ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అవినీతి కేసులో గ్రూప్ అధినేత జే వై.లీ జైలు పాలవడంతో ఆ కంపెనీలో నాయకత్వంపై ఆందోళనకర పరిస్థితుల తలెత్తడంతో, వాటికి మరింత ఆజ్యం పోస్తూ ఆ కంపెనీ సీఈవో, సీఈవో క్వాన్ ఓహ్-హున్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. శాంసంగ్ చిప్, డిస్‌ప్లే అధినేతగా ఉన్న ఆయన ఊహించని విధంగా వైదొలగడం కంపెనీలో చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి లీ అరెస్టు అయిన తర్వాత ఈయనే కంపెనీలో ముఖ్య పాత్ర పోషించారు.
ఈయన రాజీనామా కంపెనీ రికార్డు క్వార్టర్ ఆపరేటింగ్ ప్రాఫిట్‌లను అంచనావేస్తున్న సమయంలో వెలువడింది. నేడు శాంసంగ్ తన క్వార్టర్ ఫలితాలను వెలురించనుంది. శాంసంగ్ రికార్డు రాబడులను సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగో క్వార్టర్‌లో కూడా మంచి ప్రదర్శననే కనబర్చనని రీసెర్చ్ సంస్థ స్కోర్ సీఈవో పార్క్ జు-గన్ చెప్పారు. మెమరీ చిప్స్, డిస్‌ప్లే వ్యాపారాలు వంటి కాంపోనెంట్స్ బిజినెస్‌లకు క్వాన్ అధినేతగా ఉన్నారు. మెమరీ చిప్స్, స్మార్ట్‌ఫోన్లు, టీవీల్లో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీదారిగా ఉన్న శాంసంగ్, ఈ ఏడాది రికార్డు లాభాలను నమోదుచేయబోతుంది. మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరుగడంతో దీని లాభాలు కూడా మంచిగానే ఎగుస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment