ఒక్క దెబ్బతో.. రూ. 25 కోట్ల దోపిడీ!! | Robbers take away goods worth Rs 25 crore from Delhi | Sakshi
Sakshi News home page

ఒక్క దెబ్బతో.. రూ. 25 కోట్ల దోపిడీ!!

Published Thu, Apr 2 2015 5:02 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbers take away goods worth Rs 25 crore from Delhi

అది సాక్షాత్తు దేశ రాజధాని నగరం. అందులోనూ ఢిల్లీ శివార్లలో ఉన్న కాళిందీకుంజ్ ప్రాంతం. తెల్లవారుజామున ఒంటిగంట సమయం. అప్పుడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 25 కోట్ల భారీ దోపిడీ జరిగింది. శామ్సంగ్ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కును దోపిడీ దొంగలు అటకాయించారు. ఆ కంటైనర్ తలుపులు పగలగొట్టి మరీ దాంతో పారిపోయారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని నోయిడాకు ఆ కంటైనర్ వెళ్తోంది. ఆ వాహనం డ్రైవర్, క్లీనర్లు ఇద్దరినీ దొంగలు చితక్కొట్టారు. చివరకు ట్రక్కుతో సహా పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆగ్నేయ ఢిల్లీ ప్రాంతంలో పోలీసు బృందాలను మోహరించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement