
ముంబై, సాక్షి: వచ్చే జూన్‌కల్లా గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 పేరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను శామ్‌సంగ్ విడుదల చేయనున్నట్లు దక్షిణ కొరియన్ అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోల్డబుల్ ఫోన్.. ఎస్ పెన్ సపోర్ట్‌తో లభించనున్నట్లు తెలియజేసింది. తద్వారా ప్రీమియం విభాగంలోని గలాక్సీ నోట్ సీరిస్ ప్రొడక్టులను ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్.. నిలిపివేసే అవకాశముట్లు అభిప్రాయపడింది. ఆధునిక టెక్నాలజీలతో కూడిన అంటే.. ఎస్ పెన్(ఎలక్ట్రానిక్ పెన్) సపోర్ట్‌తోపాటు.. అండర్ డిస్‌ప్లే కెమెరా(యూడీసీ) ఫీచర్‌ను సైతం జెడ్ ఫోల్డ్3లో ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఆధునిక సాంకేతికలో భాగంగా కెమెరాను ఓలెడ్ స్ర్కీన్ అడుగుభాగాన అమర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో కెమెరాకు డిస్‌ప్లేలో హోల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదని వివరించింది. యూడీసీ ఫీచర్‌తో జెడ్ ఫోల్డ్3 స్క్రీన్ ట్యాబ్లెట్ పీసీని పోలి ఉంటుందని అభిప్రాయపడింది.
పెద్ద డిస్‌ప్లేలు..
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ వచ్చే జనవరిలో విడుదల చేయ తలపెట్టిన గలాక్సీ ఎస్21 అల్ట్రా(అంచనా)లోనూ ఎస్ పెన్ ఫీచర్‌ను అందించనున్నట్లు అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల డిస్‌ప్లేలో లభించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గలాక్సీ ఎస్ 21 సిరీస్‌లో 3 ఫోన్లను 2021 జనవరి నుంచీ విడుదల చేసే వీలుట్లు తెలియజేసింది. ఎస్21 6.2 అంగుళాలు, ఎస్21 ప్లస్ 6.7 అంగుళాల స్క్రీన్లతో విడుదలకానున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment