించిందని హ్యువాయ్ ఆరోపిస్తోంది. వీటిని శామ్ సంగ్ గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, గెలాక్సీ జే5 లలో ఉపయోగించిందని హ్యువాయ్ ఈ దావాలో పేర్కొంది. ఈ మోడల్స్ ను శామ్ సంగ్ హ్యుజూ, త్యాన్జిన్ కర్మాగారాల్లో రూపొందించినట్టు హ్యువాయ్ ఆరోపిస్తోంది. ఈ కేసును కోర్టు ఆమోదించిందని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ ఫిర్యాదును కంపెనీ పూర్తిగా విశ్లేషించిన తర్వాతే తన ప్రయోజనాలు రక్షించుకునేందుకు తగిన చర్యలు చేపడతామని శామ్ సంగ్ చెప్పింది. హ్యువాయ్ అధికార ప్రతినిధులు మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. మే నెలలోనే శామ్ సంగ్ పై అమెరికా, చైనాల్లో హ్యువాయ్ దావా వేసింది. నాలుగో తరం సెల్యులార్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, యూజర్ ఇంటర్ ఫేస్ సాప్ట్ వేర్ ను శామ్ సంగ్ ఫోన్లలో ఎలాంటి లైసెన్సులు లేకుండా వాడిందని ఆ దావాను ఫైల్ చేసింది. దానికి నష్టపరిహారాన్ని కూడా ఆ కంపెనీ కోరింది. -
శాంసంగ్ నుంచి 44 కొత్త స్మార్ట్ టీవీలు
♦ ఒకే రోజు ఆవిష్కరణ ♦ ఎస్‌యూహెచ్‌డీ శ్రేణిలో రూ.24లక్షల టీవీ న్యూఢిల్లీ: శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం ఒక్కరోజే దేశీయ మార్కెట్లోకి 44 కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వీటి ధరలు రూ.24వేల నుంచి రూ.24 లక్షల స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం 31 శాతం వాటాతో టీవీ మార్కెట్‌ను ఏలుతున్న ఈ కంపెనీ... ఈ ఏడాది చివరికి 35 శాతానికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. ప్రీమియం టీవీల విభాగంలో తమకు 46 శాతం వాటా ఉందని, తాజా మోడళ్ల విడుదలతో ఇది 60 శాతానికి పెరుగుతుందని శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భూటాని అన్నారు. వినియోగదారుల బడ్జెట్, వారి జీవన విధానానికి తగ్గట్టుగా ఈ టీవీలను రూపొందించామని, మార్కెట్ లీడర్‌గా తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు. 2016 అర్ధ సంవత్సరంలో టీవీ పరిశ్రమ వృద్ధి 12-15 శాతంగా ఉందన్నారు. ⇒ ఎస్‌యూహెచ్‌డీ బ్రాండ్ కింద శాంసంగ్ 4కే అల్ట్రా హెడ్డీ టీవీలను విక్రయిస్తుండగా... ఇదే శ్రేణిలో 49 అంగుళాల నుంచి 88 అంగుళాల సైజుల్లో తొమ్మిది టీవీలను తాజాగా ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.1,79 లక్షల నుంచి రూ.23.99 లక్షల వరకు ఉన్నాయి. ⇒ జాయ్ బీట్ శ్రేణిలో ఏడు టీవీలను ఆవిష్కరించింది. వీటి స్క్రీన్ సైజు 32 నుంచి 49 అంగుళాలుగా ఉండగా... ధరలు రూ.27,500 నుంచి రూ.69,500 స్థాయిలో ఉన్నాయి. ⇒ మిగిలినవన్నీ 32-88 అంగుళాల సైజులో ఉన్న స్మార్ట్ టీవీలు. వీటి ధరలు రూ.34,500 నుంచి రూ.7.04 లక్షల వరకు ఉన్నాయి. ⇒ శాంసంగ్ 2015లో దేశీయ మార్కెట్లో మొత్తం 82 లక్షల యూనిట్ల టీవీలను విక్రయించింది. -
శామ్సంగ్ నుంచి డేటా ఆదా చేసే స్మార్ట్‌ఫోన్..
దేశీ మార్కెట్లోకి గెలాక్సీ జే2 ధర రూ. 8,490 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ సిరీస్‌లో జే2 మోడల్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది. డేటాను ఆదా చేసే అల్ట్రా డేటా సేవింగ్ (యూడీఎస్) ఫీచర్‌ను తొలిసారిగా ఇందులో పొందుపరిచింది. ఈ ఫీచర్‌తో 50 శాతం వరకు డేటా ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది. ధర రూ.8,490. కంపెనీ నుంచి చవకైన 4జీ మోడల్ ఇదే. అలాగే జే2తో కలిపి శామ్సంగ్ ఇప్పటి వరకు విడుదల చేసిన 4జీ మోడళ్ల సంఖ్య 17కు చేరుకుంది. భారతీయ మార్కెట్ కోసం దేశీయంగానే దీనిని రూపొందించినట్టు శామ్సంగ్ ఐటీ, మొబైల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కస్టమర్ల నుంచి వచ్చే స్పందన ఆధారంగా యూడీఎస్ ఫీచర్‌ను ఇతర మోడళ్లలో జోడిస్తామని చెప్పారు. 2015లో శామ్సంగ్ 23 మోడళ్లను మారె ్కట్లోకి తీసుకొచ్చింది. ఇవీ గెలాక్సీ జే2 ఫీచర్లు.. క్యూహెచ్డీ సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ను గెలాక్సీ జె2 స్మార్ట్‌ఫోన్‌కు జోడించారు. రూ.10 వేలలోపు మోడళ్లలో ఈ తరహా స్క్రీన్‌ను పొందుపర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సిమ్‌తోపాటు వైఫై నుంచి ఏకకాలంలో ఇంటర్నెట్ను ఆస్వాదించొచ్చు. తద్వారా డేటా వేగం అధికంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 4.7 అంగుళాల స్క్రీన్, ఆన్‌డ్రాయిడ్ 5.1 ఓఎస్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ ఇతర ఫీచర్లు. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది. 128 జీబీ వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 నుంచి జే2 అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ బండిల్ ఆఫర్లో కస్టమర్లు రెండింతల డేటా ఆరు నెలల వరకు పొందవచ్చు. -
సామ్సంగ్ నుంచి 12 జీబీ డైనమిక్ ర్యామ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఉపకరణాల రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. ప్రపంచంలో తొలిసారిగా 12 జీబీ సామర్థ్యంతో మొబైల్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీని (డీఆర్ఏఎమ్) రూపొందించింది. ఉపకరణాల్లో అత్యంత కీలకమైన ర్యామ్‌లలో డీఆర్ఏఎమ్ ఒక రకం. 20 నానోమీటర్ ప్రాసెస్ సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని తయారు చేసినట్టు సామ్సంగ్ వెల్లడించింది. ఇది అధిక సామర్థ్యం, స్పీడ్‌తోపాటు ఎనర్జీ 20 శాతం తక్కువగా వినియోగిస్తుంది. ఈ ఫీచర్లన్నీ తదుపరి తరం స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల వంటి మొబైల్ ఉపకరణాల అభివృద్ధికి కీలకమని కంపెనీ తెలిపింది. వినియోగదారులు అద్భుత అనుభూతికి లోనవుతారని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మెమరీ సేల్స్ ఈవీపీ జూ సున్ చోయి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొత్త మెమరీ చిప్ రాకతో భవిష్యత్తులో అల్ట్రా స్లిమ్ పీసీలు, డిజిటల్, ఆటోమోటివ్ ఉపకరణాలకు అప్లికేషన్లు విస్తృతం అవుతాయని కంపెనీ భావిస్తోంది. -
ఒక్క దెబ్బతో.. రూ. 25 కోట్ల దోపిడీ!!
అది సాక్షాత్తు దేశ రాజధాని నగరం. అందులోనూ ఢిల్లీ శివార్లలో ఉన్న కాళిందీకుంజ్ ప్రాంతం. తెల్లవారుజామున ఒంటిగంట సమయం. అప్పుడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 25 కోట్ల భారీ దోపిడీ జరిగింది. శామ్సంగ్ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కును దోపిడీ దొంగలు అటకాయించారు. ఆ కంటైనర్ తలుపులు పగలగొట్టి మరీ దాంతో పారిపోయారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని నోయిడాకు ఆ కంటైనర్ వెళ్తోంది. ఆ వాహనం డ్రైవర్, క్లీనర్లు ఇద్దరినీ దొంగలు చితక్కొట్టారు. చివరకు ట్రక్కుతో సహా పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆగ్నేయ ఢిల్లీ ప్రాంతంలో పోలీసు బృందాలను మోహరించి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
భారత్‌లో శామ్సంగ్ మూడో ప్లాంటు
3 రాష్ట్ర ప్రభుత్వాలతో కంపెనీ చర్చలు న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కీలకమైన భారత మార్కెట్లో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారించింది. తాజాగా భారత్‌లో మూడో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో స్థలం కోసం అన్వేషిస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. ఈ ప్లాంటులో స్మార్ట్ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కూడా తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన శామ్సంగ్ మొబైల్ విభాగం చీఫ్ జేకే షిన్ కొత్త ప్లాంటు గురించి చర్చించినట్లు, స్థలం ఇతరత్రా అంశాలను బట్టి 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల దాకా కంపెనీ ఇన్వెస్ట్ చేయొచ్చని వివరించాయి. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో, తమిళనాడులో రెండు ప్లాంట్లు, మూడు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. దేశీయంగా విక్రయించే హ్యాండ్‌సెట్స్‌లో 90 శాతం మొబైల్స్‌ను ఈ ప్లాంట్లలోనే శామ్సంగ్ తయారు చేస్తోంది. ప్రస్తుతం వీటిలో 45,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. -
బ్లాక్‌బెర్రీపై శామ్సంగ్ కన్ను..!
⇒ షేరుకి 15.49 డాలర్ల ఆఫర్ ⇒ డీల్ విలువ దాదాపు 7.5 బిలియన్ డాలర్లు న్యూయార్క్: పూర్వ వైభవం కోసం తంటాలు పడుతున్న స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీని దక్కించుకోవడంపై శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ తాజాగా దృష్టి పెట్టింది. ఇందుకోసం బ్లాక్‌బెర్రీ ఒక్కో షేరుకి 13.35-15.49 డాలర్లు ఇవ్వజూపుతోంది. ఇది బ్లాక్‌బెర్రీ ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 38%-60% అధికం. దీని ప్రకారం చూస్తే డీల్ విలువ దాదాపు 6-7.5 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. ఇరు కంపెనీల ప్రతినిధులు ఇటీవలే దీనిపై చర్చించేందుకు సమావేశమైనట్లు సమాచారం. అయితే, బ్లాక్‌బెర్రీ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. శామ్సంగ్తో ఎలాంటి చర్చలూ జరపడం లేదని స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన అనేక టేకోవర్ ఆఫర్లను సైతం కంపెనీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్లాక్‌బెర్రీ పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియ పూర్తయితే ఇప్పుడొస్తున్న ఆఫర్ల కంటే మరింత అధిక వాల్యుయేషన్ రాగలదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. భవిష్యత్‌లో బ్లాక్‌బెర్రీ అసెట్స్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో శామ్సంగ్ 7.5 బిలియన్ డాలర్ల ఆఫర్ గొప్పదేమీ కాకపోవచ్చని వారి వాదన. శామ్సంగ్ ఇప్పటికే తమ గెలాక్సీ హ్యండ్సెట్స్కి సంబంధించి బ్లాక్‌బెర్రీతో కలిసి పనిచేస్తోంది. కార్పొరేట్ మార్కెట్లోకి ఎంట్రీ పాస్.. సాధారణ మార్కెట్లోకి చొచ్చుకుపోయినంతగా కార్పొరేట్ మార్కెట్లోకి శామ్సంగ్ దూసుకెళ్లలేకపోయింది. అనేక మొబైల్స్ తయారీ సంస్థల రాకతో ప్రస్తుతం సాధారణ మార్కెట్లో పోటీ తీవ్రతరమైపోయింది. పైగా హైఎండ్ మార్కెట్లో యాపిల్‌తో పోటీపడాల్సి వస్తోంది. మరోవైపు బ్లాక్‌బెర్రీ బలం కార్పొరేట్లే. ఈ నేపథ్యంలోనే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేస్తే కార్పొరేట్ మార్కెట్‌నూ దక్కించుకోవచ్చన్నది శామ్సంగ్ వ్యూహం. డీల్‌కు అడ్డంకులూ ఉన్నాయి.. బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేయడంలో శామ్సంగ్ పలు అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. అన్నింటి కన్నా ముందుగా బ్లాక్‌బెర్రీని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న కీలక షేర్‌హోల్డరు ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ చైర్మన్ ప్రేమ్ వత్స గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అలాగే కెనడా, అమెరికా నియంత్రణ సంస్థలు కూడా ఓకే చెప్పాల్సి ఉంటుంది. కెనడా చట్టం కింద బ్లాక్‌బెర్రీని విదేశీ సంస్థ కొనుగోలు చేయాలంటే ముందుగా ప్రభుత్వం అనుమతి ఉండాలి. గతంలో చైనాకి చెందిన లెనొవొ గ్రూప్.. బ్లాక్‌బెర్రీ కొనుగోలుకి ప్రయత్నించినప్పటికీ భద్రతా కారణాల రీత్యా కెనడా ప్రభుత్వం అనుమతించ లేదు. తనకు లాభదాయకంగా ఉండే కొన్ని విభాగాలను మాత్రమే శామ్సంగ్ కొనాలనుకుంటే.. విక్రయిచేందుకు బ్లాక్‌బెర్రీ యాజమాన్యం అంగీకరించకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శామ్సంగ్ డీల్ ప్రయత్నాలు ఎంతవరకూ సఫలం అవుతాయన్నది చూడాల్సిందే. బ్లాక్‌బెర్రీ నేపథ్యమిదీ.. 1984లో రీసెర్చ్ ఇన్ మోషన్ సంస్థ పేరిట ప్రారంభమైన బ్లాక్‌బెర్రీ.. ఇతర కంపెనీల కన్నా చాలా ముందుగానే స్మార్ట్ఫోన్లకు శ్రీకారం చుట్టి కార్పొరేట్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే, శరవేగంగా దూసుకొచ్చిన ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లతో పోటీ పడలేక బ్లాక్‌బెర్రీ చతికిలబడింది. భారీ నష్టాల్లో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే క్లాసిక్ హ్యాండ్‌సెట్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 44,000 పైచిలుకు పేటెంట్లు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో ఖాతాల ప్రకారం చూసినా వీటి విలువే 1.43 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుంది. మార్కెట్ విలువ కింద లెక్కగడితే మరింత ఎక్కువే ఉంటుందని అంచనా. -
స్పెషల్ కెమెరాతో శామ్సంగ్ గెలాక్సీ కే జూమ్
హైదరాబాద్: శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా కంపెనీ ప్రత్యేకమైన కెమెరాతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ కే జూమ్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. శామ్సంగ్ గెలక్సీ స్మార్ట్‌ఫోన్‌ను డిజిటల్ కెమెరా టెక్నాలజీతో పొందాలనుకునే వారి కోసం ఈ గెలాక్సీ కే జూమ్‌ను అందిస్తున్నామని శామ్సంగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నేటి(బుధవారం) నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని, ధర రూ.29,999 అని శామ్సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్, మొబైల్ అండ్ ఐటీ)అసిమ్ వార్సి పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 4.8 అంగుళాల హెచ్డీ సూపర్ అమోలెడ్ టచ్ స్క్రీన్, హెక్సాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. 20.7 మెగా పిక్సెల్ బీఎస్ఐ సీఎంఓఎస్ సెన్సర్ కెమెరా ఉన్న ఈ ఫోన్లో ఆప్టికల్ జూమ్ 10 రెట్లు ఉంటుందని పేర్కొన్నారు. 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎస్ హెల్త్ లైఫ్ వంటి వాల్యూ యాడెడ్ ఫీచర్లు ఉన్నాయని వివరించారు.